||సుందరకాండ ||

||నలభై ఎనిమిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 48 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టచత్త్వారింశస్సర్గః||

తతస్సరక్షోఽధిపతిర్మహాత్మా
హనూమతాక్షే నిహతే కుమారే|
మనః సమాధాయ సదేవకల్పం
సమాదిదేశేంద్రజితం సరోషమ్||1||

స|| తతః రక్షోధిపతిః మహాత్మా హనుమతా కుమారే అక్షే నిహతే మనః సమాధాయ సరోషం దేవకల్పం ఇంద్రజితం సమాదిదేశ ||

తా|| ఆ రాక్షసాధిపతి మహాత్ముడైన హనుమంతునిచేత అక్షకుమారుడు హతమార్చబడగా అలజడబడిన మనస్సును సమాధానపరచుకొని రోషముతో, దేవులతో సమానమైన ఇంద్రజిత్తుని అదేశించెను.

త్వమస్త్రవిచ్ఛస్త్రవిదాం వరిష్ఠః
సురాసురాణామపి శోకదాతా|
సురేషుసేంద్రేషు చ దృష్టకర్మా
పితామహారాధనసంచితాస్త్రః||2||

స||త్వం అస్త్రవిత్ శస్త్రవిదాం వరిష్ఠః | సురాణాం అసురాణాం అపి శోక దాతా| స ఇంద్రేషు సురేషు దృష్టకర్మా | పితామహారాధన సంచితాస్త్రః||

తా|| 'నీవు అస్త్రజ్ఞానము తెలిసిన వారిలో వరిష్ఠుడవు. సురులకు అసురులకు శోకము ప్రదానము చేయుగలవాడవు. ఇంద్రుడు మున్నగు సురలలు సైతము నీ పరాక్రమము చూసిన వారు. బ్రహ్మదేవుని అరాధించి అనేక శస్త్రములను సంపాదించినవాడవు'.

తవాస్త్రబలమాసాద్య నాసురా న మరుద్గణాః|
న శేకుః సమరేస్థాతుం సురేశ్వర సమాశ్రితాః||3||
నకశ్చిత్ త్రిషు లోకేషు సంయుగే న గతశ్రమః|
భుజవీర్యగుప్తశ్చ తపసా చాభిరక్షితః|
దేశకాలవిభాగజ్ఞః త్వమేవ మతిసత్తమః||4||

స|| తవ అస్త్రబలం ఆసాద్య న అసురా న మరుద్గణాః న సురేశ్వరః సమాశ్రితాః సమరే స్థాతుం శేకుః ||సంయుగేన గతశ్రమః కశ్చిత్ త్రిషు లోకేషు న | త్వమేవ మతిసత్తమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా అభిరక్షితః దేవకాలవిభాగజ్ఞః||

తా|| 'నీ అస్త్రబలమును చూచి అసురులు కాని మరుద్గణములు కాని సురేశ్వరుడుగాని యుద్ధములో నీ ఎదురుగా నిలబడలేరు. నీతో యుద్ధములో కష్టపడని వాడు ముల్లోకములలో లేడు. నీవే బుద్ధికుశలములు గలవాడవు. నీవు నీ భుజబలముచే తపోబలముచే రక్షింపబడుతున్నవాడవు. దేశకాలానుసారము కార్యసాధనలో ప్రజ్ఞాశాలివి".

నతేఽస్త్వశక్యం సమరేషు కర్మణా
న తేఽస్త్యకార్యం మతిపూర్వ మంత్రణే|
నసోఽస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై
న వేద యస్తేఽస్త్రబలం బలం చ తే||5||

మమానురూపం తపసో బలం చ తే
పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే|
న త్వాం సమాసాద్య రణావమర్దే
మనః శ్రమం గచ్చతి నిశ్చితార్థమ్||6||

స|| సమరేషు కర్మణా తే అశక్యం నాస్తి| మతిపూర్వమంత్రేణ తే అకార్యం నాస్తి| త్రిషు సంగ్రహేషు యః తే అస్త్రబలం తే బలం చ న వేద సః కశ్చిత్ నాస్తి||తే తపసః బలం మమ అనురూపం సంయుగే పరాక్రమశ్చ బలం చ రణావమర్థే |త్వాం సమాసాద్య మనః నిశ్చితార్థం శ్రమమ్ న గచ్ఛతి||

తా|| ' సమరములో నీకు శక్యముకాని పనిలేదు. బుద్ధికౌశల్యములతో నీకు సాధింపబడని కార్యము లేదు. నీ అస్త్రపాటవము బలము గురించితెలియనివాడు ముల్లోకములలోను లేడు. తపోబలములో యుద్ధములో పరాక్రమములో రణములో శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలములో నీవు నాతో సమానము. నీవు నిలబడితే నా మనస్సు నిశ్చయముగా నిశ్చింతగా ఉంటుంది'.

