||సుందరకాండ ||

||నలభై ఐదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 45 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచచత్త్వారింశస్సర్గః||

జంబుమాలి హతమార్చబడడముతో రావణుడు అమాత్య పుత్రులు ఏడు మందిని హనుమంతుడిని బందీ చేయడానికి ఆదేశిస్తాడు. వాళ్ళు కూడాహనుమంతుని ధాటిని ఆపలేకతనువులు కోల్పోతారు. అది ఈ సర్గలో కథ.

ఇక నలభై ఐదవ సర్గలో శ్లోకాలు.

||శ్లోకము 45.01||

తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణస్సుతాః|
నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తసప్తార్చివర్చసః ||45.01||

స|| తతః రాక్షసేంద్రేణ ఉదితాః మంత్రిణః సప్తార్తి వర్చసః సప్త సుతాః తస్మాత్ భవనా త్ నిర్యయుః||

||శ్లోకార్థములు||

తతః రాక్షసేంద్రేణ ఉదితాః -
అప్పుడు రాక్షసేంద్రునిచే అదేశించబడిన
మంత్రిణః సప్త సుతాః -
ఏడుగురు మంత్రికుమారులు
సప్తార్తి వర్చసః -
అగ్నితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుచూ
తస్మాత్ భవనాత్ నిర్యయుః-
ఆ భవనము నుండి బయలుదేరిరి.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాక్షసేంద్రునిచే అదేశించబడిన ఏడుగురు మంత్రికుమారులు అగ్నితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుచూ ఆ భవనము నుండి బయలుదేరిరి." ||45.01||

||శ్లోకము 45.02||

మహబలపరీవారా ధనుష్మంతో మహాబలాః|
కృతాస్త్రాస్త్రవిదాం శ్రేష్ఠాః పరస్పరజయైషిణః ||45.02||

స||మహాబలపరీవారాః శ్రేష్ఠాః మహాబలాః ధనుష్మంతః కృతాస్త్రవిదాం పరస్పరజైషిణః స్యాత్||

||శ్లోకార్థములు||

మహాబలపరీవారాః -
మహాబలముతో వెళ్ళినవారు
శ్రేష్ఠాః మహాబలాః -
శ్రేష్టులు, మహాబలము కలవారు
ధనుష్మంతః కృతాస్త్రవిదాం -
ధనుష్మంతులు, అశ్త్రవిద్యను నేర్చుకున్నవారు
పరస్పరజైషిణః స్యాత్ -
తోటివారికన్నమిన్నగాఉండవలెనని కోరికగలవారు

||శ్లోకతాత్పర్యము||

"ఆ అమాత్యపుత్రులు మహాబలముతో వెళ్ళిరి. వారు శ్రేష్టులు. మహాబలము కలవారు. ధనుష్మంతులు. అశ్త్రవిద్యను నేర్చుకున్నవారు, తోటివారి కన్నమిన్నగా ఉండవలెనని కోరిక గలవారు." ||45.02||

||శ్లోకము 45.03||

హేమజాలపరిక్షిప్తైర్ధ్వజవద్భిః పతాకిభిః|
తోయదస్వననిర్ఘోషై ర్వాజీయుక్తర్మహారథైః||45.03||

స||హేమజాలపరిక్షిప్తైః ధ్వజద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైః వాజియుక్తైః మహారథైః నిర్యయుః||

||శ్లోకార్థములు||

హేమజాలపరిక్షిప్తైః -
బంగారపు జాలీలు కల
ధ్వజద్భిః పతాకిభిః -
ధ్వజములు పతాకములు గల
తోయదస్వన నిర్ఘోషైః -
మేఘముల ధ్వనులను పోలిన ధ్వనులను చేస్తూ
వాజియుక్తైః మహారథైః నిర్యయుః -
అశ్వములతో కూడిన మహారథములపై వెళ్ళిరి

||శ్లోకతాత్పర్యము||

"బంగారపు జాలీలు కల, ధ్వజములు పతాకములు గల, రథముల కదలికతో మేఘముల ధ్వనులను పోలిన ధ్వనులను చేస్తూ అశ్వములతో కూడిన మహారథములపై వెళ్ళిరి." ||45.03||

||శ్లోకము 45.04||

తప్తకాంచన చిత్రాణి చాపాన్యమిత విక్రమాః|
విష్ఫారయంతః సంహృష్టాః తటిత్వంత ఇవాంబుదాః||45.04||

