||సుందరకాండ ||

||ఎనిమిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టమస్సర్గః

ఆ పవనాత్మజుడు వీరుడు అగు హనుమంతుడు ఆ భవన సముదాయముల మధ్యలో మణులు వజ్రములతో అలంకరింపబడిన బంగారముతో చేయబడిన జాలలతో గల గవాక్షములు కల ఒక మహత్తరమైన విమానమును చూచెను. అ అప్రమేయమైన తిరుగులేనిది వున్న స్వయముగా విశ్వకర్మ చేత నిర్మింపబడిన విమానము దివిలోకమునకు పోవు ఆకాశమార్గము లో సూర్యమార్గమునకు చిహ్నముగా ప్రకాశిస్తున్నది.

ఆ విమానములో విశేషప్రయత్నము లేకుండా చేయబడినది లేదు. అ విమానములో మహత్తరమైన రత్నములతో చేయబడనిది లేదు. అ విమానములో ఉన్న విశేషములు సురులోకములో ఉన్నాయని చెప్పలేము. ఆ విమానములో మహత్తరముగా విశేషము కానిది అంటూ ఏది లేదు.

ఆ విమానము తపశ్శక్తి తోనూ పరాక్రమము తోను అర్జించు కునబడినది. ఆ విమానము మనస్సులోనున్న కోరికలకి సమాధానముగా పోవును. అ విమానము అనేకమైన విశేషమైన భాగములతో నిర్మితమైనది. అక్కడక్కడ విశేషములతో దర్శనీయముగా నున్నది. మనస్సులో ఉన్న ఊహలకు సమాధానమై సీఘ్రముగా పోగల, వాయువేగముతో సమనావేగముతో పోగల,ఆ విమానము మహాత్ములు పుణ్యాత్ములు తేజస్విలు మహదానందభరితులు వుండు ఆలయములా వున్నది.

ఆ విమానము విశిష్టమైన రీతిలో విశేషములతో నిర్మించబడినది.ఆ విమానములో విచిత్రమైన శిఖరాలతో కూటములో నిండియున్నది. శరత్కాలపు చంద్రునిలాగా మనస్సును ఆకర్షిస్తూఉన్నది. విచిత్రమైన కూటములు శిఖరములు కల పర్వతములా ఉన్నది. కుండలములతో శోభిస్తున్నముఖముకల వేలకొలది ఉన్న భూతములు , మహత్తరమైన కాయముకల వారు గగనవిహారులూ నిశాచరులు, గుండ్రముగా విశాలముగావున్న కళ్ళూకలవారు వంకరగావున్నకళ్ళుకలవారు, మహత్తరమైన శక్తికల భూతగణములతో మోయబడుతున్నట్లు ఆ విమానము ఉన్నది.

వసంతఋతువులలోని పుష్పరాజముల అందముతో ఒప్పారు తూ వున్న, వసంతమాసము కన్న రమ్యమైనదిగా ఉన్నట్టి ఆ ఉత్తమమైన విమానమును అ వానరోత్తముడు దర్శించెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎనిమిదవ సర్గ సమాప్తము.

తత్త్వ దీపిక:

ఇక్కడ పంచకోశములలో అంతర్గతముగా వున్న ఆత్మ అన్వేషణములో ముముక్షువు ఇదవకోశములోనున్న అత్మను కనుక్కొంటాడు అని ఉపనిషత్తులు చెపుతాయి

ఈ భనముల వర్ణలలో మూడు సార్లు
"అససాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్"
అని రాస్తాడు - " అ లక్ష్మీ వంతుడు రావణుని గృహము ప్రవేశించెను" అని చెప్పి ఆ గృహవర్ణన చేసి ముందుకు పోతువుంటాడు.

ఈ మూడు చోట్ల సీత లేదుకనక ఇవి ఆత్మ స్థానమగు విజ్ఞానమయకోశమునకు ముందున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోసములు అని స్ఫురిస్తుంది అంటారు.

ఇవి దాటుతున్న హనుమంతుని ప్రత్సారి లక్ష్మీవాన్ అని వర్ణిస్తాడు వాల్మీకి

ఈ సర్గలో "దివం గతం వాయుపథ ప్రతిష్ఠితం" అన్న మాటతో ఇది ప్రాణమయ కోశమా అని స్ఫురిస్తుంది అంటారు అప్పాలాచార్యులవారు.

|| ఓమ్ తత్ సత్||