||సుందరకాండ ||

|| తొమ్మిదవ సర్గ శ్లోకార్థ తాత్పర్యముతో||

|| Sarga 9 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ నవమస్సర్గః

తొమ్మిదవ సర్గలో మళ్ళీ మొదటి లోనే " అససాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్" (9.04) అంటూ మూడో సారి ఆ లక్ష్మీవంతుడు రాక్ష సేంద్రుని నివేశనము చేరెను అని వింటాము.

ఆ రాజభవనములో రావణుని ఐశ్వర్యము వర్ణిస్తూ , కుబేరుడి దగ్గర , యముడి దగ్గర, వరుణుని దగ్గర వున్నఐశ్వర్యము, "తాదృశీ తద్విశిష్టా వా" (9.09) అలాంటి ఐశ్వర్యము లేక అంతకన్న విశిష్టమైన ఐశ్వర్యము రావణుని వద్ద వుందిట. అక్కడ "గంధస్త్వం", అంటే అక్కడ వున్న మంచి సువాసనలు, బంధువులను అహ్వానించుచున్నట్లు హనుమంతుని,
"తత్ర యత్ర స రావణః" (9.21)అంటే అక్కడ ఎక్కడ రావణుడు ఉన్నాడో అక్కడికి ఆహ్వానించాయిట.

ఆ శాలలో వైభవము చూస్తూ హనుమంతుడు " స్వర్గోయం దేవలోకోయం" (9.31), ఇది స్వర్గ లోకమా, దేవ లోకమా, లేక ఇంద్రుని అమరావతి యా అని విస్మయ పడ్డాడుట. ఆ భోగ లోకాలు ఒక దానిని మించిన ఇంకొకటివి. అంటే అక్కడి ఐశ్వర్యము చూచి హనుమ ఆశ్చర్యము కూడా అలాగ పెరిగినదన్నమాట.

అక్కడ "సహస్రం వర నారీణాం" (9.34) వెయ్యిమంది శ్రేష్ఠులైన నారీమణులు, రావణుని భార్యలు, అనేక రకముల వేషములతో అనేక రకములైన భంగిమలలో కనపడ్డారుట. అందరూ రావణుని కోరి వచ్చినవారేట. ఇదే ధోరణిలో ఈ సర్గ లో హనుమ అన్వేషణ కొనసాగుతుంది. కాని సీతమ్మ కనపడలేదు.

ఇక అర్థతాత్పర్యాలతో శ్లోకాలు

||శ్లోకము 9.01||

తస్యాలయ వరిష్టస్య మధ్యే విపులమాయతమ్|
దదర్శ భవనం శ్రేష్టం హనుమాన్మారుతాత్మజః||9.01||

స|| మారుతాత్మజః హనుమాన్ తస్య ఆలయవరిష్ఠస్య మధ్యే విపులం ఆయతం భవనం శ్రేష్టం దదర్శ||

||శ్లోకార్థములు||

మారుతాత్మజః హనుమాన్ -
మారుతాత్మజుడగు హనుమంతుడు
తస్య ఆలయవరిష్ఠస్య మధ్యే -
ఆ వరిష్ట ఆలయముల మధ్యలో
విపులం ఆయతం శ్రేష్టం భవనం -
మధ్యలో పెద్ద విశాలమైన శ్రేష్టమైన భవనమును
దదర్శ - చూచెను

||శ్లోకతాత్పర్యము||

"మారుతాత్మజుడగు హనుమంతుడు ఆ వరిష్ట ఆలయముల మధ్యలో పెద్ద విశాలమైన శ్రేష్టమైన భవనమును చూచెను." ||9.01||

కొన్ని టీకా త్రయ సుందరకాండలలో - 'విపులమాయతం' బదులు 'విమలమాయతం' అని వస్తుంది. విమలం అంటే దుమ్ము ధూళి లేని అని.

||శ్లోకము 9.02||

అర్థయోజన విస్తీర్ణమ్ ఆయతం యోజనం హి తత్|
భవనం రాక్షసేన్ద్రస్య బహుప్రాసాదసంకులమ్||9.02||

స|| తత్ రాక్షసేన్ద్రస్య భవనం బహుప్రాశాద సంకులం అర్థ యోజన విస్తీర్ణమ్ యోజనం ఆయతమ్ ( అస్తి)||

||శ్లోకార్థములు||

తత్ రాక్షసేన్ద్రస్య భవనం -
ఆ రాక్షసేంద్రుని భవనము
బహుప్రాశాద సంకులం -
అనేకమైన ప్రాసాదములతో కూడియున్నది
అర్థ యోజన విస్తీర్ణమ్ యోజనం ఆయతమ్ -
ఒక యోజనము పొడవు అర యోజనము వెడల్పు గలది

||శ్లోకతాత్పర్యము||

"ఒక యోజనము పొడవు అర యోజనము వెడల్పు గల ఆ రాక్షసేంద్రుని భవనము అనేకమైన ప్రాసాదములతో కూడియున్నది." ||9.02||

||శ్లోకము 9.03||

మార్గమాణస్తు వైదేహీం సీతాం ఆయతలోచనామ్|
సర్వతః పరిచక్రామ హనుమాన్ అరిసూదనః||9.03||

స|| అరిసూదనః హనుమాన్ ఆయతలోచనం వైదేహీం సీతాం మార్గమాణః తు సర్వతః పరిచక్రామ||

||శ్లోకార్థములు||

అరిసూదనః హనుమాన్ -
శత్రువులను మర్దించగల ఆ హనుమంతుడు
ఆయతలోచనం వైదేహీం సీతాం మార్గమాణః -
విశాలమైన కళ్ళుగల ఆ సీతాదేవి వెదుకుతూ
సర్వతః పరిచక్రామ - అన్నిచోట్లా తిరిగెను

||శ్లోకతాత్పర్యము||

"శత్రువులను మర్దించగల ఆ హనుమంతుడు విశాలమైన కళ్ళుగల ఆ సీతాదేవి వెదుకుతూ అన్నిచోట్లా తిరిగెను." ||9.03||

||శ్లోకము 9.04||

ఉత్తమమ్ రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్|
అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్రనివేశనమ్||9.04||

స|| అథ లక్ష్మీవాన్ హనుమాన్ ఉత్తమం రాక్షసావాసం అవలోకయన్ రాక్షసేంద్ర నివేశనం అససాద||

||శ్లోకార్థములు||

అథ లక్ష్మీవాన్ హనుమాన్ -
అప్పుడు లక్ష్మీవంతుడైన హనుమంతుడు
ఉత్తమం రాక్షసావాసం అవలోకయన్-
ఆ ఉత్తమమైన రాక్షస ఆవాసమును చూచి
రాక్షసేంద్ర నివేశనం అససాద -
రాక్షసేంద్రుని భవనములోకి ప్రవేశించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు లక్ష్మీవంతుడైన హనుమంతుడు ఆ ఉత్తమమైన రాక్షస ఆవాసమును చూచి రాక్షసేంద్రుని భవనములోకి ప్రవేశించెను." ||9.04||

'అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్రనివేశనమ్' అనిన మాట మూడవసారి వింటున్నాము. దీన్ని గురించి అప్పలాచార్యులవారు కొంచెం విశ్లేషించారు.

ఇలా మూడు సార్లు చెప్పడములో, హనుమంతుడు రావణ భవన ప్రాంగణములో మూడవ అంతస్తు చేరెను అన్నమాట. ఎనిమిదవ సర్గలో అత్మాన్వేషణలో పంచకోశములు దాటడము గురించి చెప్పడమైనది. ఇప్పుడు మూడో అంతస్థులో చేరాడు అంటే అత్మాన్వేషణలో మూడవ కోశమైన మనోమయ కోశము చేరాడన్నమాట.

మొదటి సర్గలో "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇతి రావణః", అంటే "నేను" "నాది" అని "అసత్ ప్రలాపములను " పలికించేవాడు కనక రావణుడు అని విన్నాము. అలా పలికించేది మన మనస్సు అని కూడా విన్నమాటే. అంటే ఆ రావణుడే మనస్సు. రావణుని రాజభవనమే మనోమయ కోశము అన్నమాట.

ఆ మనోమయ కోశమే రావణుని రాజభవనము.

||శ్లోకము 9.05||

చతుర్విషాణైర్ద్విరదైః త్రివిషాణైః తథైవ చ|
పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః ||9.05||

స|| ( తత్ భవనం) చతుర్విషాణైః తథైవ త్రివిషాణైః ద్విరదైః గజైః పరిక్షిప్తం అసంబాధం ఉదాయుధైః రక్ష్యమాణం (అస్తి)||

||శ్లోకార్థములు||

చతుర్విషాణైః తథైవ త్రివిషాణైః ద్విరదైః గజైః -
రెండు , మూడు నాలుగు దంతములు ఉన్న ఏనుగుల తోను
పరిక్షిప్తం - రక్షితార్థము చుట్టబడియున్నది
అసంబాధం ఉదాయుధైః రక్ష్యమాణం-
అప్రమత్తముగానున్న ఆయుధములు ధరించి ఉన్న రాక్షసులచేతను రక్షింపబడి యున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము రెండు , మూడు నాలుగు దంతములు ఉన్న ఏనుగుల తోను , అప్రమత్తముగానున్న ఆయుధములు ధరించి ఉన్న రాక్షసులచేతను రక్షింపబడి యున్నది". ||9.05||

||శ్లోకము 9.06||

రాక్షసీభిశ్చ పత్నీభీ రావణస్య నివేశనమ్|
అహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతమ్||9.06||

స|| (తత్) రావణస్య నివేశనం పత్నీభిః విక్రమ్య ఆహృతాభిః రాజకన్యాశ్చ రాక్షసీభిశ్చ ఆవృతమ్|

||శ్లోకార్థములు||

(తత్) రావణస్య నివేశనం పత్నీభిః -
ఆ రావణుని భవనము భార్యలతోనూ
విక్రమ్య ఆహృతాభిః రాజకన్యాశ్చ -
జయించి తీసుకురాబడిన రాజకన్యలతోనూ
రాక్షసీభిశ్చ ఆవృతమ్ -
రాక్షస స్త్రీలతోనూ నిండివుంది

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసభవనము భార్యలతోనూ , జయించి తీసుకురాబడిన రాజకన్యలతోనూ నిండి వుంది." ||9.06||

||శ్లోకము 9.07||

తన్నక్రమకరాకీర్ణం తిమిఙ్గిలఝషాకులమ్|
వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరమ్ ||9.07||

స||(తత్ రావణస్య నివేశనమ్) నక్రమకరాకీర్ణం తిమిఙ్గిళఝుషాకులమ్ వాయువేగ సమాధూతం పన్నగైః సాగరం ఇవ (అస్తి)||

||శ్లోకార్థములు||

నక్రమకరాకీర్ణం తిమిఙ్గిళఝుషాకులమ్ పన్నగైః -
మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగిళములు, పాములతో నిండి యున్న
వాయువేగ సమాధూతం సాగరం ఇవ -
పెద్ద గాలిచేత ఊగించబడిన సముద్రము వలె

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము మొసళ్ళు తిమింగిళములు పాములతో నిండి యున్న మహా సాగరము వలెనుండెను." ||9.07||

||శ్లోకము 9.08,9||

యాహి వైశ్రవణే లక్ష్మీర్యా చన్ద్రే హరివాహనే|
సారావణగృహే సర్వా నిత్యమేవానపాయినీ||9.08||

స|| యా లక్ష్మీ వైశ్రవణే యా హరివాహనే ఇన్ద్రే చ (అస్తి) సా సర్వా రావణగృహే నిత్యమేవ అనపాయినీ (అస్తి)||

రామటీకాలో - యా లక్ష్మీః వైశ్రవణే కుబేరే హరివాహనే హరితాస్వరూపవాహనవతి ఇన్ద్రేచ సా అనపాయినీ వినాశరహితా లక్ష్మీః రావణ గృహే నిత్యమేవ వసతీ ఇతి శేషః।

||శ్లోకార్థములు||

యా లక్ష్మీ వైశ్రవణే -
కుబేరునికి ఎంత ఐశ్వర్యము ఉందో
యా హరివాహనే ఇన్ద్రే చ -
ఆకుపచ్చని గుఱ్ఱముల రథము వాహనముగాగల ఇంద్రుని దగ్గర ఎంత ఐశ్వర్యము కలదో
సా సర్వా రావణగృహే -
అంత ఐశ్వర్యము ఆ రాక్షసరాజు భవనములో
నిత్యమేవ అనపాయినీ -
స్థిరముగా కొలువై వున్నది

||శ్లోకతాత్పర్యము||

తా|| కుబేరునికి ఎంత ఇశ్వర్యము ఉందో, ఆకుపచ్చని గుఱ్ఱముల రథము వాహనముగాగల ఇంద్రుని దగ్గర ఎంత ఇశ్వర్యము కలదో, అంత ఇశ్వర్యము ఆ రాక్షసరాజు భవనములో స్థిరముగా కొలువై వున్నది.

||శ్లోకము 9.09||

యా చ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ|
తాదృశీ తద్విశిష్టా వా ఋద్ధీ రక్షోగృహే ష్విహ||9.09||

