||సుందరకాండ ||

||అరువది ఒకటవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 61 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకషష్టితమస్సర్గః||

శ్లో|| తతో జామ్బవతో వాక్యమగృహ్ణన్త వనౌకసః|
అఙ్గదప్రముఖా వీరా హనుమాంశ్చ మహాకపిః||1||

స|| తతః అంగదప్రముఖాః వనౌకసః మహాకపిః హనుమంతశ్చజాంబవతః వాక్యం అగృహ్ణంత||

తా|| అప్పుడు అంగదుడు మహాకపి హనుమంతుడు తదితర వానర ప్రముఖులు జాంబవంతుని మాటలను అంగీకరించిరి.

శ్లో|| ప్రీతిమన్తః తతః సర్వే వాయుపుత్త్ర పురస్సరాః|
మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువుః ప్లవగర్షభాః||2||
మేరుమందరసంకాశా మత్తా ఇవ మహాగజాః|
ఛాదయన్త ఇవాకాశం మహాకాయా మహాబలాః||3||

స|| తతః సర్వే ప్లవగర్షభాః ప్రీతిమన్తః మహేంద్రాద్రిం పరిత్యజ్య వాయుపుత్త్ర పురస్సరాః పుప్లువుః|| (తే) మేరుమందరసంకాశాః మత్తాః మహాగజాః ఇవ ఆకాశం ఛాదయంతః ఇవ మహాబలాః మహాకాయా ( పుప్లువుః)

తా|| అప్పుడు వానరులందరూ సంతుష్ఠ హృదయులై , మహేంద్ర పర్వతము వదిలి, వాయుపుత్రుని ముందుగా వుంచుకోని ఆకాశములోకి ఎగిరిరి. వారు మేరు మందర పర్వతముల వలెనున్నవారు, మహాకాయము గలవారు. మదించిన ఏనుగులవలె నున్నవారు మహాబలురు ఆకాశమునంతా కప్పివేయుచున్నట్లు ఉన్నవారు.

శ్లో|| సభాజ్యమానం భూతైః తం ఆత్మవంతం మహాబలమ్|
హనూమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభిః||4||
రాఘవేచార్థనిర్వృత్తిం కర్తుం చ పరమం యశః|
సమాదాయ సమృద్ధార్థాః కర్మసిద్ధిభిరున్నతాః||5||
ప్రియాఖ్యానోన్ముఖాః సర్వే సర్వే యుద్ధాభినందినః|
సర్వే రామప్రతీకారే నిశ్చితార్ధా మనస్వినః||6||

స|| (తే) భూతైః సభాజ్యమానం ఆత్మవంతం మహాబలమ్ హనూమంతం మహావేగం వహంత ఇవ దృష్టిభిః || (తే) సమృద్ధార్థాః , కర్మసిద్ధిభిః రాఘవే చ అర్థనిర్వవృత్తిం పరమం యశం కర్తుం సమాధాయ , ఉన్నతాః || సర్వే ప్రియాఖ్యానోన్ముఖాః సర్వే యుద్ధాభినందినః సర్వే మనస్వినః సర్వే నిశ్చితార్థః ||

తా|| వారు సకల భూతములచే గౌరవంపబడి మహావేగముతో పోవుచున్న , ఆత్మబలముకల హనుమంతుని ( అతి గౌరవముతో ) రెప్పవేయకుండా చూస్తూ పోసాగిరి. వారు కృతార్థులై, రామకార్యనిరతులై పరమ యశస్సు పొందుటకు కోరిక కలవారై (ముందుకు) పోసాగిరి. అందరూ రామునికి వార్త తెలియచేయుటకు తహ తహలాడుతున్నవారు. అందరూ రణోత్సాహముతో న్నవారు. అందరూ మనస్సులో రామకార్యసిద్ధికి కట్టబడి యున్నవారు.

