Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 53

Vasistha's refuses to yield Sabala !!

|| om tat sat ||

బాలకాండ
ఏబది మూడవ సర్గము

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన |
విదధే కామధుక్ కామాన్ యస్య యస్య యథేప్సితమ్||

స|| హే శత్రుసూదన ! వసిష్ఠేన ఏవమ్ ఉక్తా శబలా కామధుక్ యస్య యస్య యథేప్సితమ్ కామాన్ విదధే ||

తా|| ఓ రామా ! వసిష్ఠుని చేత ఇట్లు చెప్పబడిన ఆ శబలా ఎవరికి ఎమి కోరిక గలదో దాని ప్రకారము ( భోజనములను) తయారు చేసెను.

ఇక్షూన్ మధూం స్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసనాన్ |
పానాని చ మహర్హాణి భక్ష్యాం శ్చోచ్చావచాంస్తథా ||
ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయః పర్వతోపమాః |
మృష్టాన్నాని చ సూపాంశ్చ దధికుల్యాం స్తథైవ చ ||
నానాస్వాదు రసానాం చ షాడబానాం తథైవ చ |
భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః ||
సర్వ మాసీత్ సుసంతుష్టం హృష్టపుష్ట జనాయుతమ్ |
విశ్వామిత్ర బలం రామ వసిష్ఠేనాభి తర్పితమ్ ||

స|| ఇక్షూన్ మధూం లాజాన్ మైరేయాంశ్చ పానాని మహార్హాణి శ్చోచ్చావచాం భక్ష్యాం తథా | అత్ర ఉష్ణాడ్య స్యౌదనస్య మృష్టాన్నాని సూపాంశ్చ తథైవ దధికుల్యాం రాశయః పర్వతోపమాః | నానాస్వాదు రసానాం చ తథైవ షాడబానాం చ సుపూర్ణాని గౌడాని సహస్రశః భాజనాని చ | హే రామ విశ్వామిత్ర బలమ్ సర్వం వసిష్ఠేనాభి తర్పితమ్ హృష్ట పుష్ట సుసంతుష్ఠం జనాయుతం ఆసీత్ | |

తా|| చెఱుకు గడలనూ రసములనూ తేనలనూ పానీయములను అనేకవిధములైన భక్ష్యములనూ సమకూర్చెను. ఆచట పర్వతరాసులవలెనున్న వేడిగానున్న మృష్టాన్నములు , పాయసములు , పెరుగుధారలు ఉండెను. అనేకవిధములగు రుచులుగల భక్ష్యములు , తినిబండారములతో పూర్తిగా నిండిన పాత్రలు ఉండెను. ఓ రామా ! విశ్వామిత్రుని బలగమంతయూ వసిష్టుని ఆదరముతో మిక్కిలి తృప్తిపడిన హృష్ట పుష్ట జనులతో నిండినదాయెను.

విశ్వామిత్రోs పి రాజర్షిః హృష్టః పుష్టస్తదా భవత్ |
సాంతః పురవరో రాజా స బ్రాహ్మణ పురోహితః ||
సామాత్యో మంత్రిసహితః స భృత్యః పూజితస్తదా |
యుక్తః పరమహర్షేణ వసిష్ఠం ఇదం అబ్రవీత్ ||

స|| తదా రాజర్షిః విశ్వామిత్రః అపి హృష్టః పుష్టః అభవత్ | స అంతః పురవరః స బ్రాహ్మణ స పురోహితః సామాత్యో మంత్రిసహితః స భృత్యః పూజితః రాజా తదా పరమహర్షేణ ఇదం అబ్రవీత్ |

తా|| అప్పుడు రాజర్షి అగు విశ్వామిత్రుడు కూడా మిక్కిలి సంతుష్టుడాయెను. అంతఃపుర శ్రేష్ఠులు , బ్రాహ్మణులు, పురోహితులు అమాత్యులు మంత్రులతో కూడి బ్ఃఋత్యులతో సహా పూజింపబడిన ఆ రాజు అత్యంత సంతోషముతో ఇట్లు పలికెను.

పూజితోs హం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః |
శ్రూయతామభిదాస్యామి వాక్యం వాక్య విశారద ||

స|| హే బ్రహ్మన్ ! పూజార్హేన త్వయా అహం సుసత్కృతః పూజితం | హే వాక్య విశారద అభిదాస్యామి వాక్యం శ్రూయతాం |

తా|| ఓ బ్రహ్మన్ ! పూజింపతగిన నీ చేత నేను సత్కారములతో పూజింపబడితిని. ఓ వాక్య విశారద నాది ఒక మాట ఉన్నది. వినుడుగాక .