స|| రాజ్ఞః కుబేరస్య యా వరుణస్య యా యమస్య ఋద్ధిః తాదృశీ తద్విశిష్ఠా వా (ఋద్ధిః) ఇహ రక్షో గృహే (అస్తి)||

||శ్లోకార్థములు||

రాజ్ఞః కుబేరస్య యా వరుణస్య యా యమస్య -
అధిపతులైన కుబేరుడు, వరుణుడు, యముడు వారి యొక్క
ఋద్ధిః తాదృశీ తద్విశిష్ఠా వా -
ఐశ్వర్యము తో సమానమైన లేక అంతకన్నా విశిష్ఠమైన ( ఐశ్వర్యము)
ఇహ రక్షో గృహే - ఆ రాక్షసుని గృహములో కలదు

||శ్లోకతాత్పర్యము||

"అధిపతులైన కుబేరుడు, వరుణుడు, యముడు వారి యొక్క ఐశ్వర్యము తో సమానమైన లేక అంతకన్నా విశిష్ఠమైన ఐశ్వర్యము, ఆ రాక్షసుని యొక్క గృహములో కలదు." ॥9.09॥

||శ్లోకము 9.10||

తస్య హర్మ్యస్య మధ్యస్థం వేశ్మ చాన్యత్సునిర్మితమ్|
బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః||9.10||

స|| పవనాత్మజః తస్య హర్మ్యస్య మధ్యస్థం అన్యత్ బహునిర్యూహసంకీర్ణమ్ సునిర్మితం వేశ్మ దదర్శ||

||శ్లోకార్థములు||

పవనాత్మజః - పవనాత్మజుడు
తస్య హర్మ్యస్య మధ్యస్థం - ఆ భవనముల మధ్యలో
అన్యత్ బహునిర్యూహసంకీర్ణమ్ సునిర్మితం -
ఇంకొక అందముగా నిర్మించబడిన అనేక ప్రాసాదములు గల
వేశ్మ దదర్శ - భవనమును చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ పవనాత్మజుడు భవనముల మధ్యలో ఇంకొక అందముగా నిర్మించబడిన అనేక ప్రాసాదములు గల భవనమును చూచెను." ||9.10||

||శ్లోకము 9.11||

బ్రహ్మణోఽర్థే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణా|
విమానం పుష్పకం నామ సర్వరత్నవిభూషితమ్||9.11||

స||పుష్పకం నామ విమానం సర్వ రత్న విభూషితం దివ్యం యత్ బ్రహ్మణోర్థే విశ్వకర్మణా కృతం (అస్తి) ||

||శ్లోకార్థములు||

పుష్పకం నామ విమానం -
పుష్పకమనబడు విమానము
సర్వ రత్న విభూషితం దివ్యం -
అన్నిరకముల రత్నములతో అలంకరింపబడిన దివ్యమైన
యత్ బ్రహ్మణోర్థే విశ్వకర్మణా కృతం -
ఏది బ్రహ్మకోసము విశ్వకర్మ చేత నిర్మింపబడినది

||శ్లోకతాత్పర్యము||

అది పుష్పకమనబడు విమానము. అన్నిరకముల రత్నములతో అలంకరింపబడిన దివ్యమైన ఆ విమానము బ్రహ్మకోసము నిర్మింపబడినది.

బ్రహ్మకోసము విశ్వకర్మచే నిర్మింపబడిన విమానము, కుబేరుడికి తపస్సుచేత లభించెను. కుబేరుడుని జయించి రావణుడు ఆ విమానమును తనదిగా చేసుకొనెను. ఇది పూర్వపు వృత్తాంతము. ముందు కూడా వస్తుంది.

||శ్లోకము 9.12||

పరేణ తపసా లేభే యత్కుబేరః పితామహాత్|
కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః||9.12||

స|| ( తత్ విమానం) కుబేరః పితామహాత్ పరేణ తపసా లేభే| కుబేరం ఓజసా జిత్వా తత్ రాక్షసేశ్వరః లేభే ||

||శ్లోకార్థములు||

కుబేరః పితామహాత్ - కుబేరుడు బ్రహ్మదేవుని నుంచి
పరేణ తపసా లేభే - కఠోరమైన తపస్సుచేసి సంపాదించెను
కుబేరం ఓజసా జిత్వా - కుబేరుని పరాక్రమముతో జయించి
తత్ రాక్షసేశ్వరః లేభే - ఆ (విమానమును) రాక్షసేశ్వరుడు సంపాదించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ విమానమును కుబేరుడు బ్రహ్మదేవుని నుంచి కఠోరమైన తపస్సుచేసి సంపాదించెను. కుబేరుని తన పరాక్రమముతో జయించి రాక్షసేస్వరుడు ఆ విమానమును సంపాదించెను."||9.12||

||శ్లోకము 9.13,14||

ఈహామృగ సమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః|
సుకృతైరాచితం స్తమ్భైః ప్రదీప్తమివ చ శ్రియా||9.13||
మేరుమన్దరసంకాశై రుల్లిఖద్భిరివాఽమ్బరమ్|
కూటాగారై శ్శుభాకారైః సర్వతః సమలంకృతమ్||9.14||

స|| ఈహామృగసమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః సుకృతైః స్తమ్భైః శ్రియా ప్రదీప్తం ఇవ మేరుమందర సంకాశైః ఉల్లిఖద్భిః ఇవ అమ్బరం సర్వతః శుభాకారైః కూటాగారైః సమలంకృతం ( అస్తి)

||శ్లోకార్థములు||

ఈహామృగసమాయుక్తైః - ఈహామృగముల ప్రతిమలతో
కార్తస్వరహిరణ్మయైః - బంగారముతోపూయబడిన
సుకృతైః స్తమ్భైః శ్రియా ప్రదీప్తం -
స్తంభములతో శోభాయమానముగా జ్వలిస్తూ
ఇవ మేరుమందర సంకాశైః -
మేరు మందర పర్వతములతో సమానముగా
ఉల్లిఖద్భిరివ అమ్బరం -
అకాశమునంటుతూ వున్నట్లు వున్న
సర్వతః శుభాకారైః కూటాగారైః -
అంతటా శుభకరమైన కూటాగారములతో
సమలంకృతం - అలంకరింపబడి యున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము బంగారముతోపూయబడిన ఈహామృగముల ప్రతిమలతో, స్తంభములతో శోభాయమానముగా జ్వలిస్తూ, మేరు మందర పర్వతములతో సమానముగా అకాశమునంటుతూ వున్నట్లు వున్న శుభకరమైన కూటాగారములతో అలంకరింపబడి యున్నది". ||9.14||

||శ్లోకము 9.15||

జ్వలనార్క ప్రతీకాశం సుకృతమ్ విశ్వకర్మణా|
హేమసోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్||9.15||

స|| విశ్వకర్మణా సుకృతం జ్వలనార్కప్రతీకాశం హేమసోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్ (అస్తి)||

||శ్లోకార్థములు||

జ్వలనార్కప్రతీకాశం -
వెలుగుతున్న సూర్యకిరణములలా ప్రకాశించుచున్న
హేమసోపాన సంయుక్తం -
బంగారు సోపానములతో కూడిన
చారుప్రవర వేదికమ్ -
అందమైన శ్రేష్టమైన వేదికలతో
విశ్వకర్మణా సుకృతం -
విశ్వకర్మచేత చేయబడినది

||శ్లోకతాత్పర్యము||

"బంగారు సోపానములతో అందమైన శ్రేష్టమైన వేదికలతో, వెలుగుతున్న సూర్య కిరణములలా ప్రకాశించుచున్న ఆ విమానము, విశ్వకర్మచేత చేయబడినది."||9.15||

||శ్లోకము 9.16||

జాలావాతాయనైర్యుక్తం కాంచనైస్స్పాటికైరపి|
ఇన్ద్రనీల మహానీల మణి ప్రవర వేదికమ్||9.16||

స|| (తత్ విమానం) కాంచనైః స్ఫాటికైరపి జాలవాతాయనైః యుక్తం ఇన్ద్ర నీల మహానీల మణి ప్రవర వేదికమ్ అస్తి||

||శ్లోకార్థములు||

కాంచనైః స్ఫాటికైరపి - బంగారముతో స్ఫటికముల
జాలవాతాయనైః యుక్తం - జాలలతో గల కిటికీలతోనున్న
ఇన్ద్ర నీల మహానీల మణి - ఇంద్రనీల మహానీల మణులతో
ప్రవర వేదికమ్ - అలంకరింపబడిన వేదికలతో ఉన్న

||శ్లోకతాత్పర్యము||

"బంగారముతో స్ఫటికముల జాలలతో గల కిటికీలతోనున్న, ఇంద్రనీల మహానీల మణులతో అలంకరింపబడిన వేదికలతో ఉన్నది ఆ విమానము." ||9.16||

||శ్లోకము 9.17||

విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చమహాధనైః|
నిస్తులాభిశ్చ ముక్తాభిః తలేనాభి విరాజితమ్||9.17||

స||విచిత్రేణ విద్రుమేణ మహాధనైః మణిభిశ్చ నిస్తులాభిః ముక్తాభిః తలేన అభివిరాజితమ్ అస్తి ||

||శ్లోకార్థములు||

విద్రుమేణ విచిత్రేణ - విచిత్రమైన పగడలతో
మణిభిశ్చమహాధనైః - అమూల్యమైన మణులతోనూ
నిస్తులాభిశ్చ ముక్తాభిః- సాటిలేని ముత్యాలతో
తలేనాభి విరాజితమ్ - ( విమానములోని) నేల విరాజిల్లుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆ విమానములో నేల విచిత్రమైన పగడలతో అమూల్యమైన మణులతోనూ, సాటిలేని ముత్యాలతో అలంకరింపబడి అద్భుతముగా విరాజిల్లుచున్నది." ||9.17||

||శ్లోకము 9.18||

చన్దనేన చ రక్తేన తపనీయనిభేన చ|
సుపుణ్యగన్ధినాయుక్తం ఆదిత్యతరుణోపమమ్||9.18||

స|| రక్తేన చన్దనేన తపనీయనిభేన చ సుపుణ్యగన్ధినా యుక్తం ఆదిత్య తరుణోపపమం (అస్తి)||

||శ్లోకార్థములు||

రక్తేన చన్దనేన తపనీయనిభేన -
ఎఱ్ఱని చందనముతో, కరిగించిన బంగారముతో ఆలకబడి
సుపుణ్యగన్ధినా యుక్తం -
పుణ్యగంధములతో కూడి
ఆదిత్యతరుణోపమమ్ -
ఉదయిస్తున్న సూర్యుని కాంతితో ప్రకాశిస్తున్నది.

||శ్లోకతాత్పర్యము||

"పుణ్యగంధములతో కూడి ఎఱ్ఱని చందనముతో, కరిగించిన బంగారముతో ఆలకబడి ఉదయిస్తున్న సూర్యుని కాంతితో ప్రకాశిస్తున్నది." ||9.18||

||శ్లోకము 9.19||

కూటాగారైర్వరాకారైః వివిధైః సమలంకృతమ్|
విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపిః||9.19||

స|| వివిధైః వరాకరైః కూటాగారైః సమలంకృతం దివ్యం పుష్పకం విమానం మహాకపిః ఆరురోహ||

||శ్లోకార్థములు||

కూటాగారైర్వరాకారైః వివిధైః -
అనేరకములైన అద్భుతమైన ఆకారముగల కూటాగారములతో
సమలంకృతం - అలంకరింపబడిన
దివ్యం పుష్పకం విమానం -
దివ్యమైన పుష్పక విమానమును
మహాకపిః ఆరురోహ - మహాకపి ఎక్కెను.

||శ్లోకతాత్పర్యము||

"అనేరకములైన అద్భుతమైన ఆకారముగల కూటాగారములతో అలంకరింపబడిన దివ్యమైన విమానమును ఆ మహాకపి ఎక్కెను." ||9.19||

||శ్లోకము 9.20||

తత్రస్థ స్స తదా గన్ధం పానభక్ష్యాన్నసంభవమ్|
దివ్యం సమ్మూర్ఛితం జిఘ్ర ద్రూపవంత మివానలమ్||9.20||

స|| సః తదా తత్రస్థః పానభక్ష్యాన్నసంభవం సమ్మూర్ఛితం రూపవంతం అనిలమివ దివ్యం గంధం జిఘ్రత్ ||

||శ్లోకార్థములు||

సః తదా తత్రస్థః పానభక్ష్యాన్నసంభవం -
అక్కడ పానభక్ష్యాన్నములతో కూడిన
సమ్మూర్ఛితం రూపవంతం -
మూర్చింప చేయునట్లు ఉన్న
రూపవంతం అనిలమివ -
రూపము పొందిన వాయువులాగ
దివ్యం గంధం జిఘ్రత్ -
దివ్యమైన గంధమును ఆఘ్రాణించెను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ పానభక్ష్యాన్నములతో కూడిన, మూర్చింప చేయునట్లు ఉన్న, రూపము పొందిన వాయువులాగవున్న దివ్యమైన గంధమును ఆఘ్రాణించెను." ||9.20||

||శ్లోకము 9.21||

స గన్ధస్త్వం మహాసత్త్వం బన్ధుర్బన్ధుమివోత్తమమ్|
ఇత ఏహీ త్యువాచేన తత్ర యత్ర స రావణః||9.21||

