Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 54

Sabala takes on Viswamitra's Forces!!

|| om tat sat ||

బాలకాండ
ఏబది నాల్గవ సర్గము.

కామధేనుం వశిష్ఠో అపి యదా న త్యజతే మునిః|
తదాస్య శబలాం రామ విశ్వామిత్రో అన్వకర్షత ||

స|| హే రామ ! మునిః వసిష్ఠః యదా కామధేనుం న త్యజతే తదా అస్య శబలాం విశ్వామిత్రః అన్వకర్షత ||

తా|| ఓ రామా ! వసిష్ఠ ముని ఎప్పుడు కామధేనువు ఇవ్వలేదో అప్పుడు ఆశబలను విశ్వామిత్రుడు బలవంతముగా తీసుకొనపోసాగెను.

నీయమానాతు శబలా రామ రాజ్ఞా మహాత్మనా |
దుఃఖితా చింతయామాస రుదంతీ శోకకర్శితా ||

స|| యదా రాజ్ఞా మహాత్మనా నీయమానాతు శబలా శోకకర్శితా దుఃఖితా రుదంతీ చింతయామాస||

తా|| ఆ మహాత్ముడగు విశ్వామిత్రుడు అలా తీసుకుపోవుచుండగా ఆ శబల శోకములో నున్నదై దుఃఖముతో రోదించుచున్నదై ఇట్లు ఆలోచించ సాగెను.

పరిత్యక్తా వసిష్ఠేన కిమహం సు మహాత్మనా |
యాహం రాజభటైర్దీనా హ్రీయేయం భృశదుఃఖితా||

స|| అహం సుమహాత్మనా వసిష్ఠేన పరిత్యక్తా కిం | రాజభటైః హ్రీయేయం అహం దీనా భృశ దుఃఖితా ||

త|| రాజ భటులచే తీసుకు పోబడుతున్న నేను నే దీనురాలను దుఃఖములో నున్న దానను. నేను ఆ మహాత్ముడైన వసిష్ఠునిచే పరిత్యజించబడితినా ఏమి?

కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః |
యన్మాం అనాగసం భక్తామ్ ఇష్ఠాం త్యజతి ధార్మికః ||

స|| మయా అపకృతం కిమ్ |(అహం) తస్య మహర్షేః భావితాత్మనః| మాం అనాగసం భక్తామ్ (సః) ధార్మికః ఇష్ఠాం త్యజతి ||

తా|| నేను ఆమహర్షియొక్క భావితాత్మను. అపారమైన భక్తిగల నన్ను ఆ ధార్మికుడు ఇష్టముగా వదలుచున్నాడా ? నే ను చేసిన దోషమేమి ?

ఇతి సా చింతయిత్వాతు వినిశ్వస్య పునః పునః |
నిర్దూయ తాం స్తదా భృత్యాన్ శతశ్శత్రుసూదనః |
జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః ||

స|| సా ఇతి చిన్తయిత్వా పునః పునః వినిశ్వస్య(తు)| తదా తాం శతశ్శత్రుసూదనః భృత్యాన్ నిర్దూయ అనిలవేగేన మహాత్మనః పాద మూలం జగామ||

తా|| ఆశబల ఈవిధముగా అలోచించుచూ మరల మరల నిట్టూర్పులు విడిచెను. అప్పుడు వందలకొలదీ వున్న శత్రువులను వదల్చుకొని వాయువేగముతో మహాత్మునియొక్క పాదములపై బడెను.

శబలా సా రుదంతీ చ క్రోశంతీ చేదమబ్రవీత్ |
వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘదుందుభిరావిణీ ||

స|| సా శబలా వసిష్ఠాగ్రతః స్థిత్వా రుదంతీ క్రోశంతీ చ సా మేఘదుందుభిరావిణీ ఇదం అబ్రవీత్||

తా|| ఆ శబల వసిష్ఠుని ముందర నిలిచి విలపించుచూ మేఘదుందుభి వంటి స్వరముతో ఇట్లు పలికెను.

భగవన్ కిం పరిత్యక్తా త్వయా అహం బ్రహ్మణస్సుత |
యస్మాద్రాజభృతా మాం హి నయంతే త్వత్సకాశతః ||

స|| భగవన్ ! యస్మాత్ రాజభృతా మాం హి త్వత్సకాశతః నయంతే బ్రహ్మణస్సుత త్వయా అహం కిం పరిత్యక్తా |

తా|| భగవన్ ! ఈ రాజభటులు నన్ను నీ దగ్గరనుంచి తీసుకుపోవుచున్నారు కాబట్టి ఓ బ్రహ్మసుతా నన్ను పరిత్యజింతివా ?

