తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

'దేవాగణములలో యే'

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| దేవాగణములలో యే ||

దేవాగణములలో యే
దేవూడా వని నిన్ను
భావించి ధ్యానింతురా ! కృష్ణా|
నీమోమూ తోడనే
నేమరక భక్తుల
కామితంబుల నొసగావా కావా రావా || దేవా||1||

అణువనుచు నిన్ కొందరార్యులు బల్కగా
అక్కడక్కడ వింటిరా శౌరీ|
అణువులలోకన్నా పరమాణువగునిన్ను
పరికింపగా జాలరా పరమాత్మా యీ || దేవా|| 2||

మహదాది పంచభూ
తన్మయుడవగు నిన్ను
మహాత్మ పల్కేరురా కృష్ణా|
కమనీయ కారా యే
గతి తెలియదూ |
కంజాతపత్రేక్షణా కంసాత్మకా యీ ||దేవా|| 3||

భక్తాజనమానసా పంజరకీరామా
పరమాత్మ సుగుణా ధామా శ్యామా |
పక్షివాహన నన్ను రక్షించే దొరవయ్యు
పేక్షసేయుట తగునా దానా వానా ||దేవా|| 4||

స్కంధపురీశా నిన్ కాలకంఠుడ వనుచూ
కమలాశాంభవుడా వనుచూ శౌరీ|
పెక్కరువిధముల పేర్కొనుచున్ననిన్
ఎక్కడ కనుగొందురా ఇనకులతిలకా || దేవ||5||


|| ఓమ్ తత్ సత్ ||