స||తప్తకాంచన చిత్రాణి చాపాని విష్ఫారయంతః తటిత్వంతః అంబుదా ఇవ అమిత విక్రమాః సంహృష్టాః నిర్యయుః ||

||శ్లోకార్థములు||

తప్తకాంచన చిత్రాణి చాపాని విష్ఫారయంతః-
మేలిమి బంగారపు పూతగల ధనస్సులతో
తటిత్వంతః అంబుదా ఇవ -
మెరుపులతో కూడిన మేఘములవలె విరాజిల్లుచూ
అమిత విక్రమాః సంహృష్టాః -
అమితోత్సాహముతో

||శ్లోకతాత్పర్యము||

"మేలిమి బంగారపు పూతగల ధనస్సులతో టంకారము చేయుచూ , మెరుపులతో కూడిన మేఘములవలె విరాజిల్లుచూ అమితోత్సాహముతో వెళ్ళిరి". ||45.04||

||శ్లోకము 45.05||

జనన్యస్తు తతస్తేషాం విదితా కింకరాన్ హతాన్|
బభూవుశ్శోకసంభ్రాంతాః సబాంధవసుహృజ్జనాః||45.05||

స|| తతః తేషాం సబాంధవసుహృత్ జనాః జనన్యస్తు కింకరాన్ హతాన్ విదిత్వా కామసంభ్రాంతాః బభూవుః||

||శ్లోకార్థములు||

తతః తేషాం సబాంధవసుహృత్ జనాః -
అప్పుడు వారి బంధువులు మిత్రులు
జనన్యస్తు - అమాత్య సుతుల తల్లులు
కింకరాన్ హతాన్ విదిత్వా-
కింకరులు హతమార్చబడిరి అని విని
కామసంభ్రాంతాః బభూవుః -
చింతాక్రాంతులైరి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు వారి బంధువులు మిత్రులు , అమాత్య సుతుల తల్లులు కింకరులు హనుమంతునిచేత హతమార్చబడిరి అన్నవిషయము తెలిసినవారై చింతాక్రాంతులైరి." ||45.05||

||శ్లోకము 45.06||

తే పరస్పరసంఘర్షా తప్తకాంచనభూషణాః|
అభిపేతుర్హనూమంతం తోరణస్థ మవస్థితమ్||45.06||

స|| తప్తకాంచన భూషణాః పరస్పరసంఘర్షాత్ తోరణస్థం అవస్థితమ్ హనూమంతం అభిపేతుః||

||శ్లోకార్థములు||

తప్తకాంచన భూషణాః -
మేలిమి బంగారపు ఆభూషణములు ధరించిన ఆ మంత్రిపుత్రులు
పరస్పరసంఘర్షాత్ -
ఒకరిపై ఒకరు పోటీపడుతూ
తోరణస్థం అవస్థితమ్ -
అశోకవనద్వార తోరణము మీద కూర్చునియున్న
హనూమంతం అభిపేతుః-
హనుమంతుని ఎదురుకొనిరి.

||శ్లోకతాత్పర్యము||

"మేలిమి బంగారపు ఆభూషణములు ధరించిన ఆ మంత్రిపుత్రులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ అశోకవనద్వార తోరణము మీద కూర్చునియున్న హనుమంతుని ఎదురుకొనిరి." ||45.06||

||శ్లోకము 45.07||

సృజంతో బాణవృష్టిం తే రథగర్జిత నిస్స్వనాః|
వృష్టిమంత ఇవాంబోధా విచేరుర్నైరృతాంబుదాః||45.07||

