||సుందరకాండ ||

||పదహేడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 17 || with Slokas and meanings in Telugu

|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తదశస్సర్గః

శ్లో|| తతః కుముదషణ్డాబో నిర్మలో నిర్మలం స్వయం|
ప్రజగామ నభశ్చన్ద్రో హంసో నీలమివోదకమ్||1||

స|| తతః కుముదషణ్డాభః స్వయం నిర్మలః చన్ద్రః నిర్మలం నభః జగామ యథా హంసః నీలం ఉదకం ఇవ||

తా|| అప్పుడు స్వయముగా నిర్మలమైన , కుముదముల సమూహములాగ కాంతివిరజొల్లుచున్న చంద్రుడు నిర్మలమైన ఆకాశములో నీలమైన ఉదకములో ఈదుచున్న హంసవలె ఉదయించెను.

శ్లో|| సాచివ్య మివ కుర్వన్ స ప్రభయా నిర్మలప్రభః
చన్ద్రమా రశ్మిభిః శీతైః సిషేవే పవనాత్మజమ్||2||

స||నిర్మలప్రభః సః చంద్రమా స ప్రభయా రశ్మిభిః శీతైః పవనాత్మజం సాచివ్యం కుర్వన్ శిషేవే |

తా|| నిర్మలమైన కాంతిగల చంద్రుడు తన చల్లని కిరణములు, వాటి కాంతులతో పవనాత్మజునికి సహాయము చేస్తున్నాడా అన్నట్లు సేవించసాగెను.

శ్లో|| స దదర్శ తతస్సీతాం పూర్ణచన్ద్ర నిభాననామ్|
శోకభారైరివ న్యస్తాం భారైర్నావమివామ్భసి||3||

స|| సః తతః పూర్ణచన్ద్ర నిభాననామ్ భారైః అంభసి న్యస్తామ్ నావం ఇవ శోకభారైః ( న్యస్తామ్) సీతాం దదర్శ||

తా|| అప్పుడు ఆ పుర్ణచంద్రునుబోలి ముఖము కల హనుమంతుడు భారముగా వుండి నీటిలో మునిగిపోతున్న నావ వలె శోకభారమును మోయుచున్న సీతను చూచెను.

శ్లో|| దిదృక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః|
స దదర్శా విదూరస్థా రాక్షసీః ఘోరదర్శనాః||4||

స||వైదేహీం దిదృక్షమాణః హనుమాన్ మారుతాత్మజః సః విదూరస్థా ఘోరదర్శనా రాక్షసీః దదర్శ||

తా|| వైదేహిని చూచుచున్న ఆ హనుమంతుడు పక్కనే వున్న ఘోరరూపముకల రాక్షస స్త్రీలను చూచెను.

శ్లో|| ఏకాక్షీం ఏకకర్ణాం చ కర్ణ ప్రవరణాం తథా|
అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోఛ్ఛ్వాసనాశికామ్||5||
అతికాయోత్తమాఙ్గీ చ తనుదీర్ఘశిరోధరాం|
ధ్వస్థకేశీం తథా్ఽకేశీమ్ కేశకమ్బళధారిణీమ్||6||
లమ్బకర్ణలలాటం చ లమ్బోదరపయోధరామ్|
లమ్బోష్టీం చుబుకోష్టీం చ లమ్బస్యాం లమ్బజానుకామ్||7||

స|| ఏకాక్షీం ఏక కర్ణాం తథా కర్ణప్రవరణాం అకర్ణాం శంకుకర్ణామ్ మస్తక ఉచ్ఛ్వాసనాశికామ్ (దదర్శ)||తను దీర్ఘశిరో ధరామ్ అతికాయ ఉత్తమాఙ్గీం ధ్వస్త కేశీం తథా అకేశీం కేశకమ్బల ధారిణీం దదర్శ||లమ్బకర్ణలలాటం చ లమ్బఉదర పయోధరామ్ లమ్బోష్టీం చుబుకోష్టీం లమ్బస్యాం లమ్బజానుకామ్ దదర్శ||

తా|| ఒకే కన్ను కలదానిని, ఒకే చెవి కలదానిని, వళ్ళంతాచెవి కలదానిని, చెవి లేనిదానిని ,శంకువు వంటి చెవి కలదానిని, మస్తకముపై లేచిన ముక్కు కలదానిని, శరీరము నకు మించిన తలగలదానిని, అతికాయము కలదానిని , ఉత్తమమైన అంగములు కలదానిని, ధ్వంసమైన కేశములు కలదానిని, కేశములు లేనిదానిని, శరీరము అంతా కంబళి వలె కేశములు కలదానిని, పోడువైన చెవులు కలదానిని, పొడువైన ఉదరము స్తనములు కలదానిని, పొడువైల పెదవులు కలదానిని, చుబుకముపై పెదవులు కలదానిని, పొడువైనదానిని ,పొడువైన జానువులు కలదానిని చూచెను.