నిహతాః కింకరాః సర్వే జంబుమాలీచ రాక్షసః||7||
అమాత్యపుత్త్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః|
బలాని సుసమృద్ధాని సాశ్వనాగరథానిచ||8||
సహోదరః తే దయితః కుమారోఽక్షశ్చ సూదితః|
న హి తేష్వేవ మే సారో యస్త్వయ్యరినిషూదన||9||

స|| కింకరాః తథైవ జంబుమాలీ చ అమాత్యపుత్రాశ్చ వీరాః చ పంచసేనాగ్రయాయినః బలాని సుసమృద్ధాని స అశ్వనాగరథాని చ సర్వే నిహతాః ||తే సహోదరః దయితః కుమారః అక్షః చ సూదితః | అరినిషూదన మే త్వయి సారః తేష్వేవ న హి||

తా|| ' కింకరులు అలాగే జంబుమాలి , అమాత్యపుత్రులు వీరులైన పంచ సేనాగ్రనాయకులు అనేక బలములు, అశ్వములు, ఏనుగులు, అందరూ హతమార్చబడిరి. నీ సహోదరుడు అక్షకుమారుడు కూడా హతమార్చబడెను. ఓ శత్రు సంహారకా! నీబలము పై నున్న నమ్మకము నాకు ఇంకెవరి లోనూ లేదు'.

ఇదం హి దృష్ట్వా మతిమన్మహద్బలమ్
కపేః ప్రభావం చ పరాక్రమం చ|
త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం
కురుష్వ వేగం స్వబలానురూపమ్||10||
బలావమర్దస్త్వయి సన్నికృష్టే
యథాగతే శామ్యతి శాంతశత్రౌ|
తథా సమీక్ష్యాత్మబలం పరం చ
సమారభస్వ అస్త్రవిదాం వరిష్ఠ ||11||

స|| మతిమన్ త్వం కపేః ఇదం మహత్ బలం ప్రభావం చ పరాక్రమం చ ఆత్మనః సారం చాపి సమీక్ష్య స్వబలానురూపం వేగం కురుష్వ||అస్త్రవిదాం వరిష్ఠ త్వయి సన్నికృష్టే శాంతశత్రౌ గతే బలావమర్థః యథా శామ్యతి తథా ఆత్మబలం పరం చ సమీక్ష్య సమారభస్వ||

తా|| ' ఓ బుద్ధిమంతుడా ! నీవు ఆ కపి యొక్క మహత్తరమైన బలము, ప్రభావము, పరాక్రమము , నీ యొక్క బలము పరిగణించుకొని, నీ బలానుసారముగా పరివర్తించుము. అస్త్రవిద్యలలో వరిష్ఠుడా! అక్కడకి వెళ్ళి శత్రుబలము తెలిసికొని మనబలములకు నష్టముకాని రీతిలో యుద్ధము ఆరంభింపుము'.

న వీర సేనా గణశోచ్యవంతి
న వజ్ర మాదాయ విశాల్పసారమ్|
న మారుతస్యాస్య గతేః ప్రమాణమ్
న చాగ్నికల్పః కరణేన హంతుమ్||12||
తమేవ మర్థం ప్రసమీక్ష్య సమ్యక్
స్వకర్మసామ్యాద్ధి సమాహితాత్మా|
స్మరం శ్చ దివ్యం ధనుషోఽస్త్రవీర్యమ్
ప్రజాక్షతం కర్మ సమారభస్వ||13||

స|| వీర గణశః సేనాః చ్యవంతి న | విశాలసారం వ్రజం ఆదాయ న | అస్య గతేః మారుతస్య| న ప్రమాణం అగ్నికల్పః కరణేన హన్తుం న||తం ఏవం అర్థం సమ్యక్ ప్రసమీక్ష్య స్వకర్మ సామ్యాత్ సమాహితాత్మా ధనుషః దివ్యం అస్త్రవీర్యం స్మరం చ వ్రజ కర్మ అక్షతాం సమరభస్వ||

తా|| 'ఓ వీరుడా సేనాగణములు అనవసరము. వజ్రాయుధము కూడా అతని పై పనిచేయదు. అతడు మారుతివేగము కలవాడు. అతడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాంటివాడు. సాధారణమైన పద్దతులు వ్యర్థము. నేను చెప్పిన విషయములు బాగుగా అలోచించి ఆత్మస్థైర్యముతో ఏమి చేయవలెనో అలోచించుకొని దివ్యాస్త్రములను స్మరించి పోరాటమునకు ఉద్యమించుము'.

న ఖల్వియం మతిః శ్రేష్ఠా
యత్త్వాం సంప్రేషయామ్యహమ్|
ఇయం చ రాజధర్మాణాం
క్షత్రస్య చ మతిర్మతా||14||

నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారద్యమరిందమ|
అవశ్య మేవ యోద్ధవ్యం కామ్యశ్చ విజయో రణే||15|

స|| అహం త్వాం సమ్ప్రేషయామి ఇతి యత్ ఇయం మతిః శ్రేష్ఠా న ఖలు | ఇయం రాజధర్మణాం క్షత్రియస్య మతిః మతా||అరిందమ సంగ్రామే నానాశస్త్రేషు వైశారద్యం అవశ్యమేవ బోద్ధవ్యం | రణే విజయశ్చ కామ్యః | |

తా|| 'నేను నిన్ను పంపుచున్నాను అన్నమాట నాకు సముచితముగా కనపడుటలేదు. ఇది రాజధర్మము క్షత్రియుల ధర్మము. ఓ అరిందమ సంగ్రామములో అనేక శస్త్రముల ఉపయోగించురీతులు పూర్తిగా అవగాహనలో ఉండవలెను. రణములో విజయమే కోరతగినది కదా".