స|| స గంధః తం మహాసత్త్వం యత్ర సరావణః తత్ర ఇతః ఏహి ఇతి ఉత్తమం బంధుం బంధురివ ఉవాచ ||

తిలక టీకాలో - యత్ర స రావణః తత్రస్థానే ఇత ఏహి ఇత్యువాచేవ ఉక్త గుణవాయుః కర్తా దివ్యగన్ధేన రావణ శయన గృహం జ్ఞాతవాన్ ఇత్యర్థః ; తతః తస్మాత్ పుష్పకాత్ అవరుహ్య గన్ధానుమితాం తాం రావణ శాలాం ప్రశ్థితః తాం శాలాం దదర్శ.

||శ్లోకార్థములు||

స గంధః తం మహాసత్త్వం -
ఆ వాసన ఆ మహాకపిని
ఉత్తమం బంధుం బంధురివ -
ఒక బంధువు తన ఆప్తబంధువుని అహ్వానించినట్లు
యత్ర స రావణః తత్ర ఇతః ఏహి ఇతి ఉవాచ-
ఎక్కడ ఆ రావణుడు ఉన్నాడో ఆక్కడకు రమ్ము అని చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వాసన ఆ మహాకపిని ఒక బంధువు తన ఆప్తబంధువుని అహ్వానించినట్లు ఎక్కడ ఆ రావణుడు ఉన్నాడో అక్కడకు రమ్ము అని చెప్పెను." ||9.21||

||శ్లోకము 9.22||

తత స్థాం ప్రస్థితశ్శాలామ్ దదర్శ మహతీం శుభామ్|
రావణస్య మనః కాన్తాం కాన్తామివ వరస్త్రియమ్||9.22||

స|| తతః ప్రస్థితః మహతీం శుభాం శాలాం దదర్శ తత్ వరస్త్రియ కాంతామివ మనః కాంతాం రావణస్య |।

రామటీకాలో - తతః రావణ సమీపాత్ ప్రస్థితో హనుమాన్ కాన్తాం శోభితామ్ వరస్త్రియమివ రావణస్య మహాకాన్తామ్ అతీచ్ఛావిషయీభూతాం శాలాం దదర్శ|

||శ్లోకార్థములు||

తతః ప్రస్థితః -
అక్కడకి బయలుదేరిన (హనుమంతుడు)
మనః కాంతాం రావణస్య -
రావణుని మనస్సు ఆకట్టుకొనే
వరస్త్రియ కాంతామివ -
ఉత్తమ వంశజాతి అయిన కాంత లాగవున్న
మహతీం శుభాం శాలాం దదర్శ -
మహత్తరమైన శుభకరమైన శాలను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడకి బయలుదేరిన హనుమంతుడు రావణుని మనస్సు ఆకట్టుకొనే కాంతామణి లాగా వున్న మహత్తరమైన శుభకరమైన శాలను చూచెను." ||9.22||

ఆ శాల రావణునికి ఇష్టమైన శాల అని భావము.

||శ్లోకము 9.23||

మణిసోపానవికృతాం హేమజాలవిభూషితామ్|
స్పాటికైరావృతతలాం దన్తాన్తరితరూపికామ్||9.23||

స|| మణిసోపానవికృతాం హేమజాల విభూషితామ్ స్ఫాటికైరావృతతలాం దన్తాన్తరిత రూపికాం (శాలాం దదర్శ)||

||శ్లోకార్థములు||

మణిసోపానవికృతాం -
మణులచే అలంకరింపబడిన సోపానములు కల
హేమజాల విభూషితామ్ -
బంగారు జాలలతో అలంకరింపబడిన (కీటికీలు గల)
స్ఫాటికైరావృతతలాం -
స్ఫటికములతో అలంకరింపబడిన,
దన్తాన్తరిత రూపికాం -
దంతములతో కూడిన ఏనుగల రూపములతో చిరత్రీకరింపబడిన నేల కలదు

||శ్లోకతాత్పర్యము||

"ఆ శాలలో మణులచే అలంకరింపబడిన సోపానములు కల, బంగారు జాలలతో అలంకరింపబడిన కిటికీలు గల, స్ఫటికముతో మణులతో దంతములు కల ఏనుగుల బొమ్మలతో అలంకరింపబడిన నేల కలదు." ||9.23||

||శ్లోకము 9.24||

ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి|
విభూషితాం మణిస్తమ్భైః సుబహూస్తమ్భభూషితామ్||9.24||

||శ్లోకార్థములు||

ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ -
ముత్యములతోనూ పగడములతోనూ
రూప్యచామీకరైరపి -
వెండి బంగారములతో కూడా అలంకరింపబడిన
మణిస్తంభైః విభూషితాం -
మణిస్తంభములు చేత అలంకరింపబడిన
సుబహు స్తంభైః భూషితం -
అనేక స్తంభములు కలది ( ఆ శాల)

||శ్లోకతాత్పర్యము||

"ఆ శాల ముత్యాలతోనూ పగడాలతోనూ బంగారముతోనూ అలంకరింపబడిన స్తంభములతో అలంకరింపబడిన అనేక స్తంభములతో ఉన్నది." ||9.24||

||శ్లోకము 9.25||

నమ్రైః రృజుభిరత్యుచ్చైః సమంతాత్సువిభూషితైః |
స్తమ్భైః పక్షైరివాత్యుచ్చైర్దివం సంప్రస్థితామివ ||9.25||

స|| (తత్ శాలాయాం) నమ్రైః ఋజుభిః అత్యుచ్చైః సమన్తాత్ సువిభూషితైః స్తమ్భైః అత్యుచ్చైః పక్షైః దివం సమ్ప్రస్థితామివ (సంతి) ||

||శ్లోకార్థములు||

నమ్రైః ఋజుభిః అత్యుచ్చైః -
వంగిన, వంకరలేని, ఎత్తైన
సమన్తాత్ సువిభూషితైః స్తమ్భైః -
పూర్తిగా అలంకరింపబడిన స్తమ్భములతో
అత్యుచ్చైః పక్షైః - పెద్ద రెక్కలతో
దివం సమ్ప్రస్థితామివ -
దేవలోకముకు చేరుటకు సిద్ధముగా వున్నట్లువున్నది

||శ్లోకతాత్పర్యము||

"వంకరటింకరలేని ఎత్తైన పూర్తిగా అలంకరింపబడిన స్తమ్భములతో వున్న (ఆ విమానము) రెక్కలు చాపి దేవలోకమునకు ఎగురుటకు సిద్ధముగా వున్నట్లు వుండెను." ||9.25||

||శ్లోకము 9.26||

మహత్యా కుథయాస్తీర్ణాం పృథివీ లక్షణాఙ్కయా|
పృథివీమివ విస్తీర్ణం సరాష్ట్ర గృహమాలినీమ్||9.26||

స|| తత్ శాలా పృథివీ లక్షణాంకయా కుథయా ఆస్తీర్ణం సరాష్ట్ర గృహమాలినీం పృథివీమివ విస్తీర్ణమ్ (అస్తి)

రామ్ టీకాలో- పృధివీలక్షణాంకయా పృథివీ లక్షణానాం తరు సరిత్ సముద్రాదీనాం అంకో రేఖా యస్యాం తయా విశాలాయా కుథయా చిత్ర కంబళాస్తరణేన ఆస్తీర్ణాం ఇతి।

||శ్లోకార్థములు||

తత్ శాలా పృథివీ లక్షణాంకయా -
ఆ శాలలో భూమియొక్క లక్షణములతో
కుథయా ఆస్తీర్ణం - పెద్ద తివాసీ (మీద)
సరాష్ట్ర గృహమాలినీం - రాష్ట్రములతో గృహములతో
పృథివీమివ విస్తీర్ణమ్ - భూమిలాగా విస్తృతముగా

||శ్లోకతాత్పర్యము||

"ఆ శాలలో భూమియొక్క లక్షణములతో దేశములతో గృహములతో చిత్రీకరింపబడిన భూమిలాగవున్న తివాసీ ఉండెను." ||9.26||

||శ్లోకము 9.27||

నాదితాం మత్తవిహగైః దివ్యగన్ధాదివాసితామ్|
పరార్థ్యాస్తరణో పేతాం రక్షోధిపనిషేవితామ్||9.27||

స|| మత్తవిహగైః నాదితాం దివ్యగంధాధివాసితామ్ పరార్ధ్యాస్తరణోపేతాం రక్షోధిపేన నిషేవితాం తం శాలాం దదర్శ||

||శ్లోకార్థములు||

మత్తవిహగైః నాదితాం -
మత్తెక్కిన పక్షుల కిలకిలారావముతో
దివ్యగంధాధివాసితామ్ -
దివ్యమైన గంధముల వాసనలతో నిండి
పరార్ధ్యాస్తరణోపేతాం -
అమూల్యమైన ఆసనములతో కూడివున్న
రక్షోధిపేన నిషేవితాం -
రాక్షసేంద్రునిచే తరచు ఆతిధ్యము స్వీకరింపబడిన
(తం శాలాం దదర్శ)- (ఆ శాలను చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"రాక్షసేంద్రునిచే తరచు ఆతిధ్యము స్వీకరింపబడిన ఆ శాల మత్తెక్కిన పక్షుల కిలకిలారావముతో నిండి, దివ్యమైన గంధముల వాసనలతో నిండి , అమూల్యమైన ఆసనములతో కూడి ఉన్నది."||9.27||

||శ్లోకము 9.28||

ధూమ్రాం అగరుధూపేన విమలాం హంసపాణ్డురామ్|
చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీ మివ సుప్రభామ్||9.28||

స|| విమలాం హంసపాణ్డురామ్ (శాలా) అగరుధూపేన ధూమ్రాం ఇవ అస్తి | పుష్పోపహారేణ చిత్రామ్ సుప్రభామ్ కల్మషాం కామధేనుం ఇవ సంతి ||

||శ్లోకార్థములు||

విమలాం హంసపాణ్డురామ్ -
స్వచ్ఛముగా హంసవలె తెల్లగాను,
అగరుధూపేన ధూమ్రాం ఇవ -
అగరు ధూపము వలన ధూమము రంగు కలిగి యున్న
పుష్పోపహారేణ చిత్రామ్ -
చిత్రమైన పుష్పములతో
కల్మాషీ మివ సుప్రభామ్ -
కామధేనువు వలె మంచి వర్చస్సు తో వెలుగుతోంది

||శ్లోకతాత్పర్యము||

"హంస వలె తెల్లగానున్న ఆ శాల అగరు ధూపము వలన ధూమము రంగు కలిగి యున్నది. చిత్రమైన పుష్పములతో కామధేనువు వలె మంచి వర్చస్సు తో వెలుగుతోంది"||9.28||

||శ్లోకము 9.29||

మనసంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీమ్|
తాం శోకనాశినీం దివ్యాం శ్రియః సంజననీమివ||9.29||

స|| మనః సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం శోకనాశినీం శ్రియం సంజననీం ఇవ దివ్యాం తామ్ దదర్శ||

||శ్లోకార్థములు||

మనసంహ్లాద జననీం -
మనస్సుకు ఆహ్లాదము కలిగిస్తూ
వర్ణస్యాపి ప్రసాదినీమ్ -
రంగును పెంపొందిస్తూ
శోకనాశినీం శ్రియం సంజననీం -
శోకము నాశనము చేస్తూ, శ్రియమును పెంపొందిస్తూ నట్లుగా
ఇవ దివ్యాం - దివ్యముగా వున్నట్లు వున్న

||శ్లోకతాత్పర్యము||

"మనస్సుకు ఆహ్లాదము కలిగిస్తూ, రంగును పెంపొందిస్తూ, శోకము నాశనము చేస్తూ , శ్రియమును పెంపొందిస్తూ నట్లుగా దివ్యముగానున్నది." ||9.29||

||శ్లోకము 9.30||

ఇన్ద్రియాణీన్ద్రియార్థైస్తు పఞ్చపఞ్చభిరుత్తమైః|
తర్పయామాస మాతేవ తదా రావణపాలితా||9.30||

స|| రావణపాలితా (శాలా) తదా మాతా ఇవ పంచభిః ఇన్ద్రియార్థైః పంచ ఇన్ద్రియాణి తర్పయామాస ||

||శ్లోకార్థములు||
రావణపాలితా (శాలా) తదా -
రావణుని చే పాలింపబడుతున్న
మాతా ఇవ పంచభిః ఇన్ద్రియార్థైః -
తల్లి లాగా ఐదు ఇన్ద్రియములకోసము
పంచ ఇన్ద్రియాణి తర్పయామాస -
ఐదు ఇన్ద్రియ విషయములను తర్పణము చేసెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ శాల తల్లి లాగా పంచేంద్రియాలకు తగు పదార్ధములను తర్పణములాగా సమకూర్చుచున్నది." ||9.30||

||శ్లోకము 9.31||

స్వర్గోఽయం దేవలోకోఽయం ఇన్ద్రస్యేయం పురీ భవేత్|
సిద్ధిర్వేయం పరాహిస్యా దిత్యమన్యత మారుతిః||9.31||

స||అయం స్వర్గః అయం దేవలోకః అయం ఇంద్రస్యపురీ భవేత్ | ఇయం పరాసిద్ధిః స్యాత్ మారుతిః అమన్యత ||

తిలక టీకాలో- స్వర్గో జ్యోతిష్టోమాదిక యజ్ఞ్య ఫలభూమి, దేవలోకో వాయువరూణాదిలోకః, ఇన్ద్రస్య పుర్యం అమరావతి;

గోవిందరాజులవారి టీకాలో- సామాన్యతః స్వర్గోఽయం। తత్రాపి దేవలోకః త్రయత్రంశత్ దేవానాం లోకః।తత్రాఽపి ఇన్ద్రస్య పురీఅమరావతి । పరా సిద్ధిః బ్రహ్మణః స్థానం ।

||శ్లోకార్థములు||

అయం స్వర్గః అయం దేవలోకః -
ఇది స్వర్గమా ? దేవలోకమా?
అయం ఇంద్రస్యపురీ భవేత్ -
ఇంద్రుని రాజధాని అయిన అమరావతి యా?
ఇయం పరాసిద్ధిః స్యాత్ -
ఇది ఇది అపరమైన సిద్ధి
మారుతిః అమన్యత -
అని మారుతి అనుకొనెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ శాల వైభవమును చూచి ఇది స్వర్గమా ? దేవలోకమా? ఇంద్రుని రాజధాని అయిన అమరావతి యా? అని హనుమంతుడు చూచి అనుకొనెను." ||9.31||

ఆ మనోమయ కోశమే రావణుని రాజభవనము అని మొదటిశ్లోకాలలో విన్నాము.