గవాం శతసహస్రేణ దీయతాం శబలామమ |
రత్నం హి భగవన్నేతత్ రత్నహారీచ పార్థివః ||
తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ |

స|| హే భగవన్ గవాం శతసహస్రేణ శబలా మమదీయతాం |ఏతత్ రత్నం హి | పార్థివః రత్నహారీ చ | హే ద్విజ తస్మాత్ ధర్మతో ఏషా మమ | తస్మాత్ శబలాం దేహి |

తా|| ఓ భగవన్ ! ఒక లక్ష గోవులను తీసుకొని శబల నాకు ఇయ్యబడుగాక. అది ఒక రత్నము. రాజే రత్నము లన్నియూ హరించువాడు రాజు. ఓ బ్రాహ్మణుడా ! అందువలన ధర్మముగా ఇది నాకు చెందినదే . అందువలన శబలను నాకు ఇమ్ము.

ఏవముక్తస్తు భగవాన్ వసిష్ఠో మునిసత్తమః ||
విశ్వామిత్రేణ ధర్మాత్మాప్రత్యువాచ మహీపతీమ్ |
నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్ ||
రాజన్ దాస్యామి శబలాం రాశిభి రజతస్య వా |
న పరిత్యాగమర్హేయం మత్సకా శాదరిందమ ||

స|| విశ్వామిత్రేణ ఏవం ఉక్తః మునిసత్తమః ధర్మాత్మా భగవాన్ వశిష్ఠః విశ్వామిత్రేణ ఏవం ఉక్తః మహీపతిం ప్రత్యువాచ | హే రాజన్ ! న శతసహస్రేణ వా న కోటి శతైః గవాం వా రజత్స్య రాశిభి శబలాం దాస్యామి | హే అరిందమ ! మత్సకాసాత్ అయం పరిత్యాగం న అర్హః |

తా|| విశ్వామిత్రునిచే ఈ విధముగా చెప్పబడిన మునిసత్తముడు ధర్మాత్ముడు అగు వసిష్ఠుడు ఆ రాజు తో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. " ఓ రాజన్ ! లక్ష కాని కోటిగాని గోవులతో కాని , వెండి రాశులతో గాని శబలను ఇవ్వను. ఓ రాజా ఇది నానుండి వేరగుటకు వీలు లేదు"

శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మనతో యథా |
అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తథైవ చ ||

స|| యథా ఆత్మనతో కీర్తిః మహ్యం శబలా శాశ్వతీ | అస్యాం హవ్యం చ కవ్యం చ తథైవ ప్రాణ యాత్రా చ||

తా|| మాన్యులకు కీర్తివలె నాకు శబలతో విడదీయని సంబంధము. అదియే నాకి హవ్యము కవ్యము నా జీవనయాత్ర కూడా .

ఆయత్త మగ్నిహోత్రం చ బలిర్హోమ స్తథైవ చ |
స్వాహాకారా వషట్కారౌ విద్యాశ్చ వివిథాస్తదా ||

స|| అయం అగ్నిహోత్రం చ బలిః హోమః చ తథైవ స్వాహాకారా వషట్కారా తద వివిధాః విద్యాశ్చ ||

తా|| అదియే అగ్నిహోత్ర కార్యములకూ భూతబలికి అదే విథముగా స్వాహాకారములు వషట్కారములూ వివిధములైన విద్యలకూ ( మూలము)

ఆయత్త మత్ర రాజర్షే సర్వమేతన్నసంశయః |
సర్వస్వ మేతత్ సత్యేన మమతుష్టికరీ సదా ||
కారణైర్బహుభీ రాజన్ న దాస్యే శబలాం తవ |

స|| రాజర్షే అత్ర న సంశయః ఎతత్ సర్వం | సత్యేన ఏతత్ మమ సర్వస్వం సదా తుష్టికరీ ||హే రాజన్ ! బహుభిః కారణైః తవ శబలాం న దాస్యే ||

తా|| "ఓ రాజర్షీ ! ఇచట సంశయములేదు. అదియే సర్వస్వము. నిజముగా అదియే నాకు సర్వస్వము ఎల్లప్పుడు ఆనందదాయకము. ఓ రాజన్ ! కారణములు చాలాఉన్నాయి. నేను నీకు శబలను ఇవ్వను."

వసిష్ఠేనైవ ముక్తస్తు విశ్వామిత్రో అబ్రవీత్ తతః||
సంరబ్దతరమత్యర్థం వాక్యం వాక్య విశారదః||

స|| ఏవం వసిష్ఠేన ఉక్తస్తు తతః వాక్య విశారదః విశ్వామిత్రః సంరబ్దతరం అత్యర్థం వాక్యం అబ్రవీత్ |

తా|| ఈవిధముగా వసిష్ఠునిచేత చెప్పబడిన తరువాత వాక్య విశారదుడైన విశ్వామిత్రుడు సంభ్రమముతో అర్థముతో వున్న మాటలతో ఇట్లు పలికెను.