శ్లో|| ప్లవమానాః ఖమాప్లుత్య తతస్తే కాననౌకసః|
నందనోపమమాసేదుర్వనం ద్రుమలతాయుతమ్||7||
యత్తన్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితమ్|
అధృష్యం సర్వభూతానాం సర్వభూతమనోహరమ్||8||

స|| తతః తే కాననౌకసః ఖం ఆప్లుత్య ప్లవమానాః ద్రుమలయతాయుతం నన్దనోపమమ్ వనం ఆసేదుః|| అధృష్యం సర్వభూతానాం అభిరక్షితం సర్వభూత మనోహరం యత్ సుగ్రీవస్య మధువనం నామ తత్||

తా|| అప్పుడు ఆ వానరులు ఆకాశములో ఎగురుతూ, అనేక చెట్లతో లతలతో కూడియున్న, నందనవనము లాగ వున్న, వనము చూచితిరి. ప్రవేశింప సాధ్యము కాని, అందరినుంచి రక్షింపబడిన, అందరికి ఆహ్లాదకరమైన ఆ సుగ్రీవుని వనము, మధువనము అని పేరు గలది.

శ్లో|| యద్రక్షతి మహావీర్యః సదా దదిముఖః కపిః|
మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః||9||
తే త ద్వన ముపాగమ్య బభూవుః పరమోత్కటాః|
వానరా వానరేన్ద్రస్య మనః కాంతతమం మహత్||10||

స|| మహాత్మనః కపిముఖ్యస్య సుగ్రీవస్య మాతులః మహావీర్యః దధిముఖః కపిః యత్ సదా రక్షతి || తే వానరాః వానరేన్ద్రస్య మనః క్లాంతతమం మహత్ తత్ వనం ఉపాగమ్య పరమోత్కటాః బభూవుః ||

తా|| ( ఆ మధువనము) మహాత్ముడు వానరాధిపతి సుగ్రీవునియొక్క మామ , మహావీరుడు దధిముఖుడను వానరునిచే ఎల్లవేళలా రక్షింప బడుతూవున్నది. ఆ వానరులు అందరూ ఆ వానరాధిపతికి మనసోల్లాసము కలిగించు, ఆ మహత్తరమైన వనము సమీపించి మధువును త్రాగవలెనని కటకటలాడిపోయారు.

శ్లో|| తతస్తే వానరా హృష్టా దృష్ట్వా మధువనం మహత్|
కుమారం అభ్యయాచంత మధూని మధుపిఙ్గళాః||11||
తతః కుమారస్తాన్ వృద్ధాన్ జాంబవత్ప్రముఖాన్ కపీన్|
అనుమాన్య దదౌ తేషాం విసర్గం మధుభక్షణే||12||

స|| తతః మధుపిఙ్గళాః తే వానరాః మహత్ మధువనం దృష్ట్వా హృష్టాః కుమారం మధూని అభ్యయాచంత||తతః కుమారః వృద్ధాన్ తాన్ జామ్బవత ప్రముఖాన్ కపీన్ అనుమాన్య తేషాం మధు భక్షణే నిసర్గం దదౌ||

తా|| అప్పుడు ఆ మధువు బోలిన పింగళ వర్ణము కల ఆ వానరులు, ఆ మహత్తరమైన మధువనము చూచి సంతోషపడి, ఆ మధువు కోసము అంగదకుమారుని అభ్యర్థించిరి. అప్పుడు అంగదకుమారుడు జంబవదాది ప్రముఖులను సంప్రదించి మధుభక్షణకై వానరులకు అనుమతి ఇచ్చెను.

శ్లో|| తతశ్చానుమతాః సర్వే సంప్రహృష్టా వనౌకసః|
ముదితాః ప్రేరితాశ్చాపి ప్రనృత్యన్తోఽభవం స్తతః||13||

స|| తతః సర్వే వనౌకసః అనుమతాః సమ్ప్రహృష్టాః తదా ప్రేరితాః ముదితాః ప్రనృత్యంతః అభవన్ ||

తా|| అప్పుడు ఆ వానరులందరూ ఆ విధముగా అనుమతింపబడినవారై , అత్యధిక సంతోషముతో ప్రేరేపింపబడిన వారై నృత్యము చేయ సాగిరి.

శ్లో|| గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్
నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్|
పతంతి కేచిత్ విచరంతి కేచిత్
ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్||14||
పరస్పరం కేచిదుపాశ్రయంతే
పరస్పరం కేచిదుపాక్రమంతే|
పరస్పరం కేచిదుపబ్రువంతే
పరస్పరం కేచిదుపారమంతే||15||

స|| కేచిత్ గాయన్తి|కేచిత్ ప్రణమంతి|కేచిత్ నృత్యన్తి | కేచిత్ ప్రహసన్తి| కేచిత్ పతన్తి | కేచిత్ పతన్తి| కేచిత్ విచరన్తి| కేచిత్ ప్లవన్తి|కేచిత్ ప్రలపన్తి|| కేచిత్ పరస్పరం ఉపాశ్రయన్తే| కేచిత్ పరస్పరం ఉపాక్రమంతి| కేచిత్ పరస్పరం ఉపబ్రువంతి|| కేశిత్ పరస్పరం ఉపారమంతే|| కొందరు ఒకరినొకరితో ఆడుకొనుచున్నారు.