స|| రథగర్జిత నిస్వనాః తే నైఋతాంబుదాః బాణవృష్టిమ్ సృజంతః వృష్టిమంతః అమ్బుదా ఇవ విచేరుః||

||శ్లోకార్థములు||

రథగర్జిత నిస్వనాః -
రథముల గతితో మేఘ గర్జన చేయుచూ
తే నైఋతాంబుదాః బాణవృష్టిమ్ సృజంతః -
వర్షిస్తున్న మేఘముల వలె బాణ వృష్టి కురిపిస్తూ
వృష్టిమంతః అమ్బుదా ఇవ విచేరుః-
మేఘములవలె విరాజిల్లుచూ వెళ్ళిరి

||శ్లోకతాత్పర్యము||

"రథముల గతితో మేఘ గర్జన చేయుచూ, వర్షిస్తున్న మేఘముల వలె బాణ వృష్టి కురిపిస్తూ మేఘములవలె విరాజిల్లుచూ సంచరించిరి."||45.07||

||శ్లోకము 45.08||

అవకీర్ణస్తతస్తాభిర్హనుమాన్ శరవృష్టిభిః|
అభవత్సంవృతాకారః శైలారాడివ వృష్టిభిః||45.08||

స|| తతః తాభిః శరవృష్టిభిః అవకీర్ణః హనుమాన్ వృష్టిభిః సంవృతాకారః శైలారాడివఅభవత్ ||

||శ్లోకార్థములు||

తతః తాభిః శరవృష్టిభిః అవకీర్ణః -
అప్పుడు ఆ శరపరంపరతో కప్పబడిన
హనుమాన్ - హనుమంతుడు
వృష్టిభిః సంవృతాకారః శైలారాడివ -
వర్షముతో కప్పబడిన పర్వతరాజము వలె
అభవత్ - వుండెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ శరపరంపరతో కప్పబడిన హనుమంతుడు వర్షముతో కప్పబడిన పర్వతరాజము వలె నుండెను. " ||45.08||

||శ్లోకము 45.09||

స శరాన్మోఘయామాస తేషా మాశుచరః కపిః|
రథవేగం చ వీరాణాం విచరన్విమలేంబరే||45.09||

స|| ఆశుచరః సః కపిః విమలే అంబరే విచరన్ తేషాం వీరాణాం శరాన్ రథవేగం చ మోఘయామాస||

||శ్లోకార్థములు||

ఆశుచరః సః కపిః -
ప్రచండవేగముతో వెళ్లగల ఆ వానరుడు
విమలే అంబరే విచరన్ -
ఆ నిర్మలాకాశములో తిరుగుచూ
తేషాం వీరాణాం శరాన్ -
ఆ వీరుల శరములను
రథవేగం చ మోఘయామాస -
రథవేగమును నిర్వీర్యము చేసెను

||శ్లోకతాత్పర్యము||

"ప్రచండవేగముతో వెళ్లగల ఆ వానరుడు ఆ నిర్మలాకాశములో తిరుగుచూ ఆ వీరుల శరములను రథవేగమును నిర్వీర్యము చేసెను." ||45.09||

||శ్లోకము 45.10||

స తైః క్రీడన్ ధనుష్మద్భిర్వ్యోమ్ని వీరః ప్రకాశతే|
ధనుష్మద్భిర్యథా మేఘైర్మారుతః ప్రభురంబరే||45.10||

స|| వ్యోమ్ని ధనుష్మద్భిః తైః క్రీడన్ సః వీరః అమ్బరే ధనుష్మద్భిః మేఘైః ప్రభుః మారుతిః యథా ప్రకాశతే||'

||శ్లోకార్థములు||

వ్యోమ్ని ధనుష్మద్భిః తైః క్రీడన్ -
ఆకాశములో వుండి ఆ ధనుర్ధారులను ఆటలాడిస్తూ
సః వీరః అమ్బరే -
ఆ వీరుడు ఆకాశములో
మేఘైః ప్రభుః మారుతిః యథా-
మేఘములకు ప్రభువు మారుతిలాగా
ధనుష్మద్భిః ప్రకాశతే -
ధనుర్ధారులతో మారుతి ప్రకాశించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆకాశములో వుండి ఆ ధనుర్ధారులను ఆటలాడిస్తూ మేఘముల ప్రభువు మారుతి వలె శోభించెను." ||45.10||

||శ్లోకము 45.11||

సకృత్వా నినదం ఘోరం త్రాసయం స్తాం మహాచమూమ్|
చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్||45.11||