అక్కడ, ఆ రావణ భవనములో వైభవము చూస్తూ హనుమంతుడు " స్వర్గోయం దేవలోకోయం", అంటే ఇది స్వర్గ లోకమా దేవ లోకమా లేక ఇంద్రుని అమరావతి యా అని విస్మయ పడ్డాడుట.

రామాయణ తిలక లో స్వర్గము అంటే "జ్యోతిష్టోమాదిక యజ్ఞ ఫలభోగ భూమిః" అని , అంత కన్నపెద్దది దేవలోకము, అది "వాయు వరుణాదిలోకః" అని , దాని కన్న పెద్దది ఇంద్రపురీ "అమరావతి" , అది ఇంద్ర లోకము అని చెపుతారు. అంటే అవి ఒక దాని కన్నా మించిన మరొకటి అయిన భోగ లోకాలు అన్నమాట. అంటే అక్కడి ఐశ్వర్యము చూచిన హనుమ ఆశ్చర్యము కూడా అలాగే అంచెల మీద పెరిగిందన్నమాట.

ఇది వింటూ ఉంటే మనకి తెలిసేది మనస్సు ఎలాగ బాహ్యస్వరూపములతో ఆకర్షింపబడుతుందో అని.

||శ్లోకము 9.32||

ప్రధ్యాయత ఇవాపస్యత్ ప్రదీపాం స్తత్ర కాంచనాన్|
ధూర్తానివ మహాధూర్తై ర్దేవనేన పరాజితాన్||9.32||

స|| తత్ర కాంచనాన్ ప్రదీపాన్ దేవనేన మహాధూర్తైః పరాజితం ప్రధ్యాయత ధూర్తానివ ( హనుమన్) అపస్యత్ ||

రామటీకాలో - కాఞ్చనాన్ కాఞ్చనమయాన్ ప్రదీపాన్ మఙ్గళార్థం స్తమ్భప్రదేషేషు సంస్థాపిత దీపాన్, దేవనేన ద్యూతేన మహాద్యూతైః అతివఞ్చితైః పరాజితాన్ అత ఏవ ధ్యాయతః ధన విధ్వంశాత్ నయన నిమీలనాది చేష్ఠయాధ్యానమివ కుర్వతోధూర్తానివ అపశ్యత్ । రావణాతితేజసా పరాభూతత్వాత్ దీపా న ప్రకాశన్తే ఇత్యర్థః।

||శ్లోకార్థములు||

తత్ర కాంచనాన్ ప్రదీపాన్ -
అక్కడవెలుగుతూవున్న బంగారు దీపములు
దేవనేన మహాధూర్తైః -
జూదములో నిపుణులైన జూదరులచేత
పరాజితం ప్రధ్యాయత ధూర్తానివ -
ఓడిపోయి, అలోచనలో వున్న జూదరులులాగా
అపస్యత్ - అని అనుకొనెను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడవెలుగుతూవున్న బంగారు దీపములు జూదములో నిపుణులైన జూదరి చేతులలో ఓడిపోయి, మౌనముగా నున్న జూదరులులాగా నిశ్చలముగా వున్నాయి." ||9.32||

రామ టికాలో చెప్పినది - రావణ తేజస్సుచేత పరాభవించబడడము వలన ఆ దీపాలు కూడా ప్రకాశించటల్లేదు అని అర్థము అంటారు

||శ్లోకము 9.33||

దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ|
అర్చిర్భిః భూషణానాం చ ప్రదీప్తేత్యభ్య మన్యత||9.33||

స|| దీపానాం ప్రకాశేన రావణస్య తేజసా చ భూషణానాం అర్చిభిః ప్రదీప్తా ఇతి అమన్యత||

||శ్లోకార్థములు||

దీపానాం ప్రకాశేన - దీపముల ప్రకాశము వలన
రావణస్య తేజసా చ - రావణుని తేజస్సు వలన
భూషణానాం అర్చిభిః - ఆభరణముల కాంతి వలన
ప్రదీప్తా ఇతి అమన్యత -
ప్రజ్వలిస్తున్నట్లు ఉండెను అని (హనుమ) తలచెను

||శ్లోకతాత్పర్యము||

ఆ దీపముల ప్రకాశము వలన, రావణుని తేజస్సు వలన, ఆ ఆభరణముల కాంతి వలన, ఆశాల ప్రజ్వలిస్తున్నట్లు ఉండెను , అని హనుమ తలచెను. ||9.33||

||శ్లోకము 9.34||

తతోఽపశ్యత్కుథాఽఽసీనాం నానావర్ణామ్బరస్రజమ్|
సహస్రం వరనారీణాం నానావేష విభూషితమ్ ||9.34||

స|| తత్ః కుథాసీనమ్ నానావర్ణాంబరస్రజమ్ నానావేషభూషితమ్ వరనారీణామ్ సహస్రం అపశ్యత్ ||

||శ్లోకార్థములు||

తత్ః కుథాసీనమ్ -
అప్పుడు (హనుమంతుడు) తివాచీలపై కూర్చుని ఉన్న
నానావర్ణాంబరస్రజమ్ -
అనేక రంగుల వస్త్రములు ధరించిన
నానావేషభూషితమ్-
అనేక రకములైన వేషములు ధరించిన
వరనారీణామ్ సహస్రం అపశ్యత్ -
వేలకొలదీ వరనారీమణులను చూచెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు హనుమంతుడు తివాచీలపై కూర్చుని ఉన్న అనేక రంగుల వస్త్రములు ధరించిన, అనేక రకములైన వేషములు ధరించిన, వేలకొలదీ వరనారీమణులను చూచెను." ||9.34||

||శ్లోకము 9.35||

పరివృత్తఽర్థరాత్రే తు పాననిద్రావశం గతమ్|
క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా||9.35||

స||రాత్రౌ క్రీడిత్వా ఉపరతం పాననిద్రావశం గతం తదా అర్థరాత్రే పరివృత్తే బలవత్ సుష్వాప||

||శ్లోకార్థములు||

రాత్రౌ క్రీడిత్వా ఉపరతం -
రాత్రి క్రీడలలో పాల్గొని అలసి పోయి
పాననిద్రావశం గతం -
పానము వలన కలిగిన నిద్రకు వశులై
తదా అర్థరాత్రే పరివృత్తే -
అర్ధరాత్రి గడిచిన తరువాత
బలవత్ సుష్వాప -
గాఢనిద్రలో వున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"ఆ స్త్రీలు రాత్రి క్రీడలలో పాల్గొని అలసి పోయి, పానము వలన కలిగిన నిద్రకు వశులై, అర్ధరాత్రి గడిచిన తరువాత గాఢనిద్రలో వున్నారు." ||9.35||

|శ్లోకము 9.36||

తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాన్తరభూషణమ్|
నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్||9.36||

స||నిఃశబ్దాంతర భూషణమ్ ప్రసుప్తమ్ నిఃశబ్ధాంతర భ్రమరం మహత్ పద్మవనం యథా విరురుచే||

||శ్లోకార్థములు||

నిఃశబ్దాంతర భూషణమ్ ప్రసుప్తమ్ -
శ్శబ్దములేని ఆభరణములతో నిద్రిస్తున్న (స్త్రీలు కల ఆ శాల)
నిఃశబ్ధహంస భ్రమరం -
నిశ్శబ్దముగా వున్న భ్రమరములు హంసల తో (కూడిన)
మహత్ పద్మవనం యథా -
పద్మములతో కూడిన పెద్ద వనము( సరస్సు) వలె
విరురుచే - విరాజిల్లు చుండెను

||శ్లోకతాత్పర్యము||

"నిశ్శబ్దముగా వున్న ఆభరణములు కల ఆ స్త్రీలతూ నున్న ఆ శాల , నిశ్శబ్దముగా వున్న భ్రమరములు హంసలు ఉన్న పద్మవనము లాగా విరాజిల్లెను."||9.36||

||శ్లోకము 9.37||

తాసాం సంవృతదంతాని మీలితాక్షాణి మారుతిః|
అపశ్యత్ పద్మగన్ధీని వదనాని సుయోషితామ్||9.37||

స|| మారుతిః తాసాం సుయోషితామ్ సంవృతదన్తాని మీలితాక్షాణి పద్మసుగంధిని వదనాని అపస్యత్ ||

||శ్లోకార్థములు||

తాసాం సుయోషితామ్ -
ఆ సుందరీమణుల
సంవృతదంతాని -
దంతములు కనపడకుండా వున్న
మీలితాక్షాణి -
మూసుకుపోబడిన కళ్ళుగల
పద్మసుగంధిని వదనాని-
పద్మగంధము వెదజల్లుతున్న ఆ వర స్త్రీల ముఖములను
మారుతిఃఅపస్యత్ - మారుతి చూచెను

||శ్లోకతాత్పర్యము||

"మీలితాక్షములతో దంతములు కనపడకుండా వున్న, పద్మగంధము వెదజల్లుతున్న ఆ వర స్త్రీల ముఖములను మారుతి చూచెను." ||9.37||

||శ్లోకము 9.38||

ప్రబుద్ధానివ పద్మాని తాసాం భూత్వాక్షపాక్షయే|
పునస్సంవృతపత్త్రాణి రాత్రావివ బభుస్తదా||9.38||

స|| తాసాం క్షపాక్షయే ప్రబుద్ధాని పద్మానివ భూత్వా పునః రాత్రౌ సంవృతపత్రాణివ తదా బభుః||

రామటీకాలో గోవిన్దరాజ టీకాలో కూడా - తాసాం వదనానాన్ ఇతి శేషః- అంటే ఈ శ్లోకము అక్కడి స్త్రీల వదనము గురించి వర్ణన అని

||శ్లోకార్థములు||

క్షపాక్షయే ప్రబుద్ధాని -
సూర్యోదయమునుండి రాత్రి వఱకు
పద్మానివ భూత్వా - పద్మములలా వుండి
పునః రాత్రౌ సంవృతపత్రాణివ -
మళ్ళీ రాత్రిలో ముడుచుకున్న పద్మములవలె
తదా బభుః - అప్పుడు కనిపిస్తున్నాయి

||శ్లోకతాత్పర్యము||

"( అస్త్రీల వదనములు) సూర్యోదయమునుండి రాత్రి వఱకు పద్మముల వలె వుండి ఆ స్త్రీలు మళ్ళీ రాత్రి లో ముడుచుకున్న పద్మములవలె కనిపిస్తున్నాయి".||9.38||

||శ్లోకము 9.39||

ఇమాని ముఖపద్మాని నియతం మత్తషట్పదాః|
అమ్బుజానీవ ఫుల్లాని ప్రార్థయన్తి పునః పునః||9.39||

స|| మత్తషట్పదాః ఇమాని ముఖపద్మాని ఫ్హుల్లాని అమ్బ్బుజానివ పునః పునః నియతమ్ ప్రార్థయన్తి ఇతి శ్రీమాన్ మహాకపిః అమన్యత |

రామటీకాలో- ఇమాని ప్రదృశ్యమానాని ముఖపద్మాని ఫుల్లాని అమ్బుజానివ, షట్పదాః పునః పునః ప్రార్థయన్తి నిత్యం తత్ర స్థాతుం ప్రయాచన్త ఇత్యర్థః, ఇతి యేవ అమన్యత అన్వమినోత్ అత ఏవ తాని వదనాని ఉపపత్యాఽనుమాన యుక్తా సలిలోద్భవైః కోమలైః సమాని మేనే।

