||సుందరకాండ ||

||ముప్పది ఐదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 35 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచత్రింశస్సర్గః

హనుమంతుడు వినిపించిన రామ కథను విని, "ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి" అనుకుంటూ ఆనందపడినా గాని, మళ్ళీ తనతో మాట్లాడుతున్నవాడు "మాయావీ" రావణుడా? అని శంకలో పడినది సీత.

ఆ సీతకి, హనుమంతుడు "రాముడు 'ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంతః శశీ యథా' , అంటే సూర్యునివలే తేజోవంతుడు , చంద్రునివలె లోకమునకు ఆహ్లాదము కలిగించువాడు", అంటూ సీత మనస్సుకి ఆహ్లాదము కలిగిస్తాడు. ఇది మనము ముప్పది నాలుగొవ సర్గలో విన్నకథ.

చివరికి, "నాహమస్మి తథా దేవీ" అంటూ , "నీవు శంకిస్తున్నట్లు రావణుని కాదు, నేను రామదూతను" అన్న హనుమంతుని మాటతో మనస్సు కుదుటబడినా, సీతకి రాముని గురించే ఇంకా వినాలని పిస్తుంది.

మన మనస్సు కి ఆహ్లాదపరిచే పాట వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది. పసిపిల్ల, చెప్పిన కధే మళ్ళీ మళ్ళీ చెప్పమని అడుగుతూ వుంటుంది. బ్రహ్మజ్ఞానముపై మళ్ళిన మనస్సు కి బ్రహ్మజ్ఞానముగురించే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే సీత కు తనకు ఉపశమనము కలిగించు రాముని గురించి ఇంకా వినాలనిపిస్తుంది.

ముప్పది ఐదవ సర్గ ఆ సీతమ్మ ప్రశ్నలతో మొదలవుతుంది. అప్పుడు సీత హనుమంతుని ఇలా అడుగుతుంది.

||శ్లోకము 35.01||

తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ |
ఉవాచ వచనం సాంత్వ మిదం మథురయా గిరః||35.01||

స|| వైదేహీ వానరర్షభాత్ రామకథాం శ్రుత్వా మధురయా గిరః సాంత్వం ఇదం వచనం ఉవాచ||

||శ్లోకార్థములు||

వైదేహీ వానరర్షభాత్ రామకథాం శ్రుత్వా -
వైదేహి ఆ వానరోత్తముని ద్వారా రామకథను విని
మధురయా గిరః - మధురమైన మాటలతో
సాంత్వం ఇదం వచనం ఉవాచ -
శాంతముగా ఈ మాటలు పలికెను

||శ్లోకతాత్పర్యము||

తా|| వైదేహి ఆ వానరోత్తముని ద్వారా రామకథను విని మధురమైన మాటలతో శాంతముగా ఇట్లు పలికెను. ||35.01||

||శ్లోకము 35.02||

క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణమ్|
వానరాణాం నరాణం చ కథామాసీత్ సమాగమః||35.02||

స||తే రామేణ సంసర్గః క్వ | లక్ష్మణం కథం జానాసి||నరాణాం వానరాణాం సమాగమః కథం ఆసీత్||

||శ్లోకార్థములు||

తే రామేణ సంసర్గః క్వ -
నీవు రామునితో ఎప్పుడు కలిసితివి
లక్ష్మణం కథం జానాసి -
లక్ష్మణుని ఎటుల నెఱుంగుదువు
నరాణాం వానరాణాం -
నరులకు వానరులకు
సమాగమః కథం ఆసీత్ -
సమాగమము ఎట్లు సంభవించెను

||శ్లోకతాత్పర్యము||

"నీవు రామునితో ఎప్పుడు కలిసితివి ? లక్ష్మణుని ఎటుల నెఱుంగుదువు? నరులకు వానరులకు సమాగమము ఎట్లు సంభవించెను."||35.02||

||శ్లోకము 35.03||

యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర|
తాని భూయః సమాచక్ష్వ న మాం శోకః సమావిశేత్||35.03||

స||హే వానర ! రామస్య లింగాని యాని | లక్ష్మణస్య చ|| భూయః తాని సమాచక్ష్వ | ( తదా) మాం శోకః సమావిశేత్ ||

||శ్లోకార్థములు||

హే వానర - ఓ వానరా
రామస్య లింగాని యాని -
రాముని చిహ్నములు ఏమి ?
లక్ష్మణస్య చ -
లక్ష్మణుని చిహ్నములు ఏమి
భూయః తాని సమాచక్ష్వ -
అవి నీవు మళ్ళీ చెప్పుము
( తదా) మాం శోకః సమావిశేత్ -
(అప్పుడు) నా శోకము శమించును

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా రాముని చిహ్నములు ఏమి ? లక్ష్మణుని చిహ్నములు ఏమి? అవి నీవు మళ్ళీ చెప్పుము. అప్పుడు నా శోకము శమించును." ||35.03||

||శ్లోకము 35.04||

కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం|
కథ మూరూ కథం బాహూ లక్ష్మణస్య చ శంస మే||35.04||

స|| రామస్య సంస్థానం కీదృశం | రామస్య రూపం కీదృశం| కథాం ఊరూ కథం బాహుః మే శంస| తథైవ లక్ష్మణస్య చ||

||శ్లోకార్థములు||

రామస్య సంస్థానం కీదృశం -
రాముని సంస్థానమెట్లుండును?
రామస్య రూపం కీదృశం -
రాముని రూపము ఎట్లుండును
కథాం ఊరూ కథం బాహుః మే శంస -
ఊరువులు బాహువులు ఎట్లుండును అది నాకు చెప్పుము
తథైవ లక్ష్మణస్య చ - అలాగే లక్ష్మణుడెట్లుండును

||శ్లోకతాత్పర్యము||

"రాముని సంస్థానమెట్లుండును? రాముని రూపము ఎట్లుండును?ఊరువులు బాహువులు ఎట్లుండును ? అలాగే లక్ష్మణుడెట్లుండును?'"||35.04||

||శ్లోకము 35.05||

ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్మారుతాత్మజః|
తతో రామం యథా తత్త్వ మాఖ్యాతుముపచక్రమే||35.05||

స|| వైదెహ్యా ఏవం ఉక్తస్తు తతః హనుమాన్ మారుతాత్మజః రామం తత్త్వం ఆఖ్యాతుం ఉపచక్రమే||

||శ్లోకార్థములు||

తతః వైదెహ్యా ఏవం ఉక్తస్తు -
అప్పుడు వైదేహి చేత ఇట్లు అడగబడిన
హనుమాన్ మారుతాత్మజః -
మారుతాత్మజుడగు హనుమ
రామం తత్త్వం -
రాముని యథాతథముగా
ఆఖ్యాతుం ఉపచక్రమే -
వర్ణించుటకు ఉపక్రమించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు వైదేహి చేత ఇట్లు అడగబడిన మారుతాత్మజుడగు హనుమంతుడు, రాముని యథాతథముగా వర్ణించుటకు ఉపక్రమించెను." ||35.05||

రాముని చిహ్నములు , సంస్థానము, ఊరువులూ , బాహువులూ గురించి సీతకు అన్నీ తెలుసును. సీతమ్మకి తెలుసు అని హనుమంతునికి కూడా తెలుసు. అయినా కాని తన ద్వారా వినాలనే కోరికతో అడిగినది అని హనుమకు అర్థమవుతుంది.

ఒకప్పుడు బాగా తెలిసికూడా అడిగే ప్రశ్నలు, తమని కించపరచడానికి అడిగిన ప్రశ్నలా అని కించపడే వాళ్ళు ఉంటారు. అలాగ అహంకారము తో నిండినవారు మరో విధముగా ప్రవర్తిస్తారు. కాని హనుమంతుడు అలాంటివాడు కాదు. ఆ ప్రశ్నలు తన అదృష్ఠముగా భావించి , హనుమంతుడు రాముని యథాతథముగా వర్ణించుటకు ఉపక్రమించెను.

||శ్లోకము 35.06||

జానంతీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి|
భర్తుః కమల పత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ||35.06||

స|| వైదేహి మాం పరిపృచ్ఛసి బత కమలపత్రాక్షీ దిష్ట్యా భర్తుః లక్ష్మణస్య చ సంస్థానం జానంతి ||

||శ్లోకార్థములు||

కమలపత్రాక్షీ వైదేహి -
ఓ కమలపత్రాక్షీ వైదేహీ
భర్తుః లక్ష్మణస్య చ సంస్థానం జానంతి -
భర్త లక్ష్మణుల సంస్థానము తెలిసి
దిష్ట్యా మాం పరిపృచ్ఛసి బత దిష్ట్యా -
నా అదృష్ఠము కొలదీ నన్ను అడుగుచున్నావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ కమలపత్రాక్షీ వైదేహీ భర్త లక్ష్మణుల సంస్థానము తెలిసి కూడా నా అదృష్ఠము కొలదీ నన్ను అడుగుచున్నావు."||35.06||

||శ్లోకము 35.07||

యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై|
లక్షితాని విశాలాక్షీ వదతః శ్రుణు తాని మే||35.07||

స|| యాని రామస్య లక్ష్మణస్యచ చిహ్నాని యాని వై లక్షితాని తాని వదతః | మే శ్రుణు||

||శ్లోకార్థములు||

యాని రామస్య లక్ష్మణస్యచ చిహ్నాని -
ఏ రామలక్ష్మణులు చిహ్నములు
యాని వై లక్షితాని తాని వదతః -
ఏవి ఉన్నవో అవి చెప్పెదను
మే శ్రుణు - వినుము

||శ్లోకతాత్పర్యము||

"రామలక్ష్మణులు చిహ్నములు ఏవి ఉన్నవో అవి చెప్పెదను వినుము". ||35.07||

||శ్లోకము 35.08||

రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః|
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతే జనకాత్మజే||35.08||

స|| జనకాత్మజే ప్రసూతే రామః కమలపత్రాక్షః | సర్వసత్త్వ మనోహరః | రూపదాక్షిన్య సంపన్నః|

||శ్లోకార్థములు||

జనకాత్మజే - ఓ జనకాత్మజా !
ప్రసూతే రామః కమలపత్రాక్షః -
రాముడు పుట్టుకతో కమలపత్రాక్షుడు
సర్వసత్త్వ మనోహరః -
అన్ని విధములుగా మనోహరుడు
రూపదాక్షిన్య సంపన్నః-
రూపము దక్షత సంపదలుగా గలవాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ జనకాత్మజా ! రాముడు పుట్టుకతో కమలపత్రాక్షుడు. అన్ని విధములుగా మనోహరుడు. రూపము దక్షత సంపదలుగా గలవాడు." ||35.08||

ఇకనుంచి వచ్చే శ్లోకాలు, రాముని గుణ వర్ణనలు. రాముడు సుగుణాభిరాముడు అనే మాట ఈ శ్లోకాలలో మనకు విదితమౌతుంది.

ఈ శ్లోకాలను అధ్యాత్మిక రూపముగా కూడా చూడవచ్చు.

ఆ వర్ణనలో మొదటి శ్లోకములో హనుమంతుడు తన వర్ణనలో రామః కమలపత్రాక్షః" అంటూ "రామః" అన్న మాటతో మొదలెడతాడు.

సీతారామ కల్యాణఘట్టములో జనకుడు అన్న" ఇయం సీతా" లో ఎన్ని ధ్వనులు వినిపిస్తాయో, ఎన్నిసంగతులు ఇమిడిఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా హనుమంతుడు "రామః" అన్నప్పుడు అన్నిఅర్థాలు ధ్వనులు వినిపిస్తాయి.

రామః అంటే "రమయతి ఇతి రామః" అని; రమయతి అంటే రమింపచేయువాడు. అంటే ఆనందము కలిగించువాడు. చూచెడి వారి చూపులను మనసులనూ ఆకర్షించెడివాడు రాముడు. పుట్టిన ప్రతి బిడ్డ, ఆ తల్లికి రాముడే. చూచెడి వారి చూపులను మనసులనూ ఆకర్షించెడివాడు కనకే రాముడు అనే పేరు వచ్చింది.

రాముని గుణములు వర్ణన చేయబోతున్నహనుమ "రామః " అంటాడు. ఇక్కడ "రామః" అన్న ఒక్కమాటలోనే ఓ "సీతమ్మా నీ భర్త రాముడు"; అంటే "సీతమ్మా నీ భర్త ఆనందము కలిగించువాడు" అని !

ఎవరిలోనైన మొదటిగా ఆకర్షించేవి కళ్ళు. ఇక్కడ హనుమంతుడు మొదటచెప్పినమాట " రామః కమలపత్రాక్షః" రాముని కళ్ళు కమలపత్రమును పోలి యుండు నేత్రములట. "రూప దాక్షిణ్య సంపన్నః" అంటే రూపము దాక్షిణ్యము కలవాడు. రూపము అనడములో దేహ గుణములు. దాక్షిణ్యము అనడములో ఆత్మ గుణములు సూచింపబడతాయి. ఆలాంటి దేహ గుణములతో ఆత్మగుణములతో కూడియున్నవాడు రాముడు.

ఈ గుణములు సంపాదించిన గుణములు కావు. అంటే "ప్రసూతః" గుణములతో నే పుట్టినవాడు.

