||సుందరకాండ ||
||ఇరువదియవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 20 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ వింశస్సర్గః
శ్లో|| స తాం పరివృతామ్ దీనాం నిరానన్దాం తపస్స్వినీమ్|
సాకారైర్మథురైర్వాక్యైః న్యదర్శయత రావణః||1||
స|| తాం పరివృతాం దీనాం నిరానందాం తపస్స్వినీం సాకారైః మధురైః వాక్యైః న్యదర్శయత||
తా|| (రావణుడు) చుట్టబడియున్నదీనమైన ఆనందములేని తవస్విని అయిన సీతకు హావభావచేష్ఠలతో మధురమైన మాటలతో కూడిన వాక్యములతో రావణుడు తన మనోభావమును వెల్లడించెను.
శ్లో|| మాం దృష్ట్వా నాగనాసోరు గూహమాన స్తనోదరమ్|
అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వ మిచ్చసి||2||
కామయేత్వాం విశాలాక్షీ బహుమన్యస్వ మాం ప్రియే|
సర్వాఙ్గ గుణ సంపన్నే సర్వలోకమనోహరే||3||
నేహ కేచిన్మనుష్యా వా రాక్షసాః కామరూపిణః|
వ్యపసర్పతు తే సీతే భయం మత్తస్సముత్థితమ్||4||్
సా|| నాగనాసోరు మాం దృష్ట్వా స్తనోదరం గూహమానా త్వం భయాత్ ఆత్మానం నేతుమ్ అదర్శనం ఇచ్ఛసి ఇవ || విశాలాక్షీ సర్వాఙ్గ గుణ సంపన్నే సర్వలోక మనోహరే త్వాం కామయే |ప్రియే మాం బహుమన్యస్వ||ఇహ మనుష్యా వా రాక్షసాః కామరూపిణః న | సీతే తే మత్తః సముత్థితం భయం వ్యపసర్పతు||
తా|| "ఓ ఏనుగు తొండమువంటి తొడలు కలదానా! నన్ను చూచి స్తనములను ఉదరమును దాచుకోని నీవు భయముతో నా చూపుల నుంచి మరుగుపరుచు కోవాలనుకుంటున్నావు. ఓ విశాలాక్షీ సర్వలోక మనోహరి నిన్ను నేను వాంచిస్తున్నాను. ఓ ప్రియా నన్ను కోరుకో. ఇక్కడ మనుష్యులు కాని కామరూపులైన రాక్షసులుకాని లేరు. ఓ సీతా నా గురించి కలిగిన భయమును వదిలుము".
శ్లో|| స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ నసంశయః|
గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య వా||5||
ఏవం చైతదకామం తు న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి|
కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్||6||
దేవీ నేహ భయం కార్యం మయి విశ్వసిహి ప్రియే|
ప్రణయస్వ చ తత్వేన మైవం భూః శోకలాలసా||7||
స|| హే భీరు పరస్త్రీణాం హరణం వా సంప్రమధ్య వా గమనం వా రక్షసాం సర్వథైవ స్వధర్మః| న సంశయః||ఏతత్ ఏవం కామః కామం యథాకామం మే శరీరే ప్రవర్తతామ్ తు | అకామమ్ మైథిలీ త్వాం న స్ప్రక్ష్యామి ||దేవీ ప్రియే మయి విశ్వసిహి ఇహ భయం న కార్యం | తత్వేన చ ప్రణయస్వ |ఏవం శోకలాలసా మా భూః||
తా|| " ఓ భయస్థురాలా ! పరస్త్రీలను అపహరించడము, వారితో రమించడము అన్ని విధములుగా రాక్షసుల స్వధర్మము. అందులో సంశయము లేదు. ఈ విధముగా ఈ కామము నా శరీరములో ప్రవర్తించును. ఓ మైథిలీ కాని నన్ను కోరని నిన్ను నేను తాకను. ఓదేవి ! ప్రియురాలా ! నన్ను విశ్వశించుము. ఇక్కడ భయమునకు తావులేదు. నిజముగా ప్రేమించుము. ఈ విధముగా శోకలాలసవు కావద్దు".