ఏవముక్తస్తు బ్రహ్మర్షిః ఇదం వచన మబ్రవీత్ |
శోక సంతప్తహృదయాం స్వసారమివ దుఃఖితామ్||

స|| (సా) ఏవముక్తస్తు శోక సంతప్త హృదయాం స్వసారమివ దుఃఖితామ్ బ్రహ్మర్షిః ఇదం వచనం అబ్రవీత్ |

తా|| ఇలా చెప్పబడగా శోకముతో నిండిన హృదయముకలవాడై, దుఃఖములో నున్న తన సహోదరి తో ( చెప్పినట్లు) ఆ శబలతో ఇట్లనెను.

నత్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |
ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః ||

స|| హే శబలే ! త్వాం న త్యజామి | అపి మే త్వయా న అపకృతం |ఏష బలాన్మత్తో మహాబలః రాజా త్వాం నయతే |

తా|| ఓ శబలా ! నిన్ను త్యజించుటలేదు. నీవు చేసిన దోషము ఏమీ లేదు. ఈ బలముతో మదము ఎక్కిన మహాబలుడు అయిన రాజు నిన్ను తీసుకు పోవుచున్నాడు .

న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః |
బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవచ ||

స|| త్వద్య తుల్యమ్ బలం మహ్యం న హి |విశేషతః రాజా బలీ క్షత్రియః చ పృథివ్యాః పతిః ఏవ చ |

తా|| అయన తో సమానమైన బలము నాదగ్గర లేదు. విశేషముగా ఆ రాజు బలవంతుడు క్షత్రియుడు పృథివీపతి కూడా||

ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజి రథ సంకులా|
హస్తి ధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః ||

స|| పూర్ణ అక్షౌహిణీహస్తి ధ్వజ సమాకీర్ణా సవాజి రథ సంకులా ఇయం తేన అసౌ బలవత్తరః ||

తా|| ఏనుగులతో రథములతో కూడిన పూర్తి అక్షౌహిణీ సైన్యముతో అతడు బలవత్తరుడు.

ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్ |
వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమ్ అమిత ప్రభమ్||

స|| వసిష్ఠేన ఏవం ఉక్తా తు (శబలా) వినీతవత్ వచనజ్ఞా సా అమితప్రభమ్ బ్రహ్మర్షిం (ఇదం) వచనం ప్రత్యువాచ|

తా|| వశిష్ఠునిచే ఇట్లు చెప్పబడిన ఆ శబల స వినయముతో వచనజ్ఞుడైన అత్యంత ప్రభలతో వెలుగొందుచున్న ఆ బ్రహ్మర్షి తో ఇట్లు పలికెను.

న బలం క్షత్రియస్యాహుః బ్రాహ్మణో బలవత్తరః |
బ్రహ్మన్ బ్రహ్మ బలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్||

స|| క్షత్రియస్య ఆహుః బలం న | బ్రాహ్మణః బలవత్తరః |హే బ్రహ్మన్ ! క్షత్రాత్తు దివ్యం బ్రహ్మ బలం బలవత్తరమ్ ||

తా|| ఓ బ్రహ్మన్ ! క్షత్రియుని బలము బలమే కాదు.బ్రహ్మ జ్ఞానముకలవాడు బలవత్తరుడు.ఓ బ్రహ్మన్ ! క్షత్రియబలముకన్నా దివ్యమైన బ్రహ్మణబలమే బలవత్తరము.

అప్రమేయ బలం తుభ్యం న త్వయా బలవత్తరః|
విశ్వామిత్రో మహావీర్యః తేజస్తవ దురాసదమ్ ||

స|| తుభ్యం బలం అప్రమేయ |తవ తేజః దురాసదమ్| విశ్వామిత్రః మహావీర్యః న త్వయా బలవత్తరః |

తా|| నీ బలము సాటిలేనిది. నీ తేజము సాటిలేనిది. విశ్వామిత్రుడు మహావీరుడు. కాని నీ కన్నా బలవంతుడు కాడు.

నియుంక్ష్య మాం మహాభాగ త్వద్బ్రహ్మబలసంభృతామ్ |
తస్య దర్ప బలం యత్తన్నాశయామి దురాత్మనః ||

స|| హే మహాభాగ ! త్వద్బ్రహ్మబల సంభృతామ్ మాం నియుంక్ష్య | దురాత్మనః యత్ తస్య దర్ప బలం తన్ నాశయామి ||

తా|| ఓ మహాభాగా ! నీ బ్రహ్మ బలముతో పరిపుష్టి అయిన నన్ను నియోగించుము. ఆ దురాత్మునియొక్క బలదర్పమును నాశన మొనర్చెదను.

ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠ స్సుమహాయశాః |
సృజస్వేతి తదోవా చ బలం పరబలారుజమ్ ||

స|| హే రామ ! తయా ఇత్యుక్తస్తు సు మహాయశాః వసిష్ఠః తత్ ఉవాచ బలం పర బలారుజమ్ సృజస్వ ఇతి |

తా|| ఓ రామా ! ఈవిధముగా చెప్పబడిన ఆ మహా యశస్సు గల వసిష్ఠుడు ఇట్లు పలికెను. "శత్రు బలములను జయించు బలము సృజింపును" అని.

తస్య తద్వచనం శ్రుత్వా సురభిః సా అశ్రుజత్ తదా |
తస్యా హుంభారవోత్సృష్టాః పప్లవా శ్శతశో నృపః ||
నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః |||

స|| తస్య తత్ వచనం శ్రుత్వా సా సురభిః తదా అసృజత్ | తస్యా హూంభారవాత్ సృష్టాః శతశః నృపః తస్య బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః నాశయంతి|

తా|| అయనయొక్క ఆ మాటలను విని ఆ సురభి అప్పుడు సృజించెను. ఆమెయొక్క హుంకారమునుంచి వందలకొలది సృష్ఠించబడిన రాజులు విశ్వామిత్రుడు చూచుచుండగనే ఆయన సైన్యములన్నీ నాశనము చేయసాగిరి.

బలం భగ్న తతో దృష్ట్వారథేనాక్రమ్య కౌశికః |
స రాజా పరమక్రుద్ధో రోషవిస్ఫారితేక్షణః |
పప్ల్వాన్ నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి ||

స|| భగ్నం బలం తతో దృష్ట్వా స రాజా పరమక్రుద్ధః రోషవిస్ఫా రితేక్షణః కౌశికః రథేన ఆక్రమ్య శస్త్రైరుచ్చావచైరపి పప్లవాన్ నాశయామాస |

తా|| అలా భగ్నము అగుతున్న సైన్యములను చూచి విశ్వా మిత్రుడు రథము ఎక్కిపరమక్రోధముతో ఎర్రగానున్న కన్నులతో అనేక శస్త్రములతో పప్లవసైన్యములను నాశనము చేయసాగెను.

విశ్వామిత్రార్థితాన్ దృష్ట్వా పప్లవాన్ శతశస్తతదా |
భూయఏవాసృజత్ కోపాత్ శకన్ యవన మిశ్రితాన్ ||

స|| విశ్వామిత్రార్థితాన్ పప్లవాన్ శతశః దృష్ట్వా తదా కోపాత్ శకన్ యవన మిశ్రితాన్ భూయఏవ అసృజత్ ||

తా|| విశ్వామిత్రునిచే వందలకొలదీ పప్లవులు హతమగుట చూచి అప్పుడు ( శబల) కోపముతో శకులను యవనులను మరల సృష్టించెను.

తైరాసీత్ సంవృతా భూమిః శకైర్యవన మిశ్రితైః |
ప్రభావిద్భిర్మహావీర్యైః హేమ కింజల్క సన్నిభైః ||
దీర్ఘాసిపట్టిశధరైః హేమవర్ణాంబరావృత్తైః |
నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకైః ||

స|| శకైర్యవన మిశ్రితైః తైః భూమిః సంవృతా ఆసీత్ | ప్రభావిద్భిః మహావీర్యైః హేమ కింజల్క సన్నిభైః దీర్ఘాసిపట్టిశధరైః హేమవర్ణాంబరావృత్తైః సర్వం తత్ బలం ప్రదీప్తైరివ పావకైః నిర్దగ్ధమ్ ||

తా|| ఆశకులు యవనులతో భూమి పూర్తిగా నిండిపోయెను. వారు ప్రతిభావంతులు. మహావీరులు. పొడవైన కత్తులను ధరించిఉండిరి. బంగారు వన్నెగల వస్త్రములను ధరించిఉండిరి. ఆట్టి ఆందరూ ఆ ( విశ్వామిత్రుని) బలములన్నిటినీ మహాగ్నిజ్వాలలవలె భస్మమొనర్చిరి.

తతో అస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ |
తై స్తైర్యవనకాంభోజాః పప్లవాశ్చాకులీ కృతాః ||

స|| తతః మహాతేజా విశ్వామిత్రః అస్త్రాణి ముమోచ హ తై స్తైః యవన కాంభోజాః పప్లవాశ్చ అకులీ కృతాః |

తా|| అప్పుడు మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు అస్త్రములను ప్రయోగించగా యవనులు కాంభోజులు పప్లవులు చెల్లచదురు అయితిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుః పంచాశస్సర్గః ||

|| om tat sat ||