ఈ వర్ణనలో ఆంజనేయుడు రాముని యొక్క పరతత్త్వముని గుర్తించాడు అంటారు తమ టీకాలలో గోవిన్దరాజులవారు , తిలక టికాలోను. .

"రామః" - రమయతి ఇతి రామః - అనడములోనే రాముడు ఆనంద స్వరూపుడు, ఆనందము గుణముగా కలవాడు, ఆనందము ఇచ్చువాడు అని. ఈ ఆనంద స్వరూపుడు అనే మాటతో స్ఫురించేది జగత్కారణ తత్త్వమైన పరమాత్మ సచ్చిదానంద స్వరూపమే. అంటే రాముడు ఆ పరమాత్మ స్వరూపమే అని ధ్వని.

ఛాందోగ్యోపనిషత్తు లో వినే మాట. జగత్కారణమైన పరతత్వము ఉపాసకుల సౌలభ్యము కోసము, సూర్యమండలమున వుండును. ఆ సూర్యమండలావర్తి యగు నారాయణుని వర్ణిస్తూ ఛాందోగ్యోపనిషత్తు ఇలా చెపుతుంది.

"హిరణ్మయః పురుషః దృశ్యతే
హిరణ్య శ్వశ్రుః హిరణ్య నఖః|
అ ప్రణఖాత్ సర్వ ఏవ స్వర్ణః
యథా కప్యాసం పుండరీక మేవ అక్షిణీ"||

సూర్యమండలములో హిరణ్యమయమైన పురుషుడు
-"దృశ్యతే"- కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? హిరణ్మయ కేశములతో, హిరణ్మయ నఖములతో అంటే బంగారు గోళ్ళతో కనిపిస్తాడు. అంతా హిరణ్మయ రూపములో కనపడే ఆ పురుషుడు, నీటిలోంచి మొలచి, లావైన కాడపై నిలిచి, అప్పుడే ఉదయించిన సూర్యకిరణములచే వికసించిన తామరపూవులని పోలిన కళ్ళు కలవాడు. అంటే ఆ పురుషుడు 'కమలపత్రాక్షుడు'. అది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన మాట. అదే హనుమంతుడు ఇక్కడ అన్నమాట కూడా .

ఆ పరతత్త్వమే సూర్యమండలాంతర్వర్తి యగు పురుషుడు. అతడే మళ్ళీ సూర్యవంశమున దివ్యమంగళ విగ్రహ గుణములతో , దివ్యాత్మ గుణములతో పరిపూర్ణుడై అందరి కన్నులకు గోచరించునట్లు రాముడిగా జన్మించినవాడు. "ప్రసూతః" అనడములో , జన్మము లేని వాడు జన్మించెను అని.

రాముని ఈ పరమాత్మ స్వరూపముతో పోలుస్తూ మొదలెట్టి , హనుమంతుడు మిగిలిన దేహాత్మ విశేషాలన్నీ కూడా చాలా వివరముగా ముందు శ్లోకాలలో చెపుతాడు.

||శ్లోకము 35.09||

తేజసాఽఽదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ద్యా యశసా వాసవోపమః||35.09||

స|| తేజసా ఆదిత్య సమః| క్షమయా పృథివీ సమః| బుద్ధ్యా బృహస్పతి సమః | యశసా వాసవః ఉపమః||

||శ్లోకార్థములు||

తేజసా ఆదిత్య సమః -
తేజస్సులో సూర్యునితో సమానుడు
క్షమయా పృథివీ సమః -
క్షమలో భూమితో సమానుడు
బుద్ధ్యా బృహస్పతి సమః -
బుద్ధిలో బృహస్పతి తో సమానుడు
యశసా వాసవః ఉపమః -
యశస్సులో ఇంద్రునితో సమానుడు

||శ్లోకతాత్పర్యము||

"తేజస్సులో సూర్యునితో సమానుడు. క్షమలో భూమితో సమానుడు. బుద్ధిలో బృహస్పతి తో సమానుడు. యశస్సులో ఇంద్రునితో సమానుడు." ||35.09||

||శ్లోకము 35.10||

రక్షితా జీవలోకస్య స్వజన స్యాభిరక్షితా|
రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః||35.10||

స|| జీవలోకస్య రక్షితా | స్వజనస్యాభి రక్షితా| పరంతపః స్వస్య వృత్తస్య ధర్మస్య చ రక్షితా||

||శ్లోకార్థములు||

జీవలోకస్య రక్షితా -
జీవలోకమును రక్షించువాడు
స్వజనస్యాభి రక్షితా -
తన జనములను రక్షించువాడు
పరంతపః స్వస్య వృత్తస్య -
శతృవులను తపించు పరంతపుడు
స్వస్య వృత్తస్య ధర్మస్య చ రక్షితా -
తనను ఆశ్రయించినవారి ధర్మమును రక్షించువాడు

||శ్లోకతాత్పర్యము||

"జీవలోకమును రక్షించువాడు. తన జనములను రక్షించువాడు. శతృవులను తపించు పరంతపుడు. తనను ఆశ్రయించినవారిని ధర్మమును రక్షించువాడు"||35.10||

||శ్లోకము 35.11||

రామోభామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా|
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః||35.11||

స|| ||హే భామిని | లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా |సః లోకస్య మర్యాదానాం కర్తా చ కారయితా చ||

తిలక టీకాలో - లోకస్యమర్యాదానాం వర్ణాశ్రమ మర్యాదానాం కర్తా భగవదవతారత్వాత్ - అని ; అంటే ఈ గుణములన్నీ భగవదవాతారము కాబట్టి అని.

||శ్లోకార్థములు||

హే భామిని - ఓ దేవి
లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా -
లోకములో నాలుగు వర్ణములవారిని రక్షింఛువాడు
సః లోకస్య మర్యాదానాం కర్తా -
అతడు లోకములో మర్యాదలను నిలపెట్టువాడు
చ కారయితా చ -
పాటింప చేయువాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి లోకములో నాలుగు వర్ణములవారిని రక్షింఛువాడు. అతడు లోకములో మర్యాదలను నిలపెట్టువాడు పాటింప చేయువాడు".||35.11||

||శ్లోకము 35.12||

అర్చిష్మా నర్చితోఽత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః|
సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞః శ్చ కర్మణామ్||35.12||

స|| అత్యర్థం అర్చిష్మాన్ అర్చితః | బ్రహ్మచర్య వ్రతే స్థితః | సాధూనాం ఉపకారజ్ఞః కర్మణాం ప్రచారజ్ఞః చ||

||శ్లోకార్థములు||

అత్యర్థం అర్చిష్మాన్ అర్చితః -
అత్యంత తేజోమయుడు. పూజితుడు
బ్రహ్మచర్య వ్రతే స్థితః -
బ్రహ్మచర్య వ్రతములో నిష్ఠగలవాడు
సాధూనాం ఉపకారజ్ఞః -
సాధువులకు ఉపకారము చేయుటలో ప్రజ్ఞకలవాడు
కర్మణాం ప్రచారజ్ఞః చ -
కర్మలను పాటించుటలో పాటింపచేయబడుటలో ప్రజ్ఞ కలవాడు

||శ్లోకతాత్పర్యము||

" అత్యంత తేజోమయుడు. పూజితుడు. బ్రహ్మచర్య వ్రతములో నిష్ఠగలవాడు. సాధువులకు ఉపకారము చేయుటలో ప్రజ్ఞకలవాడు. కర్మలను పాటించుటలో పాటింపచేయబడుటలో ప్రజ్ఞ కలవాడు." ||35.12||

||శ్లోకము 35.12||

రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణనాముపాసితా|
శ్రుతవాన్ శీలసంపన్నో వినీతశ్చ పరంతప||35.13||

స|| సః రాజవిద్యా వినీతః | బ్రాహ్మణానాం ఉపాసితా చ| (సః) పరంతపః శ్రుతవాన్ శీలసంపన్నః వినీతః చ||

||శ్లోకార్థములు||

సః రాజవిద్యా వినీతః -
అతడు రాజవిద్యా వినీతుడు
బ్రాహ్మణానాం ఉపాసితా చ -
బ్రాహ్మణులను ఆదరించువాడు
(సః) పరంతపః - పరంతపుడు
శ్రుతవాన్ శీలసంపన్నః -
వేదవిద్యలలో పారంగతుడు. శీలము కలవాడు
వినీతః చ - బుద్ధిమంతుడు కూడా

||శ్లోకతాత్పర్యము||

"అతడు రాజవిద్యా వినీతుడు. బ్రాహ్మణులను ఆదరించువాడు. అతడు పరంతపుడు. వేదవిద్యలలో పారంగతుడు. శీలము కలవాడు.బుద్ధిమంతుడు."||35.13||

||శ్లోకము 35.14||

యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః|
ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః||35.14||

స|| యజుర్వేద వినీతః | వేదవిద్భిః సుపూజితః చ|| వేదేషు వేదాంగేషు ధనుర్వేదే చ నిష్ఠితః||

||శ్లోకార్థములు||

యజుర్వేద వినీతః -
యజుర్వేదము తెలిసినవాడు
వేదవిద్భిః సుపూజితః చ -
వేదములను తెలిసిన వారిచేత పూజింపబడువాడు
వేదేషు వేదాంగేషు -
వేదములలోనూ వేదాంగములలోనూ
ధనుర్వేదే చ నిష్ఠితః -
ధనుర్వేదములోనూ నిష్ఠ కలవాడు

||శ్లోకతాత్పర్యము||

"యజుర్వేదము తెలిసినవాడు. వేదములను తెలిసిన వారిచేత పూజింపబడువాడు. వేదములలోనూ వేదాంగములలోనూ ధనుర్వేదములోనూ నిష్ఠ కలవాడు".||35.14||

ఇప్పటి దాకా చెప్పబడినవి ఆత్మ గుణములు; ముందు వచ్చే శ్లోకములో విపులాంశో మహాబాహుః అంటూ దేహగుణములు చెప్పబడతాయి.

||శ్లోకము 35.15||

విపులాంసో మహాబాహుః కంబుగ్రీవః శుభాననః|
గూఢజత్రుః సుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః||35.15||

స|| దేవి విపులాంసః మహాబాహుః కంబుగ్రీవః శుభాననః గూఢజత్రుః సుతామ్రాక్షః రామః జనైః శ్రుతః||

||శ్లోకార్థములు||

దేవి విపులాంసః -
ఓ దేవి (రాముడు) విశాలమైన భుజములు కలవాడు
మహాబాహుః - పెద్ద బాహువులు కలవాడు.
కంబుగ్రీవః - కంఠము శంఖాకారములో నున్నవాడు
శుభాననః - మంగళప్రదమైన ముఖము కలవాడు
గూఢజత్రుః -మూపుసంధి ఎముకలు గూఢముగా గలవాడు
సుతామ్రాక్షః - మంచి తామ్రవర్ణముగల కళ్ళు కలవాడు
రామః జనైః శ్రుతః -
రాముడు లోకములో అందరికి తెలిసినవాడు

||శ్లోకతాత్పర్యము||

" ఓ దేవి రాముడు విశాలమైన భుజములు కలవాడు. పెద్ద బాహువులు కలవాడు. కంఠము శంఖాకారములో నున్నవాడు. మంగళప్రదమైన ముఖము కలవాడు. రాముడు మూపుసంధి ఎముకలు గూఢముగా గలవాడు. మంచి తామ్రవర్ణముగల కళ్ళు కలవాడు. రాముడు లోకములో అందరికి తెలిసినవాడు." ||35.15||

||శ్లోకము 35.16||

దుందుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్|
సమ స్సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః||35.16||

స|| దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగః శ్యామం వర్ణం సమాశ్రితః ||

||శ్లోకార్థములు||

దుందుభిస్వన నిర్ఘోషః -
దుందుభి వంటి స్వరఘోష కలవాడు
స్నిగ్ధవర్ణః -
నిగనిగలాడు మేలిమి ఛాయకలవాడు
ప్రతాపవాన్ -
ప్రతాపము కలవాడు
సమః సమవిభక్తాంగః-
అన్ని అవయవములు సమానమైన ప్రమాణములో కలవాడు
శ్యామం వర్ణం సమాశ్రితః -
శ్యామవర్ణముతో నిండినవాడు

||శ్లోకతాత్పర్యము||

"రాముని స్వరము దుందుభి వంటిది. నిగనిగలాడు మేలిమి ఛాయకలవాడు. ప్రతాపము కలవాడు. అన్ని అవయవములు సమానమైన ప్రమాణములో కలవాడు. శ్యామవర్ణముతో నిండినవాడు". ||35.16||

||శ్లోకము 35.17||

త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషుచోన్నతః|
త్రితామ్ర త్రిషు చ స్నిగ్ధో గంభీర త్రిషు నిత్యశః||35.17||

స|| త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషు చ ఉన్నతః స్నిగ్ధః నిత్యశః త్రిషు గంభీరః ||

ఈ శ్లోకములు గోవిన్దరాజులవారు తమ టీకాలో రామ తిలక టీకాలో చాలా విస్తృతముగా వ్యాఖ్యానము రాశారు. ఇక్కడ చెయబడిన అనువాదము ఆ టీకాలను అనుసరించి చేయబడినది.