శ్లో|| ఏకవేణీధరాశయ్యా ధ్యానం మలిన మంబరమ్|
అస్థానేఽప్యుపవాసశ్చ నైతా న్యౌపయికాని తే||8||
విచిత్రాణి చ మాల్యాని చన్దనాన్యగరూణి చ|
వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణానిచ ||9||
మహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ|
గీతం నృత్తం చ వాద్యంచ లభ మాం ప్రాప్య మైథిలి||10||
స|| ఏకవేణీ ధరాశయ్యా ధ్యానం మలినం అంబరం అస్థానే ఉపవాసః చ ఏతాన్ తే న ఔపయికాని ||మైథిలి మాం ప్రాప్య విచిత్రాణి మాల్యాని చన్దనాని అగరూణి చ వివిధాని వాసాంసి దివ్యాన్ ఆభరణాని చ లభస్వ||మహార్హాణి చ పానాని శయనాని ఆసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభ||
తా|| " ఓక జడతో భూమియే శయ్యగాచేసుకొని మలినమైన వస్త్రములతో ఉపవాసము చేయుట ఇవన్నీ నీకు తగని పనులు. ఓ మైథిలీ నన్ను పొంది మాలలు అగరు చందనము వివిధరకములైన వస్త్రములు దివ్యమైన ఆభరణములను పొందుము. శ్రేష్టములైన పానీయములను, ఆసనములను, గీత నృత్య వాద్యములను పొందుము".
శ్లో|| స్త్రీ రత్నమసి మైవం భూః కురు గాత్రేషు భూషణం|
మాం ప్రాప్య హి కథం ను స్యాత్ త్వమనర్హా సువిగ్రహే||11||
ఇదం తే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే|
యత్ అతీతం పునర్నైతి స్రోతః శీఘ్రమపామివ||12||
త్వాం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వసృక్ |
న హి రూపోపమా త్వన్యా తవాస్తి శుభదర్శనే||13||
స|| స్త్రీ రత్నం అసి | ఏవం మాభూః | గాత్రేషు భూషణం కురు | సువిగ్రహే మాం ప్రాప్య త్వం కథం ను అనర్హా స్యాత్ ||చారు సంజాతం ఇదం తే యౌవనం వ్యతివర్తతే | యత్ అతీతం శీఘ్రః స్రోతః అపాం ఇవ పునః న ఇతి|| శుభదర్శనే త్వాం కృత్వా సః రూపకర్తా విశ్వసృక్ ఉపరతః మన్యే| త్వత్ అన్యా తవ రూపసమః న అస్తి ||
తా|| "ఓ దేవీ! నీవు స్త్రీలలో రత్నము. ఈ విధముగా నువ్వు ఉండకూడదు. నీ గాత్రములలో ఆభరణములను ధరించుము. మంచి విగ్రహము కలదానా ! నన్ను పొంది నీవు ఏమి పొందకుండా వుండగలవు ? ఈ సుందరమైన నీ యౌవ్వనము గడిచిపోవును. ఇది శీఘ్రముగా పారుచున్న నీరు వలె మరల వెనుకకు రాదు. ఓ అద్భుతమైన రూపము కలదానా ! నిన్ను సృష్టి చేసిన తరువాత సృష్టికర్త సౌదర్యము సృజించడాన్ని విరమింఛాడు కాబోలు. నీతో సమానమైన సౌందర్యవతి లేదు".
శ్లో|| త్వాం సమసాద్య వైదేహీ రూపయౌవనశాలినీమ్|
కః పుమా నతివర్తేత సాక్షా దపి పితామహః||14||
యద్యత్ పశ్యామి తే గాత్రం శీతాంశుసదృశాననే|
తస్మిం స్తస్మిన్ పృథుశ్రోణీ చక్షుర్మమ నిబధ్యతే||15||
స||వైదేహీ రూపయౌవనశాలినీం త్వాం సమాసాద్య కః పుమాన్ అతివర్తేత || సాక్షాత్ పితామహః అపి|| శీతాంశుసదృశాననే పృథుశ్రోణీ తే యద్యత్ గాత్రం పశామి తస్మిం తసమిన్ మమ చక్షుః నిబధ్యతే||
తా|| " ఓ వైదేహీ రూపయౌవ్వనశాలియగు నిన్ను చూసిన తరువాత ఏ పురుషుడు ముందుకు పోగలడు. సాక్షాత్తు బ్రహ్మకూడా పోలేడు. చంద్రబింబము తో సమానమైన అందము కలదానా, అందమైన కటిప్రదేశము కలదానా, నీ అవయవములను ఎక్కడ చూసిన అక్కడే నా కళ్ళు ఆగిపోతాయి".
