తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

|| ఓ రంగా శ్రీరంగా అంటే..||

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| ఓ రంగా శ్రీరంగా అంటే..||

ఓ రంగా శ్రీరంగా అంటే
ఓహో అంటాడు
కోరి పిలిచినా పాదభక్తుల
కోర్కె తీర్చుతాడు||

పలుకవేమిరా స్వామీ అంటే
పలికెదనంటాడు|
మలినరహితులై సేవజేసితే
కలిసి తిరుగుతాడు||ఓ రంగా|| 2||

అండ పిండ బ్రహ్మాండ మంతటా
నిండుగ వున్నాడు|
దండిగ నామ స్మరణము చేసితె
దర్శనమిస్తాడు||ఓరంగా||3||

పండరిపురమున స్థిరవాసుండై
ప్రబలుతు వున్నాడూ|
పండరినాధా రారా అంటే
పరుగునరాగలుడూ||ఓ రంగా||4||

వెంకటనాధుని హృదయములోపల
వెలుగుతునున్నాడు|
పొంకముతో భక్తి సంఘముల
బ్రోచుచునున్నాడు|| ఓ రంగా ||5||


|| ఓమ్ తత్ సత్ ||