||శ్లోకార్థములు||

త్రిస్థిరః -
మూడు స్థలములలో ధృఢముగా కలవాడు
త్రిప్రలంబశ్చ-
మూడు స్థలములలో దీర్ఘముగావుండువాడు
త్రిసమః త్రిషు చ ఉన్నతః -
మూడు ప్రదేశములలో అవయవములు ఎత్తైనవిగా అమరి వున్నాయి
స్నిగ్ధః నిత్యశః త్రిషు -
మూడు చోట్లలో ఎఱ్ఱని రంగు కలవాడు
త్రిషు గంభీరః -
మూడు విధములుగా గంభీరముగా వుండువాడు.

||శ్లోకతాత్పర్యము||

మూడు స్థలములలో ( వక్షస్థలము, మణీకట్టు ,పిడికెట్టు) ధృఢముగా కలవాడు. మూడు స్థలములలో ( బాహువులు కనుబొమలు వృషణకోశము) దీర్ఘముగావుండువాడు. మూడు ప్రదేశములలో అవయవములు (నాభి రొమ్ము పొత్తికడుపు) ఎత్తైనవిగా అమరి వున్నాయి. మూడు చోట్లలో ( అర చేయి అరికాళ్ళూ గోళ్లు) ఎఱ్ఱని రంగు కలవాడు. మూడు విధములుగా ( నడకతీరు,నిలబడు విధానము, కంఠస్వరము) గంభీరముగా వుండువాడు. ||35.17||

||శ్లోకము 35.18||

త్రివలీవాం స్త్ర్యవనతః చతుర్వ్యంగః త్రిశీర్షవాన్|
చతుష్కలః చతుర్లేఖః చతుష్కిష్కుః చతుస్సమః||35.18||

స|| త్రివలీవాం స్త్ర్యవనతః చతుర్వ్యంగః త్రిశీర్షవాన్ చతుష్కలః చతుశ్కిష్కుః చతుస్సమః ||

||శ్లోకార్థములు||

త్రివలీవాం -
(ఉదరముపై) మూడు మడతలు కలవాడు
స్త్ర్యవనతః -
మూడు చోట్ల నిమ్నముగా వున్నవాడు
చతుర్వ్యంగః -
నాలుగు చోట్ల హ్రస్వముగా వుందు వాడు
త్రిశీర్షవాన్ -
తలపై మూడు సుడులు కలవాడు
చతుష్కలః -
(అంగుష్ఠముపై)నాలుగు రేఖలు కలవాడు
చతుశ్కిష్కుః -
నాలుగు మూరల ఎత్తు గలవాడు
చతుస్సమః -
నాలుగు చోట్ల సమానమైన ప్రమాణములలో ఉండువాడు

||శ్లోకతాత్పర్యము||

"ఉదరముపై మూడు మడతలు కలవాడు. స్తనములు స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా నున్నవాడు. నాలుగు ( కంఠము లింగము వీపు పిక్కలు) హ్రస్వమైనవి. తలపై మూడు సుడులు కలవాడు. (అంగుష్ఠముపై) నాలుగు రేఖలు కలవాడు. నాలుగు మూరల ఎత్తు గలవాడు. నాలుగు చోట్ల ( బాహువులు మోకాళ్ళు తోడలు చెక్కిళ్ళు) సమానమైన ప్రమాణములలో ఉండువాడు." ||35.18||

||శ్లోకము 35.19||

చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్ట్రః చతుర్గతిః|
మహోష్ఠహనునాసశ్చ పంచస్నిగ్ధోsష్టవంశవాన్||35.19||

స|| చతుర్దశసమద్వంద్వః చతుర్దంష్ట్రః చతుర్గతిః మహోష్టహనునాసః చ పంచస్నిగ్ధః అష్టవంశవాన్ ||

||శ్లోకార్థములు||

చతుర్దశసమద్వంద్వః -
పద్నాలుగు జతల అంగములు సమముగా కలవాడు
చతుర్దంష్ట్రః -
నాలుగు ( ముందు పళ్ళు) దంతములు కలవాడు
చతుర్గతిః -
నాలుగు విధములగు నడకతీరు కలవాడు
మహోష్టహనునాసః చ -
మహత్తరమైన దవడలు, ముక్కు కలవాడు
పంచస్నిగ్ధః -
ఇదు చోట్ల నిగనిగలాడుచుండువాడు
అష్టవంశవాన్ -
అష్టవంశములు సమానమైన ప్రమాణములో కలవాడు

||శ్లోకతాత్పర్యము||

"పద్నాలుగు జతల అంగములు సమముగా కలవాడు ( కనుబొమ్మలు, నాశికపుటములు,కళ్ళు, పెదవులు, చెవులు, చేతులు, మోచేతులు , మణికట్లు, స్తనాగ్రములు, పిరుదులు, వృషణములు,మోకాళు, పాదములు , నడుము ఇరుప్రక్కలు), నాలుగు ( ముందు పళ్ళు) దంతములు కలవాడు. నాలుగు విధములగు ( సింహ శార్దూల వృష భగజ) నడకతీరు కలవాడు. మహత్తరమైన దవడలు, ముక్కు కలవాడు. ఇదు చోట్ల ( కళ్ళు, పళ్ళు, చర్మము, పాదములు. కేశములు) నిగనిగలాడుచుండువాడు. రాముని శరీరములో అష్టవంశములు ( శరీరము,చేతివేళ్ళు, కాలివేళ్ళు,చేతులు, నాశికలు,నేత్రాలు చెవులు వృషణములు) సమానమైన ప్రమాణములో కలవాడు."||35.19||

||శ్లోకము 35.20||

దశపద్మో దశబృహ త్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్|
షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః||35.20||

స|| రాఘవః దశపద్మః దశబృహః త్రిభిః వ్యాప్తః ద్విశుక్లవాన్ షడున్నతః నవతనుః త్రిభిః వ్యాప్నోతి||

||శ్లోకార్థములు||

రాఘవః దశపద్మః -
రాఘవుడు పది పద్మములు కలవాడు
దశబృహః -
పది అవయవములు విపులముగా అమరి వుండువాడు
త్రిభిః వ్యాప్తః - మూడుతో ప్రఖ్యాతి కలవాడు
ద్విశుక్లవాన్ - రెండిటిని పావనము చేసినవాడు.
షడున్నతః - ఆరు అంగములు ఉన్నతమైన వాడు
నవతనుః - తొమ్మిది తనువులు కలవాడు
త్రిభిః వ్యాప్నోతి-
మూడు కాలములలో ధర్మార్థకామములను ఆచరించువాడు

||శ్లోకతాత్పర్యము||

"పది అవయవములు విపులముగా అమరి వుండువాడు( శిరస్సు, నుదురు,చెవులు, కంఠము, వక్షము , హృదయము, పొట్ట చేతులు, కాళ్ళు వీపు). మూడు (తేజస్సు, కీర్తి సంపద) తో ప్రఖ్యాతి కలవాడు. రెండిటిని ( మాతృ పితృ వంశములను)పావనము చేసినవాడు. ఆరు అంగములు ఉన్నతమైన వాడు( చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము). తొమ్మిది తనువులు కలవాడు. మూడు కాలములలో ధర్మార్థకామములను ఆచరించువాడు." ||35.20||

||శ్లోకము 35.21||

సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః|
దేశకాలవిభాగజ్ఞః సర్వలోకప్రియం వదః||35.21||

స|| సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాలవిభాగజ్ఞః సర్వలోకప్రియం వదః||

||శ్లోకార్థములు||

సత్యధర్మపరః -
సత్యధర్మములను ఆచరించువాడు
శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః -
సకలైశ్వర్య సంపన్నుడు, సంగ్రహించుట అనుగ్రహించుటలో రక్తికలవాడు
దేశకాలవిభాగజ్ఞః -
దేశకాలముల జ్ఞానము కలవాడు
సర్వలోకప్రియం వదః-
లోకములో అందరికి ప్రియముకలుగునట్లు మాట్లాడువాడు

||శ్లోకతాత్పర్యము||

"సత్యధర్మములను ఆచరించువాడు , సకలైశ్వర్య సంపన్నుడు, సంగ్రహించుట అనుగ్రహించుటలో రక్తికలవాడు, దేశకాలముల జ్ఞానము కలవాడు, లోకములో అందరికి ప్రియముకలుగునట్లు మాట్లాడువాడు."||35.21||

||శ్లోకము 35.22||

భ్రాతా చ తస్య ద్వైమాత్ర సౌమిత్రి రపరాజితః|
అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిథః||35.22||

స|| తస్య భ్రాతా చ ద్వైమాత్రః సౌమిత్రిః అపరాజితః అనురాగేణ రూపేణ గుణేన చ తథావిధః||

||శ్లోకార్థములు||

తస్య భ్రాతా చ ద్వైమాత్రః -
అతని తమ్ముడు, సవితితల్లి కోడుకు
సౌమిత్రిః అపరాజితః -
సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు అపరాజితుడు
అనురాగేణ రూపేణ గుణేన చ తథావిధః -
రూపము అనురాగము గుణములలోరాముని వంటి వాడే

||శ్లోకతాత్పర్యము||

" అతని తమ్ముడు, సవితితల్లి కోడుకు , సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు అపరాజితుడు. రూపము అనురాగము గుణములలోరాముని వంటి వాడే."||35.22||

||శ్లోకము 35.23||

తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శనసముత్సుకౌ|
విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ||35.23||

స|| తౌ ఉభౌ నరశార్దూలౌ త్వత్ దర్శన సముత్సుకౌ మహీం విచిన్వంతౌ అస్మాభీ అభిసంగతౌ కృత్స్నాం||

||శ్లోకార్థములు||

తౌ ఉభౌ నరశార్దూలౌ -
ఆ నరశార్దూలు ఇద్దరూ
త్వత్ దర్శన సముత్సుకౌ -
నీ దర్శనముకై ఆతురతతో
మహీం విచిన్వంతౌ -
భూమండలము అంతా వెతుకుతూ
అస్మాభీ అభిసంగతౌ కృత్స్నాం -
మమ్ములను కలుసుకున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"ఆ నరశార్దూలు ఇద్దరూ నీ దర్శనముకై ఆతురతతో భూమండలము అంతా వెతుకుతూ మమ్ములను కలుసుకున్నారు."||35.23||

||శ్లోకము 35.24||

త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరామ్|
దదర్శతు ర్మృగపతిం పూర్వజేనావరోపితమ్||35.24||

స|| త్వాం ఏవ మార్గమాణౌ వసుంధరాం విచిన్వంతౌ పూర్వజేన(వాలినా) అవరోపితం మృగపతిం ( సుగ్రీవం)దదర్శ||

||శ్లోకార్థములు||

త్వాం ఏవ మార్గమాణౌ -
నిన్ను వెతుకుతూ వున్న
వసుంధరాం విచిన్వంతౌ -
భూమి అంతా వెదుకుతూ
పూర్వజేన(వాలినా) అవరోపితం -
పూర్వజునిచేత బహిష్కృతుడైన
మృగపతిం ( సుగ్రీవం)దదర్శ -
వానరాధీశుని చూచెను."

||శ్లోకతాత్పర్యము||

"నిన్ను వెతుకుతూవున్న సమయములో పూర్వజునిచేత బహిష్కృతుడైన వానరాధీశుని చూచెను." ||35.24|

||శ్లోకము 35.25||

ఋశ్యమూకస్య పృష్ఠే తు బహుపాదపసంకులే|
భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనమ్||35.25||

స|| బహుపాదప సంకులే ఋష్యమూకస్య పృష్ఠే భ్రాతుః భయార్తం ప్రియదర్శనం సుగ్రీవం దదర్శ||

||శ్లోకార్థములు||

బహుపాదప సంకులే -
అనేకమైన వృక్షములు కల
ఋష్యమూకస్య పృష్ఠే -
ఋష్యమూక పర్వతములో
భ్రాతుః భయార్తం -
అన్నతో భయపడి
ప్రియదర్శనం సుగ్రీవం దదర్శ -
ప్రియదర్శనుడగు సుగ్రీవుని చూచిరి

||శ్లోకతాత్పర్యము||

"ఆ నరశార్దూలు ఇద్దరూ అనేకమైన వృక్షములు కల ఋష్యమూక పర్వతములో అన్నతో భయపడి దాగివున్న ప్రియదర్శనుడగు సుగ్రీవుని కలిసిరి. ||35.25||

||శ్లోకము 35.26||

వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరమ్|
పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితమ్||35.26||

స|| వయం తు పూర్వజేన రాజ్యాత్ అవరోపితం సత్యసంగరం హరిరాజం తం సుగ్రీవం పరిచర్యామహే||

||శ్లోకార్థములు||

వయం తు - మేము కూడా
పూర్వజేన రాజ్యాత్ అవరోపితం -
రాజ్యమునుంచి అగ్రజునిచేత వెడలగొట్ట బడిన
సత్యసంగరం హరిరాజం -
సత్యము చెప్పు వానర రాజు అగు
తం సుగ్రీవం పరిచర్యామహే -
ఆ సుగ్రీవుని పరిచర్యలలో వున్నవారము

||శ్లోకతాత్పర్యము||

"మేము కూడా వానరాధీశుడగు, సత్యపరాధీనుడైన, రాజ్యమునుంచి అగ్రజునిచేత వెడలగొట్ట బడిన ఆ సుగ్రీవుని పరిచర్యలలో వున్నవారము."||35.26||

||శ్లోకము 35.27||

తతస్తౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ|
ఋశ్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ||35.27||