తతః పితుస్తద్వచనం నిశమ్య
ప్రదక్షిణం దక్షసుత ప్రభావః|
చకార భర్తార మదీనసత్త్వో
రణాయ వీరః ప్రతిపన్నబుద్ధిః||16||

తత స్తైః స్వగణైరిష్టైరింద్రజిత్ ప్రతిపూజితః|
యుద్దోద్దతః కృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత ||17||

శ్రీమాన్పద్మపలాశాక్షో రాక్షసాధిపతేః సుతః|
నిర్జగామ మహాతేజాః సముద్ర ఇవ పర్వసు||18||

స|| తతః దక్షసుతప్రభావః వీరః పితుః తత్ వచనం నిశమ్య అదీనసత్త్వః రణాయ ప్రతిపన్నబుద్ధిః భర్తారం ప్రదక్షిణం చకార || తతః యుద్ధోద్ధతః ఇంద్రజిత్ ఇష్టైః తైః స్వగణైః ప్రతిపూజితః కృతోత్సాహః సంగ్రామం ప్రతిపద్యత ||శ్రీమాన్ పద్మపలాశాక్షః మహాతేజాః రాక్షసాధిపతేః సుతః పర్వసు సముద్రః ఇవ నిర్జగామ||

తా|| పిమ్మట ఆ వీరుడు దక్షుని పుత్రునితో సమానమైన ప్రభావము కలవాడు అగు ఇంద్రజిత్తు ఆ వచనములను విని, భయములేని వాడై రణమునకు సిన్నద్ధుడై, తండ్రి కి ప్రదక్షిణము చేసెను. అప్పుడు యుద్ధమునకు తయారైన ఇంద్రజిత్తు, తనవారిచే పూజింపబడి ఉత్సాహము కలవాడై బయలు దేరెను. శ్రీమంతుడు పద్మరేకుల వంటి కళ్ళు గలవాడు మహాతేజము గలవాడు రాక్షసాధిపతి పుత్రుడు అగు ఇంద్రజిత్తు పర్వ దినములలో ఉండు సముద్రమువలె ఉప్పొంగుతూ యుద్ధమునకు వెడలెను.

స పక్షిరాజోపమతుల్యవేగైః
వ్యాళైశ్చతుర్భిః సితతీక్ష్ణదంష్ట్రైః|
రథం సమాయుక్త మసంగవేగం
సమారురోహేంద్రిజిదింద్ర కల్పః||19||
స రథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞోఽస్త్రవిదాం వరః|
రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్యత్ర సోఽభవత్||20||

స|| ఇంద్రకల్పః సః ఇంద్రజిత్ పక్షిరాజ ఉపమ తుల్యవగైః సితతీక్ష్ణదంష్ట్రైః చతుర్భిః వ్యాఘైః సమాయుక్తం అసహయవేగం రథం సమారురోహ||రథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః అస్త్రవిదాం వరః రథేన క్షిప్రం రథేన యత్ర హనుమాన్ అభవత్ శీఘ్రం అభియయౌ ||

తా|| ఇంద్రునివంటి ఆ ఇంద్రజిత్తు, గరుత్మంతునితో సమానమైన వేగము కల , వాడి అయిన కోరలుగల నాలుగు వ్యాఘ్రములచేత లాగబడిన రథమును ఎక్కెను. ఆ రథము ఎక్కి ధనస్సు ధరించిన శ్రేష్ఠుడు, శస్త్రవిద్యా పారంగతుడూ, అస్త్రవిధ్యలు నేర్చిన వారిలో శ్రేష్ఠుడు త్వరగా రథములో హనుమంతుడు ఎచట ఉండెనో అచటికి పోయెను.

స తస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ|
నిశమ్య హరివీరోఽసౌ సంప్రహృష్టతరోsభవత్||21||
సుమహచ్చాపమాదాయ శితశల్యాంశ్చ సాయకాన్|
హనుంమంత మభిప్రేత్య జగామ రణపణ్డితః||22||

స|| సః అసౌ హరివీరః తస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య సంప్రహృష్ఠతరః అభవత్ ||రణపండితః సుమహత్ చాపం శితశల్యాన్ సాయకాన్ ఆదాయ హనుమంతమ్ అభిప్రేత్య జగామ||

తా|| ఆ కపిప్రవరుడు అతని రథఘోషలను , ధనస్సులాగిన శబ్దములను విని మరింత సంతోషము కలవాడయ్యెను. రణములో పండితుడు వాడి అయిన శరములను మహత్తరమైన ధనస్సు తీసుకొని హనుమంతుని ఎదురుకొనుటకు సిద్ధపడెను.

తస్మింస్తతః సంయతి జాతహర్షే
రణాయ నిర్గచ్ఛతి బాణపాణౌ|
దిశశ్చ సర్వాః కలుషాబభూవుః
మృగాశ్చ రౌద్రా బహుదా వినేతుః||23||
సమాగతాః తత్ర తు నాగయక్షా
మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః|
నభః సమావృత్య చ పక్షి సంఘా
వినేదురుచ్చైః పరమ ప్రహృష్టాః||24||

స|| తతః సమ్యతి జాతహర్షేః తస్మిన్ చాపాణౌ రణాయ నిర్గచ్ఛతి సర్వాః దిశః కలుషాః బభూవుః | రౌద్రాః మృగాశ్చ బహుధా వినేదుః||తత్ర సమాగతాః నాగయక్షాః చక్రచరాః మహర్షయః సిద్ధాః చ నభః సమావృత్య పరమ ప్రహృష్టాః |పక్షి సంఘాశ్చ ఉచ్చైః వినేదుః||

తా|| సమరోత్సాహ జనిత సంతోషము కలవాడై ధనస్సు చేతిలో పట్టుకొని రణమునకు వెళ్ళగానే అన్ని దిశలు కలుషిత మయ్యెను. రౌద్రమైన మృగములు వికృతమైన స్వరముతో అరవసాగెను. అక్కడ చేరిన నాగులు యక్షులు మహర్షులు సిద్ధులు ఆకాశములో అమిత సంతోషముతో గుమిగూడిరి. పక్షి సంఘములుగట్టిగా అరవసాగినవి.