గోవిన్దరాజా తమ టీకాలో- తాని ముఖాని గుణతః సౌరభాది గుణైః సలిలోద్భవైః పద్మైః।ప్రార్థయన్తి ప్రాథయేరన్ మధుర సలుబ్ధతయా అత్ర పునః పునః షట్పదాని పతేయుర్త్యర్థః।

||శ్లోకార్థములు||

మత్తషట్పదాః -
మత్తెక్కిన తుమెదలు
ఇమాని ముఖపద్మాని -
వీరి ముఖపద్మములను
అమ్బుజానీవ ఫుల్లాని -
వికసించిన పద్మముల రీతి
పునః పునః నియతమ్ ప్రార్థయన్తి -
ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ కోరుచున్నవి

||శ్లోకతాత్పర్యము||

"మత్తెక్కిన తుమెదలు వీరి ముఖపద్మములను వికసించిన పద్మముల రీతి ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ కోరుచున్నవి"||9.39||

||శ్లోకము 9.40||

ఇతిచామన్యత శ్రీమాన్ ఉపపత్యా మహాకపిః|
మేనే హి గుణతస్తాని సమాని సలిలోద్భవైః||9.40||

స|| తాని గుణతః ఉపపత్త్యా సలిలోద్భవైః సమాని మేనే హి ||

||శ్లోకార్థములు||

శ్రీమాన్ మహాకపిః -
శ్రీమంతుడైన ఆ మహావానరుడు
తాని గుణతః సలిలోద్భవైః సమాని -
వాటిని ( ఆ ముఖపద్మములను) గుణములతో సరస్సులోని పద్మములతో సమానమని
ఉపపత్త్యా - ఎంచి ( అనుకొని)
ఇతి చ అమన్యత -
తుమ్మెదలు ఆ భ్రమతో మళ్ళీ మళ్ళీ వాలుతున్నాయి అని అనుకొనెను

||శ్లోకతాత్పర్యము||

"శ్రీమంతుడైన ఆ మహాకపి గుణములు ఆధారముగా ఆ స్త్రీల ముఖములు సలిలములో జనించిన పద్మముల సమానముగా ఎంచి, మత్తెక్కిన తుమ్మెదలు మళ్ళీ మళ్ళీ ఆ ముఖపద్మములను పద్మములని భ్రమతో నిశ్చయముగా వాలుతున్నాయి అని అనుకొనెను."||9.40||

||శ్లోకము 9.41||

సా తస్య శుశుభేశాలా తాభిస్త్రీభి ర్విరాజితా|
శారదీవ ప్రసన్నా ద్యౌః తారాభిరభిశోభితా||9.41||

స|| తస్య సా శాలా తాభిః స్త్రీభిః విరాజితా | తారాభిః అభిశోభితా ప్రసన్నా శారదీ ద్యౌ ఇవ శుశుభే||

||శ్లోకార్థములు||

తస్య సా శాలా -
రావణుని యొక్క ఆ శాల
తాభిః స్త్రీభిః - ఆ స్త్రీలతో
తారాభిః అభిశోభితా -
తారలతో శోభించుచున్న
ప్రసన్నా శారదీ ద్యౌ ఇవ శుశుభే -
ప్రసన్నమైన శర్ద్కాలపు ఆకాశము శోబించుచున్నట్లు
తాభిః స్త్రీభిః విరాజితా - ఆ స్త్రీలతో విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

తా|| "ఆ రాక్షసేంద్రుని యొక్క ఆ శాల, తారలతో కూడి శోభిస్తున్న నిర్మలమైన శరత్ రాత్రివలె, ఆ స్త్రీలతో విరాజిల్లెను"||9.41||

||శ్లోకము 9.42||

స చ తాభిః పరివృతః శుశుభే రాక్షసాధిపః|
యథా హ్యుడు పతిః శ్రీమాం స్తారాభిరభిసంవృతః||9.42||

స|| తాభిః పరివృత్తః సః రాక్షసాధిపః తారాభి అభిసంవృత్తః శ్రీమాన్ హ్యుడుపతిః ఇవ శుశుభే||

||శ్లోకార్థములు||

తాభిః పరివృత్తః సః రాక్షసాధిపః - వారిచే చుట్టబడియున్న ఆ రాక్షస రాజు
తారాభి అభిసంవృత్తః - తారాలతో చుట్టబడిన
శ్రీమాన్ హ్యుడుపతిః ఇవ శుశుభే - శ్రీమంతుడైన చంద్రుడు శోభించినట్లు

||శ్లోకతాత్పర్యము||

"ఆ స్త్రీలతో చుట్టబడి ఆ రావణుడు తారలతో చుట్టబడి వెలుగుచున్న చంద్రుడిలా వెలుగుచుండెను." ||9.42||

||శ్లోకము 9.43||

యాశ్చ్యవన్తేఽమ్బరాత్తారాః పుణ్యశేష సమావృతాః|
ఇమా స్తా స్సంగతాః కృత్స్నా ఇతి మేనే హరిస్తదా||9.43||

స|| యాః తారాః పుణ్యశేష సమావృతాః అమ్బరాత్ చ్యవన్తే తాః కృత్స్నాః ఇమాః సంగతాః ఇతి తదా హరిః మేనే ||

||శ్లోకార్థములు||

యాః తారాః పుణ్యశేష సమావృతాః -
ఏ తారలు పుణ్యము క్షీణించిపోగా
అమ్బరాత్ చ్యవన్తే -
ఆకాశమునుండి పడిపోయినాయో
తాః కృత్స్నాః ఇమాః సంగతాః -
వారందరూ పూర్తిగా ఈ స్త్రీలలో వున్నారు
ఇతి తదా హరిః మేనే -
అని ఆ వానరుడు తలచెను

||శ్లోకతాత్పర్యము||

"ఏ తారలు పుణ్యము క్షీణించిపోగా ఆకాశమునుండి పడిపోయినాయో , వారందరూ పూర్తిగా ఈ స్త్రీలలో వున్నారు అని ఆ వానరుడు తలచెను." ||9.43||

||శ్లోకము 9.44||

తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషామ్|
ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితామ్||9.44||

స|| తత్ర యోషితామ్ ప్రభావర్ణ ప్రసాదః చ శుభార్చిషామ్ మహతీనామ్ తారాణామివ సువ్యక్తమ్ విరేజుః||

||శ్లోకార్థములు||

తత్ర యోషితామ్ - ఆ సుందరీమణుల
ప్రభావర్ణ ప్రసాదః -
కాంతి వర్ణము ప్రసన్నతా
శుభార్చిషామ్ -
శుభమైన కాంతిని ప్రసరించే
మహతీనామ్ తారాణామివ సువ్యక్తమ్ -
మహత్తరమైన తారలవలె బాగుగా కనిపించుచూ
విరేజుః - ప్రకాశించుచున్నవి

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ ఆ వరస్త్రీల రంగులు, కాంతి, ప్రసన్నతా, శుభమైన కాంతిని ప్రసరించే మహత్తరమైన తారల వలె బాగుగా కనిపించుచూ ప్రకాశిస్తున్నవి." ||9.44||

||శ్లోకము 9.45||

వ్యావృత్తగురు పీనస్రక్ప్రకీర్ణ వరభూషణాః|
పానవ్యాయామకాలేషు నిద్రాపహృతచేతసః||9.45||

స|| ( సా) పానవ్యాయామ కాలేషు వ్యావృత్త గురుపీన స్రక్ప్రకీర్ణ వర భూషణాః నిద్ర అపహృత చేతసః సన్తి||

||శ్లోకార్థములు||

పానవ్యాయామ కాలేషు -
పాన క్రీడల సమయములో
వ్యావృత్త గురుపీన స్రక్ప్రకీర్ణ వర భూషణాః -
ధరించిన ఆభరణములు చెల్లాచెదరై
నిద్ర అపహృత చేతసః - అదమరచి నిద్రిస్తున్నారు

||శ్లోకతాత్పర్యము||

"పానక్రీడల సమయములో ధరించిన ఆభరణములు చెల్లాచెదరై వున్న ఆ స్త్రీలు అదమరచి నిద్రిస్తున్నారు." ||9.45||

||శ్లోకము 9.46||

వ్యావృత్త తిలకాః కాశ్చిత్ కాశ్చిదుద్భ్రాన్తనూపురాః|
పార్శ్వే గళితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితాః||9.46||

స|| కశ్చిత్ పరమయోషితః వ్యావృత్త తిలకాః కశ్చిత్ ఉద్భ్రాన్తనూపురాః కశ్చిత్ పార్శ్వే గళితహారాః చ ||

||శ్లోకార్థములు||

కశ్చిత్ పరమయోషితః వ్యావృత్త తిలకాః -
కొందరు వరస్త్రీల తిలకము రేగి పోయి ఉన్నది
కశ్చిత్ ఉద్భ్రాన్తనూపురాః -
కొందరి నూపురములు స్థానము తప్పాయి.
కశ్చిత్ పార్శ్వే గళితహారాః చ -
కొందరి హారములు పక్కకి జారి పడి ఉన్నాయి

||శ్లోకతాత్పర్యము||

"కొందరు వరస్త్రీల తిలకము రేగి పోయి ఉన్నది. కొందరి నూపురములు స్థానము తప్పాయి. కొందరి హారములు పక్కకి జారి పడి ఉన్నాయి."||9.46||

||శ్లోకము 9.47||

ముక్తాహారాఽవృతా శ్చాన్యాః కాశ్చిత్ విస్రస్తవాససః|
వ్యావిద్దరశనాదామాః కిశోర్య ఇవ వాహితాః||9.47||

స|| అన్యాః ముక్తాహారావృతాః అన్యాః కాశ్చిత్ విస్రస్తవాససః వ్యావిద్ధరశనాదామాః వాహితాః కిశోర్యాః ఇవ ఆసీత్||

||శ్లోకార్థములు||

అన్యాః ముక్తాహారావృతాః -
మరికోందరు తెగిన ముత్యాలహారముల కలవారై ఉన్నారు
అన్యాః కాశ్చిత్ విస్రస్తవాససః -
కొందరి వస్త్రములు జారిపోయి ఉన్నాయి
వ్యావిద్ధరశనాదామాః -
కొందరి మొలనూళ్ళు తెగి పోయిఉన్నాయి
వాహితాః కిశోర్యాః ఇవ -
కొందరు నేలపై పొరలుతున్న ఆడగుర్రములవలె నున్నారు

||శ్లోకతాత్పర్యము||

"మరికోందరు తెగిన ముత్యాలహారముల కలవారై ఉన్నారు. కొందరి వస్త్రములు జారిపోయి ఉన్నాయి. కొందరి మొలనూళ్ళు తెగి పోయిఉన్నాయి.కొందరు నేలపై పొరలుతున్న ఆడగుర్రములవలె నున్నారు"||9.47||

||శ్లోకము 9.48||

సుకుణ్డలధరాశ్చాన్యా విచ్ఛిన్నమృదితస్రజః|
గజేన్ద్రమృదితాః పుల్లా లతా ఇవ మహాననే||9.48||

స|| సుకుణ్డలధరాః అన్యాః విచ్ఛిన్నమృదితస్రజాః మహావనే గజేంద్రమృదితాః పుల్లా లతా ఇవ ఆసీత్ ||

||శ్లోకార్థములు||

మహావనే - మహారణ్యములో
గజేన్ద్రమృదితాః పుల్లా లతా ఇవ -
గజేంద్రునిచే చెల్లాచెదరు చేయబడినా కాని వికసిస్తున్న లతల వలె
అన్యాః విచ్ఛిన్నమృదితస్రజాః -
కొందరు దాల్చిన హారములు తెగి చిందరవందరగా వున్నా
సుకుణ్డలధరాః -
మంచికుండలములను ధరించి వున్నారు

||శ్లోకతాత్పర్యము||

"మహారణ్యములో గజేంద్రునిచే చెల్లాచెదరు చేయబడినా కాని వికసిస్తున్న లతల వలె కొందరు స్త్రీలు దాల్చిన హారములు తెగి చిందరవందరగా వున్నా మంచికుండలములను ధరించి వున్నారు." ||9.48||

||శ్లోకము 9.49||

చన్ద్రాంశుకిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః|
హంసా ఇవ బభుః సుప్తాః స్తనమధ్యేషు యోషితామ్||9.49||

స॥ కాసాంచిత్ యోషితాం స్తనమధ్యేషు ఉత్కటాః చంద్రాంశుకిరణాభాః చ హారాః సుప్తాః హంసా ఇవ బభుః||

||శ్లోకార్థములు||

కాసాంచిత్ యోషితాం - కొందరు వరస్త్రీలు
స్తనమధ్యేషు ఉత్కటాః హారాః చ -
స్థనముల మధ్య వెలుగుచున్న హారములతో
చంద్రాంశుకిరణాభాః - చంద్రకిరణముల కాంతిలో
సుప్తాః హంసా ఇవ బభుః - నిద్రిస్తున్న హంసల వలె ఉన్నారు

||శ్లోకతాత్పర్యము||

"కొందరు వరస్త్రీలు స్థనముల మధ్య వెలుగుచున్న హారములతో చంద్రకిరణముల కాంతిలో నిద్రిస్తున్న హంసల వలె ఉన్నారు."||9.49||

||శ్లోకము 9.50||

అపరాసాం చ వైఢూర్యాః కాదమ్బా ఇవ పక్షిణః|
హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్||9.50||