స|| తతః తౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశం ఉపాగతౌ ||

||శ్లోకార్థములు||

తతః తౌ చీరవసనౌ -
అప్పుడు నారచీరలు ధరించిన
ధనుః ప్రవరపాణినౌ -
ధనస్సును చేతిలో పట్టుకున్న
ఋష్యమూకస్య శైలస్య -
ఋష్యమూక పర్వతమువద్దనున్న
రమ్యం దేశం ఉపాగతౌ -
రమ్యమైన ప్రదేశమునకు వచ్చితిరి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు నారచీరలు ధరించిన ధనస్సును చేతిలో పట్టుకున్న వారిద్దరూ ఋష్యమూక పర్వతమువద్దనున్న రమ్యమైన ప్రదేశమునకు వచ్చితిరి."||35.27||

||శ్లోకము 35.28||

స తౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః|
అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః||35.28||

స|| సః వానరర్షభః తౌ నరవ్యాఘ్రౌ దృష్ట్వా భయమోహితః తస్య గిరేః శిఖరం అవప్లుతౌ ||

||శ్లోకార్థములు||

సః వానరర్షభః - ఆ వానర రాజు
తౌ నరవ్యాఘ్రౌ దృష్ట్వా-
నరవ్యాఘ్రములవలెనున్న ఆ ఇద్దరు నరవరులను చూచి
భయమోహితః - భయపడినవాడై
తస్య గిరేః శిఖరం అవప్లుతౌ -
ఆ పర్వత శిఖరముకు ఎగిరి వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

"నరవ్యాఘ్రములవలెనున్న ఆ నరవరులను చూచి భయపడినవాడై వానరాధీశుడు ఆ పర్వత శిఖరముకు ఎగిరి వెళ్ళెను."||35.28||

||శ్లోకము 35.29||

తతః స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః|
తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరమ్||35.29||

స|| సః వానరేంద్రః తస్మిన్ శిఖరే వ్యవస్థితః తతః తయోః ( రామలక్ష్మణయోః) సమీపం మాం ఏవ సత్వరం ప్రేషయామాస||

||శ్లోకార్థములు||

సః వానరేంద్రః - ఆ వానరేంద్రుడు
తస్మిన్ శిఖరే వ్యవస్థితః -
ఆ శిఖరమునందే ఉండి
తతః తయోః ( రామలక్ష్మణయోః) సమీపం -
ఆ వారిద్దరి సమీపమునకు
మాం ఏవ సత్వరం ప్రేషయామాస -
నన్నే వెంటనే పంపించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరేంద్రుడు ఆ శిఖరమునందే ఉండి ఆ వారిద్దరి సమీపమునకు నన్ను వెంటనే పంపించెను."||35.29||

||శ్లోకము 35.30||

తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ప్రభూ |
రూపలక్షణసంపన్నౌ కృతాంజలిరుపస్థితః||35.30||

స|| అహం సుగ్రీవవచనాత్ ప్రభూ పురుషవ్యాఘ్రౌ రూపలక్షణసంపన్నౌతౌ కృతాంజలిః ఉపస్థితః ||

||శ్లోకార్థములు||

అహం ప్రభూ సుగ్రీవవచనాత్ -
నేను ప్రభువైన సుగ్రీవుని వచనములతో
పురుషవ్యాఘ్రౌ రూపలక్షణసంపన్నౌ-
బలవంతులు రూపలక్షణసంపన్నులగు
తౌ కృతాంజలిః ఉపస్థితః -
వారిద్దరికి అంజలిఘటించి నిలబడితిని."

||శ్లోకతాత్పర్యము||

"నేను ప్రభువైన సుగ్రీవుని వచనములతో రూపలక్షణసంపన్నులగు వారిద్దరికి అంజలిఘటించి నిలబడితిని."

||శ్లోకము 35.31||

తౌ పరిజ్ఞాతతత్వార్థౌ మయా ప్రీతిసమన్వితౌ|
పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ||35.31||

స|| పరిజ్ఞాత తత్త్వార్థౌ పురుషర్షభౌ ప్రీతిసమన్వితౌ తం మయా పృష్ఠమారోప్య దేశం ప్రాపితౌ ||

||శ్లోకార్థములు||

పరిజ్ఞాత తత్త్వార్థౌ -
వారి తత్త్వమును తెలిసికొని
పురుషర్షభౌ ప్రీతిసమన్వితౌ -
బలవంతులు ప్రీతి ప్రసన్నత కల వారిద్దరినీ
తం మయా పృష్ఠమారోప్య -
నా పృష్ఠముపై నెక్కించుకొని
దేశం ప్రాపితౌ -
దేశమునకు కొనిపోయితిని.

||శ్లోకతాత్పర్యము||

"వారి తత్త్వమును తెలిసికొనిన నేను ప్రీతి ప్రసన్నత కల వారిద్దరినీ నా పృష్ఠముపై నెక్కించుకొని వారిని మా దేశమునకు కొనిపోయితిని." ||35.31||

||శ్లోకము 35.32||

నివేదితౌ చ తత్త్వేన సుగ్రీవాయ మహాత్మనే|
తయో రన్యోన్య సల్లపాద్భృశం ప్రీతి రజాయత||35.32||

స|| మహాత్మనే సుగ్రీవాయ తత్త్వేన నివేదితౌ తయోః అన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతిః అజాయత||

||శ్లోకార్థములు||

మహాత్మనే సుగ్రీవాయ -
మహాత్ముడైన సుగ్రీవునకు
తత్త్వేన నివేదితౌ -
తత్త్వము నివేదించిన పిమ్మట
తయోః అన్యోన్య సల్లాపాత్ -
పిమ్మట వారిద్దరి అన్యోన్య సల్లాపములతో
భృశం ప్రీతిః అజాయత -
వెంటనే మైత్రి ఉదయించెను

||శ్లోకతాత్పర్యము||

"మహాత్ముడైన సుగ్రీవునకు వారి తత్త్వము నివేదించిన పిమ్మట వారిద్దరి అన్నోన్య సల్లాపములతో మైత్రి ఉదయించెను."||35.32||

||శ్లోకము 35.33||

తతస్తౌ ప్రీతిసంపన్నౌ హరీశ్వరనరేశ్వరౌ|
పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వ వృత్తయా||35.33||

స|| తతః ప్రీతిసంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పూర్వవృత్త కథయా పరస్పర కృత ఆశ్వాసౌ||

||శ్లోకార్థములు||

తతః ప్రీతిసంపన్నౌ -
అలాగ ప్రీతిసంపన్నులగు
హరీశ్వర నరేశ్వరౌ -
హరీశ్వర నరీశ్వరులు
పూర్వవృత్త కథయా -
పూర్వము జరిగిన వృత్తాంతములతో
పరస్పర కృత ఆశ్వాసౌ-
పరస్పర ఆశ్వాసము పొందిరి

||శ్లోకతాత్పర్యము||

"అలాగ ప్రీతిసంపన్నులగు వారిద్దరూ పూర్వము జరిగిన వృత్తాంతములతో పరస్పర ఆశ్వాసము పొందిరి". ||35.33||

||శ్లోకము 35.34||

తతః స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః|
స్త్రీ హేతోః వాలినా భ్రాత్రా నిరస్త మురుతేజసా||35.34||

స|| తతః స్త్రీహేతోః భ్రాత్రా వాలినా నిరస్తం సుగ్రీవం ఉరుతేజసా లక్ష్మణాగ్రజః సాంత్వయామాస||

||శ్లోకార్థములు||

తతః స్త్రీహేతోః -
అప్పుడు స్త్రీ కారణముగా
భ్రాత్రా వాలినా నిరస్తం సుగ్రీవం -
వాలిచేత వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని
ఉరుతేజసా లక్ష్మణాగ్రజః సాంత్వయామాస -
తేజోవంతుడగు లక్ష్మణాగ్రజుడు ఊరడించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు స్త్రీ కారణముగా అన్నయైన వాలిచేత వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని తేజోవంతుడగు లక్ష్మణాగ్రజుడు ఊరడించెను." ||35.34||

||శ్లోకము 35.35||

తతస్త్వన్నాశజం శోకం రామస్యా క్లిష్టకర్మణః|
లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్ ||35.35||

స|| తతః లక్ష్మణః అక్లిష్టకర్మణః రామస్య త్వన్నాశజం శోకం వానరేంద్రస్య సుగ్రీవాయ న్యవేదయత్ ||

||శ్లోకార్థములు||

తతః లక్ష్మణః- అప్పుడు లక్ష్మణుడు
అక్లిష్టకర్మణః రామస్య -
క్లిష్ఠమైన కార్యములు సాధించ గల రాముని
త్వన్నాశజం శోకం -
నీవు లేనందువలన జనించిన శోకమును
వానరేంద్రస్య సుగ్రీవాయ న్యవేదయత్ -
ఆ వానరేంద్రునికి నివేదించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు లక్ష్మణుడు క్లిష్ఠమైన కార్యములు సాధించ గల రాముని నీవు లేనందువలన జనించిన శోకమును శోకమును ఆ వానరేంద్రునికి నివేదించెను."||35.35||

||శ్లోకము 35.36||

స శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః|
తదాసీన్నిష్ప్రభోsత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్||35.36||

స|| సః వానరేంద్రః తు లక్ష్మణేన ఈరితం వచః శ్రుత్వా తదా గ్రహగ్రస్తః అంశుమాన్ ఇవ అత్యర్థం నిష్ప్రభః ఆసీత్ ||

||శ్లోకార్థములు||

సః వానరేంద్రః తు - ఆ వానరేంద్రుడు
లక్ష్మణేన ఈరితం వచః శ్రుత్వా -
లక్ష్మణుని చేత చెప్పబడిన మాటలను విని
తదా గ్రహగ్రస్తః అంశుమాన్ ఇవ -
గ్రహము పట్టిన సూర్యుని వలె
అత్యర్థం నిష్ప్రభః ఆసీత్ -
మిక్కిలి తేజోవిహీనిడయ్యెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరేంద్రుడు లక్ష్మణుని చేత చెప్పబడిన మాటలను విని గ్రహము పట్టిన సూర్యుని వలె తేజోవిహీనిడయ్యెను." ||35.36||

||శ్లోకము 35.37||

తతస్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమాణయా|
యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే||35.37||

స|| తతః త్వత్ గాత్రశోభీని యాని ఆభరణజాలాని రక్షసా హ్రియమాణయా మహీతలే పాతితాని (దర్శయామాశుః)||

||శ్లోకార్థములు||

తః త్వత్ గాత్రశోభీని -
నీ అవయవములకు శోభను కలిగించు
రక్షసా హ్రియమాణయా -
రాక్షసుడు నిన్ను తీసుకుపోతున్నప్పుడు
మహీతలే పాతితాని -
భూమిపై పడవేయబడిన
యాని ఆభరణజాలాని -
ఆ ఆభరణజాలమును
(దర్శయామాశుః) - (చూపించసాగెను)

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాక్షసుడు నిన్ను తీసుకుపోతున్నప్పుడు భూమిపై పడవేయబడిన నీ అవయవములకు శోభను కలిగించు ఆభరణజాలమును చూపించెను." ||35.37||

||శ్లోకము 35.38||

తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూధపాః|
సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవ||35.38||

స|| హరియూధపాః తాని సర్వాణి ఆనీయ సంహృష్టా రామాయ దర్శయామాస| తవ సు గతిం తు న విదుః||

||శ్లోకార్థములు||

హరియూధపాః తాని సర్వాణి ఆనీయ -
వానర ముఖ్యులు ఆ ఆభరణములన్ని తీసుకువచ్చి
సంహృష్టా రామాయ దర్శయామాస -
సంతోషముతో రామునకు చూపించ సాగిరి.
తవ సుగతిం తు న విదుః -
నీవు ఎక్కడికి తీసుకుపోబడితివో అది వారికి తెలియదు

||శ్లోకతాత్పర్యము||

"వానర ముఖ్యులు ఆ ఆభరణములన్ని తీసుకువచ్చి సంతోషముతో రామునకు చూపించ సాగిరి. నీవు ఎక్కడికి తీసుకుపోబడితివో ఆ మార్గము వారికి తెలియదు." ||35.38||

||శ్లోకము 35.39||

తాని రామాయ దత్తాని మయై వోపహృతాని చ|
స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతచేతసి||35.39||

స|| మయైవ ఉపహృతాని తాని రామాయ దత్తాని | తస్మిన్ విగతచేతసి స్వనవంతి అవకీర్ణాని ||

||శ్లోకార్థములు||

స్వనవంతి అవకీర్ణాని -
ధ్వని చేస్తూ క్రిందపడిన
మయైవ ఉపహృతాని -
నా చేత సేకరింపబడిన (అభరణములు)
తాని రామాయ దత్తాని -
వాటిని రామునికి ఇచ్చితిమి
తస్మిన్ - వాటిని (చూడగానే గుర్తించిన)
విగతచేతసి- మూర్ఛపోయెను

||శ్లోకతాత్పర్యము||

"నా చేత సేకరింపబడిన ధ్వని చేస్తూ క్రిందపడిన వాటిని రామునికి ఇచ్చితిమి. వాటిని చూడగానే గుర్తించిన రాముడు మూర్చ్ఛిల్లెను." ||35.39||

||శ్లోకము 35.40||

తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ|
తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవతమ్||35.40|

