||సుందరకాండ ||
||ముప్పది ఒకటవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 31 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ ఏకత్రింశస్సర్గః
ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపిః|
సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ||1||
స||మహాకపిః ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా వైదేహ్యామధురం వాక్యం సంశ్రవే వ్యాజహార హ||
ఆ మహాకపి ఇలాగ అనేక విధములుగా ఆలోచించి వైదేహికి మధురమైన మాటలు వినిపించుటకు సిద్ధ పడెను.
రాజా దశరథో నామ రథ కుంజిర వాజిమాన్|
పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం న్మహయశాః||2||
రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా చర్షిభిస్సమః|
చక్రవర్తికులే జాతః పురందరసమో బలే||3||
స|| దశరథః నామ రాజా రథకుంజిరవ్యాజిమాన్ పుణ్యశీలః మహాకీర్తిః ఇక్ష్వాకూణాం మహాయశాః|| (సః) రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా ఋషిభిః సమః చ బలే పురందర సమః చక్రవర్తికులే జాతః||
"దశరథుడు అను పేరుగల రాజు అనేకమైన రథములు ఏనుగులు కలవాడు, పుణ్యశీలుడు, మహాకీర్తిగలవాడు ఇక్ష్వాకులలో మహత్తరమైన యశస్సు కలవాడు. రాజర్షి, శ్రేష్ఠ మైన గుణములు కలవాడు, తపస్సులో ఋషులతో సమానమైన వాడు. బలములోఇంద్రునితో సమానుడు. చక్రవర్తుల కులములో జన్మించినవాడు'.
అహింసారతి రక్షుద్రో ఘృణీ సత్యపరాక్రమః|
ముఖ్యశ్చ ఇక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః||4||
పార్థివవ్యంజనైర్యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః|
పృథివ్యాం చతురంతాయాం విశ్రుత స్సుఖదః సుఖీ||5||
స|| (సః) అహింసా రతి అక్షుద్రః ఘృణీ సత్యపరాక్రమః ఇక్ష్వాకువంశశ్చ ముఖ్యః చ లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః|| (సః) పార్థివవ్యంజనైః యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః చతురంతాయాం పృథివ్యాం విశ్రుతః సుఖదః సుఖీ చ||
"ఆహింసలో అనురక్తి గలవాడు. ఉదారుడు క్షుద్రుడు కాడు, దయకలవాడు, సత్యమనే ఆయుధముకల పరాక్రముడు. ఇక్ష్వాకువంశములోముఖ్యుడు. లక్ష్మికల లక్ష్మిని పెంపొందింప కలవాడు. రాజలక్షణములు కలవాడు, ఇశ్వర్యము కలవాడు. రాజులలో రాజు. నాలుగు సముద్రములతో చుట్టబడిన భూమండలము లో పేరుగలవాడు, సుఖములను కలగించువాడు తాను సుఖముగా నుండువాడు".
తస్య పుత్త్రః ప్రియోజ్యేష్ఠః తారాధిపనిభాననః|
రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్||6||
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా|
రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః||7||
తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః|
సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్||8||
స|| తస్య జ్యేష్ఠ పుత్రః ప్రియః రామః నామః తారాధిపనిభాననః విశేషజ్ఞః సర్వధనుష్మతాం శ్రేష్ఠః||(సః) పరంతపః స్వస్య ధర్మస్య రక్షితా స్వజనస్య రక్షితా జీవలోకస్య ధర్మస్య చ రక్షితా || తస్య సత్యాభిసందస్య వృద్ధస్య పితుః వచనాత్ వీరః స భార్యః స భ్రాత్రా చ వనం ప్రవ్రాజితః||
"ఆయన యొక్క ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు రాముడను పేరుగలవాడు. చంద్రునిముఖమువంటి ముఖము కలవాడు, విశేషజ్ఞానము కలవాడు. ధనస్సు ధరించువారిలో శ్రేష్ఠుడు. శతృవులను తపించు వాడు. స్వధర్మమును పాటించువాడు. స్వజనములను రక్షించువాడు. జీవలోకమును ధర్మమును రక్షించువాడు. ఆ వీరుడు సత్యసంధుడు తన యొక్క వృద్ధుడగు తండ్రి మాటలను అనుసరించి భార్యతో తమ్మునితో కలిసి వనమునకు పోయెను".
తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా|
రాక్షసా నిహతా శ్శూరా బహవః కామరూపిణః||9||
జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ|
తత స్త్వమర్షాపహృతా జానకీ రావణేన తు||10||
వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా|
స|| తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా బహవః కామరూపిణః శూరాః రాక్షసాః నిహతాః|| తతః జనస్థానవధం చ ఖరదూషణౌ హతః శ్రుత్వా వనే మృగరూపేణ మాయయా రామం వంచయిత్వా రావణేన జానకీ అమర్షా అపహృతా||
"అక్కడ మహారణ్యములో మృగములను వేటాడుతూ అనేకమంది కామరూపులు శూరులు అగు రాక్షసులు ఆయనచేత సంహరింపబడిరి. అక్కడ జనస్థానములో రాక్షసుల వధ, ఖరదూషణుల మరణము విని , మాయా మృగరూపములో రాముని వంచించిన రావణుని చేత, సీత అపహరింపబడెను".
