||సుందరకాండ ||

||ఎనిమిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 8 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టమస్సర్గః

స తస్య మధ్యే భవనస్య సంస్థితమ్ మహద్విమానం మణివజ్రచిత్రితమ్|
ప్రతప్త జంబూనదజాలకృత్రిమమ్ దదర్శ వీరః పవనాత్మజః కపిః||1||

స|| వీరః పవనాత్మజః కపిః భవనస్య తస్య మధ్యే సంస్థితంమహత్ విమానం దదర్శ| తత్ విమానం మణివజ్రచిత్రితం జమ్బూనదజాలకృత్రిమమ్ అపి (అస్తి)|

ఆ పవనాత్మజుడు వీరుడు ఆ భవనముఅ సముదాయములో మధ్యలో మణులు వజ్రములతో అలంకరింపబడిన బంగారముతో చేయబడిన జాలలతో గల గవాక్షములు కల ఒక మహత్తరమైన విమానమును చూచెను.

తదప్రమేయాప్రతికారకృత్రిమమ్ కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా|
దివం గతం వాయుపథప్రతిష్టితమ్ వ్యరాజతాssదిత్య పథస్య లక్ష్మవత్|| 2||

స|| తత్ అప్రమేయ అప్రతీకారకృత్రిమమ్ (విమానం ) స్వయం విశ్వకర్మణా సాధు కృతం ఇతి |(తత్ విమానం) దివం గతం వాయు పథే ప్రతిష్ఠితమ్ ఆదిత్య పథస్య లక్ష్మవత్ వ్యరాజత||

అ అప్రమేయమైన తిరుగులేనిది వున్న స్వయముగా విశ్వకర్మ చేత నిర్మింపబడిన విమానము దివిలోకమునకు పోవు ఆకాశమార్గము లో సూర్యమార్గమునకు చ్నముగా ప్రకాశిస్తున్నది.

నతత్ర కించి న్నకృతం ప్రయత్నతో న తత్రకించిన్న మహార్హరత్నవత్|
న తే విశేషా నియతా స్సురేష్వపి న తత్ర కించిన్న మహావిశేషవత్|| 3||

స|| తత్ర కించిదపి ప్రయత్నతః న కృతం నాస్తి| తత్ర న మహర్హరత్నవత్ కించిదపి నాస్తి| తే విశేషాః సురేష్వపి న నియతాః | తత్ర న మహావిశేషవత్ కించ్దపి నాస్తి|

ఆ విమానములో విశేషప్రయత్నము లేకుండా చేయబడినది లేదు. అక్కడ మహత్తరమైన రత్నములతో చేయబడనిది లేదు. అందులో ఉన్న విశేషములు సురులోకములో ఉన్నాయని చెప్పలేము. ఆ విమానములో మహత్తరముగా విశేషము కానిది ఏది లేదు.

తపస్సమాధానపరాక్రమార్జితమ్ మనస్సమాధానవిచారచారిణమ్|
అనేకసంస్థాన విశేషనిర్మితమ్ తతస్తతస్తుల్య విశేషదర్శనమ్|| 4||

స|| తత్ విమానం తపః సమాధానపరాక్రమార్జితమ్| తత్ విమానం మనః సమాధానవిచార చారిణమ్| తత్ విమానం అనేక సంస్థాన విశేషనిర్మితమ్ | తతః తతః తుల్యవిశేష దర్శనమ్||

ఆ విమానము తపశ్శక్తి తోనూ పరాక్రమము తోను అర్జించు కున్నది. ఆ విమానము మనస్సులోనున్న కోరికలకి సమాధానముగా పోవును.అ విమానము అనేకమైన విశేషమైన భాగములతో నిర్మితమైనది. అక్కడక్కడ విశేషములతో దర్శనీయముగా నున్నది.

మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం|
మహాత్మనాం పుణ్యకృతాం మహర్ధినాంయశస్వినా అగ్ర్యముదామివాలయం||5||

మనస్సులో ఉన్న ఊహలకు సమాధానమై సీఘ్రముగా పోగల, వాయువేగముతో సమనావేగముతో పోగల,ఆ విమానము మహాత్ములు పుణ్యాత్ములు తేజస్విలు మహదానందభరితులు వుండు ఆలయములా వున్నది

విశేషమాలాంబ్య విశేషసంస్థితమ్ విచిత్రకూటం బహుకూటమండితమ్|
మనోభిరామం శరదిందు నిర్మలమ్ విచిత్రకూటం శిఖరం గిరేర్యథా ||6||

స|| తత్ విమానం విశేషం ఆలంబ్యవిశేష సంస్థితం| తత్ విమానం విచిత్రకూటం బహుకూటమండితమ్ అస్తి| నిర్మలం శరద్ ఇన్దు ఇవ మనోభిరామం| గిరే శిఖరం యథా విచిత్రకూటం (అపి అస్తి)|

ఆ విమానము విశిష్టమైన్ రీతిలో విశేషములతో నిర్మించబడినది.ఆ విమానములో విచిత్రమైన శిఖరాలతో కూటములో నిండియున్నది. శరత్కాలపు చంద్రునిలాగా మనస్సును ఆకర్షిస్తూఉన్నది. విచిత్రమైన కూటములు శిఖరములు కల పర్వతములా ఉన్నది.

వహంతి యం కుండలశోభితాననాః మహాశనా వ్యోమచరా నిశాచరాః |
వివృత విధ్వస్తవిశాలలోచనాః మహాజవా భూతగణా స్సహస్రశః||7||

స|| యం ( విమానం) సహస్రః కుణ్డలశోభితాననః మహాశనాః వ్యోమచరాః నిశాచరాః వివృత విధ్వస్త విశాల లోచనాః మహాజవాః భూతగణాః వహంతి||

కుండలములతో శోభిస్తున్నముఖముకల వేలకొలది ఉన్న భూతములు , మహత్తరమైన కాయముకల వారు గగనవిహారులూ నిశాచరులు, గుండ్రముగా విశాలముగావున్న కళ్ళూకలవారు వంకరగావున్నకళ్ళుకలవారు, మహత్తరమైన శక్తికల భూతగనములతో మోయబడుతున్నట్లు ఆ విమానము ఉన్నది.

వసంతపుష్కోత్కరచారుదర్శనమ్ వసంతమాసాదపి కాంత దర్శనమ్|
స పుష్పకం తత్ర విమానముత్తమమ్ దదర్శ తద్వానరవీరసత్తమః||8||

స|| తత్ వానర సత్తమః తత్ ఉత్తమం పుష్పకం విమానం దదర్శ | వసంతపుష్కోత్తరచారుదర్శనం తం విమానం దదర్శ| వసంత మాసాదపి కాన్త దర్శనమ్ తం విమానం దదర్శ|

వసంతఋతువులలోని పుష్పరాజముల అందముతో ఒప్పారు తూ వున్న, వసంతమాసము కన్న రమ్యమైనదిగా ఉన్నట్టి ఆ ఉత్తమమైన విమానమును అ వానరోత్తముడు దర్శించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎనిమిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||