శ్లో|| భవ మైథిలి భార్యా మే మోహ మేనం విసర్జయ|
బహ్వినాం ఉత్తమస్త్రీణాం ఆహృతానామ్ ఇతః తతః||16||
సర్వాసామేవ భద్రంతే మమాగ్రమహీషీభవ|
లోకేభ్యో యాని రత్నాని సంప్రమథ్యాహృతాని వై||17||
తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహం చ తే|
స|| మైథిలి మే భార్యా భవ | ఏనం మోహం విసర్జయ | ఆహృతానాం భహ్వీనామ్ మమ ఉత్తమ స్త్రీణాం సర్వాసాం ఏవ అగ్రమహిషీ భవ| తే భద్రమ్ అస్తు ||భీరుః లోకేభ్యః యాని రత్నాని సంప్రమమధ్య ఆహృతాని తాని సర్వాణి ఏతత్ రాజ్యం చ అహం చ తే||
తా|| " ఓ మైథిలీ ! నా భార్య అవుము. నీ మోహమును వదులుము. బాహుబలముతో తీసుకురాబడిన అనేక ఉత్తమస్త్రీలందరికి పెద్ద పట్టపురాణివి అగుము. నీకు మంగళము కూరును. ఓ భయస్థులారా లోకములో జయించి తీసుకువచ్చిన రత్నములన్నీ , వస్తువులన్నీ , నా రాజ్యము అన్నీ నీవే . నేనూ కూడా నీ వాడనే".
శ్లో|| విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీమ్||18||
జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసినీ|
నేహ పశ్యామి లోకేఽన్యం యో మే ప్రతిబలో భవేత్ ||19||
పశ్యమే సుమహద్వీర్యం అప్రతిద్వన్ద్వమాహవే|
స|| పృథివీం సర్వాం నానా నగరమాలినీం విజిత్య విలాసినీ తవ హేతోః జనకాయ ప్రదాస్యామి || ఇహ లోకే అన్యం మే ప్రతిబలః న | ఆహవే మే సుమహత్ వీర్యం అప్రతిద్వన్ద్వం పశ్య ||
తా|| "అనేక నగరములతో కూడిన పృథివీ మండలము అంతా జయించి నీ కొఱకు జనకునకు సమర్పిస్తాను. ఈ లోకములో నాతో సమానమైన బలము కలవాడులేడు. యుద్ధరంగములో కూడా నాకు ప్రతిద్వంది లేని వీర్యమును చూడుము".
శ్లో|| అసకృత్ సంయుగే భగ్నా మయా విమృదితధ్వజాః||20||
అశక్తాః ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః|
ఇచ్చయా క్రియతా మద్య ప్రతికర్మ తవోత్తమమ్||21||
సప్రభాణ్యవసజ్యన్తాం తవాఙ్గే భూషణానిచ|
సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణా||22||
స||మయా అసకృత్ సురాసురాః సంయుగే భగ్నాః విమృదిత ధ్వజాః | మమ ప్రత్యనీకేషు స్థాతుమ్ అశక్తాః|| మమ ఇచ్ఛ ఆద్య తవ ఉత్తమమ్ ప్రతికర్మ క్రియతామ్|తవ అఙ్గే స ప్రభాణి భూషణాని చ అవసజ్యంతాం | ప్రతికర్మణా సంయుక్తం తే సాధు రూపం పశ్యామి ||
తా|| " నాతో అసమానులైన సురాసురులు యుద్ధములో పడిపోయిన ధ్వజములతో భగ్నులైనారు. నా ముందు నిలబడడానికి అశక్తులు అయ్యారు. నా యొక్క ఇచ్ఛ నీవు ఉత్తమమైన అలంకరణలు చేసికొనవలెను. నీ అంగములలో కాంతి గల ఆభరణలు ధరించబడుగాక. ఆ విధముగా అలంకరింపబడిన నీ సాధురూపము చూచెదను".