తా|| కొందరూ గానము చేయుచుండిరి . కోందరు వంగి నమస్కారములు పెట్టుచుండిరి. కొందరు నృత్యము చేయుచుండిరి . కొందరు నవ్వుచుండిరి, కొందరు క్రింద పడుచుండిరి. కొందరు అటూ ఇటూ పచార్లు చేయుచుండిరి. కొందరు ఎగిరి గంతులు వేయుచుండిరి. కొందరు ప్రలాపనలు చేయుచుండిరి. కొందరు ఒకరినొకరితో కలిసి తిరుగుచుండిరి. కొందరు ఒకరినొకరిపై ఎక్కుచుండిరి. కొందరు ఒకరినొకరితో మాట్లాడుచుండిరి.

శ్లో|| ద్రుమాద్ద్రుమం కేచిదభిద్రవంతే
క్షితౌనగాగ్రాన్ నిపతంతి కేచిత్|
మహీతలా కేచిదుదీర్ణవేగా
మహాద్రుమాగ్రాణ్యభిసంపతంతి ||16||
గాయంతమన్యః ప్రహసన్నుపైతి
హసంతమన్యః ప్రరుదన్నుపైతి|
రుదంత మన్యః ప్రణుదన్నుపైతి
నుదంతమన్యః ప్రణదన్నుపైతి||17||

స|| కేచిత్ ద్రుమాత్ ద్రుమం అభిద్రవన్తే | కేచిత్ క్షితౌ నగాగ్రాత్ నిపతన్తి | ఉదీర్ణవేగాః మహీతలాత్ మహాద్రుమాగ్రాణి అభిసంపతన్తి ||గాయన్తం అన్యః ప్రహసన్ ఉపైతి| హసన్తం అన్యః ప్రరుదన్ ఉపైతి| రుదంతం అన్యః ప్రణుదన్ ఉపైతి || నుదన్తం అన్యః ప్రణదన్ ఉపైతి||

తా|| అందులో కొందరు ఒక చెట్టునుంచి ఇంకొక చెట్టుపైకి ఎగురుచున్నవారు. కొందరూ విరిగిన కొమ్మలమీదనుంచి దూకుచూ ఉన్నారు. కొందరు మహవేగముతో మహీతలము నుండి మహా వృక్షముల చివరి కొమ్మలపై ఎగురుచున్నవారు. ఇంకొందరు గానము చేయుచున్నవారు. మరికొందరు నవ్వుతూ వారివద్దకు పోవుచున్నవారు. ఆ నవ్వుతున్నవాని వద్దకు ఏడుస్తూ వున్న ఇంకొకడు వెళ్ళుతున్నాడు. ఏడుస్తూ వున్నవాడిని ఇంకొకడు తోస్తున్నాడు. తోసేస్తున్నవాడి దగ్గరకు ఇంకొకడు అరుస్తూ పోయెను.

శ్లో|| సమాకులం తత్కపి సైన్యమాసీన్
మధుప్రపానోత్కట సత్త్వచేష్టం |
న చాత్రకశ్చన్నభభూవ మత్తో
న చాత్ర కశ్చిన్నబభూవ తృప్తః||18||
తతో వనం తత్పరిభక్ష్యమాణమ్
ద్రుమాంశ్చ విధ్వంసితపత్త్రపుష్పాన్|
సమీక్ష్య కోపాద్దధివక్త్రనామా
నివారయామాస కపిః కపీంస్తాన్||19||

స|| మధుప్రసానోత్కట సత్త్వచేష్టం తత్ కపిసైన్యం సమాకులం ఆసీత్ | అత్ర కశ్చిత్ మత్తః న బభూవ|ఇతి న | అత్ర కశ్చిత్ తృప్తః న బభూవ ఇతి న|| తతః దధివక్త్రనామా కపిః తత్ వనం విధ్వంసితపత్రపుష్పాన్ ద్రుమాంశ్చ సమీక్ష్య కోపాత్ పరిభక్ష్యమాణమ్ తాన్ కపీన్ నివారయామాస||