స||వీర్యవాన్ సః ఘోరం నినదం కృత్వా తామ్ మహాచమూం త్రాసయన్ తేషు రక్షస్సు వేగం చకార||

||శ్లోకార్థములు||

వీర్యవాన్ సః ఘోరం నినదం కృత్వా-
ఆ వీరుడు ఘోరమైన గర్జనచేయుచూ
తామ్ మహాచమూం త్రాసయన్ -
ఆ మహాసేనకి భీతి కలిగించునట్లు
తేషు రక్షస్సు వేగం చకార - ఆ రాక్షసులలో వేగముగా తిరిగెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ వీరుడు ఘోరమైన గర్జనచేయుచూ ఆ మహాసేనకి భీతి కలిగించునట్లు తిరిగెను." ||45.11||

||శ్లోకము 45.12||

తలేనాభ్యహనత్కాంశ్చిత్ పాదైః కాంశ్చిత్పరంతపః
ముష్టినాభ్యహనత్కాంచిన్ నఖైః కాంశ్చిద్వ్యదారయత్||45.12||

స||పరంతః కాంశ్చిత్ తలేన అభ్యహనత్ | కాశ్చి పాదైః | కాశ్చిత్ ముష్టినా | కాశ్చిత్ నఖైః వ్యదారయత్ ||

||శ్లోకార్థములు||

పరంతః కాంశ్చిత్ తలేన అభ్యహనత్ -
ఆ శత్రుమర్దనడు కొందరిని చేతితో కొట్టి హతమార్చెను
కాశ్చి పాదైః -
కొందరిని పాదములతో
కాశ్చిత్ ముష్టినా -
కొందరిని పిడికిలితో
కాశ్చిత్ నఖైః వ్యదారయత్ -
కొందరిని గోళ్లతో సంహరించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ శత్రుమర్దనడు కొందరిని చేతితో కొట్టి హతమార్చెను. కొందరిని పాదములతో, కొందరిని పిడికిలితో, కొందరిని గోళ్లతో సంహరించెను." ||45.12||

||శ్లోకము 45.13||

ప్రమమాథోరసా కాంశ్చిదూరూభ్యాం అపరాన్ కపిః|
కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి||45.13||

స||కపిః కాంశ్చిత్ ఉరసా | అపరాన్ ఊరుభ్యాం ప్రమాథ | కేచిత్ తస్య నినాదేన తత్రైవ భువి పతితాః||

||శ్లోకార్థములు||

కపిః కాంశ్చిత్ ఉరసా -
ఆ వానరుడు కొందరిని తన రొమ్ముతో
అపరాన్ ఊరుభ్యాం ప్రమాథ -
మరికొందరిని తొడలతో మధించి
కేచిత్ తస్య నినాదేన -
కొందరు అతని గర్జనతో
తత్రైవ భువి పతితాః -
అక్కడే భూమిపై పడిపోయిరి

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు కొందరిని తన రొమ్ముతో, మరికొందరిని తొడలతో మధించి వధించెను. కొందరు అతని సింహనాదము విని భూమిపై పడిరి."||45.13||

||శ్లోకము 45.14||

తతస్తేష్వవసన్నేషు భూమౌ నిపతితేషు చ|
తత్సైన్యమగమత్ సర్వం దిశోదశ భయార్దితమ్||45.14||

స||తేషు అవసన్నేషు భూమౌ నిపతితేషు చ | తతః సర్వం సైన్యం భయార్దితం దశ దిశః అగమత్||

||శ్లోకార్థములు||

తేషు అవసన్నేషు -
వారి ఆవసానముతో
భూమౌ నిపతితేషు చ -
భూమిమీద పడిపోయినప్పుడు
తతః సర్వం సైన్యం భయార్దితం -
అప్పుడు ఆ సైన్యము అంతా భయపడినవారై
దశ దిశః అగమత్ -
పది దిక్కులలో పారిపోయిరి

||శ్లోకతాత్పర్యము||

"వారి ఆవసానముతో భూమిమీద పడిపోయినప్పుడు, ఆ సైన్యము అంతా భయపడినవారై పది దిక్కులలో పారిపోయిరి." ||45.14||

||శ్లోకము 45.15||

వినేదుర్విస్వరం నాగా నిపేతుర్భువి వాజినః|
భగ్ననీడధ్వజచ్చత్రైర్భూశ్చ కీర్ణాsభవ ద్రథైః||45.15||