స|| దర్శనీయాని తవ తాని అంకే కృత్వా దేవప్రకాశేన తేన దేవేన బహువిధం పరిదేవితమ్||

||శ్లోకార్థములు||

దర్శనీయాని - చూపించినవానిని
తవ తాని అంకే కృత్వా -
నీవి తన ఒడిలో ఉంచుకొని
దేవప్రకాశేన తేన దేవేన -
దేవతలవలె ప్రకాశించుచున్న ఆ దేవుడు
బహువిధం పరిదేవితమ్ -
పరిపరివిధములుగా విలపించెను

||శ్లోకతాత్పర్యము||

"చూపించినవానిని తన ఒడిలో ఉంచుకొని దేవతలవలె ప్రకాశించుచున్న ఆ దేవుడు పరిపరివిధములుగా విలపించెను." ||35.40||

||శ్లోకము 35.41||

పశ్యతస్తాని రుదత స్తామ్యతశ్చ పునః పునః|
ప్రాదీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనమ్||35.41||

స|| తాని పశ్యతః రుదతః పునః పునః తామ్యతశ్చ దాశరథేః శోకహుతాశనం తాని ప్రాదీపయన్ ||

||శ్లోకార్థములు||

తాని పశ్యతః రుదతః పునః పునః -
వాటిని ( ఆ అభరణములను) చూస్తూ మళ్ళీ మళ్ళీ విలపిస్తూ
తామ్యతశ్చ దాశరథేః శోకహుతాశనం-
మండిపోతున్న దాశరథి శోకాగ్నిని
తాని ప్రాదీపయన్ -
అవి మరింత ప్రజ్వలింపచేశాయి

||శ్లోకతాత్పర్యము||

"వాటిని ( ఆ అభరణములను) చూస్తూ మళ్ళీ మళ్ళీ విలపిస్తూ మండిపోతున్న దాశరథి శోకమును ఆ ఆభరణములు మరింప ప్రజ్వలింపచేశాయి" ||35.41||

||శ్లోకము 35.42||

శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా|
మయాపి వివిధైర్వాక్యైః కృఛ్ఛా దుత్థాపినః పునః||35.42||

స|| దుఃఖార్తేన తేన మహాత్మనా శయితం చ మయాపి వివిధైః వాక్యైః కృచ్ఛాత్ పునః ఉత్థాపితః ||

||శ్లోకార్థములు||

దుఃఖార్తేన శయితం చ మహాత్మనా -
దుఃఖములో మునిగి పడుకొనిన ఆ మహాత్ముని
తేన మయాపి వివిధైః వాక్యైః కృచ్ఛాత్ -
ఆయననను నేను కూడా వివిధ మాటలతో
పునః చిరం ఉత్థాపితః -
అతి కష్టముతో మళ్ళీ లేవతీసితిని.

||శ్లోకతాత్పర్యము||

"దుఃఖములో మునిగి పడుకొనిన ఆ మహాత్ముని నేను కూడా వివిధ మాటలతో అతి కష్టముతో లేవతీసితిని." ||35.42||

||శ్లోకము 35.43||

తాని దృష్ట్వా మహాబాహుః దర్శయిత్వా ముహుర్ముహుః|
రాఘవః ససౌమిత్రిః సుగ్రీవే స న్యవేదయత్||35.43||

స|| తాని దృష్ట్వా మహాబాహుః ముహుః ముహుః దర్శయిత్వా రాఘవః స సౌమిత్రిః సుగ్రీవే న్యవేదయత్ ||

||శ్లోకార్థములు||

తాని దృష్ట్వా - ఆ అభరణములను చూచి
మహాబాహుః ముహుః ముహుః దర్శయిత్వా -
ఆ మహాబాహువులు కల వాడు మరల చూచి
రాఘవః స సౌమిత్రిః -
రాఘవుడు సౌమిత్రితో కలిసి
సుగ్రీవే న్యవేదయత్ -
సుగ్రీవునకు అప్పగించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ అభరణములను చూచి ఆ మహాబాహువులు కల రాఘవుడు మరల చూచి సౌమిత్రితో కలిసి సుగ్రీవునకు అప్పగించెను." ||35.43||

||శ్లోకము 35.44||

స త్వాదర్శనాదార్యే రాఘవః పరితప్యతే|
మహతా జ్వలతా నిత్యమగ్నినేవాగ్ని పర్వతః||35.44||

స|| ఆర్య సః రాఘవః తవ అదర్శనాత్ నిత్యం మహతా అగ్నినా అగ్నిపర్వత ఇవ జ్వలతే పరితప్యతే ||

||శ్లోకార్థములు||

ఆర్య సః రాఘవః -
పూజ్యురాలా రాఘవుడు
తవ అదర్శనాత్ పరితప్యతే -
నీ దర్శనము లేక పరితపిస్తున్నాడు
నిత్యం మహతా అగ్నినా -
నిత్యము మహత్తరమైన అగ్నితో
అగ్నిపర్వత ఇవ జ్వలతే -
అగ్నిపర్వతము వలె జ్వలించుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"పూజ్యురాలా రాఘవుడు నీ దర్శనము లేక పరితపిస్తున్నాడు. నిత్యము మహత్తరమైన అగ్నితో అగ్నిపర్వతము వలె జ్వలించుచున్నాడు". ||35.44||

]
||శ్లోకము 35.45||

త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవమ్|
తాపయంతి మహాత్మానమగ్న్యగార మివాగ్నయః||35.45||

స|| త్వత్కృతే మహాత్మానం తం రాఘవం అనిద్రా చ శోకః చింతా చ అగ్న్యగారం అగ్నయః ఇవ తాపయంతి ||

||శ్లోకార్థములు||

త్వత్కృతే మహాత్మానం తం రాఘవం -
నీ గురించి మాహాత్ముడగు ఆ రాఘవుని
అనిద్రా చ శోకః చింతా చ -
నిద్రలేకపోవడము శోకము చింత కూడా
అగ్న్యగారం అగ్నయః ఇవ తాపయంతి -
అగ్నిగృహమును అగ్ని వలె తపింపచేయుచున్నవి

||శ్లోకతాత్పర్యము||

"నీ గురించి మాహాత్ముడగు రాముని, నిద్రలేకపోవడము శోకము చింత అను మూడు అగ్నులు, అగ్నిగృహమును అగ్ని వలె తపింప చేస్తున్నాయి. ||35.45||

||శ్లోకము 35.46||

తవాదర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే|
మహతా భూమికంపేన మహానివ శిలోచ్చయః||35.46||

స|| తవ అదర్శన శోకేన రాఘవః మహతా భూమికంపేన మహాన్ శిలోచ్ఛయః ఇవ ప్రవిచాల్యతే ||

||శ్లోకార్థములు||

తవ అదర్శన శోకేన రాఘవః -
నీ దర్శనము లేక శోకములో రాఘవుడు
మహతా భూమికంపేన -
మహత్తరమైన భూకంపముతో
మహాన్ శిలోచ్ఛయః ఇవ ప్రవిచాల్యతే-
మహత్తరమైన పర్వతము వలె చలించి పోతున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"నీ దర్శనము లేక శోకములో రాఘవుడు మహత్తరమైన భూకంపముతో చలించిన మహత్తరమైన పర్వతము వలె చలించి పోతున్నాడు" ||35.46||

||శ్లోకము 35.47||

కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ|
చరన్ న రతిమాప్నోతి త్వా మపశ్యన్ నృపాత్మజే||35.47||

స||త్వాం అపశ్యన్ సురమ్యాణి ప్రస్రవణాని చరన్ నృపాత్మజః రతిం న ఆప్నోతి ||

||శ్లోకార్థములు||

త్వాం అపశ్యన్ - నిన్ను కానక
సురమ్యాణి ప్రస్రవణాని చరన్ -
రమ్యమైన వనములలో తిరుగుతున్నప్పటికీ
నృపాత్మజః రతిం న ఆప్నోతి-
నృపాత్మజుడు రతిని పొందుటలేదు

||శ్లోకతాత్పర్యము||

"నిన్ను కానక రమ్యమైన వనములలో తిరుగుతున్నప్పటికీ నృపాత్మజుడు రతిని పొందుటలేదు".||35.47||

||శ్లోకము 35.48||
సత్వాం మనుజశార్దూల క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః|
సమిత్రభాంధవం హత్వా రావణం జనకాత్మజే||35.48||

స|| జనకాత్మజే మనుజశార్దూలః రాఘవః సమిత్రబాంధవం రావణం హత్వా త్వాం క్షిప్రం ప్రాప్స్యతి ||

||శ్లోకార్థములు||

జనకాత్మజే మనుజశార్దూలః రాఘవః -
ఓ జనకాత్మజా మనుజ శార్దూలుడు రాఘవుడు
సమిత్రబాంధవం రావణం హత్వా -
రాఘవుడు రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి
త్వాం క్షిప్రం ప్రాప్స్యతి -
నిన్ను తప్పక పొందును

||శ్లోకతాత్పర్యము||

"ఓ జనకాత్మజా మనుజ శార్దూలుడు రాఘవుడు రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి, నిన్ను తప్పక పొందును." ||35.48||

||శ్లోకము 35.49||

సహితౌ రామసుగ్రీవావుభావకురుతాం తదా|
సమయం వాలినం హంతుం తవచాన్వేషణం తథా||35.49||

స|| తదా రామసుగ్రీవౌ ఉభౌ సహితౌ వాలినం హంతుం తథా తవ చ అన్వేషణం సమయం అకురుతామ్ ||"

||శ్లోకార్థములు||

తదా రామసుగ్రీవౌ ఉభౌ సహితౌ -
అప్పుడు రామసుగ్రీవులిద్దరూ
వాలినం హంతుం -
వాలిని హతమార్చుటకూ
తథా తవ చ అన్వేషణం -
అలాగే నీ అన్వేషణమునకు
సమయం అకురుతామ్ -
అంగీకారముకు వచ్చితిరి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రామసుగ్రీవులిద్దరూ వాలిని హతమార్చుటకూ అలాగే నీ అన్వేషణమునకు అంగీకారముకు వచ్చితిరి." ||35.49||

||శ్లోకము 35.50||

తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః|
కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః||35.50||

స|| తతః స హరీశ్వరః తాభ్యాం వీరాభ్యాం కుమారాభ్యం సహ కిష్కింధాం ఉపాగమ్య యుద్ధే వాలీ నిపాతితః||

||శ్లోకార్థములు||

తతః స హరీశ్వరః -
అప్పుడు ఆ హరీశ్వరుడు
తాభ్యాం వీరాభ్యాం కుమారాభ్యం సహ -
వీరులగు రాజకుమారులిద్దరితో
కిష్కింధాం ఉపాగమ్య -
కిష్కింధ వచ్చి
యుద్ధే వాలీ నిపాతితః -
యుద్ధములో వాలిని సంహరించిరి.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ హరీశ్వరుడు వీరులగు రాజకుమారులిద్దరితో కిష్కింధ వచ్చి యుద్ధములో వాలిని సంహరించిరి." ||35.50||

||శ్లోకము 35.51||

తతో నిహత్య తరసా రామో వాలిన మాహవే|
సర్వేషాం హరి సంఘానాం సుగ్రీవమకరోత్ పతిమ్||35.51||

స|| తతః రామః ఆహవే తరసా వాలినం నిహత్య సుగ్రీవం సర్వేషాం హరిసంఘానాం పతిం అకరోత్ ||

||శ్లోకార్థములు||

తతః రామః ఆహవే - అప్పుడు రాముడు
తరసా వాలినం నిహత్య -
యుద్ధములో వాలిని సంహరించి
సుగ్రీవం సర్వేషాం హరిసంఘానాం -
సుగ్రీవుని సమస్త వానర సంఘములకూ
పతిం అకరోత్ - అధిపతిగా చేసెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాముడు యుద్ధములో వాలిని సంహరించి సుగ్రీవుని సమస్త వానర సంఘములకూ అధిపతిగా చేసెను".||35.51||

||శ్లోకము 35.52||

రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత|
హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతమ్||35.52||

స|| దేవీ రామసుగ్రీవయోః ఇక్యం ఏవం సమజాయత | మాం తయోః దూతం ఇహ ఆగతం చ హనుమంతం విద్ధి

||శ్లోకార్థములు||

దేవీ రామసుగ్రీవయోః ఐక్యం -
ఓ దేవీ రామసుగ్రీవుల ఐక్యము
ఏవం సమజాయత -
ఈ విధముగా కుదిరెను
తయోః దూతం ఇహ ఆగతం చ -
వారిద్దరి దూతగా ఇక్కడికి వచ్చిన
మాం హనుమంతం విద్ధి -
నన్ను హనుమంతుడు అని తెలిసికొనుము

||శ్లోకతాత్పర్యము||

" ఓ దేవీ రామసుగ్రీవుల ఐక్యము ఈ విధముగా కుదిరెను. నన్ను వారిద్దరి దూతగా ఇక్కడికి వచ్చిన నన్ను హనుమంతుడు అని తెలిసికొనుము."||35.52||

||శ్లోకము 35.53||

స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ |
త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్ ||35.53||