తా|| మధుపానముతో అనేక విధములైన చేష్టలు చేయుచున్నవారితో, ఆ వానర సైన్యము నిండిపోయినది. అచట మధువు తో మత్తెక్కని వాడుగాని, మధువుతో తృప్తి చెందని వాడుగాని ఒక్కడు లేడు. అప్పుడు దధి ముఖుడని పేరుగల వానరుడు ఆ ధ్వంసము చేయబడిన వృక్షములను పత్రపుష్పములను చూచి ఆ మధువును తాగుచున్న వానరులని నివారింపసాగెను.

శ్లో|| సతైః ప్రవృద్ధైః పరిభర్త్స్యమానో
వనస్య గోప్తా హరివీరవృద్ధః|
చకార భూయో మతి ముగ్రతేజా
వనస్య రక్షాం ప్రతి వానరేభ్యః||20||
ఉవాచకాంశ్చిత్పరుషాణి ధృష్ట
మసక్తమన్యాంశ్చ తలైర్జఘాన|
సమేత్యకైశ్చిత్ కలహం చకార
తథైవ సామ్నోపజగామ కాంశ్చిత్||21||

స|| ప్రవృద్ధైః తైః పరిభర్త్స్యమానః వనస్య గోప్తా హరివీర వృద్ధః ఉగ్రతేజాః వానరేభ్యః వనస్య రక్షాం ప్రతి భూయః మతిం చకార||కాంశ్చిత్ పరుషాణి ఉవాచ| అన్యాంశ్చ అసక్తం | తలైః ధృష్టం జఘాన| కేచిత్ సమేత్య | కేచిత్ కలహం చకార| తహైవ కాంస్చిత్ సామ్నా ఉపజగామ||

తా|| మితిమీరి ప్రవర్తిస్తున్న వారిచేత నిర్లక్ష్యము చేయబడిన ఆ వనరక్షకుడు అగు వృద్ధవానరుడు, ఆ ఉగ్రతేజములో ఉన్న వానరులనుంచి, ఆ వనము రక్షించుటకు ఇతర మార్గములగురించి అలోచించసాగెను. కొందరికి పురుషవాక్యములతో చెప్పెను. కొందరిని ఏమీ అనలేదు. కొందరిని అరచేతులతో కొట్టెను. కొందరితో తగువులాడెను. కొందరితో సామోపాయము ఉపయోగించెను

శ్లో|| సతైర్మదాత్ సంపరివార్య వాక్యైః
బలాచ్చ తేన ప్రతివార్యమాణైః|
ప్రధర్షితః త్యక్తభయైః సమేత్య
ప్రకృష్యతే చా ప్యనవేక్ష్య దోషమ్||22||
నఖైస్తుదంతో దశనైర్దశంతః
తలైశ్చ పాదైశ్చ సమాపయంతః|
మదాత్కపిం కపయః సమగ్రా
మహావనం నిర్విషయం చ చక్రుః||23||

స|| తః మదాత్ అప్రతివార్య వాక్యైః తేన బలాత్ ప్రతివార్యమాణైః త్యక్త భయైః తైః ప్రధర్షితః| సః దోషం చ అనవేక్ష్య సమ్యే ప్రకృష్యతే చ||సమగ్రాః కపయః మదాత్ నఖైః తుదన్తః | దశనైః దసన్తః| తలైశ్చ పాదైశ్చ తం కపిం సమాపయన్తః | (తే సర్వే) మహావనం నిర్విషయం చకృః||

తా|| వారు మదముతో, ప్రతిఘటించు వాక్యములతోనూ తమ బలము ప్రకటించుచూ భయము లేని వారై అతని పై అనుచితముగా ప్రవర్తించిరి . తమ తప్పును చూడకుండా ఆ వానరులందరూ అతనిని ప్రతిఘటించిరి. ఆ వానరులందరూ గోళ్లతో రక్కిరి. దంతములతో కొరికిరి. చేతులతోనూ కాళ్ళతోనూ ఆ వానరును ఎదురుకొనిరి. ఆ వానరులందరూ ఆ వనమును ధ్వంసము చేసిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకషష్టితమస్సర్గః ||

ఈ విధముగా శ్రీమ ద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఒకటవ సర్గ సమాప్తము

|| ఓం తత్ సత్||