హైరణ్యకక్ష్యా గ్రైవేయాన్ సువర్ణాంకుశ భూషితాన్ |
దదామి కుంజరాం స్తేs హం సహస్రాణి చతుర్దశ ||

స|| చతుర్దశ సహస్రాణి హైరణ్యకక్ష్యా గ్రైవేయాన్ సువర్ణాంకుశ భూషితాన్ కుంజరాన్ తే అహం దాస్యామి ||

తా|| నీకు బంగారు తాళ్ళతోనూ , సువర్ణ ఆభరణములతోనూ అంకుశములతోనూ అలంకృతమైన పదులాగువేల ఏనుగలు ఇచ్చెదను .

హైరణ్యానామ్ రథానాం తే శ్వేతాశ్వానాం చతుర్యుజామ్|
దదామి తే శతాన్యష్టౌ కింకిణీక విభూషితాన్ ||

స|| తే హైరణ్యానాం రథానాం కింకిణీక విభూషితాన్ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ శతాన్యష్టౌ దదామి ||

తా|| నీకు కింకిణములతో నున్న నాలుగు తెల్లని గుఱ్ఱములతో నున్న ఎనిమిది వందల బంగారు రథములను ఇచ్చెదను.

హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్ |
సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత ||

స|| హే సువ్రత! దేశజాతానాం కులజానాం మహౌజసాం హయానాం దశ సహస్రమేకమ్ తవ దదామి ||

తా|| ఓ సువ్రత ! తగినదేశములో పుట్టిన, మంచి వంశములో పుట్టిన, మంచి బలముగల పదనొకండు వేల అశ్వములనిచ్చెదను.

నానావర్ణవిభక్తానాం వయః స్థానాం స్తథైవ చ |
దాదామ్యేకాం గవాం కోటీం శబలా దీయతా మమ ||

స|| తథైవ వయః నానావర్ణ విభక్తానాం స్థానాం ఏకాం కోటీం గవాం దదామి !మమ శబలా దీయతా ||

తా|| అదేవిథముగా వయస్సులోనున్న అనేక రంగులు కల ఒక కోటి ఆవులను ఇచ్చెదను. నాకు శబలను ఇమ్ము.

యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ |
తవద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ||

స|| హే ద్విజోత్తమా ! రత్నం వా హిరణ్యం వా యావత్ ఇచ్ఛసి తత్ సర్వం తవ దదామి | మమ శబలా దీయతాం ||

తా|| ఓ ద్విజోత్తమా ! రత్నములైన బంగారమైనా నీవు కోరినంత ఇచ్చెదను. నాకు శబలను ఇమ్ము.

ఏవముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమతా |
న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్ కథంచన ||

స|| ధీమతా విశ్వామిత్రేణ ఏవం ఉక్తస్తు , "రాజన్ కథంచన శబలాం న దాస్యామి" ఇతి ప్రాహ ||
తా|| ధీమతుడైన విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా , " ఓ రాజా ఏట్టిపరిస్థితిలోనూ సబలను ఇవ్వను" అని ( వసిష్ఠుడు) చెప్పెను.

ఏతదేవహి మే రత్నం ఏతదేవహి మే ధనమ్ |
ఏతదేవహి సర్వస్వమ్ ఏతదేవహి జీవితమ్ |||
దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞైవాప్త దక్షిణాః |
ఏతదేవహి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథా ||

స|| హే రాజన్ ! ఏతత్ ఏవహి మే రత్నం | ఏతత్ ఏవహి మే ధనమ్ | ఏతత్ ఏవహి మే సర్వస్వం | ఏతత్ ఏవహి మే జీవితమ్ | ఏతత్ ఏవ హి దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞైవాప్త దక్షిణాః | తథా ఏతత్ ఏవహి వివిథా క్రియాశ్చ ||

తా|| ఓ రాజన్ ఇది నారత్నము. ఇదియే నాధనము. ఇదియే నాసర్వస్వము. ఇదియే నాజీవితము. ఇదియే నా దర్శ పూర్ణమాస యాగములకు దక్షిణలతో కూడిన యజ్ఞములకు (ఆధారము). అదేవిధముగా అనేక కార్యములకు కూడా |

అదోమూలాః క్రియాస్సర్వా మమరాజన్ న సంశయః |
బహూనా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||

స|| హే రాజన్ ! మమ క్రియాస్సర్వా అదో మూలాః న సంశయః | కిం ప్రలాపేన బహునా కామదోహినీం న దాస్యే ||

తా|| ఓ రాజన్ ! నా కార్యములన్నిటికీ సంశయములేకుండా ఇదియే మూలము. ఎక్కువ మాటలు అనవసరము. నా మనోరథములను తీర్చు కామధేనువును ఇవ్వను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిపంచాశస్సర్గః ||

|| ఓమ్ తత్ సత్||