స|| సుగ్రీవః స్వరాజ్యం ప్రాప్య హరీశ్వరాన్ సమానీయ త్వదర్థం దశ దిశః మహాబలాన్ ప్రేషయామాస||

||శ్లోకార్థములు||

సుగ్రీవః స్వరాజ్యం ప్రాప్య -
సుగ్రీవుడు స్వరాజ్యము పొంది
హరీశ్వరాన్ సమానీయ -
వానరలందరిని పిలిపించి
త్వదర్థం మహాబలాన్ -
నీ అన్వేషణార్థము మహాబలము కలవారిని
దశ దిశః ప్రేషయామాస -
పది దిక్కులలో పంపసాగెను

||శ్లోకతాత్పర్యము||

"సుగ్రీవుడు స్వరాజ్యము పొంది వానరలందరిని పిలిపించి నీ అన్వేషణార్థము పది దిక్కులలో మహాబలము కలవారిని పంపసాగెను." ||35.53||

||శ్లోకము 35.54||

అదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా|
అద్రిరాజ ప్రతీకాశాః సర్వతః ప్రస్థితా మహీమ్||35.54||

స|| వానరేంద్రేణ మహౌజసా సుగ్రీవేణ అదిష్టాః అద్రిరాజప్రతీకాశః మహీం సర్వతః ప్రస్థితా||

||శ్లోకార్థములు||

వానరేంద్రేణ మహౌజసా -
మహాతేజస్సుగల వానరేంద్రుడు
సుగ్రీవేణ అదిష్టాః -
సుగ్రీవుని అదేశము ప్రకారము
అద్రిరాజప్రతీకాశః -
పర్వతరాజు తో సమానమైన వారిని
మహీం సర్వతః ప్రస్థితా-
భూమండలము అంతా ( వెదుకుటకు) బయలుదేరిరి

||శ్లోకతాత్పర్యము||

"వానరేంద్రుడు మహాతేజస్సుగల సుగ్రీవుని అదేశము ప్రకారము భూమండలము అంతా నిన్ను వెతుకుటకై బయలుదేరిరి".||35.54||

||శ్లోకము 35.55||

తతస్తు మార్గామాణావై సుగ్రీవ వచనాతురాః|
చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః||35.55||

స|| తతః తే వయం అన్యే వానరాః చ సుగ్రీవ వచనాతురాః మార్గమాణాః కృత్స్నాం వసుధాం చరంతి ॥

||శ్లోకార్థములు||

తతః తే వయం అన్యే వానరాః చ -
అప్పుడు మేము ఇతర వానరులు కూడా
సుగ్రీవ వచనాతురాః -
సుగ్రీవుని ఆదేశానుసారము
మార్గమాణాః కృత్స్నాం -
నిన్ను వెదుకుతూ
వసుధాం చరంతి -
భూమండలము అంతా తిరుగుచున్నాము

||శ్లోకతాత్పర్యము||

" అప్పుడు మేము ఇతర వానరులు సుగ్రీవుని ఆదేశానుసారము నిన్ను వెదుకుతూ భూమండలము అంతా తిరుగుచున్నాము." ||35.55||

||శ్లోకము 35.55||

అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూను ర్మహాబలః|
ప్రస్థితః కపిశార్దూలః త్రిభాగబలసంవృతః||35.56||

స|| వాలిసూనుః మహాబలః లక్ష్మీవాన్ త్రిభాగబలసంవృతః కపిశార్దూలః అంగదః నామ ప్రస్థితః ||

||శ్లోకార్థములు||

వాలిసూనుః లక్ష్మీవాన్ -
వాలిపుత్రుడు లక్ష్మీవంతుడు అగు
అంగదః నామ కపిశార్దూలః -
అంగదుడుఅనే పేరుగల కపిశార్దూలుడు
మహాబలః త్రిభాగబలసంవృతః ప్రస్థితః-
మహాబలవంతుడు మూడుభాగములలో ఒకవంతు సైన్యముతో బయలుదేరెను

||శ్లోకతాత్పర్యము||

"కపిశార్దూలుడు వాలిపుత్రుడు లక్ష్మీవంతుడు అగు అంగదుడు అనే పేరుగల కపిశార్దూలుడు, మూడుభాగములలో ఒకవంతు సైన్యముతో బయలుదేరెను." ||35.56||

||శ్లోకము 35.57||

తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వతసత్తమే|
భృశం శోకపరీతానా మహోరాత్రగణా గతాః||35.57||

స|| వింధ్యే పర్వతసత్తమే విప్రణష్టానామ్ భృశం శోకపరీతానాం తేషాం నః అహోరాత్రగణాః గతాః||

||శ్లోకార్థములు||

వింధ్యే పర్వతసత్తమే -
వింధ్యపర్వతములలో
విప్రణష్టానామ్ భృశం శోకపరీతానాం -
దారితెన్నూతెలియక అత్యంత శోకసముద్రములో
తేషాం నః అహోరాత్రగణాః గతాః -
మాకు అందరికీ అహోరాత్రములు గడిచినవి"

||శ్లోకతాత్పర్యము||

"వింధ్యపర్వతములలో దారితెన్నూతెలియక అత్యంత శోకసముద్రములో అహోరాత్రములు గడిచినవి". ||35.57||

||శ్లోకము 35.58||

తే వయం కార్యనైరాశ్యాత్ కాలస్యాతిక్రమణే|
భయాచ్చ కపిరాజస్య ప్రాణాం స్త్యక్తుం వ్యవస్థితాః||35.58||

స|| తే వయం కార్యనైరాశ్యాత్ కాలస్య అతిక్రమేణ చ కపిరాజస్య భయాత్ చ ప్రాణామ్ త్యక్తుం వ్యవస్థితాః||

||శ్లోకార్థములు||

తే వయం కార్యనైరాశ్యాత్ -
మేము అందరము కార్య నిరాశవలన
కాలస్య అతిక్రమేణ చ -
కాలము గడిచిపోవుటవలన
కపిరాజస్య భయాత్ చ -
కపిరాజుపై భయముతో
ప్రాణామ్ త్యక్తుం వ్యవస్థితాః -
ప్రాణములు త్యజించుటకు సిద్ధపడితిమి.

||శ్లోకతాత్పర్యము||

" మేము అందరము కార్య నిరాశవలన కాలము గడిచిపోవుటవలన కపిరాజుపై భయముతో ప్రాణములు త్యజించుటకు సిద్ధపడితిమి." ||35.58||

||శ్లోకము 35.59||

విచిత్య వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ|
అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాం స్త్యక్తుం సముద్యతాః||35.59||

స|| వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ విచిత్య దేవ్యాః పదం అనాసాద్య ప్రాణాం త్యక్తుం సముద్యతాః ॥

||శ్లోకార్థములు||

వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ -
వనదుర్గములు కోండలు లోయలూ అన్వేషించి
విచిత్య దేవ్యాః పదం అనాసాద్య -
దేవి యొక్క స్థానము కనుగొనలేక
ప్రాణాం త్యక్తుం సముద్యతాః-
ప్రాణములను త్యజించుటకు సిద్ధపడితిమి

||శ్లోకతాత్పర్యము||

" వనదుర్గములు కోండలు లోయలూ అన్వేషించి దేవి యొక్క స్థానము కనుగొనలేక ప్రాణములను త్యజించుటకు సిద్ధపడితిమి." ||35.59||

||శ్లోకము 35.60||

దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్|
భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః||35.60||

స|| ప్రాయోపవిష్టాన్ సర్వాన్ వానరాన్ దృష్ట్వా అంగదః భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయత్ ||

||శ్లోకార్థములు||

ప్రాయోపవిష్టాన్ సర్వాన్ వానరాన్ దృష్ట్వా -
ప్రాయోపవేశమునకు సిద్ధపడిన వానరులందరినీ చూచి
అంగదః భృశం శోకార్ణవే మగ్నః -
అంగదుడు దుఃఖసాగరములో మునిగి
పర్యదేవయత్ - దుఃఖించెను

||శ్లోకతాత్పర్యము||

" ప్రాయోపవేశమునకు సిద్ధపడిన వానరులందరినీ చూచి అంగదుడు దుఃఖసాగరములో మునిగిపోయెను." ||35.60||

||శ్లోకము 35.61||

తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా|
ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషుః ||35.61||

స|| వైదేహీ తవ నాశం చ వాలినః వధః చ జటాయుషుః మరణం చ అస్మాకం ప్రాయోపవేశం ||

||శ్లోకార్థములు||

వైదేహీ తవ నాశం చ -
ఓ వైదేహీ నీ అన్వేషణావిఫలము
వాలినః వధః చ - వాలి వథ
జటాయుషుః మరణం చ -
జటాయుషు మరణము
అస్మాకం ప్రాయోపవేశం-
మా ప్రాయోపవేశమునకు కారణములు

||శ్లోకతాత్పర్యము||

" ఓ వైదేహీ నీ అన్వేషణావిఫలము, వాలి వథ, జటాయుషు మరణము ఇవన్ని మా ప్రాయోపవేశమునకు కారణములయ్యెను." ||35.61||

||శ్లోకము 35.62||

తేషాం న స్స్వామిసందేశా న్నిరాశానాం ముమూర్షతాం|
కార్యహేతో రివాయత శ్శకుని ర్వీర్యవాన్ మహాన్||35.62||

స|| స్వామిసందేశాత్ నిరాశానామ్ ముమూర్షతాం తేషాం నః కార్యహేతోః ఇవ వీర్యవాన్ మహాశకునిః ఆయాతః ||

||శ్లోకార్థములు||

స్వామిసందేశాత్ -
స్వామి అదేశములపై
నిరాశానామ్ ముమూర్షతాం తేషాం -
నిరాశతో ప్రాణత్యాగమునకు సిద్ధమైన సమయములో
నః కార్యహేతోః ఇవ -
మాకు సహయము చేయుటకా అన్నట్లు
వీర్యవాన్ మహాశకునిః ఆయాతః -
వీరుడైన గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చెను.

||శ్లోకతాత్పర్యము||

"స్వామి అదేశములపై నిరాశతో ప్రాణత్యాగమునకు సిద్ధమైన సమయములో సమయనుకూలముగా వీరుడైన గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చెను."

||శ్లోకము 35.63||

గృధరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధరాట్|
శ్రుత్వా భాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్||35.63||

స|| గృధరాజస్య సోదరః గృధరాట్ సంపాతిః నామ భాతృవధం కోపాత్ ఇదం వచనమ్ అబ్రవీత్||

||శ్లోకార్థములు||

గృధరాజస్య సోదరః -
పక్షిరాజు సోదరుడు
గృధరాట్ సంపాతిః నామ -
సంపాతి అనబడు పక్షిరాజు
భాతృవధం కోపాత్ -
భాతృ వధగురించి విని కోపముతో
ఇదం వచనమ్ అబ్రవీత్ -
ఈ వచనములను పలికెను

||శ్లోకతాత్పర్యము||

"పక్షిరాజు సోదరుడు సంపాతి అనబడు పక్షిరాజు భాతృ వధగురించి విని కోపముతో ఇట్లు పలికెను".

||శ్లోకము 35.64||

యవీయాన్కేన మే భ్రాతా హతః క్వ చ నిపాతితః|
ఏత దాఖ్యాతు మిచ్చామి భవద్భిః వానరోత్తమాః||35.64||

స|| వానరోత్తమః మే యావీయాన్ భ్రాతా కేన హతః క్వ చ నిపాతితః భవద్భిః ఏతత్ ఆఖ్యాతుం ఇఛ్ఛామి ||

||శ్లోకార్థములు||

వానరోత్తమః -
వానరోత్తములారా
మే యవీయాన్ భ్రాతా -
నా చిన్నతమ్ముడు
కేన హతః క్వ చ నిపాతితః -
ఎవరిచేత ఎక్కడ హతమార్చబడెనో
భవద్భిః ఏతత్ ఆఖ్యాతుం ఇఛ్ఛామి-
మీచేత చెప్పబడుటకు కోరుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"వానరోత్తములారా నా చిన్న తమ్ముడు ఎవరిచేత ఎక్కడ హతమార్చబడెనో మీచేత చెప్పబడుటకు కోరుచున్నాను". ||35.64||

||శ్లోకము 35.65||

అంగదోఽకథయ త్తస్య జనస్థానే మహద్వధమ్|
రక్షసా భీమరూపేణ త్వా ముద్దిశ్య యథాతథమ్||35.65||

స|| త్వమ్ ఉద్దిశ్య అంగదః భీమరూపేణ రక్షసా జనస్థానే మహద్వధం యథాగతం తస్య అకథయత్ ||

||శ్లోకార్థములు||

త్వమ్ ఉద్దిశ్య -
అప్పుడు నీ కొఱకు
భీమరూపేణ రక్షసా -
భీమరూపముగల రాక్షసుడు
జనస్థానే మహద్వధం -
జనస్థానములో చేసిన (జటాయు) మహావథను
యథాగతం తస్య అంగదః అకథయత్ -
యథా తథముగా అంగదుడు చెప్పెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు నీ కొఱకు భీమరూపముగల రాక్షసుడు జనస్థానములో చేసిన (జటాయు) మహావథను యథా తథముగా అంగదుడు చెప్పెను ".||35.65||

||శ్లోకము 35.66||

జటయుషో వధం శ్రుత్వా దుఃఖిత స్సోsరుణాత్మజః|
త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే||35.66||

