దేవీమహాత్మ్యమ్ !

దుర్గాసప్తశతి

దేవీ మహాత్మ్యములో స్తుతులు !!

||om tat sat||

దేవీ మహాత్మ్యము

దేవీ సప్త శతి - దేవి మీద ఏడువందలశ్లోకాలలో కథా రూపముగా చెప్పబడిన స్తుతి. ఈ దేవీ స్తుతిలో పన్నెండు అధ్యాయాలున్నాయి

అదే దేవీ మహత్మ్యము.
దీనినే చండీ సప్తశతీ అనికూడా అంటారు.
చండీ హోమములో పారాయణ చేయబ్అడే శ్లోకాలు కూడా ఇవే

దేవీ మహాత్మ్యము లో మహామాయ తన వివిధ స్చరూపములలో రాక్షసులను వధించడము వర్ణింపబడుతుంది. దేవీ మహాత్మ్యము ప్రథమ చరితము , మధ్యమ చరితము , ఉత్తర చరితము అని మూడు భాగాలు గా వస్తుంది . మహామాయ తన మహాకాళి (తామసిక) స్వరూపములో మధుకైటక వధకు తోర్పడుట ప్రథమ చరిత్రములో ఒకటవ అధ్యాయములో , మహామాయ తన మహాలక్ష్మి స్వరూపములో మహిషాసురుని వధించుట మధ్యమ చరితములోని రెండు మూడు నాల్గవ అధ్యాయములలోనూ, మహామాయ తన మహాసరస్వతీ స్వరూపములో శుంభ నిశుంభాసురలను వధించుట ఉత్తర చరితములోనూ ( అంటే ఇదునుంచి పదకొండవ అధ్యాయము వరకు) వర్ణింపబడియున్నది.

ఈ దేవీ మహాత్మ్యము ముఖ్యముగా దుర్గాపూజా దినములలో పారాయణచేయబడును.

పారాయణ చేసు కోవడానికి అనుగుణముగా
- చణ్డికా ధ్యానము
- అర్గలాస్తోత్రము
- కీలక స్తోత్రము
- దేవీ కవచము
- శక్రాది స్తుతి ( నాలుగొవ అధ్యాయము)
- దేవీ స్తుతి ( ఇదవ అధ్యాయము)
- నారాయణీ స్తుతి ( పదకొండవ అధ్యాయము)
- అపరాధ క్షమాపణ స్తోత్రము
- దేవీ సూక్తము ( ఋగ్వేదమునుంచి)
ఇక్కడ తీసుకు రావడమైనది.
సప్తశతి లోని పదమూడు సర్గలు కూడా ఇక్కడ తీసుకు వచ్చాము
ఇవన్నీ మీ పఠనానందము కోసమే

||ఓమ్ తత్ సత్||
|| ओं तत् सत्||