స||నాగాః విస్వరమ్ వినేదుః | వాజినః భువి నిపేతుః| భూశ్చ భగ్ననీడధ్వజచ్ఛత్రైః రథైః కీర్ణా అభవత్||

||శ్లోకార్థములు||

నాగాః విస్వరమ్ వినేదుః -
ఏనుగులు వికృతముగా ఘీంకరించెను
వాజినః భువి నిపేతుః -
గుఱ్ఱములు నేలపై పడెను
భూశ్చ భగ్ననీడధ్వజచ్ఛత్రైః రథైః-
భూమికూడా రథమునుంచి విరిగి ముక్కలై పడిన రథముల పైకప్పులు, ధ్వజములు,
రథైః కీర్ణా అభవత్ -
రథములతో నిండిపోయెను

||శ్లోకతాత్పర్యము||

"ఏనుగులు వికృతముగా ఘీంకరించెను .గుఱ్ఱములు నేలపై పడెను. భూమికూడా రథమునుంచి విరిగి ముక్కలై పడిన రథముల పైకప్పులు, ధ్వజములు, చత్రముల తో నిండిపోయెను ". ||45.15||

||శ్లోకము 45.16||

స్రవతారుధిరేణాథ స్రవంత్యో దర్శితాః పథి|
వివిధైశ్చ స్వరైర్లంకా ననాద వికృతం తదా||45.16||

స||అథా స్రవతా రుధిరేణ పథి స్రవంత్యః దర్శితాః తదా లంకా వివిధైః స్వరైః వికృతం ననాద||

గోవిన్దరాజ టీకాలో - స్రవన్త్యః నద్యః।

||శ్లోకార్థములు||

అథా పథి స్రవతా రుధిరేణ -

మార్గములన్నీ స్రవించుచున్న రక్తముతో
స్రవంత్యః దర్శితాః -
నిండినవై కనపడుచున్నవి
తదా లంకా వివిధైః వికృతం స్వరైః-
ఆ లంక అంతా అనేక వికృతమైన స్వరములతో
ననాద - మారుమోగెను

||శ్లోకతాత్పర్యము||

"మార్గములన్నీ స్రవించుచున్న రక్తముతో నిండినవై ఆ లంక అంతా అనేక వికృతమైన నాదములతో మారుమోగెను." ||45.16||

||శ్లోకము 45.17||

సతాన్ప్రవృద్దాన్విహత్య రాక్షసాన్
మహాబలశ్చండపరాక్రమః కపిః|
యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః
తమేవ వీరోఽభిజగామ తోరణమ్||45.17||

స|| వీరః మహాబలః చణ్డ పరాక్రమః స కపిః ప్రవృద్ధాన్ తాన్ రాక్షసాన్ వినిహృత్య అన్యైః యుయుత్సుః పునరేవ తం తోరణమేవ అభిజగామ||

రామ టీకాలో- మహాబలః కపీః తాన్ రాక్షసాన్ వినిహిత్య అన్యైః పునః యుయుత్సుః సన్ తత్ పూర్వమధిష్టితం తోరణం అభిజగామ।

||శ్లోకార్థములు||

వీరః మహాబలః -
ఆ వీరుడు మహాబలుడు
చణ్డ పరాక్రమః స కపిః -
చండపరాక్రమము గల ఆ వానరుడు
ప్రవృద్ధాన్ తాన్ రాక్షసాన్ వినిహృత్య -
వీరాగ్రేసరులైన ఆ రాక్షసులను హతమార్చి
అన్యైః యుయుత్సుః -
ఇతరులతో యుద్ధము చేయవలెననే ఉత్సాహముతో
పునరేవ తం తోరణమేవ అభిజగామ -
మళ్ళీ ఆ అశోక వనద్వార తోరణముఫైకి ఎక్కెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వీరుడు మహాబలుడు చండపరాక్రమము గల వానరుడు వీరాగ్రేసరులైన ఆ రాక్షసులను హతమార్చి ఇంకా ఇతరులతో యుద్ధము చేయవలెననే ఉత్సాహముతో మళ్ళీ ఆ అశోక వనద్వార తోరణముఫైకి ఎక్కెను." ||45.17||

అమాత్యపుత్రుల మరణముతో నలభైనాలుగొవ సర్గ సమాప్తము అవుతుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచచత్త్వారింశస్సర్గః ||

||ఒమ్ తత్ సత్||