తెలుగు లో ప్రార్థనలు !!

శ్రీరాములవారిపై పాటలు స్తోత్రాలు !

 

 


|| ఓమ్ తత్ సత్ ||

శ్రీరాములవారిపై స్తోత్రాలు

రామ నామము

మంత్రాలలో రామ నామము ఒక మంత్రము. రామ నామమును తారక మంత్రము అంటారు. తారకము అంటే రక్షింపబడడానికి అనువైనది. తారక మంత్రము అంటే సంసారులను రక్షించె మంత్రము అని. మనము కృష్ణా అనుకోవచ్చు. శివ శివా అనుకోవచ్చు. కాని రామ నామముకే తారక నామము అన్నమాట ఎలా వచ్చింది అంటే కారణాలు మన సాంప్రదాయములో వున్నాయి.

శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారపురుషుడు. విష్ణు సహస్రనామము చదివితే ముక్తి లభిస్తుంది అని వింటాము. కాని అన్ని నామములు చదవడము అందరికి సులభము కాకపోవచ్చు. అదే మాట శివాపార్వతుల సంభాషణలో పార్వతీ దేవి శివుడిని అడుగుతుంది. దానికి శివుడు
"సహస్ర నామ తత్తుల్యమ్ రామ నామ వరాననే" - అంటే ఈ సహస్రనామములతో సమానమైన తుల్యము కలది రామ నామము అని. రామనామము విష్ణువు యొక్క సహస్రనామముల తో తుల్యము అంటే సమానము అని. సహస్ర నామములు చేయలేనివారికి రామనామము తారక మంత్రము అన్నమాట.

రాముడు దయా స్వభావము కలవాడు.
సర్వభూత హితే రతః - సమస్త భూతముల హితము కోరువాడు అని.
రాముని దయాస్వభావము గుహుని కథలో , జటాయు కథలో, శబరి కథలో , విభీషణుని కథలో వింటాము.
రాముడు శరణాగత వత్సలుడు. దండకావనములో ఋషులరక్షణకి అభయము ఇచ్చిన శ్రీరాముడు, సీతమ్మకి ఇలా చెపుతాడు. "దండకావనములో వున్న ఋషులందరి రక్షణకి అభయము ఇచ్చినవాడను. ఓ సీతా నాప్రాణము , లక్ష్మణుని, నిన్ను త్యాగము చేసెదను కాని ఋషులకి ఇచ్చినమాటను తప్పను". అది రాములవారి అభయము.
రామ నామ జపములో భావము ,"ఓ రామ నువ్వే నా శరణాగతి" అని.
ఈ సంపుటలో రాముని మీదా కొన్ని స్తుతులు కొన్ని అందచేస్తున్నాము.

శ్రీరామ మంగళాశాసనము
శ్రీరామ రక్షా స్తోత్రము
శ్రీరామ పంచరత్నమాల
భద్రాచల శ్రీరామ స్తోత్రము
రామచంద్రకృపాళు భజమన..

ఇవన్ని నిస్సందేహముగా మానందము కోసము చేయబడినవే.

ఇవి మీకు కూడా ఆనందము కలిగిస్తాయి అని ఆశిస్తూ,

భవదీయులు
కాసరబాద వర్గము
(kasarabada.org)

||ఓమ్ తత్ సత్||