Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 72

The Four marriages !!

||om tat sat ||

బాలకాండ
ద్విసప్తతితమస్సర్గః
( శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నలకు సీత ఊర్మిళా మాండవీ శ్రుతకీర్తులను ఇచ్చి వివాహమొనర్చుటకు నిశ్చయించుట)

తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||

స||ఉక్తవంతం వైదేహం వసిష్ఠసహితం నృపం తం వీరం వచనం మహామునిః విశ్వామిత్రః ఉవాచ ||

తా|| అట్లు వీరుడైన విదేహమహరాజు చే చెప్పబడిన వసిష్టునితో కూడిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ |
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోs స్తి కశ్చన ||

స|| హే నరపుంగవ ఇక్ష్వాకూణాం విదేహానాం కులాని అచిన్త్యాని అప్రమేయాని | ఏషాం కశ్చన న తుల్యః అస్తి |

తా|| "ఓ నరపుంగవా ! ఇక్ష్వాకు విదేహ కులములు సాటిలేనివి వాటి వైభవము వర్ణింపబడలేనివి. వీటితో సమానమైనవి లేవు".

సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా |
రామలక్ష్మణయో రాజన్ సీతాచోర్మిళయా సహ ||

స|| రాజన్! రామలక్ష్మణయోః సీతా చ ఉర్మిళా సహ సంబంధః ధర్మ సదృశః రూపసంపదా సదృశః ||

తా|| "ఓ రాజా! సీతా ఊర్మిళలతో రామ లక్ష్మణుల సంబంధము ధర్మరీత్యా సదృశము. రూపసంపదలలో కూడా సదృశము".

వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ |
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః ||

స|| హే నరశ్రేష్ఠ ! మమ వచనం వక్తవ్యం శ్రూయతాం | ఏష రాజా భ్రాతా కుశధ్వజః యవీయాన్ ధర్మజ్ఞః ||

తా|| "ఓ నరశ్రేష్ఠా ! చెప్పతగిన నా వచనములను వినురుగాక | ఈ తమ్ముడు అగు రాజు కుశధ్వజుడు అతి ధర్మజ్ఞుడు".

అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణా ప్రతిమం భువి |
సుతా ద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే ||
భరతస్య కుమారస్య శతృఘ్నస్య చ ధీమతః |
వరయామ స్సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః ||

స|| హే నరశ్రేష్ఠ ! రాజన్ ధర్మాత్మనః అస్య సుతా ద్వయం రూపేణ భువి అప్రతిమం ధీమతః భరతస్య శతృఘ్నస్య కుమారస్య పత్న్యర్థం వరయామహే || హే రాజన్ తయోః సుతే మహాత్మనయోః అర్థే వరయామః ||

తా|| "ఓ రాజా! ఈ ధర్మాత్ముడగు రాజుకి గల భువిలో అతి సందరమైన ఇద్దరు కుమార్తెలను ఓ నరశ్రేష్ఠా ధీమతులైన కుమారులు భరత శతృఘ్నుల భార్యలు అగుటకు ప్రార్థించుఉన్నాను. ఓ రాజా! నీ పుత్రికలను ఈ మహాత్ముల కోసము కోరుచున్నాను"

పుత్త్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః |
లోకపాలోపమాస్సర్వే దేవతుల్య పరాక్రమః ||

స|| దశరథస్య ఇమే పుత్త్రాః రూపయౌవ్వనశాలినః | సర్వే లోకపాల ఉపమా:| దేవతుల్య పరాక్రమాః ||

తా|| "దశరథుని ఈ పుత్రులు రూపయౌవ్వన సంపదలు కలవారు. లోకపాలునితో సరితూగువారు.దేవులతో సమానమైన పరాక్రమము కలవారు".

ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతామ్ |
ఇక్ష్వాకోకులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః ||

స|| హే రాజేంద్ర ! సంబంధేన ఇక్ష్వాకుకులం భవతః ఉభయోః అపి పుణ్యకర్మణః అనుభధ్యతాం ||

తా|| "ఓ రాజేంద్ర ! ఈ సంబంధముతో పుణ్యకార్యములు చేసిన ఇక్ష్వాకుకులము మీది కూడా దృఢపడును".

విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తథా |
జనకః ప్రాంజలి ర్వాక్యం ఉవాచ మునిపుంగవౌ ||

స|| వసిష్ఠస్య మతే విశ్వామిత్ర వచః శ్రుత్వా జనకః మునిపుంగవౌ ప్రాంజలిః వాక్యం ఉవాచ ||

తా|| వసిష్ఠుని సమ్మతితో చెప్పబడిన విశ్వామిత్రుని వచనములను విని జనకుడు ఆ మునిపుంగవులకు అంజలిఘటించి ఇట్లు పలికెను.

కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ |
సదృశం కులసంభంధం యదాజ్ఞాపయథః స్వయమ్ ||

స|| హే మునిపుంగవౌ ! యదా స్వయం ఆజ్ఞాపయథః యేషాం కులసంబంధం సదృశం మన్యే | ఇదం కులం ధన్యం ||

తా|| "ఓ మునిపుంగవులారా ! మీరు స్వయముగా అజ్ఞాపించుటవలన ఈ కులసంబంధము తగినది అని భావిస్తున్నాను. ంఆ కులము ధన్యమైనది".

ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే |
పత్న్యౌ భజేతాం సహితౌ శతృఘ్నభరతావుభౌ ||

స|| భద్రం వః ||కుశధ్వజ సుతే ఇమే శతృఘ్నభరతా వుభౌ పత్న్యౌ సహితౌ భజేతాం | ఏవం భవతు ||

తా|| "మీకు శుభము అగుగాక. కుశధ్వజుని పుత్రికలు ఇద్దరూ భరత సతృఘ్నులకు పత్నులు అగుదురు గాక".

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే |
పాణీన్ గృహ్ణంతు చత్వారో రాజపుత్త్రా మహాబలాః ||

స|| రాజపుత్రీణాం చతసౄణాం చత్వారో రాజపుత్త్రాః ఏకాహ్న పాణీన్ గృహ్ణంతు ||

తా|| నలుగురు రాజపుత్రుల నలుగురు రాజపుత్రికల పాణిగ్రహణము ఒకేదినమున అగుగాక |

ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః|
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ||

స|| బ్రహ్మన్ ! మనీషిణః ఉత్తర ఫల్గుణీభ్యాం యత్ర ప్రజాపతిః భగః (అస్తి తత్ దినే ) వైవాహికం ప్రశంసంతి |

తా|| "ఓ బ్రహ్మన్ !మనుష్యులు భగ ప్రజాపతి ఉత్తర ఫలుగుణి లో ఉన్నప్పుడు జరుగు వివాహము ప్రశంసించుదురు".

ఏవముక్త్వా వచసౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః |
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ||

స|| సౌమ్యం వచః ఏవం ఉక్త్వా కృతాంజలిః ఉభౌ మునివరౌ ప్రతి ఉద్ధాయ జనకః వాక్యమ అబ్రవీత్ ||

తా||సౌమ్యమైన ఇట్టి వచనములను ఆ మునులు ఇద్దరులతో పలికి , జనకుడు కృతాంజలి ఘటించి మరల ఇట్లు పలికెను .

పరో ధర్మః కృతో మహ్యం శిష్యో sస్మి భవతోః సదా |
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ ||

స|| హే మునిపుంగవౌ ! మహ్యం పరోధర్మః కృతః | సదా భవతోః శిష్యో అస్మి | ఇమాం ముఖ్యాని ఆసనాని ఆసతాం ||

తా|| "ఓ మునిపుంగవులారా ! నాకు ఉపకారము చేసితిరి. ఎల్లప్పుడూ మీకు శిష్యుడుగానుందును. ఈ ముఖ్యమైన ఆసనములను స్వీకరించుడు".

యథా దశరథస్యేయం తథాయోధ్యాపురీమమ |
ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హథ ||

స|| యథా దశరథస్య అయోధ్యాపురీ తథా ఇయం| మమ ప్రభుత్వే సందేహం న అస్తి | యథార్హం కర్తుమర్హథ ||

తా|| "ఈ ( మిథిలా) నగరమును దశరథుని అయోధ్యాపురి వలె నే అని భావించుడు. నా ప్రభుత్వములో సందేహము లేదు. మీరు ఆజ్ఞాపించినటులనే అగును".

తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః |
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్ ||

స|| తథా వైదేహే బ్రువతి రఘునందనః రాజా దశరథః హృష్ఠః మహీపతిం జనకే ప్రత్యువాచ||

తా|| అట్లు చెప్పిన విదేహరాజుకి రఘునందనుడగు రాజు దశరథుడు సంతోషముతో జనక మహారాజు కి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

యువామసంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ |
ఋషయో రాజసంఘాశ్చ భవద్బ్యామభిపూజితాః ||

స|| భ్రాతరౌ మిథిలేశ్వరౌ యువాం అసంఖ్యేయ గుణౌ ( అస్తి) | ఋషయోః రాజసంఘాశ్చ భవద్భాం అభిపూజితః ||

తా|| "ఓ మిథిలేశ్వరులరా ! మీకు అసంఖ్యాకమైన గుణములు కలవు. ఋషులు రాజుసంఘములు మీ చేత పూజింపబడినవి".

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయం |
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్ ||

స|| స్వస్తి ప్రాప్నుహి ! స్వమాలయం గమిష్యామి | శ్రాద్ధకర్మాణి సర్వాణి విధస్యాం | భద్రం తే | ఇతి అబ్రవీత్ చ ||

తా|| "మీకు శుభమగుగాక ! నా భవనమునకు వేళ్ళెదను. శ్రాద్గకర్మలను అన్నింటినీ చేసెదను. మీకు శుభమగుగాక" . అని చెప్పెను

తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా |
మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహయశాః ||

స|| తదా రాజా దశరథః తం నరపతిం అపృష్ట్వా మహాయశాః తౌ మునీంద్రౌ పురస్కృత్య జగామాశు ||

తా||అప్పుడు రాజా దశరథుడు ఆనరపతి అనుమతితో ఆ మునీంద్రులిద్దరితో కలిసి వెళ్ళెను.

స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః |
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్ ||

స|| స నిలయం గత్వా విధానతః శ్రాద్ధం కృత్వా ప్రభాతే కాల్యం ఉత్థాయ ఉత్తమమ్ గోదానం చక్రే||

తా|| అతడు తన ఆలయమునకు పోయి విథి విధానముగా శ్రాద్ధకర్మలను నిర్వహించి ప్రభాత సమయములో ఉత్తమమైన గోవుల దానము చేసెను.

గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః |
ఏకైకశో దదౌ రాజా పుత్త్రానుద్దిశ్య ధర్మతః ||

స|| ఏకైకశో పుత్త్రాన్ ఉద్దిశ్య ధర్మతః శతశహస్రాణి గవాం బ్రాహ్మణ్యేభ్యో దదౌ ||

తా|| ప్రతి ఒక్కరి పుత్త్రులకోసము ధర్మానుసారముగా లక్ష గోవులను బ్రాహ్మణునకు దానమిచ్చెను.

సువర్ణ శృంగా స్సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః |
గవాం శతసహసాణి చత్వారి పురుషర్షభ ||

స|| సువర్ణశృంగ సంపన్నాః సవత్సాః కాంస్య దోహనాః చత్వారి శతసహస్రాణి గవాం ( బ్రాహ్మణ్యేభ్యో దదౌ)

తా|| (అవి) బంగారపు కొమ్ములు గలవి ,పాలు సమృద్ధిగా ఇచ్చునవి, దూడలు ఉన్నవి. అట్టి నాలుగు లక్షల ఆవులను బ్రాహ్మణులకు ఇచ్చెను.

విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునందనః |
దదౌ గోదానముద్దిశ్య పుత్త్రాణాం పుత్త్రవత్సలః ||

స|| పుత్రవత్సలః రఘునందనః పుత్రాణామ్ గోదానముద్దిస్య అన్యచ్చ సుబహు విత్తం ద్విజేభ్యో దదౌ ||

తా|| పుత్రవత్సలుడగు రఘునందనుడు పుత్త్రులక్షేమముకోరఅకు గో దానము ఇచ్చి ఇంకా చాలా ధనమును బ్రాహ్మణులకు ఇచ్చెను.

స సుతైః కృతగోదానైః వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||

స|| స నృపతిః తదా కృత గోదానైః లోకపాలైః వృతః వృతస్తు సౌమ్యః ప్రజాపతిః ఇవ భాతి ||

తా|| గోదానములను ఇచ్చిన ఆ ( దశరథ) మహారాజు లోకపాలులచే చుట్టబడిన సౌమ్యుడగు ప్రజాపతి వలె ప్రకాశించుచుండెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విసప్తతితమస్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విథముగా బాలకాండలోని దెబ్బది రెండవ సర్గ సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||