స॥ అపరాసాంశ్చ వైడూర్యాః పక్షిణః కాదమ్బాః ఇవ అన్యాసామ్ హేమసూత్రాణి పక్షిణః చక్రవాకా ఇవ||

||శ్లోకార్థములు||

అపరాసాంశ్చ వైడూర్యాః పక్షిణః కాదమ్బాః ఇవ -
కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్యములు కాదంబపక్షుల వలెను
అన్యాసామ్ హేమసూత్రాణి పక్షిణః చక్రవాకా ఇవ -
కొందరు ధరించిన సువర్ణ సూత్రాలు చక్రవాక పక్షులవలెను

||శ్లోకతాత్పర్యము||

"కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్యములు కాదంబపక్షుల వలెను, కొందరు ధరించిన సువర్ణ సూత్రాలు చక్రవాక పక్షులవలెను కనిపిస్తున్నాయి."||9.50||

||శ్లోకము 9.51||

హంసకారణ్డవాకీర్ణాః చక్రవాకోపశోభితాః|
ఆపగా ఇవ తా రేజుర్జఘనైః పులినైరివ||9.51||

స|| జఘనైః పులినైః ఇవ తాః హంసకారణ్డవాకీర్ణాః చక్రవాకోపశోభితాః ఆపగా ఇవ రేజుః||

||శ్లోకార్థములు||

జఘనైః పులినైః ఇవ తాః -
ఇసుకతిన్నెలవలె జఘనములు కల ఆ స్త్రీలు
హంసకారణ్డవాకీర్ణాః -
హంస కారండవపక్షులచే నిండిన
చక్రవాకోపశోభితాః -
చక్రవాక పక్షులచే విరాజిల్లు
ఆపగా ఇవ రేజుః -
నదుల వలె సోభిస్తున్నారు

||శ్లోకతాత్పర్యము||

"ఇసుకతిన్నెలవలె విశాలమైన జఘనములు కల ఆ స్త్రీలు హంసకారండవ చక్రవాక పక్షులచే విరాజిల్లు నదులవలె శోభిస్తున్నారు."||9.51||

||శ్లోకము 9.52||

కిఙ్కిణీ జాల సంకోశాస్తా హైమవిపులాంబుజాః|
భావగ్రాహా యశస్తీరాః సుప్తానద్య ఇవాఽఽబభుః||9.52||

స|| కింకిణీజ్వాలసంకోశాః హైమవిపులామ్బుజాః సుప్తాః భావగ్రాహాః యశస్తీరాః నద్యా ఇవ ఆబభుః||

||శ్లోకార్థములు||

కింకిణీజ్వాలసంకోశాః సుప్తాః -
చిరుమువ్వలుగల మొలతాళ్ళతో నిద్రిస్తున్న ( స్త్రీలు)
నద్యా ఇవ ఆబభుః -
నదులవలె శోభించారు
హైమవిపులామ్బుజాః -
బంగారు ఆభరణములు విపులమైన పద్మములు వలె
భావగ్రాహాః -
శృంగారచేష్ఠలలో ఏర్పడ్డ గాట్లే మొసళ్ళవలె
యశస్తీరాః -
వారి యశస్సులే తీరాలుగాను
(ఆబభుః) - ఒప్పారుతున్నాయి

||శ్లోకతాత్పర్యము||

"చిరుమువ్వలుగల మొలతాళ్ళను, బంగారు ఆభరణములు ధరించి నిద్రిసున్న ఆ స్త్రీలు పెద్ద పద్మములు లాగా, శృంగార చేష్టలలో ఏర్పడ్డ నఖగాట్లే మొసళ్ల గా, వారి యశస్సులే తీరాలుగా, గలిగిన నదులవలె ఒప్పారుతున్నాయి."||9.52||

||శ్లోకము 9.53||

మృదుష్వఙ్గేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః|
బభూవుర్భూషణా నీవ శుభా భూషణరాజయః||9.53||

స|| కాసాంచిత్ మృదుషు అంగేషు కుచాగ్రేషు చ సంస్థితాః శుభాః భూషణరాజయః భూషణానీవ బభూవుః ||

|శ్లోకార్థములు||

కాసాంచిత్ మృదుషు అంగేషు కుచాగ్రేషు-
కొందరి మృదువైన అంగములమీద కుచాగ్రముల మీద
సంస్థితాః శుభాః - శుభకరమైన ముద్రలు
భూషణరాజయః భూషణానీవ బభూవుః -
భూషణ ముద్రలు భూషణములవలె ప్రకాశించుచున్నాయి

||శ్లోకతాత్పర్యము||

"మృదువైన అంగములు కల కొందరు వారి అంగముల మీద కుచములమీద పడిన ఆభరణముల ముద్రలు అవే ఆభరణముల వలె ప్రకాశించుచున్నాయి." ||9.53||

||శ్లోకము 9.54||

అంశుకాన్తాశ్చ కాసాంచిన్ ముఖమారుతకంపితాః|
ఉపర్యుపరివక్త్రాణాం వ్యాధూయన్తే పునః పునః||9.54||

స|| కాసాంచిత్ ముఖమారుత కంపితాః అంశుకాంతాశ్చ వక్త్రాణాం ఉపరి ఉపరి పునః పునః వ్యాధూయన్తే||

||శ్లోకార్థములు||

కాసాంచిత్ ముఖమారుత - కొందరి ముఖముల శ్వాస నిశ్వాసల గా
కంపితాః అంశుకాంతాశ్చ- కంపించబడిన పయ్యెద కొంగులు
వక్త్రాణాం ఉపరి ఉపరి - వారి ముఖములపైన
పునః పునః వ్యాధూయన్తే - మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి
||శ్లోకతాత్పర్యము||

"కొందరి ముఖముల శ్వాస నిశ్వాసల గాలితో కంపించబడిన పయ్యెద కొంగులు వారి ముఖములపైన మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి." ||9.54||

||శ్లోకము 9.55||

తాః పతాకాఇవోద్ధూతాః పత్నీనాం రుచిరప్రభాః|
నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే||9.55||

స|| నానావర్ణసువర్ణానాం పత్నీనామ్ వక్త్రమూలేషు తాః రుచిరప్రభాః ఉధ్దూతాః పతాకాః ఇవ రేజిరే||

||శ్లోకార్థములు||

నానావర్ణసువర్ణానాం పత్నీనామ్ -
అనేకమైన మంచి రంగులు కల ఆ రావణ పత్నుల
వక్త్రమూలేషు తాః రుచిరప్రభాః -
ముఖములపై వస్త్రాంతములు
ఉధ్దూతాః పతాకాః ఇవ రేజిరే -
ఎగురుచున్న పతాకములవలె నున్నవి

||శ్లోకతాత్పర్యము||

"అనేకమైన మంచి రంగులు కల అ స్త్రీల ముఖములపై వస్త్రాంతములు రెపరెపలాడుచూ ఎగురుచున్న పతాకములవలె నున్నవి."||9.55||

||శ్లోకము 9.56||

వవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుణ్డలాని శుభార్చిషామ్|
ముఖమారుత సంసర్గాన్ మన్దం మన్దం సుయోషితామ్||9.56||

స|| కాసాంశ్చిత్ శుభార్చిషామ్ యోషితాం కుణ్డలాని అత్ర ముఖ మారుత సంసర్గాత్ మన్దం మన్దం వవల్గుశ్చ||

||శ్లోకార్థములు||

కాసాంశ్చిత్ శుభార్చిషామ్ యోషితాం -
కొందరు శుభప్రదమైన సుందరాంగుల
కుణ్డలాని అత్ర ముఖ మారుత సంసర్గాత్ -
కుండలములు అక్కడ ముఖమునుంచి వచ్చిన ఉఛ్వాస నిఃశ్వాసలతో
మన్దం మన్దం వవల్గుశ్చ -
మెల్లి మెల్లిగా ఊగుచూఉన్నాయి

||శ్లోకతాత్పర్యము||

"కొందరు శుభప్రదమైన సుందరాంగుల కుండలములు, అక్కడ ముఖమునుంచి వచ్చిన ఉఛ్వాస నిఃశ్వాసలతో, మెల్లిగా మెల్ల్లిగా కంపిస్తున్నాయి ." ||9.56||

||శ్లోకము 9.57||

శర్కరఽసన గన్ధైశ్చ ప్రకృత్యా సురభిస్సుఖః|
తాసాం వదననిశ్వ్యాసః సిషేవే రావణం తదా||9.57||

స||తదా ప్రకృత్యా శర్కరాసవగంధైశ్చ సురభిః సుఖః తాసామ్ వదననిఃశ్వాసః రావణం శిషేవే||

||శ్లోకార్థములు||

తదా ప్రకృత్యా - అప్పుడు స్వాభావికముగా
శర్కరాసవగంధైశ్చ -
చక్కర తో కూడిన గంధము కల
తాసామ్ వదననిఃశ్వాసః -
వారి వదనమునుంచి వస్తున్న ఉఛ్వాస నిఃశ్వాసములు
సురభిః సుఖః - పరమళిస్తూ సుఖముగా
రావణం శిషేవే - రావణుని సేవించుచున్నవి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు స్వాభావికముగా పరిమళభరితమైన ముఖమునుంచి వచ్చువారి శ్వాసలు రావణుని కి సేవచేస్తున్నాయి." ||9.57||

||శ్లోకము 9.58||

రావణాననశఙ్కాశ్చ కాశ్చిత్ రావణయోషితః|
ముఖాని స్మ సపత్నీనాం ఉపాజిఘ్రన్ పునః పునః||9.58||

స|| కశ్చిత్ రావణ యోషితాః రావణాననశంకాశ్చ పునః పునః సపత్నీనామ్ ముఖాని ఉపాజిఘ్రన్||

||శ్లోకార్థములు||

కశ్చిత్ రావణ యోషితాః- కోందరు రావణ స్త్రీలు
రావణాననశంకాశ్చ - రావణుడే అనుకొని
పునః పునః సపత్నీనామ్ - మళ్ళీ మళ్ళీ సపత్నుల
ముఖాని ఉపాజిఘ్రన్ - ముఖములను ముద్దుపెట్టుకొనసాగిరి.

||శ్లోకతాత్పర్యము||

"కోందరు రావణ స్త్రీలు రావణుడే అనుకొని మళ్ళీ మళ్ళీ సపత్నుల ముఖములను ముద్దుపెట్టుకొనసాగిరి."||9.58||

||శ్లోకము 9.59||

అత్యర్థం సక్తమనసో రావణే తా వరస్త్రియః|
అస్వతన్త్రాః సపత్నీనాం ప్రియమేవాఽఽచరం స్తదా||9.59||

స|| రావణే అత్యర్థం సక్త మనసః తా వరస్త్రియః అస్వతంత్రాః తదా సపత్నీనామ్ ప్రియమేవ ఆచరన్ ||

||శ్లోకార్థములు||

రావణే అత్యర్థం సక్త మనసః -
రావణునిపై అమితమైన ప్రేమగల
తా వరస్త్రియః అస్వతంత్రాః -
ఆ వరాంగనలు అస్వతంత్రులై (భ్రమతో)
తదా సపత్నీనామ్ ప్రియమేవ ఆచరన్ -
తమ సపత్నులకు ప్రియమునే చేకూర్చిరి.

||శ్లోకతాత్పర్యము||

"రావణునిపై అమితమైన ప్రేమగల ఆ వర స్త్రీలు భ్రమతో చెంతనున్న సపత్నులకు ప్రేమను చేకూర్చారు."||9.59||

||శ్లోకము 9.60||

బాహూన్ ఉపవిధాయాన్యాః పారిహార్యవిభూషితాన్|
అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత్ర శిశ్యిరే||9.60||

స|| అన్యాః ప్రమదాః పరిహార్య విభూషితాన్ బాహూన్ రమ్యాణి అంశుకాని ఉపనిధాయ శిశ్యిరే||

||శ్లోకార్థములు||

అన్యాః ప్రమదాః -
ఇంకా కొందరు స్త్రీలు
పరిహార్య విభూషితాన్ బాహూన్ -
ఆభరణములను తీసిన చేతులను
రమ్యాణి అంశుకాని -
అందమైన వస్త్రములను
ఉపనిధాయ శిశ్యిరే -
తలగడాగా చేసుకొని నిదురించిరి

||శ్లోకతాత్పర్యము||

"ఇంకా కొందరు ఆభరణములను తీసిన చేతులను, అందమైన వస్త్రములను తలగడాగా చేసుకొని నిదురించిరి." ||9.60||

||శ్లోకము 9.61||

అన్యావక్షసి చాన్యస్యాః తస్యాః కాశ్చిత్ పునర్భుజమ్|
అపరాత్వఙ్క మన్యస్యాః తస్యాశ్చాప్యపరాభుజౌ||9.61||

స|| అన్యాః అన్యస్యాః వక్షసి కాచిత్ పునః తస్యాః భుజం అపరా అన్యస్యాః అంకం అపరా తస్యాః భుజౌ శిశ్యిరే||

||శ్లోకార్థములు||

అన్యాః అన్యస్యాః వక్షసి -
కొందరు ఇంకొకరి వక్షస్థలముపై
కాచిత్ పునః తస్యాః భుజం-
ఇంకొక వరాంగన అమె భుజముపై
అపరా అన్యస్యాః అంకం -
ఇంకోక వరాంగన ఇంకొకరి తొడలమీద
అపరా తస్యాః భుజౌ శిశ్యిరే -
ఇంకొక వరాంగన అమె భుజముపై నిదురించిరి

||శ్లోకతాత్పర్యము||

"కొందరు ఇంకొకరి వక్షస్థలముపై, అమె భుజముపై ఇంకొక వరాంగన, ఇంకోక వరాంగన ఇంకొకరి తొడలమీద,అమె భుజముపై ఇంకొక వరాంగన నిదురించిరి." ||9.61||

||శ్లోకము 9.62||

ఊరుపార్శ్వకటీ పృష్ఠం అన్యోన్యస్య సమాశ్రితాః|
పరస్పరనివిష్టాఙ్గ్యో మదస్నేహవశానుగాః||9.62||

