సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

శివోహం శివోహం సచ్చితానందస్వరూపోహం !

శివోహం శివోహం సచ్చితానందస్వరూపోహం !
ఈ ప్ర పంచము ఉత్తమోత్తమ గురువు .
ప్రతివస్తువులో ఒక పాఠము ఉన్నది .
ప్రతి అనుభవములో ఒక ఉపదేశం ఉన్నది.
అది నేర్చుకొనుము.
అటుల యుక్తాయుక్త వివేచనగల వానివిగా విజ్ఞానముగల వానివిగా మారిపొమ్ము
వెలుతురు ఒక్కటే ఉన్నది .
ప్రాణము ఒక్కటే ఉన్నది
జీవితము ఒక్కటే ఉన్నది
ఒకే మతమే ఉన్నది
ఒకే ధర్మము ఉన్నది.
కళ్ళు చూచును
చెవులు వినును
జీతము పుచ్చుకోకుండానే పాదాలు నడుచును ..
ఓ మానవుడా !
వాటి దగ్గర నీతులు నేర్చు కొని స్వలాభము కోరకుండా సేవ జేస్తూయుండుము.
దైవ భక్తి జ్ఞానము వీటి ద్వారా శాంతికి శత్రువయిన ఈ స్వార్ధమును చంపుము

దేముడు మనిషిని తన స్వంత ఆత్మవలె సృష్ఠించినాడు

నీవు దేవ దేవుడవు

చేతులు పాదాలు కనురెప్పలు చర్మము మూత్రపిండములు దంతములు ఇవన్నీ ఓద్దికతో కలసి మెలసి పనిచేయుచున్నవి

అదే విధముగా ఇతరులతో ఐకమత్యముతో నుండుము

పాశ్ఛాత్యుల భావములో మనిషి ఎవడంటే ఓక మనస్సు కలిగిన జీవి మాత్రమే.
హిందువుని భావములో మనిషికి ముఖ్యము ఆత్మ.

ఈ భూమి మీద పని నెరవేర్చుటకు ఈ దేహమును మనస్సుతో జత పరచి ఒద్దికతో నుండుటకి వెల్లడి యగు ఆత్మ ముఖ్యము.

ఈ సర్వవ్యాపకమగు ఆత్మ యను వేదాంతము యొక్క బోధను నీ హృదయములో నిధిగా భద్రపరచు కొనుము.

ఏడబాటు ఒక హద్దు కాదు దూరం ఓక అడ్డంకి కాదు

పరమాత్మ యందు భక్తి ఉన్న యడల మనము అరణ్యములోనున్నను కొదువ లేదు.

శివోహం శివోహం సచ్చితానందస్వరూపోహం !

( ఇది అమ్మ రాసుకున్న పుస్తకాలలోనించి : అంటే "అమ్మ మాట" !!! )

 

!!శివోహం