శ్రీమద్వాల్మీకి రామాయణము

||రామాయణ పారాయణ సర్గలు||

|| పారాయణము గురించి||

|| ఓమ్ తత్ సత్||

శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులుగారు వారు రాసిన సుందరకాండ తత్వదీపిక లో తమ "నివేదన" అంటూ ఒక చిన్న ఉపోద్ఘాతము రాశారు. అందులో కొన్ని వాక్యాలు:

" గ్రంథము గురించి ఓక మనవి. సుందరకాండ గూర్చి పారాయణము , సంక్షేప రామాయణము, శ్రీరామావతారము, సీతా కల్యాణము, సీతారామ సుఖజీవనము, నాగపాశవిమోచనము, ఆదిత్య హృదయము, రావణ వథ, బ్రహ్మ కృత శ్రీరామ స్తుతి , పట్టాభిషేకము అనువానితో కలిపి చేసినపుడు సంపూర్ణరామాయణము పారాయణ చేసిన ఫలము లభించునని ప్రాచీన సంప్రదాయము నెరింగిన పెద్దలు చెపుదురు.ఈ సర్గలు ప్రత్యేకముగా పారాయణ చేయుటకు తగినవి. అవి ఉత్తమములగు ఫలములను ఒసంగజాలినవి."

" సుందరకాండము పరమరహస్యమైన మంత్రము . దానిని పారాయణ చేయుట సర్వారిష్ట నివారణము. సర్వాభీష్ఠప్రదము. దానిని రోజుకి ఒక సర్గ చొప్పున లేదా యథా శక్తిగా గాని చేయవచ్చు. కాని అన్నిటికంటే సప్త సర్గ పారాయణము సద్యః ఫలప్రదము. రోజుకి ఏడు సర్గలు చొప్పున అరువది ఎనిమిది దినములలో ఏడు సార్లు పూర్తి సుందరకాండ పారాయణ చేయడము సప్త సర్గ పారాయణము. ఈ సప్త సర్గ పారాయణమున ప్రతి ఆవృత్తి అయినపుడు పట్టభిషేక సర్గ చేయనక్కర లేదు. పూర్తిగా 68 రోజులైన తరువాతనే ( అంటే ఏడు సార్లు సుందరకాండ పారాయణ అయినతరువాతనే ) పట్టాభిషేక సర్గ చేయవలెను. అట్లుగాక విడివిడిగా ( సుందరకాండ) చదివి నపుడు ముందుగా సంక్షేప రామాయణము, శ్రీరామ జననము, సీతాకల్యాణము, చదివి సుందరకాంద పారాయనము చేయవలెను.అది పూర్తి అయిన పిమ్మట యుద్ధకాండలోని నాగపాశ బంధ విమోచనము,అదిత్య హృదయము, రావణవధ, శ్రీరామ స్తవము, పట్టాభిషేకము చదవవలెను. అందుకే ఇందు ఆ సర్గలన్నీ చేర్చబడినవి".

పారాయణము గురించి ఇవన్నీ శ్రీభాష్యం అప్పలాచార్యులవారి మాటలు.

భాష్యం అప్పలాచర్యులగారి ననుసరించి ఇది ప్రాచీన సంప్రదాయము.

దీనిని అనుసరించే మేము "రామాయణములో పారాయణసర్గలు" అని పైన చెప్పబడిన తొమ్మిది సర్గలు అందిస్తున్నాము.

ఇవి మీ పారాయణానందానికే

||ఓమ్ తత్ సత్||

మనవి: శ్రీమద్రామాయణము - సుందరకాండము - ప్రవచన శిరోమణి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపిక శ్రీరామాయణ ప్రవచన మహాయజ్ఞ నిర్వహణ సంఘము , శ్రీకృష్ణాశ్రమము , నౌరోజీ రోడ్ , విశాఖపత్తణం 530 002 , ఆంధ్రప్రదేష్ వారి ద్వారా ప్రచరితము.

 

|| Om tat sat ||