శ్లో|| హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా|
కరాళాం భుగ్నవక్త్రాం చ పిఙ్గాక్షీం వికృతాననామ్||8||
వికృతాః పిఙ్గళాః కాళీః క్రోధనాః కలహప్రియాః|
కాలాయస మహాశూల కూటముద్గర ధారిణీః||9||
వరాహ మృగ శార్దూల మహిషాజ శివాముఖీః|
గజోష్ట్ర హయపాదీశ్చ నిఖాతశిరసో పరాః||10||

స|| హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుఘ్నవక్త్రాం పింగాక్షీం వికృతాననామ్ దదర్శ || వికృతాః పింగళాః కాలీః క్రోధనాః కలహప్రియాః కాలాయస మహాశూల కూటముద్గర ధారిణీః ||వరాహ మృగ శార్దూల మహిషాజ శివాముఖీః గజ ఉష్ట్ర హయ పాదీః అపరాః నిఖాత శిరసః ||

తా|| పొట్టిదానిని, పొడువుగావున్నదానిని, మరుగుజ్జును,వికటమైన రూపముకలదానిని, వామనరూపము కలదానిని, అలాగే ఎత్తుపళ్ళుకలదానిని, వికృతమైన ముఖముకలదానిని, ఎఱ్ఱనికళ్ళు కలదానిని చూచెను. వికృతమైన దానిని, ఎఱ్ఱగావున్నదానిని, నల్లగా వున్నదానిని, మంచి క్రోధములో ఉన్నదానిని, కలహముచేయుటలో కోరికగలదానిని, శూలములు పట్టుకువున్నదానిని, గూటములు ముద్గరములు పట్టుకు ఉన్నదానిని చూసెను. వరాహము, లేళ్ళ, శార్దూల, మహిషముల, ఆడనక్కల ముఖముల లాంటి ముఖములుకల వారిని, గజము, ఉష్ట్రము, హయముల పాదములవంటి పాదములు కలవారిని , మేడలేకుండా శిరస్సు వున్నవారిని చూచెను.

శ్లో|| ఏకహస్తైకపాదాశ్చ ఖరకర్ణ్యశ్వకర్ణికాః|
గోకర్ణీ హస్తికర్ణీచ హరికర్ణీ స్తథాపరా||11||
అనాసా అతినాసాశ్చ తిర్యజ్ఞ్నాస వినాసికాః|
గజసన్నిభనాసాశ్చ లలాటోచ్ఛ్వాసనాసికాః||12||

స|| ఏక హస్త ఏకపాదాః చ ఖరకర్ణ అశ్వకర్ణికాః గోకర్ణీ హస్తికర్ణీ చ తథా అపరా హరికర్ణీ చ దదర్శ|| అనాసా అతినాసాః చ తిర్యజ్ఞాసా వినాసికాః గజసన్నిభ నాసాః చ లలాటఉచ్ఛ్వాసనాసికాః చ ||

తా|| ఒకే హస్తము కలదానిని, ఒకే పాదము కలదానిని, ఖరము యొక్క చెవి కలదానిని, గుఱ్ఱముయొక్క చెవి కలదానిని, గోవు యొక్క చెవి కలదానిని, గజముయొక్క చెవి కలదానిని, అలాగే ఇంకొక కోతి చెవి కలదానిని, చూచెను. అలాగే ముక్కు లేని దానిని, పెద్దముక్కు కలదానిని, వంకరముక్కు కలదానిని, వికృతమైన నాసిక కలదానిని, గజము యొక్క తొండములాంటి నాసికకలదానిని, లలాటముదాకాసాగివున్న ముక్కు కలదానిని కూడా చూచెను.