స|| వరారోహే సః అరుణాత్మజః జటాయుషః వధః శుత్వా దుఃఖితః త్వాం రావణాలయే వసంతీం శశంస||

||శ్లోకార్థములు||

వరారోహే - ఓ వరాననా
సః అరుణాత్మజః- ఆ అరుణాత్మజుడు
జటాయుషః వధః శుత్వా దుఃఖితః-
జటాయువు మరణము విని దుఃఖపడి
త్వాం రావణాలయే వసంతీం శశంస -
నువ్వు రావణుని అంతఃపురములో వున్నట్లు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"ఓ వరాననా ఆ అరుణాత్మజుడు జటాయువు మరణము విని దుఃఖపడి నువ్వు రావణుని అంతఃపురములో వున్నట్లు చెప్పెను." ||35.66||

||శ్లోకము 35.67||

తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనమ్|
అంగదప్రముఖా స్తూర్ణం తతః సంప్రస్థితా వయమ్||35.67||

స|| తస్య సంపాతేః ప్రీతివర్ధనం తత్ వచనం శ్రుత్వా అంగదప్రముఖాః వయం తూర్ణమ్ తతః ప్రస్థితః||

||శ్లోకార్థములు||

తస్య సంపాతేః ప్రీతివర్ధనం -
ఆ సంపాతి యొక్క ప్రీతిని కలిగించు
తత్ వచనం శ్రుత్వా -
ఆ మాటలు విని
అంగదప్రముఖాః -
అంగదప్రముఖులు
వయం తూర్ణమ్ తతః ప్రస్థితః-
మేము అందరము అచటినుంచి వెంటనే బయలు దేరితిమి

||శ్లోకతాత్పర్యము||

"ఆ సంపాతి యొక్క ప్రీతిని కలిగించు మాటలు విని అంగదప్రముఖులు మేము అందరము అచటినుంచి వెంటనే బయలు దేరితిమి". ||35.67||

||శ్లోకము 35.68||

వింధ్యా దుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంత ముత్తరమ్|
త్వద్దర్శనకృతోత్సాహా హృష్టాః తుష్టాః ప్లవంగమాః||35.68||

స|| ప్లవంగమాః త్వత్ దర్శనకృతోత్సాహాః హృష్టాః తుష్టాః వింధ్యాత్ ఉత్థాయ సాగరస్య ఉత్తర అంతం సమ్ప్రాప్తాః||

||శ్లోకార్థములు||

ప్లవంగమాః త్వత్ దర్శనకృతోత్సాహాః -
ఆకాశములో ఎగరగలవారందరమూ నీ దర్శనము కలుగుననే ఉత్సాహముతో
హృష్టాః తుష్టాః - సంతోషముతో
వింధ్యాత్ ఉత్థాయ -
వింధ్యపర్వతమునుంచి లేచి
సాగరస్య ఉత్తర అంతం సమ్ప్రాప్తాః -
సాగరము యొక్క ఉత్తర తీరము చేరితిమి

||శ్లోకతాత్పర్యము||

"ఆకాశములో ఎగరగలవారందరమూ నీ దర్శనము కలుగుననే ఉత్సాహముతో వింధ్యపర్వతమునుంచి లేచి సాగరము యొక్క ఉత్తర తీరము చేరితిమి."||35.68||

||శ్లోకము 35.69||

అంగదప్రముఖాస్సర్వే వేలోపాంత ముపస్థితాః|
చింతాం జగ్ముః పునర్భీతాః త్వద్దర్శనసముత్సకాః||35.69||

స||అంగదప్రముఖాః సర్వే త్వత్ దర్శనముత్సుకాః వేలోపాంతం ఉపస్థితాః భీతాః పునః చింతాం జగ్ముః||

||శ్లోకార్థములు||

అంగదప్రముఖాః సర్వే -
అంగద ప్రముఖులు అందరూ
త్వత్ దర్శనముత్సుకాః-
నిన్ను చూడవలను ఉత్సాహముతో
వేలోపాంతం ఉపస్థితాః -
సముద్రతీరము చేరి,
భీతాః పునః చింతాం జగ్ముః -
భయపడి మరల చింతాక్రాంతులైరి

||శ్లోకతాత్పర్యము||

"అంగద ప్రముఖులు నిన్ను చూడవలను ఉత్సాహముతో సముద్రతీరము చేరి, సముద్రము చూచి భయపడి మరల చింతాక్రాంతులైరి." ||35.69||

||శ్లోకము 35.70||

అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః|
వ్యవధూయ భయం తీవ్రం శతం ప్లుతః||35.70||

స|| అథ అహం సాగరం ప్రేక్ష్య సీదతః హరిసైన్యస్య తీవ్రం భయం వ్యవధూయ యోజనానాం శతం ప్లుతః||

||శ్లోకార్థములు||

అథ అహం సాగరం ప్రేక్ష్య -
అప్పుడు నేను సాగరము చూచి
సీదతః హరిసైన్యస్య తీవ్రం భయం వ్యవధూయ -
వానరసైన్యము యొక్క భయము తొలగిస్తూ
యోజనానాం శతం ప్లుతః-
వందయోజనముల సాగరమును లంఘించితిని

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు నేను సాగరము చూచి వానరసైన్యము యొక్క భయము తొలగిస్తూ వందయోజనముల సాగరమును లంఘించితిని".||35.70||

||శ్లోకము 35.71||

లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా|
రావణశ్చ మయా దృష్టః త్వం చ శోకపరిప్లుతా||35.71||

స|| రాక్షసాకులా లంకా చ అపి మయా రాత్రౌ ప్రవిష్టా మయా రావణశ్చ దృష్టః శోకపరిప్లుతా త్వం చ||

||శ్లోకార్థములు||

రాక్షసాకులా లంకా చ అపి -
రాక్షసులతో నిండి యున్న లంకానగరము కూడా
మయా రాత్రౌ ప్రవిష్టా -
నాచేత రాత్రి ప్రవేశింపబడినది
మయా రావణశ్చ దృష్టః-
నాచేత రావణుడు చూడబడినవాడు
శోకపరిప్లుతా త్వం చ-
శోకముతో నిండిన నువ్వు కూడా

||శ్లోకతాత్పర్యము||

" రాక్షసులతో నిండి యున్న లంకానగరము రాత్రి ప్రవేశించి రావణుని కూడా చూచి , శోకములో మునిగియున్న నిన్ను చూచితిని." ||35.71|

||శ్లోకము 35.72||

ఏతత్తే సర్వ మాఖ్యాతం యథావృత్త మనిందితే|
అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథే రహమ్||35.72||

స||అనిందితే దేవి ఏతత్ యథావృతం తే ఆఖ్యాతం | మమ అభిభాషస్వ | అహం దాశరథేః దూతః||

||శ్లోకార్థములు||

అనిందితే దేవి - అనిందితే దేవి
అహం దాశరథేః దూతః-
నేను దాశరథి దూతను
ఏతత్ యథావృతం తే ఆఖ్యాతం -
ఈ వృత్తాంతము యథా తథము గా వివరించితిని.
మమ అభిభాషస్వ- నాతో మాట్లాడుము.

||శ్లోకతాత్పర్యము||

"దోషములులేని ఓదేవీ! ఈ వృత్తాంతము యథా తథము గా వివరించితిని. నాతో మాట్లాడుము. నే దాశరథి దూతను." ||35.72|

||శ్లోకము 35.73||

తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్త మిహాగతమ్|
సుగ్రీవ సచివం దేవి బుద్ద్యస్వ పవనాత్మజమ్||35.73||

స|| దేవి రామకృతోద్యోగం త్వన్నిమిత్తం ఇహ ఆగతం తం మామ్ సుగ్రీవ సచివం పవనాత్మజం బుద్ధ్యస్వ||

||శ్లోకార్థములు||

దేవి రామకృతోద్యోగం -
ఓ దేవి రామునిచేత నియోగింపబడి
త్వన్నిమిత్తం ఇహ ఆగతం -
నీ కోసమై ఇక్కడికి వచ్చినవాడను
తం మామ్ సుగ్రీవ సచివం -
అట్టి నన్ను సుగ్రీవుని సచివునిగా
పవనాత్మజం బుద్ధ్యస్వ-
పవనాత్మజునిగా తెలిసికొనుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి నీ కోసమై రామునిచేత నియోగింపబడి ఇక్కడికి వచ్చిన పవనాత్మజుని నన్ను సుగ్రీవుని సచివునిగా తెలిసికొనుము". ||35.73|।

||శ్లోకము 35.74||

కుశలీ తవ కాకుత్‍స్థ సర్వశస్త్రభృతాం వరః|
గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః||35.74||

స|| సర్వశస్త్రభృతాం వరః తవ కాకుత్‍స్థః కుశలీ | గురోః ఆరాధనే యుక్తః లక్ష్మణః చ ||

||శ్లోకార్థములు||

సర్వశస్త్రభృతాం వరః -
సమస్త అస్త్రములను ధరించువారిలో శ్రేష్ఠుడైన
తవ కాకుత్‍స్థః కుశలీ -
నీ కాకుత్‍స్థుడు కుశలము
గురోః ఆరాధనే యుక్తః లక్ష్మణః చ -
గురువును ఆరాధించు లక్ష్మణుడు కూడా కుశలము

||శ్లోకతాత్పర్యము||

" సమస్త అస్త్రములను ధరించువారిలో శ్రేష్ఠుడైన నీ కాకుత్‍స్థుడు కుశలము. గురువును ఆరాధించు లక్ష్మణుడు కూడా కుశలము. ||35.74॥

||శ్లోకము 35.75||

తస్య వీర్యవతో దేవి భర్తుః తవ హితే రతః|
అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ||35.75||

స|| దేవి వీర్యవతః తవ భర్తుః తస్య హితే రతః అహం సుగ్రీవ వచనాత్ ఇహ ఏకః ప్రాప్తః||

||శ్లోకార్థములు||

దేవి వీర్యవతః తవ భర్తుః -
ఓ దేవి వీరుడు నీ భర్త
తస్య హితే రతః -
అతని యొక్క హితము కోరువాడు అగు
సుగ్రీవ వచనాత్ -
సుగ్రీవుని వచనములతో
ఇహ అహం ఏకః ప్రాప్తః-
ఇక్కడికి నేను ఒక్కడినే వచ్చితిని

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి వీరుడు నీ భర్త యొక్క హితము కోరువాడు అగు సుగ్రీవుని వచనములతో నేను ఒక్కడినే వచ్చితిని." ||35.75||

||శ్లోకము 35.76||

మయేయ మసహాయేన చరతా కామరూపిణా|
దక్షిణా ది గనుక్రాంతా త్వన్మార్గవిచయైషిణా||35.76||

స|| త్వన్మార్గవిచయైషిణా కామరూపిణా అసహాయేన చరతా మయా ఇయం దక్షిణా దిక్ అనుక్రాంతా||

||శ్లోకార్థములు||

త్వన్మార్గవిచయైషిణా -
నీ జాడ తెలిసికొనగోరి,
కామరూపిణా -
కోరిన రూపము ధరించగల
అసహాయేన చరతా మయా ఇయం -
ఇంకెవరి సహాయము లేకుండా తిరుగుతూ ఈ
దక్షిణా దిక్ అనుక్రాంతా -
ఈ దక్షిణప్రాంతమునకు వచ్చితిని

||శ్లోకతాత్పర్యము||

"నీ జాడ తెలిసికొనగోరి, కోరిన రూపము ధరించగల నేను ఇంకెవరి సహాయము లేకుండా తిరుగుతూ ఈ దక్షిణప్రాంతమునకు వచ్చితిని".||35.76||

||శ్లోకము 35.77||

దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశ మనుశోచతామ్|
అపనేష్యామి సంతాపం తవాభిగమశంసనాత్||35.77||

స|| దిష్ట్యా అహం త్వన్నాశం హరిసైన్యానాం సంతాపం తవ అభిగమశంసనాత్ అపనేష్యామి||

||శ్లోకార్థములు||

దిష్ట్యా త్వన్నాశం-
అదృష్టముకొలదీ నీవు లేవు అని
హరిసైన్యానాం సంతాపం -
దుఃఖములో వున్న వానరసైన్యముయొక్క సంతాపము
తవ అభిగమశంసనాత్ -
నీవు చూచిన వార్తతో
అహం అపనేష్యామి-
నేను వారి శోకము తొలగించెదను

||శ్లోకతాత్పర్యము||

" అదృష్టముకొలదీ నిన్ను చూచిన వార్త, నీ జాడతెలియక సంతాపములో మునిగియున్న వానరసైన్యము యొక్క శోకమును తొలగించును." ||35.77||

||శ్లోకము 35.78||

దిష్ట్యా హి మమ న వ్యర్థం దేవి సాగర లంఘనమ్|
ప్రాప్స్యా మ్యహ మిదం దిష్ట్వా త్వద్దర్శనకృతం యశః||35.78||