ఆయాంతం స రథం తూర్ణమింద్రజితం కపిః|
నిననాదమహానాదం వ్యవర్థత చ వేగవాన్||25||
ఇంద్రజిత్తు రథం దివ్యమాస్థితః చిత్రకార్ముకః|
ధనుర్విష్ఫారయామాస తటిదూర్జితనిస్స్వనమ్||26||
తతః సమేతావతి తీక్ష్ణవేగౌ
మహాబలౌ తౌ రణనిర్విశంకౌ|
కపిశ్చ రక్షోధి పతేశ్చ పుత్త్రః
సురాసురేంద్రావివ బద్ధవైరౌ||27||

స|| కపిః తూర్ణమ్ ఆయాంతం సరథం ఇంద్రజితం దృష్ట్వా మహానాదం విననాద| వేగవాన్ వ్యవర్ధత చ||ఇంద్రజిత్ తు దివ్యం రథం ఆస్థితః చిత్రకార్ముకః తటిదూర్జితనిఃస్వనమ్ ధనుః విష్ఫారయామాస||తతః అతితీక్ష్ణవేగౌ మహాబలౌ రణనిర్విశంకౌ తౌ కపిః చ రక్షోధిపతేః తనుశ్చ బద్ధవైరౌ సురాసురేంద్రావివ సమేతౌ||

తా|| ఆ వానరుడు రథములో వేగముగా వచ్చుచున్న ఇండ్రజిత్తుని చూచి పెద్ద నాదము చేసెను. త్వరగా తన కాయమును పెంచెను. ఆ దివ్యమైన రథముపై నున్న ఇంద్రజిత్తు కూడా తన అద్భుతమైన ధనస్సు చేతబట్టి ధనస్సుతో ధనుష్ఠంకారము చేసెను. అప్పుడు తీక్ష్ణవేగము కలవారు మహాబలులు అగు ఆ వానరుడు మరియు రాక్షసాధిపతి సుతుడు, బద్ధవైరులైన ఇంద్రుడు రాక్షసేంద్రులవలె రణమున పోరాడసాగిరి.

స తస్య వీరస్య మహారథస్య
ధనుష్మతః సంయతి సమ్మతస్య|
శర ప్రవేగం వ్యహనత్ప్రవృద్ధః
చచార మార్గే పితురప్రమేయే||28||
తతః శరానాయతతీ‍క్ష్ణశల్యాన్
సుపత్రిణః కాంచన చిత్ర పుంఖాన్|
ముమోచ వీరః పరవీరహంతా
సుసన్నతాన్ వజ్రనిపాతవేగాన్ ||29||
తతస్తు తత్ స్వ్యందననిస్స్వనం చ
మృదంగభేరీపటహాస్వనంచ|
నికృష్యమాణస్య చ కార్ముకస్య
నిశమ్య ఘోషం పునరుత్ప్రపాత||30||

స|| అప్రమేయః సః ప్రవృద్ధః మహారథస్య ధనుష్మతః సంయతి సమ్మతస్య తస్య వీరస్య శరప్రవేగం వ్యహనత్ | పితుః మార్గే చచార||తతః పరవీరహంతా వీరః ఆయతతీక్ష్ణశల్యాన్ సుపత్రిణః కాంచన చిత్రపుంఖాన్ సుసన్నతాన్ వజ్రనిపాతవేగాన్ శరాన్ ముమోచ|| తతః సః తస్య తత్ స్యందననిఃస్వనం చ మృదంగభేరీపటహస్వనం చ వికృష్యమానస్య కార్ముకస్య ఘోషం నిశమ్య పునః ఉత్పపాత||

తా|| అప్రమేయుడు తనశరీరము పెంచుకొనిన వాడు అయిన హనుమంతుడు మహారథుడు ధనస్సు ధరించిన వాడు ప్రయోగించిన శరపరంపరలను నిర్వీర్యము చేస్తూ, తన తండ్రి మార్గమైన ఆకాశములో తిరగసాగెను. అప్పుడు శత్రుసంహారకుడు వీరుడు పొడుగుగా వాడి అయిన రెక్కలుగల బంగారముతో చేయబడిన, కొంచెము వంగిన అగ్రభాగము కలవి, వజ్రపాతము వంటి వేగము కలవి అయిన బాణములను హనుమంతుని పై ప్రయోగించెను. అప్పుడు హనుమంతుడు రథము యొక్క ధ్వని్, మృదంగములు భేరిలు పటహముల ధ్వని, ఆ ఇంద్రజిత్తు ధనస్సుచెసిన ధ్వని, విని అకాశములో ఇంకా పైకి ఎగిరెను.