శ్లో|| హస్తిపాదా మహపాదా గోపాదాః పాదచూళికాః|
అతిమాత్ర శిరోగ్రీవా అతిమాత్రకుచోదరీ||13||
అతిమాత్రాస్యనేత్రాశ్చ దీర్ఘజిహ్వా నఖాస్తథా|
అజాముఖీః హస్తిముఖీః గోముఖీః సూకరీముఖీః||14||

స|| హస్తిపాదాః మహాపాదాః గోపాదాః పాదచూళికాః చ అతిమాత్రశిరోగ్రీవాః అతిమాత్రకుచోదరీః చ||అతిమాత్రాస్యనేత్రాః చ దీర్ఘజిహ్వా నఖాః తథా అజాముఖీః హస్తిముఖీః గోముఖీః సూకరీముఖీః చ ||

తా|| ఏనుగు పాదములు, పెద్దపాదములు, గోవు పాదములు కలవారిని, పాదములమీద జుట్టు కలవారిని, అతిమాత్రమైన మెడలు కలవారిని, అతిమాత్రకుచములు ఉదరములు కలవారిని, కూడా చూచెను. అలాగే పొడవైన కళ్ళు కలవారిని, పొడువైన నాలుక కలవాదానిని, పొడువైన గోళ్ళుకలదానిని, అలాగే అజాముఖము, హస్తిముఖము, గోముఖము, సూకరీ ముఖము కలవారిని చూచెను.

శ్లో|| హయోష్ట్ర ఖరవక్త్రాశ్చ రాక్షసీర్ఘోరదర్శనాః|
శూలముద్గర హస్తాశ్చ క్రోధనాః కలహప్రియాః||15||

స|| హయ ఉష్ట్ర ఖర వక్త్రాః చ ఘోర దర్శనాః రాక్షసీః శూలం ఉద్గర హస్తాః చ క్రోధనాః కలహప్రియాః చ దదర్శ||

తా|| గుఱ్ఱము, ఒంటె, గాడిదలముఖము కలవారిని, చూడడానికి ఘోరముగా వున్నరాక్షస స్త్రీలను, శూలము ఉద్గరము చేతిలో పట్తుకొని ఉన్నవారిని, కోపస్వభావము కలవారిని , కలహప్రియులను కూడా చూచెను.

శ్లో|| కరాళా ధూమ్రకేశీశ్చ రాక్షసీర్వికృతాననాః|
పిబన్తీస్సతతం పానం సదా మాంస సురా ప్రియాః||16||
మాంస శోణితదిగ్ధాఙ్గీ మాంసశోణితభోజనాః|
తా దదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణదర్శనాః||17||
స్కన్ధవన్త ముపాసీనాః పరివార్య వనస్పతిమ్|

స|| కరాళాః ధూమ్రకేశీః చ వికృతాననాః చ సతతం పానం పిబన్తీః రాక్షసీః మాంస సురా ప్రియాః దదర్శ|| మాంస శోణీత దిగ్ధాఙ్గీః మాంసశోణిత భోజనాః రోమహర్షణ దర్శనాః స్కంధవంతం వనస్పతిం పరివార్య ఉపాసీనాః తాం కపిశ్రేష్ఠః దదర్శ||

తా|| పెద్ద నోరు కలవారిని, పొగరంగుకేశములు కలవారిని, వికృతమైన కళ్ళు కలవారిని, ఎల్లప్పుడు తాగుచూ ఉన్నరాక్షసస్త్రీ లను , మాంసము మద్యము పై మోహము లో ఉన్నవారిని చూచెను. రక్తమాసములతో తడిసిన అంగములుకలవారిని, రక్తమాంసములు భోజనము చేయువారిని, చూచుటకుగగుర్పాటుకలగించు రాక్షస స్త్రీలను, విశాలమైన బోదెకల ఆ మహావృక్షము చుట్టూ ఉపాసీనులైన రాక్షస స్త్రీలను అ వానరశ్రేష్ఠుడు చూచెను.

శ్లో|| తస్యాధస్తాచ్చ తాం దేవీం రాజపుత్రీం అనిందితామ్||18||
లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజామ్|
నిష్ప్రభాం శోకసంతప్తాం మలసంకులమూర్ధజామ్||19||
క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ|
చారిత్ర వ్యపదేశాఢ్యాం భర్తృదర్శనదుర్గతామ్||20||
భూషణైరుత్తమార్హీనాం భర్తృవాత్సల్యభూషణామ్

స|| లక్ష్మీవాన్ హనుమాన్ తస్య అధస్తాత్ రాజపుత్రీం జనకాత్మజామ్ అనందితాం తాం దేవీం లక్షయామాస|| నిష్ప్రభాం శోకసంతప్తాం మలసంకులమూర్ధజామ్ క్షీణ పుణ్యాం చ్యుతాం భూమౌ నిపాతితాం తారాం ఇవ ||చారిత్రవ్యపదేశాడ్యాం భర్తృదర్శనదుర్గతాం ఉత్తమైః భూషణైః హీనాం భర్తృవాత్సల్య భూషణామ్||

