||సుందరకాండ ||

||నలభయ్యవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 40 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చత్వారింశస్సర్గః

శ్రుత్వాతు వచనం తస్య వాయుసూనోర్మహాత్మనః|
ఉవాచ్మహితం వాక్యం సీతా సురసుతోపమా||1||

స|| వాయుసూనుః మహత్మనః తస్య ఆత్మహితం వాక్యం శ్రుత్వా సీతా సురసుతోపమా ఉవాచ తు ||

మహాత్ముడైన వాయుపుత్రుని తన కోసమై చెప్పిన వచనములు వినిన సురకాంతలతో సమానమైన్ సీత ఇట్లు పలికెను.

త్వాం దృష్ట్వాప్రియవక్తారం సంప్ర హృష్యామి వానర|
అర్థ సంజాతసస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధరా||2||
యథా తం పురుషవ్యాఘ్రం గాత్రైః శోకాభికర్శితైః|
సంస్పృశేయం సకామాహం తథా కురు దయాం మయి||3||

స|| త్వాం ప్రియవక్తారం దృష్ట్వా అర్థసంజాత సస్యః వసుంధరా వృష్టిం ప్రాప్య ఇవ సంప్రహృష్యామి||స కామం అహం శోకకర్శిభితైః గాత్రైః తం పురుషవ్యాఘ్రం యథా సంస్పృశేయం తథా మయి దయామ్ కురు |

తా|| ఓ వానరా ప్రియమైన మాటలు చెప్పగల నిన్ను చూచినతరువాత సగము మొలకెత్తిన విత్తనము వర్షము పొందినట్లు నేను ఆనందించుచున్నాను. శోకముముతో కృశించిపోయిన నాగాత్రములు ఆ పురుషవ్యాఘ్రముని స్పర్శానందము పొందనట్లు నాపై దయ కలుగునట్లు చేయుము.

అభిజ్ఞానం చ రామస్య దద్యా హరిగణోత్తమ|
క్షిప్తామిషికాం కాకస్య కోపాత్ ఏకాక్షి శాతనీమ్||4||
మనశ్శిలాయాః తిలకో గండపార్శ్వే నివేశితః|
త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి||5||
స వీర్యవాన్ కథం సీతాం హృతాం స మనుమన్యసే|
వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమః||6||

స|| హరిగణోత్తమ కోపాత్ క్షిప్తం కాకస్య ఏకాక్షిశాతనీమ్ ఇషికాం రామస్య అభిజ్ఞానం దద్యా చ ||తిలకే ప్రణష్టే త్వయా మనశ్శిలయాః తిలకః గణ్డపార్శ్వే నివేశితః కిల తం స్మర్తుం అర్హసి||వీర్యవాన్ మహేంద్రవరుణోఫమః సః హృతాం రాక్షసాం మధ్యే వసంతీం సీతాం కథం సమనుమన్యసే ||

తా|| ఓ హరిగణోత్తమా ! కోపముతో ఒక ఇషికతో వాయసముయొక్క కంటిని హరించిన అభిజ్ఞానమును గా ఇవ్వుము. తిలకము చెదిరిపోగా నీచేత మణిశిలతో చెక్కిలిపై దిద్దబడిన విషయము నువ్వు అతనికి గుర్తు చేయుము. ఓ వీరుడా మహేంద్రుడు వరుణులతో సమానమైన అతడు అపహరింపబడి రాక్షసులమధ్యలో నున్నసీతను ఏట్లు ఉపేక్షించుచున్నావు?

ఏష చూడామణిర్దివ్యో మయా సు పరిరక్షితః|
ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వాం ఇవానఘ||7||
ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారిసంభవః|
అతః పరం న శక్ష్యామి జీవితుం శోకలాలసా||8||

స|| అనఘ దివ్యః ఏషః చూడామణీః మయా సుపరిరక్షితః | వ్యసనేఏతం దృష్ట్వా త్వాం ఇవ ప్రహృష్యామి||శ్రీమాన్ వారిసంభవః ఏషః నిర్యాతితః శోకలాలసా అతః పరం జీవితుం న శక్ష్యామి ||

తా|| ఓ అనఘ దివ్యమైన ఈ చూడామణి నాచేత రక్షింపబడినది. కష్టములలో దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నాను.ఓ శ్రీమాన్ ఈ జలనిధిలో పుట్టిన దీనిని అనవాలుగా పంపిస్తున్నాను. ఇంక ముందు జీవించదము కష్టము.

అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః|
రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహమ్||9||
ధారయిష్యామి మాసం తు జీవితం శత్రు సూదన|
ఊర్ధ్వం మాసాన్ నజీవిష్యే త్వయా హీనా నృపాత్మజ||10||
ఘోరోరాక్షసరాజోఽయం దృష్టిశ్చ న సుఖామయి|
త్వాం చ శ్రుత్వా విపద్యంతం న జీవేయమహం క్షణమ్||11||

స|| అహం అసహ్యాని దుఃఖాని సుఘోరాణాం రాక్షసీనాం హృదయచ్ఛిదః వాచశ్చ త్వత్ కృతే అహం మర్షయామి|| నృపాత్మజ శత్రుసూదన జీవితం మాసం ధారయిష్యామి | త్వయా హీనా మాసాన్ ఊర్ధ్వం న జీవిష్యే ||రాక్షసరాజః ఘోరః| మయి దృష్టిః సుఖా న |త్వం విపద్యంతం శ్రుత్వా క్షణం న జీవేయం||

తా|| నేను అసహ్యమైన దుఃఖములను, ఘోరమైన రాక్షసుల వచనములను నీరాక కొరకై సహిస్తున్నాను. ఓ నృపాత్మజ శత్రుసూదనా ఈ జీవితము ఒక మాసము ధరించెదను. నీవు లేకుండా మాసము గడినచిన పిమ్మట జీవించను. రాక్షసరాజు ఘోరమైన వాడు. నా అతని దృష్టి సుఖము కలిగించదు. నీవు రాకలో జాప్యత విని ఒక క్షణము జీవించను.

వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్|
అథాబ్రవీన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః||12||

స|| మహాతేజా హనుమాన్ మారుతాత్మజః వైదేహ్యాః కరుణం సాశ్రుభాషితమ్ వచనం శ్రుత్వా అథ అబ్రవీత్ ||

తా|| మహాతేజోవంతుడైన ఆ హనుమంతుడు ఆ సీతయొక్క కరుణను గలిగించు వచనములను విని అప్పుడు సమాధానము ఇచ్చెను.

త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే|
రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే||13||
కథంచిత్ భవతీ దృష్టా న కాలః పరిశోచితుమ్|
ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని||14||
తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్త్రావరిందమౌ|
త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః||15||

స|| దేవి త్వత్ రామః శోకవిముఖః| సత్యేన తే శపే| రామే దుఃఖాభిభూతే లక్ష్మనః పరితప్యతే||భామిని కథంచిత్ భవతీ దృష్టా | పరిశోచితుం కాలః న| ఇఅమం ముహూర్తం దూఖానాం అంతం ద్రక్ష్యసి ||తౌ ఉభౌ రాజపుత్రాః అరిందమౌ పురుషవ్యాఘ్రౌ త్వత్ దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీ కరిష్యతః||

తా|| ఓ దేవీ నీశోకముతో విముఖుడై ఉన్నాడు. నిజము చెప్పుచున్నాను. రాముడు దుఖములో ఉండుటవలన్ లక్ష్మణుడు పరితపిస్తున్నాడు.ఓ భామిని అదృష్టము కొలదీ నీవు చూడబడినావు. ఇప్పుడు పరితపించుటకు కాలము కాదు. ఈ ముహూర్తమే నీ శోకముల అంతము కనిపించుచున్నది.ఆ పురుషవ్యాఘ్రములైన శ్త్రువులను మర్దించు ఆ రాజపుత్రులిద్దరూ నీ దర్శనమునకై గల ఉత్సాహముతో లంకానగరమును భస్మము చేసెదరు.

హత్వాతు సమరే క్రూరం రావణం సహబాంధవమ్|
రాఘవౌ త్వా విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః||16||
యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే|
ప్రీతిసంజననం తస్య భూయస్త్వం దాతుమర్హసి||17||

స|| విశాలాక్షి సహ బాంధవం క్రూరం రావణం సమరే హత్వా రాఘవౌ త్వాం స్వాం పురీం ప్రతి ప్రాపయిష్యతః||అనిందితే రామః యత్ అభిజ్ఞానం విజానీయాత్ తస్య ప్రీతి సంజననమ్ భూయః త్వం దాతుం అర్హసి||

తా|| ' ఓ విశాలాక్షీ రావణుబి బంధువర్గముతో కలిపి సమరములో హతమార్చి నిన్ను రాఘవుడు తన నగరమునకొ కొనిపోవును. దోషరహితురాలా ! రామునకు ప్రీతి కలిగించు మరి ఒక అభిజ్ఞానమును ఇమ్ము'.