శరణామంతరేష్వాశు వ్యవర్తత మహాకపిః|
హరిః తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహమ్||31||
శరణామగ్రతస్తస్య పునస్సమభివర్తత
ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాతానిలాత్మజః||32||
తా వుభౌ వేగసంపన్నౌ రణకర్మ విశారదౌ|
సర్వభూతమనోగ్రాహి చక్రతుర్యుద్ధ ముత్తమమ్||33||

స|| మహాకపిః హరిః ఆశు అభిలక్షస్య తస్య లక్ష్యసంగ్రహం మోఘయన్ శరాణాం అంతరేషు వ్యవర్తత||అనిలాత్మజః హనుమాన్ తస్య శరాణాం అగ్రతః సమభివర్తత హస్తౌ ప్రసార్య ఉత్పపాత||తా వుభౌ రణకర్మ విశారదౌ వేగసంపన్నౌ సర్వభూతమనోగ్రాహి ఉత్తమం యుద్ధం చక్రతుః||

తా|| మహాకపి, లక్ష్యము ఛేదిస్తూ బాణ ప్రయోగములో నిష్ణాతుడైన ఇంద్రజిత్తుయొక్క లక్ష్యసంగ్రహమును వ్యర్థము చేస్తూ, అంతరిక్షములో తిరగసాగెను. మారుతాత్మజుడైన హనుమంతుడు అతని శరములకు అందకుండా ముందు సాగుతూ తన చేతులను చాచి పైకి ఎగిరిపోయెను. వారిద్దరూ రణకర్మలో విశారుదులు. వేగము కలవారు. వారు సమస్త భూతములకు మనస్సు హరించే విధముగా యుద్ధము చేయసాగిరి.

హనూమతో న వేద రాక్షసోఽన్తరమ్
నమారుతిః తస్య మహాత్మనోఽన్తరమ్ |
పరస్పరం నిర్విషహౌ బభూవతుః
సమేత్య తౌ దేవసమానవిక్రమౌ||34||
తతస్తు లక్ష్యే స విహన్యమానే
శరేష్వమోఘేషు చ సంపతత్సు|
జగామ చింతాం మహతీం మహాత్మా
సమాధి సంయోగ సమాహితాత్మా||35||
తతో మతిం రాక్షసరాజసూనుః
చకార తస్మిన్ హరివీరముఖ్యే|
అవధ్యతాం తస్య కపేః సమీక్ష్య
కథం నిగచ్ఛేదితి నిగ్రహార్థమ్||36||

స|| రాక్షసః హనూమతః అన్తరం న వేద | మారుతిః మహాత్మనః తస్య న | దేవసమానవిక్రమౌ తౌ సమేత్య పరస్పరం నిర్విషహౌ బభూవతుః || తతః లక్ష్యే విహన్యమానే అమోఘేషు శరేషు సంపతత్సు మహాత్మా సమాధిసంయోగసమాహితాత్మా సః మహతీం చింతం జగామ||తతః రాక్షసరాజసూనః తస్య కపేః అవధ్యతాం సమీక్ష్య నిగ్రహార్థం కథం నిగచ్ఛేత్ ఇతి తస్మిన్ హరిప్రవీరముఖ్యే మతిం చకార||

తా|| రాక్షసునకు హనుమంతుని అంతు తెలియుటలేదు. మారుతికి కూడా ఆ రాక్షసుని అంతు తెలియుటలేదు. దేవసమాన విక్రమము గల వారిద్దరూ ఒకరికొకరు లొంగకుండా యుద్ధము చేయసాగిరి. అప్పుడు లక్ష్యమును సంపాదించని ఆ శరపరంపరను ఎకాగ్రతో వదిలిన ఆ మహత్ముడు ఇంద్రజిత్తు అలోచనలో పడెను. అప్పుడు ఆ రాక్షసరాజు సుతుడు ఈ వానరుడు చంపబడడు అని నిశ్చయించుకొని ఇతనిని ఎట్లు బంధించవలెను అని ఆ వానరుని గురించి ఆలోచించెను.

తతః పైతామహం వీర స్సోఽస్త్రమస్త్రవిదాం వరః|
సందధే సుమహాతేజాః తం హరిప్రవరం ప్రతి||37||
అవధ్యోఽయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్త్వవిత్|
నిజగ్రాహ మహాబాహుః మారుతాత్మజమింద్రజిత్||38||
తేన బద్ధస్తతోఽస్త్రేణ రాక్షసేన స వానరః|
అభవన్నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే||39||

స|| తతః వీరః అస్త్రవిదాం వరః సుమహాతేజాః సః హరిప్రవీరం ప్రతి పైతామాహం అస్త్రం సందధే||అస్త్రతత్వవిత్ మహాబాహుః ఇంద్రజిత్ అవధ్యః ఇతి జ్ఞాత్వా తం మారుతాత్మజం అస్త్రేణ నిజగ్రాహ||తతః తేన రాక్షసేన అస్త్రేణ బద్ధః సః వానరః నిర్విచేష్టః అభవత్ | సః మహీతలే పపాత||

తా|| అప్పుడు వీరుడు అస్త్రప్రయోగములో విదుడు మహాతేజము కలవాడు అగు ఇంద్రజిత్తు ఆ వానరోత్తముని మీద పితామహుని బ్రహ్మాస్త్రము సంధించెను. ఆ అస్త్రముల తత్త్వము ఎరిగిన మహాబాహువులు కల ఇంద్రజిత్తు ఆ వానరుడు అవధ్యుడు అని గ్రహించి మారుతాత్మజుని ఆ అస్త్రముతో బంధించెను. అప్పుడు ఆ రాక్షసునిచేత ఆ అస్త్రముతో బంధింపబడి ఆ వానరుడు చేష్టలు లేని వాడయ్యెను. ఆ వానరుడు భూమిపై పడెను.