తా|| లక్ష్మీ వంతుడైన హనుమంతుడు ఆ చెట్తుకింద శోకములో ఉన్న రాజపుత్రీ జనకాత్మజ ఆగు ఆ దేవిని చూసెను. ప్రభలేని, శోకములో మునిగియున్న, మాలిన్యముతో కూడిన కేశములు కల ఆమె, క్షీణించిపోయిన పుణ్యములతో భూమి యందు రాలిన నక్షత్రము వలె నున్నది. పాతివ్రత్యదర్మముతొ సంపన్నురాలైన, భర్త దర్శనములేని దుర్గతిలో ఉత్తమమైన భూషణములు లేకుండా వున్న ఆమె , భర్తపై వాత్సల్యము అనే ఆభరణముతో అలంకరింపబడినది.

శ్లో|| రాక్షసాధిపసంరుద్ధాం బంధుభిశ్చ వినాకృతామ్||21||
వియూధాం సింహసంరుద్ధాం బద్ధాం గజవధూమివ|
చన్ద్రరేఖాం పయోదాన్తే శారదభ్రైరివావృతామ్||22||
క్లిష్టరూపాం అసంస్పర్శా దయుక్తా మివ పల్లకీమ్|

స|| బంధుభిః వినా రాక్షసాధిపసంరుద్ధాం చ కృతం వియూధాం సింహసంరుద్ధాం బద్ధాం గజవధూం ఇవ||పయోదాంతే శారదభ్రైః ఆవృతం చంద్రరేఖాం ఇవ అసంస్పర్శాత్ క్లిష్టరూపాం అయుక్తాం వల్లకీం ఇవ||

తా|| బంధువులు లేక, రాక్షసాధిపుని ఆధిపత్యములో ఉన్న ఆమె తన సమూహమునుకోలుపోయి సింహముచే అడ్డగింపబడిన ఆడఏనుగు వలె నున్నది. వర్షాకాలము చివరిలో శరత్కాలమేఘములచే కప్పబడిన చంద్ర రేఖవలె నున్న, క్లిష్టమైన రూపములో ఉన్నఆమె, ఉపయోగించబడని తీగెలు సారించని వీణలా వున్నది.

శ్లో|| సీతాం భర్తృవశే యుక్తాం అయుక్తాం రాక్షసీ వశే||23||
అశోకకవనికా మధ్యే శోకసాగరమాప్లుతామ్|
తాభిః పరివృతాం తత్ర సగ్రహ మివ రోహిణీమ్||24||
దదర్శ హనుమాన్ దేవీం లతామకుసుమామివ|

స|| భర్తృవశే యుక్తాం రాక్షసీవసే అయుక్తాం అశోకకవనికా మధ్యే శోకసాగరం ఆప్లుతామ్ (సీతాం దదర్శ)|| తత్ర సగ్రహాం రోహిణీం ఇవ తాభిః పరివృతాం ఆకుసుమాం లతాం ఇవ దేవీం హనుమాన్ దదర్శ||

తా|| భర్తవశములో ఉండతగిన, రాక్షస్త్రీల వశములో ఉండకూడని ఆమె, అశోకవనిక మధ్యలో శోకసాగరములో మునిగి ఉన్నది. అక్కడ గ్రహములచేత పీడింపబడిన రోహిణి వలె ఆ రాక్షస్త్రీలచేత చుట్టబడి ఉన్న, కుసుమమైన లతలా వున్న ఆ దేవిని హనుమంతుడు దర్శించెను.

శ్లో|| సా మలేన దిగ్ధాఙ్గీ వపుషా చాప్యలఞ్కృతా||25||
మృణాళీ పఞ్కదిగ్ధేన విభాతి న విభాతి చ|
మలినేనతు వస్త్రేణ పరిక్లిష్టేన భామినీమ్||26||
సంవృతాం మృగ శాబాక్షీం దదర్శ హనుమాన్ కపిః|
తాం దేవీం దీనవదనాం అదీనాం భర్తృతేజసా||27||
రక్షితాం స్వేన శీలేన సీతాం అసితలోచనామ్|