స|| మదస్నేహవశానుగాః అన్యోన్యస్య ఉరుపార్శ్వకటీపృష్ఠం సమాశ్రితాః పరమనివిష్టాంగ్యః శిశ్యిరే||

||శ్లోకార్థములు||

మదస్నేహవశానుగాః అన్యోన్యస్య-
ఒకరితో నొకరు మద్యపానము వలన స్నేహము కలవారై
ఉరుపార్శ్వకటీపృష్ఠం సమాశ్రితాః -
ఒకరి తొడలు, ప్రక్కలు, కటి ప్రదేశములమీద ఇంకొకరితో కలిసి
పరమనివిష్టాంగ్యః శిశ్యిరే - అంగములలో అంగములు కలవారై నిదురించిరి

||శ్లోకతాత్పర్యము||

"ఒకరితో నొకరు మద్యపానము వలన స్నేహము కలవారై, ఓకరి తొడలు, ప్రక్కలు, కటి ప్రదేశములమీద ఇంకొకరితో కలిసి అంగములలో అంగములు కలవారై నిదురించిరి." ||9.62||

||శ్లోకము 9.63||

అన్యోన్యభుజసూత్రేణ స్త్రీమాలాగ్రథితా హి సా|
మాలేన గ్రథితా సూత్రే శుశుభే మత్తషట్పదా||9.63||

||శ్లోకార్థములు||

అన్యోన్య భుజసూత్రేణ గ్రథితా -
ఒకరికొకరి భుజములు కట్టబడినట్లున్న
సా స్త్రీ మాలా - ఆ స్త్రీల మాల
సూత్రే గ్రథితా మత్తషట్పదాః మాలేవ -
దారముచే గుచ్చబడిన మదించిన తుమ్మెదలు కల పుష్పమాలవలె
శిశ్యిరే - ప్రకాశించుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఒకరికొకరి భుజములు కల స్త్రీలతో కట్టబడినట్లున్న మాల, మదించిన తుమ్మెదలతో దారముతో గుచ్చబడిన పుష్పహారము వలె ప్రకాశిస్తున్నది."||9.63||

||శ్లోకము 9.64,65||

లతానాం మాధవే మాసి పుల్లనాం వాయుసేవనాత్ |
అన్యోన్యమాలాగ్రథితం సంసక్త కుసుమోచ్చయమ్||9.64||
వ్యతివేష్టిత సుస్కన్ధం అన్యోన్యభ్రమరాకులమ్|
ఆసీద్వన మివోద్ధూతమ్ స్త్రీవనం రావణస్య తత్||9.65||

స|| అన్యోన్యమాలాగ్రథితమ్ సంసక్త కుసుమోచ్చయమ్ వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులమ్ రావణస్య తత్ స్త్రీవనం మాఘవే మాసే వాయుసేవనాత్ ఫుల్లానామ్ లతానామ్ అన్యోన్యమాలాగ్రథితమ్ అన్యోన్యభమరాకులమ్ ఉద్ధూతమ్ వనమ్ ఇవ ఆసీత్ ||

||శ్లోకార్థములు||

అన్యోన్యమాలాగ్రథితమ్ - ఒకరిపైనొకరు పెనవేసికొనిన
సంసక్త కుసుమోచ్చయమ్ - కుసుమముల మాల వలె
వ్యతివేష్టిత సుస్కంధం - భుజములు పరస్పరము చుట్టుకొని
అన్యోన్య భ్రమరాకులమ్ - భ్రమరములవలె నున్న
రావణస్య తత్ స్త్రీవనం - అ రావణుని స్త్రీల వనము
మాఘవే మాసే - మాఘమాసములో
వాయుసేవనాత్ ఉద్ధతమ్ - వాయుసంచారముచే ఊగుతున్న
ఫుల్లానామ్ లతానామ్ - పుష్పించిన తీగలతో నిండిన
అన్యోన్యమాలాగ్రథితమ్ - ఓకటితో నొకటి చుట్టుకొని మాలవలెనున్న
అన్యోన్యభమరాకులమ్ - భ్రమరములతో నిండిన,
వనమ్ ఇవ - వనము వలె

||శ్లోకతాత్పర్యము||

"ఒకరిపైనొకరు పెనవేసికొనిన కుసుమముల మాల వలె భుజములు పరస్పరము చుట్టుకొని భ్రమరములవలె నున్న అ రావణుని స్త్రీల వనము మాఘమాసములో వాయుసంచారముచే వూగుతున్న, పుష్పించిన భ్రమరములతో నిండిన, లతావనములో కలిసిన తీగలవలెనున్న వనమును తోపింపచేయుచున్నది". ||9.64,65||

||శ్లోకము 9.66||

ఉచితేష్వపి సువ్యక్తం న తాసాం యోషితాం తదా|
వివేకశ్శక్య ఆధాతుం భూషణాఙ్గామ్బరస్రజామ్||9.66||

స||తదా తాసాం యోషితామ్ భూషణాంగాంబర స్రజామ్ వివేకః సువ్యక్తం ఆధాతుమ్ ఉచితేష్వపి న శక్యః||

||శ్లోకార్థములు||

తదా తాసాం యోషితామ్ -
అప్పుడు ఆ వరాంగనల
భూషణాంగాంబర స్రజామ్ -
ఆభరణములు అంగములు వస్త్రములు మాలలు
వివేకః సువ్యక్తం -
వివేకముకలవాడు కూడా స్పష్ఠముగా
ఆధాతుమ్ ఉచితేష్వపి న శక్యః -
ఎక్కడ ఏదివున్నదో చెప్పుటకు శక్యము కాదు

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వరాంగనల ఆభరణములు అంగములు వస్త్రములు వివేకముకలవాడు కూడా ఎవరివో ఏవో చెప్పడానికి శక్యము కాదు." ||9.66||

||శ్లోకము 9.67||

రావణేసుఖసంవిష్టే తా స్స్త్రియో వివిధ ప్రభాః|
జ్వలన్తః కాఞ్చనా దీపాః ప్రైక్షంతాఽనిమిషా ఇవ||9.67||

స|| రావణే సుఖసంవిష్టే వివిధప్రభాః తాః స్త్రియః జ్వలంతః కాంచనాః దీపాః ఇవ అనిమిషాః ప్రేక్షంత ఇవ ఆసీత్||

రామ తిలకలో - రావణే సుఖసంవిష్టే సుప్తే సతీ ఇత్యర్థః,జ్వలన్తః కాఞ్చనా దీపాః తదభిమాని దేవ విశేషాః అనిమిషా నిమేషరహితాః, సన్తః వివిధ ప్రభాః తాం రావణసంబన్ధినీః స్త్రియః ప్రేక్షన్తే , ఏతేన రావణ జాగరణ సమయే తత్ స్త్రే దర్శనం దేవానామపి సుదుర్లభః ఇతి వ్యఙ్జితం. తేన రావణ ప్రతాపాతిశయః సూచితమ్ ।

||శ్లోకార్థములు||

రావణేసుఖసంవిష్టే -
రావణుడు సుఖముగా నిద్రిస్తూ ఉన్నప్పుడు
వివిధప్రభాః తాః స్త్రియః -
వివిధ కాంతులుగల ఆ రావణ స్త్రీలను
జ్వలంతః కాంచనాః దీపాః -
జ్వలిస్తున్న ఆ కాంచన దీపములు
అనిమిషాః ప్రేక్షంత ఇవ -
తదేకముగా చూస్తున్నవా అన్నట్లు

||శ్లోకతాత్పర్యము||

"రావణుడు సుఖముగా నిద్రిస్తూ ఉన్నప్పుడు వివిధ కాంతులుగల ఆ రావణ స్త్రీలను జ్వలిస్తున్న ఆదీపములు తదేకముగా చూస్తున్నవా అన్నట్లు ఉన్నవి."||9.67||

ఇక్కడ రావణుడు మెలుకువగా ఉన్నప్పుడు రావణుని భార్యలవేపు దేవతలు కూడా చూడలేరు అని ఒక ధ్వని; అదే రావణ ప్రతాపము గురించి ఇంకో ధ్వని.

||శ్లోకము 9.68||

రాజర్షిపితృదైత్యానాం గన్ధర్వాణాం చ యోషితః|
రాక్షసానాం చ యాః కన్యాః తస్య కామవశం గతాః||9.68||

స||రాజర్షి పిత్రుదైత్యానామ్ గంధర్వాణాం యోషితః రాక్షసానామ్ యాః కన్యాః తస్య కామవశానుగతాః ||

||శ్లోకార్థములు||

రాజర్షి పిత్రుదైత్యానామ్ గన్ధర్వాణాం -
రాజర్షుల పితృదేవతల దైత్యుల గంధర్వుల
యోషితః - స్త్రీలు
రాక్షసానామ్ యాః కన్యాః -
రాక్షసుల ఆ కన్యలు
తస్య కామవశానుగతాః -
అతని కామముచే వశులై ఉన్నారు.

||శ్లోకతాత్పర్యము||

"రాజర్షుల స్త్రీలు, పితృదేవతల అతివలు, దైత్యాంగనలు, గంధర్వ కాంతలు, రాక్షస కన్యలు అతనిపై కామముచే వశులై ఉన్నారు." ||9.68||

||శ్లోకము 9.69||

యుద్ధకామేన తా స్సర్వా రావణేన హృతా స్త్రియః|
సమదా మదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః||9.69||

స|| సర్వాః తాః స్త్రియః యుద్ధకామేన రావణేన హృతాః సమదాః కాశ్చిత్ మదనేన మోహితాః ఏవ ఆగతాః||

||శ్లోకార్థములు||

సర్వాః తాః స్త్రియః - ఆ స్త్రీలు అందరు
యుద్ధకామేన రావణేన హృతాః -
యుద్ధముచేయు కోరికగల రావణునిచేత అపహరింపబడినవారు
సమదాః కాశ్చిత్ మదనేన మోహితాః ఏవ ఆగతాః-
కొందరు మదనోన్మత్తముచే ప్రేరేపింపబడి వచ్చినవారు

సర్వాః తాః స్త్రియః - ఆ స్త్రీలు అందరు
యుద్ధకామేన రావణేన హృతాః -
యుద్ధముచేయు కోరికగల రావణునిచేత అపహరింపబడినవారు
సమదాః కాశ్చిత్ మదనేన మోహితాః ఏవ ఆగతాః-
కొందరు మదనోన్మత్తముచే ప్రేరేపింపబడి వచ్చినవారు

||శ్లోకతాత్పర్యము||

"ఆ స్త్రీలు అందరు యుద్దములో జయించి తీసుకు రాబడిన వారు, కొందరు మదనోన్మత్తముచే ప్రేరేపింపబడి వచ్చినవారు ఉన్నారు." ||9.69||

"సర్వాః తాః స్త్రియః - ఆ స్త్రీలు అందరు" - అనడములో ఒక్క సీత తప్ప మిగిలిన వారందరు రావణుని పై ప్రేమతో వచ్చినవారే అని ధ్వని

||శ్లోకము 9.70||

న తత్ర కాచిత్ ప్రమదా పసహ్య
వీర్యోపపన్నేన గుణేన లబ్ధా|
న చాన్యకామాపి న చాన్యపూర్వా
వినా వరార్హం జనకాత్మజాం తామ్||9.70||

స|| వరార్హం తాం జనకాత్మజాం వినా తత్ర కాశ్చిత్ ప్రమదా వీర్యోపపన్నేన గుణేన ప్రసహ్య లబ్ధా న అన్యకామాపి చ న అన్యపూర్వాచ న ||

||శ్లోకార్థములు||

వరార్హం తాం జనకాత్మజాం వినా -
అత్యుత్తమురాలైన సీత తప్ప
తత్ర కాశ్చిత్ ప్రమదా వీర్యోపపన్నేన ప్రసహ్య లబ్ధా న
- తన పరాక్రమముచే బలాత్కారముగా తీసుకువచ్చినవారు ఎవరూ లేరు
గుణేన - గుణముల వలననే
అన్యకామాపి చ న -
ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు
అన్యపూర్వాచ న -
పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు లేరు

||శ్లోకతాత్పర్యము||

"అత్యుత్తమురాలైన సీత తప్ప ఆ స్త్రీ సమూహములో తన పరాక్రమముచే బలాత్కారముగా తీసుకువచ్చినవారు ఎవరూ లేరు, ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు, పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు ఎవరూ లేరు." ||9.70||

||శ్లోకము 9.71||

న చాకులీనా న చ హీనరూపా
నాదక్షిణా నానుపచారయుక్తా|
భార్యాభవత్తస్య న హీనసత్త్వా
న చాపి కాన్తస్య న కామనీయా||9.71||

స|| తస్య భార్యా అకులీనా న చ అభవత్ | హీనరూపాచ న | అదక్షిణా చ న | అనుపచారయుక్తా చ న || హీనసత్త్వా చ న | కాన్తస్య న కామనీయా||

రామటీకాలో /In RamaTika elaboration- అకులీణా నిషిద్ధకులోఽత్పన్నా తస్య రావణస్య భార్యా నాభవత్ | హీన రూపా చ నాభవత్| అదక్షినా అకుశలాపి నాభవత్ | అనుపచారయుక్తా ఉత్తమభూషణ రహితా నాభవత్ |హీన సత్త్వా హీన బలాపి న కాన్తస్య రావణస్య న కామనీయా అనీప్సితాఽపి భార్యా నాభవత్"

||శ్లోకార్థములు||

తస్య భార్యా అకులీనా న - అతని భార్యలలో అకులీనులు లేరు
హీనరూపాచ న -రూపము లేని వారు లేరు
అదక్షిణా చ న - యోగ్యతలేని వారు లేరు
హీనసత్త్వా చ న - సత్త్వము లేని వారు లేరు
కాన్తస్య న కామనీయా - ఆ కాంతలలో ఎవరూ కామించతగని వారు లేరు.

||శ్లోకతాత్పర్యము||

"అతని భార్యలలో అకులీనులు లేరు. రూపము లేని వారు లేరు. యోగ్యతలేని వారు లేరు. సత్త్వము లేని వారు లేరు, ఆ కాంతలలో ఎవరూ కామించతగని వారు లేరు." ||9.71||

ఇక్కడ చెప్పినది ఒక సారి మననము చేద్దాము.