తతోఽథ బుద్ధ్వా స తదాస్త్రబంధం
ప్రభోః ప్రభావాత్ విగతాత్మవేగః|
పితామహానుగ్రహమాత్మనశ్చ
విచింతయామాస హరిప్రవీరః ||40||
తతః స్వాయంభువైర్మంత్రైః
బ్రహ్మాస్త్రమభిమంత్రితమ్|
హనుమాంశ్చింతయామాస
వరదానం పితామహత్||41||

స|| తతః అథ సః హరిప్రవీరః తత్ అస్త్రబంధం బుద్ధ్వా ప్రభోః విగతాత్మ వేగః ఆత్మనః పితమహానుగ్రహం విచింతయామాస||తతః హనుమాన్ స్వాయంభువైః మంత్రైః అభిమంత్రం బ్రహ్మాస్త్రం పితామహాత్ వరదానం చింతయామాస||

తా|| అప్పుడు ఆ వానరుడు ఆ బంధించిన అస్త్రము యొక్క ప్రభావము తెలిసికొని వేగము లేనివాడై తనలో బ్రహ్మదేవుడిచ్చిన అనుగ్రహము గురించి ఆలోచించసాగెను. అప్పుడు హనుమంతుడు స్వయంభూ యొక్క మంత్రముచే అభిమంత్రింఛబడిన బ్రహ్మాస్త్రము తనకు ఇచ్చిన వరదానము గుర్తుచేసుకొనెను.

నమేఽస్త్రబంధస్య చ శక్తిరస్తి
విమోక్షణే లోకగురోః ప్రభావాత్|
ఇత్యేవ మత్వా విహితోఽస్త్రబంధో
మయాఽఽత్మయోనేరసువర్తితవ్యః||42||

సవీర్యమస్త్రస్య కపిర్విచార్య
పితామహానుగ్రహమాత్మనశ్చ|
విమోక్ష శక్తిం పరిచింతయిత్వా
పితామహాజ్ఞామనువర్తతే స్మ||43||

స|| లోకగురోః ప్రభావాత్ అస్త్రబంధనస్య విమోక్షణే మే శక్తిః నాస్తి ఇతి ఏవం మత్వా ( ఇదం అస్రమ్) విహితః | ఆత్మయోనేః అస్త్రబంధః మయా అనువర్తితవ్యః|| స కపిః అస్త్రస్య వీర్యం విచార్య ఆత్మనః పితమహానుగ్రహం చ విమోక్షణశక్తిం పరిచింతయిత్వా పితామహ ఆజ్ఞాం అనువర్తతే స్మ||

తా|| 'లోకములగురువు ప్రభావమువలన కలిగిన అస్త్రబంధనము నుంచి విడివడగల శక్తి లేదని అని ప్రయోగింపబడిన ఈ అస్త్రమును నేను అనుసరించవలెను'. ఆ వానరుడు ఆ అస్త్రముయొక్క వీర్యమును గురించి విచారించు , తనకు విమోక్షణ శక్తిపై పితామహుని అనుగ్రహమును గుర్తుతెచ్చుకొని, పితామహుని అస్త్రమును అనుసరించుటకు నిశ్చయించుకొనెను.

అస్త్రేణాపి హి బద్ధస్య భయం మమ న జాయతే|
పితామహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ |||44|||
గ్రహణేచాపి రక్షోభిర్మహాన్మే గుణదర్శనః|
రాక్షసేంద్రేణ సంవాదః తస్మాత్ గృహ్ణంతు మాంపరే||45||

స|| అస్త్రేణాపి బద్ధస్య హి మమ భయం న జాయతే| పితామహేంద్రాభ్యాం అనిలేన చ రక్షితః స్యాత్||రక్షోభిః గ్రహణే చాపి మే మహత్ గుణదర్శనం రాక్షసేంద్రేణ సంవాదః ( భవేత్) | తస్మాత్ మామ్ పరే గృహ్ణంతు||

తా|| 'ఈ అస్త్రముచే బంధింపబడినప్పటికీ నాకు భయము లేకున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రుడు వాయుదేవులచే నేను రక్షింపబడుతున్నాను కాబోలు. రాక్షసులచేత బంధింపబడి రాక్షసేంద్రునితో మట్లాడు అవకాశము కలుగును. అందువలన వారు నన్ను బంధింతురుగాక"

స నిశ్చితార్థః పరవీరహంతా
సమీక్ష్యకారీ వినివృత్తచేష్టః|
పరైః ప్రసహ్యాభిగతైర్నిగృహ్య
ననాద తైః తైః పరిభర్త్యృమానః||46||

స|| పరవీరహంతా సమీక్ష్యకారీ సః నిశ్చితార్థః వినివృత్తచేష్టః ( అభవత్) | అభిగతైః తైః తైః పరైః ప్రసహ్య నిగృహ్య పరిభర్త్సమానః ననాద||

తా|| శత్రువులను హతమార్చగలవాడు, కార్యములను సమీక్షించి కార్యములను చేయువాడు, నిశ్చయము చేసికొనినవాడై, చేష్టలు ఏమీ లేకుండా ఉండెను. రాక్షసులు దగ్గరకు వచ్చి బంధించి భయపెడుతూ ఉంటే ఆ హనుమంతుడు బిగ్గరగా నాదము చేసెను.

తతః తం రాక్షాసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమమ్|
బబంధుః శణవల్కైశ్చ ద్రుమచీరైశ్చ సంహతైః||47||

స|| తతః రాక్షసాః అరిందమమ్ తం నిర్విచేష్టమ్ దృష్ట్వా శణవల్కైశ్చ సంహతైః ద్రుమచీరైశ్చ బబంధు||

తా|| అప్పుడు శత్రువులను నాశనము చేయగల ఆ హనుమంతుడు చేష్టలు లేకుండా వుండుట చూచి ఆ రాక్షసులు హనుమంతుని నారచీరలతో తాళ్లతో మరల బంధించిరి.