స|| మలేన దిగ్ధాంగీ వపుషా చాపి అలంకృతా సా పంకదిగ్ధా మృణాలీవ విభాతి న విభాతి చ|| కపిః హనుమాన్ పరిక్లిష్టేన మలినేన వస్త్రేణ సంవృతాం భామినీం మృగ శాబాక్షీం దదర్శ||దీనవదనాం భర్తృతేజసా అదీనాం అశితలోచనామ్ స్వేన శీలేన రక్షితాం తాం సీతాం దదర్శ||

తా|| మాలిన్యముతో కూడిన అంగములు కలదైనప్పటికీ అలంకరింపడియున్నట్లు వున్న ఆమె ఒకవిధముగా ప్రకాశము కల ఇంకోవిధముగా ప్రకాశములేని బురదలో ఉన్న తామర పువ్వు వలె నున్నది. ఆ హనుమంతుడు మలిన రహితమైన వస్త్రములతో చుట్టబడియున్న లేడి కన్నుల వంటి కన్నులుకల అమెను చూచెను. దీనవదనము కల, భర్తతేజసముతో ధైర్యమువహించిన, నల్లని కళ్ళు కల, తన శీలము తో తననే రక్షించుకొనుచున్నఆ సీతను హనుమంతుడు చూచెను.

శ్లో|| తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశాబనిభేక్షణామ్||28||
మృగ కన్యామివ త్రస్తాం వీక్షమాణాం సమన్తతః|
దహన్తీమివ నిశ్శ్వాసైః వృక్షాన్ పల్లవధారిణః||29||
సంఘాతమివ శోకానాం దుఖ స్యోర్మి మివోత్థితాం|

స|| తాం మృగ శాబ నిభేక్షణామ్ సీతాం దృష్ట్వా హనుమాన్ త్రస్తాం వీక్షమాణాం మృగ కన్యాం ఇవ (మన్యే)|| సా నిఃశ్వాసైః వృక్షాన్ పల్లవధారిణః దహంతీం ఇవ శోకానాం సంఘాతమివ శోఖానాం దుఃఖస్య ఇవోత్థితాం ఊర్మిం ఇవ తాం హనుమతః మన్యే||

తా|| ఆ లేడికన్నుల వంటి కన్నులగల ఆ సీతను చూచి హనుమంతుడు భీతి చెందిన లేడి వలె నున్నది అని అనుకొనెను. ఆమె ఉచ్చ్వాస నిఃశ్వాసములతో ఆచెట్టుపైనున్న చిగుర్లను దహించివేస్తున్నదా అన్నట్లు వున్నది. శోకముల సమూహము వలె నున్న, పైకి లేచిన దుఃఖతరంగములవలె నున్న ఆ సీతను హనుమంతుడు చూసెను.

శ్లో|| తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణశోభినీమ్||30||
ప్రహర్షమతులం లేభే మారుతిః ప్రేక్ష్య మైథిలీమ్|
హర్షజాని చ సోఽశ్రూణి తాం దృష్ట్వామదిరేక్షణామ్|
ముముచే హనుమాం స్తత్ర నమశ్చక్రే చ రాఘవం ||31||

స|| తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణశోభినీం మైథిలీమ్ ప్రేక్ష్య మారుతిః అతులం ప్రహర్షం లేభే|| తాం మదిరేక్షణాం తత్ర దృష్ట్వా హర్షజాని అశ్రూణి ముముచే | రాఘవం చ నమః చక్రే ||

తా|| ఆ క్షమారూపము కల, ఆభరణములేకపోయినప్పటికి అందముగాకల అంగముల తో శోభిస్తున్న ఆ మైథిలిని చూచి ఆ మారుతికి అత్యంత ఆనందము కలిగెను. ఆ ఆకర్షణీయమైన కళ్ళు కల అ సీతను చూచి హర్షముతో కన్నీళ్ళను విడచెను. రాఘవునకు నమస్కరించెను.

శ్లో|| నమస్కృత్వాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్|
సీతాదర్శనసంహృష్టో హనుమాన్ సంవృతోఽభవత్||32||

స|| సీతా దర్శన సంహృష్టః వీర్యవాన్ రామాయ లక్ష్మణాయ చ నమస్కృత్వా హనుమాన్ సంవృతో అభవత్ ||

తా|| సీతాదర్శనముతో సంతోషపడిన ఆ హనుమంతుడు రామునకు లక్ష్మణునకు నమస్కరించి ఆ చెట్టుఆకులచాటున దాగి ఉండెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తదశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదహేడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||