స|| దేవి దిష్ట్యా మమ సాగరలంఘనం న వ్యర్థమ్ | దిష్ట్యా అహం త్వద్దర్శనకృతం ఇదం యశః ప్రాప్స్యామి ||

||శ్లోకార్థములు||

దేవి దిష్ట్యా మమ -
అదృష్టము కొలదీ నా
సాగరలంఘనం న వ్యర్థమ్ -
సాగరలంఘనము వ్యర్థము కాలేదు
దిష్ట్యా అహం త్వద్దర్శనకృతం-
అదృష్టము కొలదీ నీ దర్శనము చేసిన
ఇదం యశః ప్రాప్స్యామి -
ఈ కీర్తిని నేను పొందెదను

||శ్లోకతాత్పర్యము||

"అదృష్టము కొలదీ నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. అదృష్టము కొలదీ నీ దర్శనము చేసిన కీర్తిని నేను పొందెదను." ||35.78||

||శ్లోకము 35.79||

రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వా మభిపత్స్యతే|
సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపమ్||35.79||

స।। మహావీరః రాఘవః చ సమిత్రబాంధవం రాక్షసాధిపం రావణం హత్వా క్షిప్రం త్వాం అభిపత్స్యతే||

|శ్లోకార్థములు||

మహావీరః రాఘవః చ -
మహావీరుడు రాఘవుడు
సమిత్రబాంధవం రాక్షసాధిపం -
మిత్రభాంధవులతో కలిపి రాక్షసరాజు అగు
రావణం హత్వా -
రావణుని హతమార్చి
క్షిప్రం త్వాం అభిపత్స్యతే-
త్వరలో నిన్ను చేరును

||శ్లోకతాత్పర్యము||

"మహావీరుడు రాఘవుడు మిత్రభాంధవులతో కలిపి రావణుని హతమార్చి త్వరలో నిన్ను చేరును".||35.79||

||శ్లోకము 35.80||

మాల్యవాన్నామ వైదేహి గిరిణా ముత్తమో గిరిః|
తతో గచ్ఛతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః ||35.80||

స|| వైదేహీ గిరీణాం ఉత్తమః మాల్యవాన్ నామ గిరిః తతః కేసరీ హరిః గోకర్ణం పర్వతం గచ్ఛతి||

||శ్లోకార్థములు||

వైదేహీ గిరీణాం ఉత్తమః -
వైదేహీ పర్వతములలో ఉత్తమమైనది
మాల్యవాన్ నామ గిరిః -
మాల్యవంతమనే పర్వతము
తతః కేసరీ హరిః -
అచటినుండి కేసరి అనబడు వానరుడు
గోకర్ణం పర్వతం గచ్ఛతి -
గోకర్ణమనే పర్వతము వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

" వైదేహీ పర్వతములలో ఉత్తమమైనది మాల్యవంతమనే పర్వతము. అచటినుండి కేసరి అనబడు వానరుడు గోకర్ణమనే పర్వతము వెళ్ళెను." |35.80||

||శ్లోకము 35.81||

స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః|
తీర్థే నదీ పతేః పుణ్యే శంబసాదన ముద్దరత్||35.81||

స|| దేవర్షిభిః దిష్టః మామ్ పితా సః మహాకపిః నదీపతేః పుణ్యే శంబసాదనం ఉద్ధరత్||

||శ్లోకార్థములు||

దేవర్షిభిః దిష్టః -
దేవఋషుల ఆదేశానుసారము
మామ్ పితా సః మహాకపిః -
నా తండ్రి ఆ మహా వానరుడు
నదీపతేః పుణ్యే -
పుణ్య నదీతీరములో
శంబసాదనం ఉద్ధరత్ -
శంబశాదనుని సంహరించెను

||శ్లోకతాత్పర్యము||

"దేవఋషుల ఆదేశానుసారము నా తండ్రి ఆ పుణ్య నదీతీరములో శంబశాదనుని సంహరించెను." ||35.81||

||శ్లోకము 35.82||

తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి|
హనుమానితి విఖ్యాతో లోకేస్వేనైవ కర్మణా||35.82||

స||మైథిలి తస్య హరిణః క్షేత్రే వాతేన జాతః స్వేన కర్మణా ఏవ లోకే హనుమాన్ ఇతి విఖ్యాతః||

||శ్లోకార్థములు||

మైథిలి తస్య హరిణః క్షేత్రే -
ఓ మైథిలీ ఆ వానరుల క్షేత్రములో
వాతేన జాతః -
వాయుదేవుని అనుగ్రహముతో జన్మించిన
స్వేన కర్మణా ఏవ -
నేను నా చేతల వలన
లోకే హనుమాన్ ఇతి విఖ్యాతః -
లోకములో హనుమంతుడు అనే పేరుతో పేరుపొందితిని

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ ఆ వానరుల క్షేత్రములో వాయుదేవుని అనుగ్రహముతో జన్మించిన నేను నా చేతల వలన హనుమంతుడు అనే పేరుతో పేరుపొందితిని".||35.82||

||శ్లోకము 35.83||

విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః|
అచిరాత్ రాఘవో దేవి త్వా మితో నయితాsనఘే||35.83||

వైదేహి విశ్వాసార్థం మయా భర్తుః గుణాః ఉక్తాః | దేవి రాఘవః అచిరాత్ త్వాం ఇతః నయితా అనఘే

||శ్లోకార్థములు||

వైదేహి విశ్వాసార్థం -
ఓ వైదేహీ విశ్వాసము కలిగించుటకు
మయా భర్తుః గుణాః ఉక్తాః -
నీ భర్త గుణములను చెప్పితిని
దేవి రాఘవః అచిరాత్-
ఓ దేవి రాఘవుడు అచిరకాలములో
త్వాం ఇతః నయితా అనఘే -
నిన్ను ఇచటినుంచి తీసుకుపోవును

||శ్లోకతాత్పర్యము||

"ఓ వైదేహీ నీకు విశ్వాసము కలిగించుటకు నీ భర్త గుణములను చెప్పితిని. ఓ దేవి రాఘవుడు అచిరకాలములో వచ్చి నిన్ను తీసుకుపోవును". ||35.83||

||శ్లోకము 35.84||

ఏవం విశ్వాసితా సీతా హేతుభిః శోకకర్శితా|
ఉపపన్నై రభిజ్ఞానై ర్దూతం తమవగచ్ఛతి||35.84||

||స|| శోకకర్శితా సీతా ఏవం హేతుభిః విశ్వశితా ఉపపన్నైః అభిజ్ఞానైః తం దూతం అవగచ్ఛతి

||శ్లోకార్థములు||

శోకకర్శితా సీతా -
శోకములో మునిగియున్న సీతా
ఏవం హేతుభిః విశ్వశితా -
హేతువులతో విశ్వాసము పొంది
ఉపపన్నైః అభిజ్ఞానైః -
కనపడిన గుర్తులతో
తం దూతం అవగచ్ఛతి -
ఆ వానరుని రాముని దూతగా గుర్తించెను

||శ్లోకతాత్పర్యము||

"శోకములో మునిగియున్న సీతా కూడా హేతువులతో విశ్వాసము పొంది ఆ వానరుని రాముని దూతగా గుర్తించెను".||35.84||

||శ్లోకము 35.85||

అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ|
నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం||35.85||

స|| జానకీ అతులం హర్షం గతా చ ప్రహర్షేణ వక్రపక్ష్మాభ్యాం నేత్రాభ్యాం ఆనందజం జలం ముమోచ||

||శ్లోకార్థములు||

జానకీ అతులం హర్షం గతా చ -
జానకి అత్యంత ఆనందముతో
ప్రహర్షేణ వక్రపక్ష్మాభ్యాం నేత్రాభ్యాం-
అందమైన కనుబొమలద్వారా
ఆనందజం జలం ముమోచ -
ఆనంద భాష్పములను కార్చెను

||శ్లోకతాత్పర్యము||

" జానకి అత్యంత ఆనందముతో అందమైన కనుబొమలద్వారా కన్నీళ్ళు కార్చెను."||35.85||

||శ్లోకము 35.86||

చారు తద్వదనం తస్యా స్తామ్రశుక్లాయతేక్షణం|
అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్||35.86||

స|| విశాలాక్షాయాః తస్యాః చారు తామ్రశుక్లాయతేక్షణం తత్ వదనం రాహుముక్తః ఉడ్డురివ అశోభత|

||శ్లోకార్థములు||

విశాలాక్షాయాః తస్యాః -
విశాలాక్షి అగు అమె యొక్క
చారు తామ్రశుక్లాయతేక్షణం తత్ వదనం -
ఆ ఎర్రని అంచుగల కళ్ళుగల అ ముఖము
రాహుముక్తః ఉడ్డురివ అశోభత -
రాహువు ముఖమునుండి వివడిన చంద్రుని వలె శోభించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఎర్రని అంచుగల కళ్లతో ఆ విశాలాక్షి ముఖము రాహువు ముఖమునుండి వివడిన చంద్రుని వలె శోభించెను."||35.86||

||శ్లోకము 35.87||

హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా|
అథోవాచ హనుమాంస్తాముత్తరం ప్రియదర్శనామ్||35.87||

స|| సా హనుమంతం వ్యక్తం కపిం మన్యతే అన్యథా ఇతి అథ హనుమాన్ ప్రియదర్శనాం తాం ఉత్తరం ఉవాచ||

||శ్లోకార్థములు||

సా హనుమంతం వ్యక్తం -
ఆమె ముందు వున్న హనుమంతుడు
కపిం మన్యతే అన్యథా న ఇతి -
వానరుడే ఇంకొకడు కాడు అని గ్రహించెను
అథ హనుమాన్ ప్రియదర్శనాం -
హనుమంతుడు ప్రసన్నమైన చూపులుగల
తాం ఉత్తరం ఉవాచ-
ఆమె తో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"ఆమె హనుమంతుడు వానరుడే ఇంకొకడు కాడు అని గ్రహించెను. అప్పుడు హనుమంతుడు ప్రసన్నమైన చూపులుగల ఆమె తో ఇట్లు పలికెను." ||35.87||

||శ్లోకము 35.88||

ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసిహి మైథిలి|
కింకరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహమ్||35.88||

స|| మైథిలి ఏతత్ సర్వం ఆఖ్యాతం సమాశ్వసిహి| కిం కరోమి కథం వా రోచతే | అహం ప్రతియామి ||

||శ్లోకార్థములు||

మైథిలి ఏతత్ సర్వం ఆఖ్యాతం సమాశ్వసిహి-
ఓ మైథిలీ ఇదంతా సర్వస్వము చెప్పితిని విశ్వసింపుము
కిం కరోమి కథం వా రోచతే -
ఏమి చెసినచో సంతోషపడుదువో చెప్పుము
అహం ప్రతియామి -
నేను తిరిగి వెళ్ళెదను

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ ఇదంతా సర్వస్వము చెప్పితిని విశ్వసింపుము. ఏమి చెసినచో సంతోషపడుదువో చెప్పుము. నేను తిరిగి వెళ్ళెదను".||35.88||

||శ్లోకము 35.89||

హతేఽసురే సంయతి శంబసాదనే
కపిప్రవీరేణ మహర్షి చోదనాత్|
తతోఽస్మి వాయుప్రభవో హి మైథిలి
ప్రభావతః తత్ప్రతిమశ్చ వానరః||35.89||

స|| మైథిలి కపిప్రవరేణ మహర్షిచోదనాత్ అసురే శంబసాదనే సంయతి హతే సతి అథ వాయుప్రభవః ప్రభావతః తత్ప్రతిమః వానరః అస్మి||

||శ్లోకార్థములు||

మైథిలి - ఓ మైథిలీ
కపిప్రవరేణ మహర్షిచోదనాత్ -
మహర్షుల అదేశానుసారము కపిప్రవరుడు
అసురే శంబసాదనే సంయతి హతే సతి -
అసురుడగు శంబసాదనుని హతమార్చినప్పుడు
అథ వాయుప్రభవః -
అప్పుడు వాయుదేవుని వరప్రసాదముగా
ప్రభావతః తత్ప్రతిమః -
ప్రభావము లో వాయుదేవునితో సమానమైన
వానరః అస్మి-
వానరుడను నేను

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ మహర్షుల అదేశానుసారము కపిప్రవరుడు శంబసాదనుని హతమార్చెను. మహర్షుల దీవెనలతో వాయుదేవుని వరప్రసాదముగా పుట్టి ప్రభావము లో వాయుదేవునితో సమానమైన వాడను." ||35.89||

రామాయణము అంతటిలో హనుమ, "తతోఽస్మి వాయుప్రభవో హి మైథిలి"; 'ఓ మైథిలీ వాయుదేవునితో సమానమైన బలము కలవాడను' అంటూ తనకు గల అసాధారణమైన శక్తి గురించి మాట్లాడడము ఇక్కడే చూస్తాము. ఇక్కడ సీతకి విశ్వాసము కలిగించడానికి తనపుట్టుక, వంద యోజనములను దాటగలను అంటూ వాయుదేవునితో సమానమైన శక్తిగల, తన శక్తి ని కూడా వివరిస్తాడు.

మళ్ళీ ముందు సర్గలలో ఒక చోట సీతకి రామసుగ్రీవుల దగ్గర ఇంకా పెద్ద సైన్యము వుంది అని చెప్పడము అవుతుంది. అప్పుడు నిరహంకార రహితుడైన హనుమ రామసుగ్రీవుల సైన్యములో అందరూ తనకన్న గొప్పవాళ్ళే కాని తనకన్న తక్కువ వారు లేరు అని చెపుతాడు హనుమ.

అదే హనుమ గొప్పతనము

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి సుందరకాండలో ముప్పది ఇదవ సర్గ సమాప్తము

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచత్రింశస్సర్గః||

|| ఓమ్ తత్ సత్||