శ్లో|| ప్రతికర్మాభి సంయుక్తా దాక్షిణ్యేన వరాననే|
భుంక్ష్వభోగాన్ యథాకామం పిబ భీరు రమస్వ చ||23||
యథేష్టం చ ప్రయచ్చ త్వం పృథివీం వా ధనాని చ|
లలస్వ మయి విస్రబ్దా ధృష్ట మాజ్ఞాపయస్వ చ||24||
మత్ప్రసాదా ల్లలన్త్యాశ్చ లలన్తాం భాన్ధవా స్తవ |
బుద్ధిం మామనుపశ్య త్వం శ్రియం భద్రే యశశ్చ మే||25||
స|| వరాననే భీరుః దాక్షిణ్యేన ప్రతికర్మాభి సంయుక్తా యథా కామం భోగాన్ భుంక్ష్వ పిబ రమస్వ చ|| త్వం పృథివీమ్ ధనాని చ యథేచ్ఛం ప్రయచ్ఛ| విస్రబ్దా మయి లలస్వ | ఘృష్టం ఆజ్ఞాపయస్వ చ|| భద్రే మత్ప్రసాదాత్ లలన్త్యాః తవ బాంధవా లలన్తాం | త్వం మమ ఋద్ధిం యశశ్చ అనుపశ్య|
తా|| " ఓ భీరు! సుందరాంగీ ! నీకు ఇష్టమైనట్లు అలంకరించుకొని భోగములు అనుభవించుము. మధుపానము సేవించుము. రమింఛుము. నువ్వు పృథివినీ ధనమును ఈ కోరికప్రకారము దానము చేయుము. భయము లేకుండా నాతో రమించు. ధైర్యముగా నన్ను ఆజ్ఞాపించుము. ఓ మంగళస్వరూపిణీ ! నన్ను ప్రసాదించి సుఖసంతోషములు పొంది నీ బంధువులను కూడా సంతోషపెట్టు. నా బుద్ధినీ యశస్సును చూడు".
శ్లో|| కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాససా|
నిక్షిప్త విజయో రామో గతశ్రీః వనగోచరః||26||
వ్రతీ స్థణ్డిలశాయీ చ శఙ్కే జీవతి వా న వా|
న హి వైదేహి రామ స్త్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే||27||
పురో బలాకై రసితైః మేఘైః జ్యోత్స్నామివావృతమ్|
స|| సుభగే చీరవాససా రామేణ కిం కరిష్యసి| నిక్షిప్త విజయః గతశ్రీః వనగోచరః వ్రతీ స్థణ్డిలశాయీ చ రామః జీవతి వా న శఙ్కే || వైదేహీ రామః త్వం పురోబలాకైః అసితైః మేఘైః ఆవృతాం జ్యోత్స్నాం ఇవ ద్రష్టుం వా పి న హి ఉపలప్స్యతే||
తా|| " ఓ సుందరీ చీరవస్త్రములు ధరించే రామునితో ఏమి చేస్తావు. విజయము ఐశ్వర్యము లేని వనములో చరించు తాపసిక వ్రతములను అనుసరించుభూమిపై నిద్రించు రాముడు జీవిస్తున్నాడో లేదో అన్నది శంకయే. ఓ వైదేహీ మేఘములతో కప్పివేయబడిన చంద్రుని ఏలాచూడలేవో అలాగే నిన్ను రాముడు చూడలేడు".
శ్లో|| న చాపి మమ హస్తా త్త్వామ్ ప్రాప్తు మర్హతి రాఘవః||28||
హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ|
చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని|| 29||
మనోహరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా|
స||హిరణ్యకశిపుః ఇన్ద్రహస్తగతాం కీర్తిం ఇవ రాఘవః మమ హస్తాత్ త్వాం ప్రాప్తుం న చాపి అర్హతి|| చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని భీరు సుపర్ణః పన్నగం యథా మమ మనః హరసి||
తా|| " హిరణ్యకశిపుడు ఇంద్రునిచే అపహరింపబడిన కీర్తిని ( తన భార్య) పొందగలగాడు. కాని నా హస్తమునుంచి రాముడు నిన్ను పొందలేడు. ఓ చారుస్మితి చారుదతి చారునేత్రీ ! విలాసినీ ! నీవు గరుత్మంతుడు స్వర్పమును హరించినట్లుగా నామనస్సుని అపహరించినావు".