సాsబ్రవీ ద్దత్తమేవేతి మయాభిజ్ఞాన ముత్తమమ్|
ఏతదేవ హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణమ్||18||
శ్రద్ధేయం హనుమాన్వాక్యం తవ వీర భవిష్యతి|

స|| మయా ఉత్తమం అభిజ్ఞానం దత్తమేవ ఇతి సా అబ్రవీత్ | వీర హనుమాన్ ఏతత్ మత్కేశభూషణం దృష్ట్వా తవ వాక్యం రామస్య శ్రద్ధేయం భవిష్యతి ||

తా|| అప్పుడు ఆమె ' ఆచేత ఉత్తమమైన అభిజ్ఞానము ఇవ్వబడినది' అనిచెప్పెను. 'ఓ వీరుడా నాచే ఇవ్వబడిన కేశ భూషణము చూచిన వెంటనే నీ మాతలు రాముడు శ్రద్ధగా వినును'

స తం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగసత్తమః||19||
ప్రణమ్య శిరసా దేవీం గమనాయోపచక్రమే|

స|| శ్రీమాన్ సః ప్లవగసత్తమః మణివరం గృహ్య దేవీం శిరసా ప్రణమ్య గమనాయ ఉపచక్రమే||

తా|| ఓ ప్లవగసత్తముడు మణివరము ను స్వీకరించి దేవికి శిరసా అభివాదము చేసి వెళ్ళుటకు తయారు అయ్యెను.

తముత్పాత కృతోత్సాహమ్ అవేక్ష్య హరిపుంగవమ్||20||
వర్థమానం మహావేగం ఉవాచ జనకాత్మజా|
అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పగద్గదయా గిరా||21||

స|| జనకాత్మజా ఉత్పాతకృతోత్సాహం వర్ధమానం మహావేగం తం హరిపుంగవం ఆవేక్ష్య అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పగద్గదయా గిరా ఉవాచ||

తా|| అప్పుడు జనకాత్మజ వేళ్ళుటకు ఉత్సాహముతో పెరిగిన , మాహావేగము కల ఆ హరిపుంగవుని చూచి కన్నీళ్లతో నిండిన కళ్లతో గద్గద స్వరముతో ఇట్లు పలికెను.

హనుమాన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ|
సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయమ్||22||
యథా చ మహాబాహుః మాం తారయతి రాఘవః|
అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతు మర్హసి||23||
ఇమం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభి రేభిః పరిభర్త్సనం చ|
బ్రూయాస్తు రామస్య గతస్సమీపం శివశ్చ తేఽధ్వాస్తు సహరిప్రవీర||24||

స|| హనుమాన్ భ్రాతరౌ సింహసంకాశౌ రామలక్ష్మణౌ సహామాత్యం సుగ్రీవం చ సర్వాన్ అనామయం బ్రూయాః||మహాబలః సః రాఘవః అస్మాత్ దుఃఖాంబుసంరోధాత్ (మాం) యథా తారయతి త్వం సమాధాతుం అర్హసి||హరిప్రవీర రామస్య సమీపం గతః మమ్ ఇమం తీవ్రం శోకవేగం ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం బ్రూయాః | తే అధ్వా శివః అస్తు ||

తా|| ఓ హనుమా సింహములవంటి సోదరులు , అమాత్యులతో కూడిన సుగ్రీవుని , తక్క్కిన అందరినీ క్షేమము అడుగుము. మహాబలుడు అయిన ఆ రాఘవుడు నన్ను ఎట్లు ఈ దుఃఖసాగరమునుంచి రక్షించునో అది నీవు చూడుము. పరిప్రవీర రాముని వద్దకు పోయి నా తీవ్రమైన శోకమును రాక్షసుల బెదిరింపులు చెప్పుము. నీ ప్రయానము శుభప్రదము అగుగాక.

స రాజపుత్త్ర్యా ప్రతివేదితార్థః కపిః కృతార్థః పరిహృష్టచేతాః|
అల్పావశేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామ||25||

స|| స కపిః రాజపుత్ర్యా ప్రతివేదితార్థః కృతార్థః పరిహృష్టచేతసః కార్యం అల్పావశేషం ప్రసమీక్ష్య ఉదీచీం దిశం మనసా జగామ||

తా|| ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేసము తీసుకొని కృతార్థుడై సంతోషము కలమనస్సు కలవాడై మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చత్వారింశస్సర్గః ||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభయ్యవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||