అక్కడ "సహస్రం వర నారీణాం" (9.34) వెయ్యిమంది శ్రేష్ఠులైన నారీమణులు, రావణుని భార్యలు అనేక రకముల వేషములతో అనేక రకములైన భంగిమలలో కనపడ్డారుట.

ఆ స్త్రీల సమూహములో ,అత్యుత్తమురాలైన సీత తప్ప, రావణుని పరాక్రమముచే బలాత్కారముగా తీసుకు రాబడినవారు ఎవరూ లేరు, ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు, పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు ఎవరూ లేరు. అందరూ రావణుని వాంఛించినవారే అన్నమాట. అతని భార్యలలో అకులీనులు లేరు. రూపము లేని వారు లేరు. యోగ్యతలేని వారు లేరు. ఉపచారము చేయతగని వారు లేరు. బుద్ధిహీనులు లేరు. ఆ కాంతలలో కామించతగని కాంతలు కూడా లేరుట. ఒక్క సీతమ్మ తప్ప.

||శ్లోకము 9.72||

బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య
యదీదృశీ రాఘవ ధర్మపత్నీ|
ఇమా యథా రాక్షసరాజ భార్యాః
సుజాతమస్యేతి హి సాదుబుద్ధేః||9.72||

స|| ఇమాః రాక్షసరాజభార్యాః యథా రాఘవపత్నీ ఈదృశీ అస్య సుజాతమ్ ఇతి సాధుబుద్ధేః హరీశ్వరస్య బుద్ధిస్తు బభూవ ||

||శ్లోకార్థములు||

ఇమాః రాక్షసరాజభార్యాః యథా -
ఈ రాక్షస భార్యలవలె
రాఘవపత్నీ ఈదృశీ -
రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే
అస్య సుజాతమ్ ఇతి -
అతని పుట్టుక శుభకరమై యుండును అని
సాధుబుద్ధేః హరీశ్వరస్య బుద్ధిస్తు -
సాధు బుద్ధి కల హనుమ కి తోచెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ రాక్షస భార్యలలాగా రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే అతని పుట్టుక శుభకరమై యుండును అని, సాధు బుద్ధి కల హనుమ కి తోచెను" ||9.72||

ఈ అలోచనలో కొంచెము అశ్లీలత కనిపిస్తుంది. అందుకనే కవి వచ్చే శ్లోకములో ఇంకా విశదీకరిస్తాడు.

||శ్లోకము 9.73||

పునశ్చ సోఽచింతయ ధార్తరూపో
ధ్రువం విశిష్టా గుణతో హి సీతా|
అధాయ మస్యాం కృతవాన్ మహాత్మా
లఙ్కేశ్వరః కష్ట మనార్యకర్మ||9.73||

స||సః ఆత్తరూపః పునశ్చ అచిన్తయత్ సీతా ధ్రువం గుణతః విశిష్ఠా అథ మహాత్మా అయం లఙ్కేశ్వరః అస్యాం అనార్యం కృతవాన్ కష్టమ్||

||శ్లోకార్థములు||

సః ఆత్తరూపః పునశ్చ అచిన్తయత్ -
తన స్వరూపము పొందిన హనుమ మరల చింతింప సాగెను
సీతా ధ్రువం గుణతః విశిష్ఠా-
సీత నిజముగా గుణములలో విశిష్ఠురాలు
మహాత్మా అయం లఙ్కేశ్వరః -
మహాత్ముడైన ఈ రావణుడు
అస్యాం అనార్యం కృతవాన్ కష్టమ్-
ఆమె విషయములో హీనముగా వ్యవహిరించెను.ఎంత కష్టము

||శ్లోకతాత్పర్యము||

"తన స్వరూపము పొందిన హనుమ మరల చింతింప సాగెను." సీతాదేవి నిస్సంశయముగా సద్గుణ సంపన్నురాలు. అయినప్పటికీ లంకాధిపతి అయిన రావణుడు ఆమె విషయములో హీనముగా వ్యవహిరించెను.ఎంత కష్టము". ||9.73||

ముందు శ్లోకములో ఈ రాక్షస భార్యలలాగా రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే అతని పుట్టుక శుభకరమై యుండును అని, సాధు బుద్ధి కల హనుమ కి తోచెను అని అంటాడు కవి..
రావణుడు తన స్త్రీలతో ఎలా కలిసి ఉన్నాడో, రాముడు కూడా సీతతో కలిసివున్నచో వీని ఇశ్వర్యము అవిచ్ఛిన్నమై, వీని జన్మ ధన్యమై యుండును గదా అని హనుమ అసలు భావము.

కాని ఆ వాక్య నిర్మాణములో అశ్లీలమైన ధ్వని వినిపిస్తుంది. అందుకనే కవి మళ్ళీ చెపుతాడు పునశ్చ అచిన్తయత్ అని. పునశ్చ అచిన్తయత్ అంటే హనుమ మళ్ళీ ఆలోచించాడు అని.

ఇక్కడ ముందు హనుమ అనుకున్నమాటలో మూడురకముల ధ్వని వచ్చుటకు వీలు ఉన్నది.

(1) "స్వయంవరమునకు ముందే రాముని పొందకుండా ఈ రావణునే పొందియున్నచో
ఈ రాక్షసరాజుల భార్యలానే ఈమె కూడా రావణునితో రమించితే
అతని జన్మ "సుజాతమ్" అంటే మంచిగా పుట్టిన జన్మ అయ్యేది" అని.
హనుమను సాదుబుద్ధి అనబడ్డాడు కాబట్టి ఈ భావము హనుమకి కలిగి యుండదు.

(2) "ఈ రాక్షస రాజు భార్యలు తమ భర్తతో ఎట్లు అనందముగా ఉన్నారో,
అట్లు మా రాముని భార్యకూడా మా రామునితో యున్నచో
ఈ రావణుని జన్మ , సీతాపహరణము లేకుండా "సుజాతమ్" అయ్యేది "
అని ఇంకొక భావము.

(3) మూడో భావము - "మా రాఘవపత్ని వీనిచే అపహరింపబడి ఈ విధముగా నెట్లున్నదో,
అట్లు వీని భార్యలు కూడా మరియొకని చే అపహరింపబడి యున్నచో
వీని జన్మకు తగిన పని ( సుజాతమ్) " అని ఇంకొక భావము.

హనుమంతుడు తలచిన తలపులో దోషము లేకున్ననూ, ఈ విధముగా దోషము స్ఫురించు టకు అవకాశమున్నది అని టికాత్రయ వ్యాఖ్యలలో వింటాము

ఇక్కడ గోవిన్దరాజులవారి వ్యాఖ్య వినతగినది.

గొవిన్దరాజులవారి టీకాలో.. అథ సః హనుమాన్| సీతా గుణతః పాతివ్రత్యాది గుణతః విశిష్ఠా హి| అస్యామ్ ఏతత్ విషయే మహాత్మా మహాకులప్రసూతోఽపి అయం లఙ్కేశ్వరః అనార్యకర్మ అపహరణరూపం కర్మకృతవాన్ కష్టం ఇతి ఆత్త రూపః అత్యన్తమ్ ఆర్తః "ప్రశసాయాం రూపప్" పునశ్చాచిన్తయత్| వైదేహ్యాః ధృఢవ్రతత్వాత్ పాతివ్రత్యభఙ్గో న భవేత్ అపి తు మిథ్యాపవాదం ఏవం ఉత్పాదితవాన్ ఇతి భృశం దుఃఖితః సన్ చిన్తితవాన్ ఇత్యర్థః | ఇక్కడ హనుమకే తోచినమాట, - వైదేహి ధృఢవ్రతముతో పాతివ్రత్య భంగములేనప్పటికీ ఆ రాక్షసస్త్రీలను సీతమ్మను హీనమైన ఉపమానముతో ఒకేవిధముగా తూచడములో సీతమ్మకి మిథ్యాపవాదము కలిగించాను అని పశ్చాత్తాపముతో దుఃఖపడి హనుమ మళ్ళీ "పునశ్చ చిన్తయత్ ఆత్త రూపః". అని భావము

గోవిన్దరాజులవారు టీకాలో ఇంకా చెప్పిన మాట, - 'రాక్షసరాజ పత్నీవత్ సీతా స్వభర్త్రాసంగతా చేత్ సీతాపహరణం న కృత్వాన్ చేత్ అస్య సుజాతం ఇత్యుక్తం'.
అంటే రావణుడు తన స్త్రీలతో ఎలా కలిసి ఉన్నాడో, రాముడు కూడా సీతతో కలిసివున్నచో వీని ఇశ్వర్యము అవిచ్ఛిన్నమై, వీని జన్మ ధన్యమై యుండును గదా అని హనుమ అసలు భావము.

హనుమంతుడుకి కూడా ఆ వాక్య నిర్మాణమున అశ్లీలమగు అర్థము కూడా స్ఫురించుటకు అవకాశమున్నది . అందుకే వెంటనే స్ఫురించెను.

అప్పుడు - "పునశ్చ"- మళ్ళీవెంటనే హనుమంతుడు అనుకుంటాడు.

'పునశ్చ సోఽచింతయదార్తరూపః
ధృవం విశిష్టా గుణతో హి సీతా ' ||9-73||

అలా బాధపడి " ఈ రాక్షస స్త్రీలను సీతతో పోలిక చెప్పుటకు కూడా తగదు. వీరికంటె గుణములలో పాతి వ్రత్య ధర్మములో సీత ప్రత్యేకత గలది" అని అనుకొనెను. " ఈ లంకేశ్వరుడు మహతపశ్శాలియై యుండియు యుక్తానుక్తము ఆలోచించక అనార్యులు చేయవలసిన క్రూరమైన పని ఈ మహాపతివ్రత విషయమున చేసెను! అహా ! ఏమి ఇది !" అని బాధపడెను.

భవద్గీతలో ఒకచోట కృష్ణుడు చెపుతాడు:

"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్త్వతః"|| (గీత 7.03)

"వేలకొలది మనుష్యులలో ఒక్కడు సిద్ధికి యత్నించును. యత్నించినవారిలో కొందరే ముందుకు సాగుదురు. అట్లు సాగిన వారిలో ఏవరో ఒక్కడు భగవత్ స్వరూపమును ఎరుగ గలుగును"అని.

అలాగే లంకలో రావణునిచే బంధింపబడిన కొన్ని వేలమంది "వరనారీమణుల" లో ఒక్కరికికూడా రావణుని వదలి వేరొకనిని పొందవలెనను అనే కోరిక కలుగలేదు. వేరొకడు పొందదగిన వాడు ( పరమాత్మ) ఉన్నాడని భావనయే లేక సుఖములో ఓలలాడుతున్నారు.

ఓక్క సీతమ్మ మాత్రమే రావణుని ఐశ్వర్యమును ధనమును కాదని శ్రీరామచంద్రుని కోరుకొనును.

ఆత్మాన్వేషణ చేయవలెను అనే ఆలోచన అందరికీ స్ఫురించదు. కొన్ని వేలమందిలో ఏ ఒక్కరికో స్ఫురించును.
అతడే ముముక్షువు. ముముక్షువు ( మోక్షమందు కోరిక గలవాడు) అగుట ఎంత దుర్లభమో దీనిచే తెలియబడుచున్నది.
ఈ సర్గలో ముముక్షువు కు గల అడ్డంకులు అన్నీ ఆ రాజభవనము యొక్క వర్ణన ద్వారా , ఆ వరనారీమణుల వర్ణన ద్వారా విశదీకరముగా చెప్పబడినవి.

ఇక్కడ విన్నమాటలు టికాత్రయములో అలాగే అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో వింటాము

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే నవమస్సర్గః||

||ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో తొమ్మిదవ సర్గ సమాప్తము||

||ఓమ్ తత్ సత్||

 

 

 


|| ఓమ్ తత్ సత్||