స రోచయామాస పరైశ్చబంధనమ్
ప్రసహ్యవీరైరభినిగ్రహం చ|
కౌతుహలాన్మాం యది రాక్షసేంద్రో
ద్రష్టుంవ్యవస్యేదితి నిశ్చితార్థః||48||

స|| రాక్షసేంద్రః మామ్ కౌతుహలాత్ ద్రష్టుం వ్యవస్యేద్యపి ఇతి నిశ్చితార్థః సః పరైః బంధనం వీరైః ప్రసహ్య అభినిగ్రహం చ రోచయామాస||

తా|| ఆ రాక్షసేంద్రుడు కుతూహలముకొలదీ నన్ను చూచుటకు వచ్చును అని తలచి, నిశ్చయమైన మనస్సు కలవాడై తనను బంధించుచున్ననూ ఏమీ చేయక ఊరకుండా ఉండెను.

స బద్ధస్తేన వల్కేన విముక్తోఽస్త్రేణ వీర్యవాన్|
అస్త్రబంధః స చాన్యాం హి న బంధమనువర్తతే||49||

అథేన్ద్రజిత్తు ద్రుమచీరబద్ధం
విచర్యవీరః కపిసత్తమం తమ్|
విముక్త మస్త్రేణ జగామ చింతామ్
నాన్యేన బద్ధో హ్యనువర్తతేఽస్త్రమ్||50||

అహో మహత్కార్య కృతం నిరర్థకం
న రాక్షసైర్మంత్రగతిర్విమృష్ఠా|
పునశ్చ నాస్త్రే విహతేఽస్త్రమన్యత్
ప్రవర్తతే సంశయితాః స్మ సర్వే||51||

స|| తేన వల్కేన బద్ధః వీర్యవాన్ సః అస్త్రేణ విముక్తః | సః అస్త్రబంధః అన్యం బంధం న అనువర్తతే హి||అథ వీరః ఇంద్రజిత్ ద్రుమచీరబద్ధం తం కపిసత్తమం అస్త్రేణ విముక్తం విచార్య చింతాం జగామ | బద్ధః అస్త్రం న అనువర్తతే హి||అహో మహత్ కర్మ నిరర్థకం కృతం | రాక్షసైః మంత్రగతిః న విమృష్టాః | మంత్రే విహతే అన్యత్ అస్త్రం న ప్రవర్తతే | సర్వే సంశయితాః స్మ||

తా|| ఆ వల్కలములచేత బంధింపబడిన ఆ వీరుడు ఆ బ్రహ్మాస్త్రమునుండి విడివడెను. ఆ అస్త్రబంధము ఇంకొక బంధనముఉన్నచో తన బంధము విడి పెట్టును. అప్పుడు ఆ వీరుడు ఇంద్రజిత్తు తాళ్లతో కట్టబడి బ్రహ్మాస్త్రమునుండి విడుదలపొందిన వానరుని చూచి ఆలోచనలో పడెను. 'ఇతర బంధనములు ఉన్నచో బ్రహ్మాస్త్రము బంధించదు. అయ్యో మహత్తరమైన కర్మ నిరర్ధకమైనది. ఈ రాక్షసులకు మంత్రవిధానము తెలియదు. మంత్రమునుంచి విడుదలపొందినచో మరియే మంత్రము పనిచేయదు. అన్నీ సంశయావస్థలో పడినవి కదా'.

అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానమవబుధ్యత|
కృష్యమాణస్తు రక్షోభిః తైశ్చ బంధైర్నిపీడితః||52||

హన్యమానః తతః క్రూరై రాక్షసైః కాష్టముష్టిభిః|
సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత స వానరః||53||

స|| హనుమాన్ ఆత్మానం అస్త్రేణ ముక్తః న అవబుధ్యత | తైః రక్షోభిః కృష్యమాణః బంధైః నిపీడితః ఆత్మానం న అవబుధ్యత|| తతః సః వానరః కౄరైః రాక్షసైః కాష్ఠముష్టిభిః హన్యమానః రాక్షసేంద్రస్య సమీపం ప్రాకృష్యత||

తా|| హనుమంతుడు తను బ్రహ్మాస్త్రమునుండి విడివడెను అని తెలిసికొనలేదు. ఆ రాక్షసులచేత బంధింపబడినవాడై, బంధములతో బాధింపబడినప్పటికీ అలాగే ఉండిపోయెను. అప్పుడు ఆ వానరుడు కౄరులైన ఆ రాక్షసులచేత పిడికలతో పీడింపబడి కర్రలతో కొట్టబడి రాక్షసేంద్రుని సమీపమునకు తీసుకుపోబడెను.

అథేంద్రజిత్తం ప్రసమీక్ష్యముక్తం
అస్త్రేణ బద్ధం ద్రుమచీరసూత్రైః|
వ్యదర్శయత్తత్ర మహాబలమ్ తం
హరిప్రవీరం సగణాయ రాజ్ఞే||54||

స|| అథ ద్రుమచీరసూత్రైః బద్ధం తం అస్త్రేణ ముక్తం ప్రసమీక్ష్య ఇంద్రజిత్ మహాబలం తం హరిప్రవీరం తత్ర సగణాయ రాజ్ఞే న్యదర్శయత్||

తా|| ఆ విధముగా తాళ్లతో కట్టబడిన, ఆ బ్రహ్మాస్త్రమునుండి విడుదల అయిన వానిని చూచి, మహాబలుడైన ఇంద్రజిత్తు ఆ వానరోత్తముని రాజునకు రాక్షసగణములకు చూపించెను.