శ్లో|| క్లిష్ట కౌశేయవసనాం తన్వీ మప్యనలఙ్కృతామ్||30||
తాం దృష్ట్వా స్వేషు దారేషు రతిం నోపలభామ్యహమ్|
అన్తఃపుర నివాసిన్యః స్త్రియః సర్వగుణాన్వితాః||31||
యావంత్యో మమ సర్వాసామ్ ఐశ్వ్వర్యం కురు జానకి|
స|| క్లిష్టకౌశేయవసనాం తన్వీం త్వాం అనలంకృతాం అపి దృష్ట్వా అహం స్వేషు దారేషు రతిం న ఉపలభామి|| జానకీ మమ స్త్రియః అన్తఃపురనివాసిన్యః యావన్త్యః సర్వగుణాన్వితాః | సర్వాసాం ఇశ్వర్యం కురు||
తా|| "ఓ తన్వీ ! నలిగిపోయిన పట్టువస్త్రము ధరించిన, అలంకారములతో లేకపోయినా కాని నిన్ను చూచిన తరువాత నా భార్యలతో రతి పొందలేకపోతున్నాను. ఓ జానకీ నా అంతః పురములో ఉన్న స్త్రీలు సర్వగుణ సంపన్నులు. నీవు వారిపై అధిపత్యము వహించుము".
శ్లో|| మమ హ్యసితకేశాంతే త్రైలోక్యప్రవరా స్స్త్రియః||32||
తాస్త్వాం పరిచరిష్యన్తి శ్రియ మప్సరసో యథా|
యాని వైశ్రవణే సుభ్రు రత్నాని ధనాని చ||33||
తాని లోకాంశ్చ సుశ్రోణి మాం చ భుఙ్‍క్ష్వ యథా సుఖమ్|
న రామస్తపసా దేవి న బలేన న విక్రమైః|
న ధనేన మయా తుల్యః తేజసా యశసాఽపి వా|34||
స|| అసితకేశాంతే మమ తాః త్రైలోక్య ప్రవరాః స్త్రియః అప్సరసః శ్రియం యథా త్వాం పరిచరిష్యన్తి|| సుశ్రోణి సుభృ వైశ్రవణే యాని రత్నాని ధనాని చ తాని లోకాంశ్చ మాం చ యథాసుఖం భుఙ్‍క్ష్వ|| దేవీ రామః తపసా మయా న తుల్యః | న బలేన విక్రమైః చ|న ధనేన తేజసా యశసా అపి వా||
తా|| "ఓ నల్లని కేశములు కలదానా! నా యొక్క ముల్లోకములలో శ్రేష్టులైన స్త్రీలు, అప్సరస స్త్రీలు లక్ష్మి ని సేవించినట్లు నీకు పరిచర్యలు చేస్తారు. ఓ చక్కని కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము కలదానా ! నేను కుబేరుని జయించి తీసుకువచ్చిన రత్నములు ధనములు ఆన్నీ నన్నుకూడా యథాసుఖముగా అనుభవింపుము. ఓ దేవీ రాముడు తపస్సులో నాతో సమానుడు కాడు. బలములో సమానుడు కాడు. ధనములో తేజస్సులో యశస్సులో కూడా సమానుడుకాడు".
శ్లో|| పిబ విహర రమస్వ భుఙ్‍క్ష్వ భోగాన్
ధననిచయం ప్రదిశామి మేదినీం చ|
మయి లల లలనే యథాసుఖం త్వం
త్వయి చ సమేత్య లలన్తు బాన్ధవాస్తే || 35||
స||లలనే ధననిచయం మేదినీం చ త్వం ప్రదిశామి |పిబ విహర రమస్వ | భోగాన్ యథాయుక్తం మయి లల| తే బాన్ధవాః సమేత్య త్వయి లలన్తు||
తా|| "ఓ లలనా ! కుప్పలుగా ధనము బంగారము నీకు ప్రసాదిస్తాను. తిని తాగి విహరించి రమించుము. భోగములను నీకు తోచినట్లు నాతో అనుభవించుము. నీ బంధవులు తో కలిసి అనుభవించుము".
శ్లో|| కుసుమిత తరుజాల సంతతాని
భ్రమరయుతాని సముద్రతీరజాని|
కనక విమల హారభూషితాఙ్గి
విహర మయా సహ భీరు కాననాని||36||
స|| భీరు కనక విమల హారభూషితాంగీ కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్రతీరజాని కాననాని మయా సహ విహర||
"ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో. బాగుగాపుష్పించిన చెట్లు కల, భ్రమరములు కల సముద్ర తీర ఉద్యానవనములలో నాతో కలిసి విహరించుము".
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే వింశస్సర్గః||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువదియవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||