సమార్గమాణస్తాం దేవీం రామః సీతామనిందితామ్||11||
అససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం |
తతః స వాలినం హత్వా రామః పరపురంజయః||12||
ప్రాయచ్ఛత్ కపిరాజ్యం తత్సుగ్రీవాయ మహాబలః|
సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః||13||
దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతీ సహస్రశః|
స|| సః రామః సీతాం అనిందితాం దేవీం వనే మార్గమాణః సుగ్రీవం నామ వానరం మిత్రం అససాద||తతః సః పరపురంజయః మహాబలః రామః వాలినం హత్వా కపిరాజ్యం తత్ సుగ్రీవాయ ప్రాయచ్ఛత్|| సుగ్రీవేణ సందిష్టాః సహస్రశః కామరూపిణః హరయః సర్వాసు దిక్షుః తాం దేవీం విచిన్వంతీ ||
"ఆ రాముడు దోషరహితమైన సీతను అన్వేషిస్తూ మార్గములో సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రుడుగా పొందెను. అప్పుడు శతృవుల నగరములను జయించగల మహాబలవంతుడగు రాముడు, వాలిని హతమార్చి, ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను. సుగ్రీవునిచే పంప బడిన వేలకొలదీ తముకోరిన రూపము దాల్చగల వానరులు, సీతను అన్వేషించుటకై అన్ని దిశలలోను పంపబడిరి".
అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతమ్||14||
అస్యా హేతౌ ర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః|
యథారూపం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితామ్||15||
అశ్రౌషం రాఘవస్యాహం సేయ మాసాదితా మయా|
విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః||16||
స|| అస్య విశాలాక్ష్యాః హేతోః సంపాతి వచనాత్ అహం శతయోజనం ఆయతం సాగరం ప్లుతః || అహమ్ రాఘవస్య తాం యథారూపం యథావర్ణం యథాలక్ష్మీం అశ్రౌషం సా ఇయం మయా ఆసాదితా|| అసౌ వానరపుంగవః ఏవం ఉక్త్వా విరరామ||
"ఆ విశాలాక్షి కారణముగా సంపాతి వచనములపై నేను వందయోజనములు విస్తీర్ణమైన సాగరమును దాటితిని. నేను రాఘవునిచే చెప్పబడిన రూపము వర్ణము లక్షణములు వర్చస్సులను ఈమె లో చూచుచున్నాను". ఆ వానరపుంగవుడు ఈ విధముగా చెప్పి విరమించెను.
జానకీ చాపి తత్ శ్రుత్వా పరం విస్మయమాగతా||16||
స|| తత్ శ్రుత్వా జానకీ చ పరం విస్మయం ఆగతా అపి||
ఆ మాటలను విని జానకికి అత్యంత ఆశ్చర్యము కలిగెను.
తతః సా వక్రకేశాంతా సుకేశీ కేశసంవృతమ్||17||
ఉన్నమ్య వదనం బీరు శ్శింశుపావృక్ష మైక్షత||18||
నిశమ్య సీతా వచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చవీక్ష్య|
స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామ మనుస్మరంతీ||19||
స|| తతః వక్రకేశాంతా భీరుః క్లేశసంవృతం సా వదనం ఉన్నమ్య శింశుపావృక్షం ఏక్షత|| సీతా కపేః వచనం నిశమ్య సర్వాః దిశః చ ప్రదిశః చ వీక్ష్యా స్వయం సర్వాత్మనా రామం అనుస్మరంతీ పరమం ప్రహర్షం జగామ||
భయస్వభావము కల వక్రములైన కేశాంతములు గల కేశములచే కప్పబడిన తన ముఖమును పైకెత్తి శింశుపా వృక్షముపైకి చూచెను. వానరుని మాటలను విని అన్ని దిశలలో చూస్తూ రామునినే ధ్యానిస్తూ సీత ఆనండభరితురాలయ్యెను.
సాతిర్యగూర్ధ్వం చ తథా ప్యధస్తాన్ నిరీక్షమాణా తం అచింత్య బుద్ధిమ్|
దదర్శ పింగాధిపతేరమాత్యమ్ వాతాత్మజం సూర్య మివోదయస్థమ్||20||
స|| సా తిర్యక్ ఊర్ధ్వం చ తథాపి అథస్తాత్ నిరీక్షమాణా అచిన్త్యబుద్ధిం పింగాధిపతేః అమాత్యం ఉదయస్థం సూర్యం ఇవ తం వాతాత్మజం దదర్శ||
ఆమె పైకి క్రిందకీ అన్నివైపులా చూచి అచిన్త్య బుద్ధికలవాడు, పింగాధిపతి మంత్రీ, ఉదయభానుని వలె నున్న హనుమంతుని చూచెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకత్రింశస్సర్గః||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఒకటవ సర్గ సమాప్తము.
||ఓం తత్ సత్||