తం మత్తమివ మాతంగ బద్ధం కపివరోత్తమమ్|
రాక్షసా రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్||55||
కోఽయం కస్య కుతోవాఽత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః|
ఇతి రాక్షసవీరాణాం తత్ర సంజజ్ఞిరే కథాః||56||
హన్యతాం దహ్యతాం వాఽపి భక్ష్యతామితి చాపరే|
రాక్షసాః తత్ర సంక్రుద్ధాః పరస్పర మథాsబ్రువన్||57||

స|| మత్తం మాతంగం ఇవ బద్ధం కపివరోత్తమం తం రాక్షసః రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయత్||కః అయం| కస్య కుతః వా అత్ర| కిం కార్యం | కః వ్యపాశ్రయః| ఇతి రాక్షవీరాణాం కథాః సంజిజ్ఞిరే||అథ అపరే రాక్షసాః సంకృద్ధాః హన్యతామ్ దహ్యతాం చాపి భక్ష్యతాం ఇతి పరస్పరం అబ్రువన్ ||

తా|| మదించిన మాతంగము వలె బంధింపబడిన వానరోత్తముని ఆ రాక్షసుడు రాక్షసాధిపతి అగు రావణునికి సమర్పించిరి. 'ఇతడు ఎవడు? ఎవరివాడు? ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చిన వాడు? ఏ కార్యము కొరకు? ఇతడి వెనక ఎవరున్నారు', అని రాక్షస వీరులు తమలో తాము అనుకొనిరి. ఇంకా కొంతమంది రాక్షసులు కోపోద్రిక్తులై ఇతనిని 'హతమార్చండి', 'దహనము చేయండి', 'భక్షించండి' అని ఒకరికొకరు చెప్పుకొనసాగిరి,

అతీత్య మార్గం సహసా మహాత్మా
స తత్ర రక్షోsధిపపాదమూలే|
దదర్శ రాజ్ఞః పరిచారవృద్దాన్
గృహం మహారత్న విభూషితం చ||58||

స|| మహాత్మా సః సహసా మార్గం అతీత్య తత్ర రాజ్ఞః మహారత్నవిభూషితం గృహం రక్షోధిపపాదమూలే పరిచారవృద్ధాన్ దదర్శ||

తా|| అ మహాత్ముడు తొందరగా రాజమార్గమును దాటి ఆ రాజుయొక్క మహారత్నములతో అలంకరింపబడిన రాజగృహమును, రాక్షసాధిపుని పాదములవద్ద ఆసీనులైన వృద్ధపరిచారకులను చూచెను.

స దదర్శ మహాతేజా రావణః కపిసత్తమమ్|
రక్షోభిర్వికృతాకారైః కృష్యమాణ మితస్తతః||59||
రాక్షసాధిపతిం చాపి దదర్శ కపిసత్తమః|
తేజోబలసమాయుక్తం తపంతమివ భాస్కరమ్||60||

స|| మహతేజాః సః రావణః వికృతాకారైః రక్షోభిః ఇతః తతః కృష్యమానం కపిసత్తమం దదర్శ||కపిసత్తమః చ తేజోబలసమాయుక్తం తపంతం భాస్కరం ఇవ రాక్షసాధిపతిం దదర్శ||

తా|| మహాతేజము గల ఆ రావణుడు వికృతాకారముకల రాక్షసులచేత అక్కడికి తీసుకు రాబడిన కపిసత్తముని చూచెను. ఆ వానరోత్తముడు కూడా తేజో బలములతో భాస్కరుని వలె విరాజిల్లు చున్న రాక్షసాధిపతిని చూచెను.

సరోషసంవర్తిత తామ్రదృష్టిః
దశాననః తం కపిమన్వవేక్ష్య|
అథోపవిష్యాన్ కులశీలవృద్ధాన్
సమాదిశత్తం ప్రతిమంత్రిముఖ్యాన్||61||

యథాక్రమం తైః స కపిర్విపృష్టః
కార్యార్థమర్థస్య చ మూలమాదౌ|
నివేదయామాస హరీశ్వరస్య
దూతః సకాశాత్ అహమాగతోఽస్మి||62||

స|| సః దశాననః రోషసంవర్తితతామ్రదృష్టిః తం కపిం అన్వేక్ష్య అథ ఉపవిష్టాన్ కులశీలబద్ధాన్ మంత్రిముఖ్యాన్ తంప్రతి సమాదిశత్ ||తైః యథాక్రమం కార్యార్థం అర్ధస్య మూలం విపృష్టః సః కపిః హరీశ్వరస్య సకాశాత్ ఆగతః అస్మి ఇతి నివేదయామాస||

తా|| అ దశాననుడు రోషముతో ఎఱ్ఱబడిన కళ్ళుగలవాడై ఆ కపిని చూచి , ఉపావిశులైన అనుభవశీలులైన మంత్రిముఖ్యులను ఆ వానరుని గురించి అడిగెను. వారిచేత యథాక్రమముగా వచ్చినకార్యము దాని మూలము గురించి అడగబడగా ఆవానరుడు " కపిరాజు యొక్క కార్యము వలన వచ్చిన వాడను " అని పలికెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టచత్త్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఎనిమిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||