Sundarakanda Chapter 57

Hanuman descends on Mahendra

mountain!!

Chapter 57:

Summary : Hanuman descends on the Mahendra mountain and tells everybody that he saw Sita in the Ashoka grove in Lanka guarded by fierce looking Rakshasa women !!

For telugu Home page

click here

సుందరకాండ
ఏబది ఏడవ సర్గము

అప్లుత్య చ మహావేగః పక్షవానివ పర్వతః |
భుజంగయక్షగంధర్వప్రబుద్ధకమలోత్పలమ్||
హనుమాన్ మారుతగతిః మహానౌరివ సాగరమ్ |
అపారమపరిశ్రాంతః పుప్లువే గగనార్ణవమ్ ||

తా| మహాపరాక్రమము గల హనుమంతుడు రెక్కలు గల పర్వతము వలె ఎగిరెను. నాగులు యక్షులు గంధర్వులే వికశించిన కమలములుగాగల అ గగనార్ణవమును వాయువేగముగల హనుమంతుడు ఒక మహానౌక సాగరము దాటినట్లు దాటెను.

పర్వతేంద్రం సునాభం చ సముపస్పృశ్య వీర్యవాన్ |
జ్యాముక్తఇవ నారాచో మహావేగోభ్యుపాగతః ||
స కించదనుసంప్రాప్తః సమాలోక్య మహాగిరిమ్|
మహేంద్ర మేఘసంకాశం ననాద హరిపుంగవః ||

తా|| ఆ మహావీరుడు మార్గమధ్యమున మైనాక పర్వతమును స్పృశించి విల్లునుండి విడువబడిన బాణమువలె అతివేగముగా ఆవతల తీరమును చేరెను. ఆ వానరోత్తముడు మేఘసదృశమైన ఆ మహేంద్ర పర్వతము సమీపించుచుండగా దానిని గాంచి మహాధ్వని చేసెను.

తే దీనమనస స్సర్వే శుశ్ర్రువుః కాననౌకసః |
వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్యనినదోపమమ్||
నిశమ్యనదతో నాదం వానరాస్తే సమంతతః |
బభూవురుత్సుకాస్సర్వే సుహృద్దర్శనకాంక్షిణః||
జాంబవాన్ అ హరిశ్రేష్ఠః ప్రీతిసంహృష్ఠమానసః |
ఉపామంత్ర్య హరీన్ సర్వాన్ ఇదం వచనమబ్రవీత్ ||

తా|| అప్పటివఱకు దిగులుపడిన మనసు గల ఆ వానరులందరును హనుమంతుని మేఘగర్జనముతో సమానమైన ఆ గర్జన వినిరి. హనుమంతుని దర్శనమునకై తహతహలాదుచున్న వానరులందరూ అ ధ్వనిని విని సంతోషభరితులైరి . వానరనాయకుడైన జాంబవంతుడు సంతోషముతో ఉప్పొంగినవాడై వానరులందరిని దగ్గరకు పిలిచి ఇట్లు చెప్పెను.

సర్వథా కృతకార్యోసౌ హనుమాన్ నాత్ర సంశయః |
న హ్యస్యాకృతకార్యస్య నాద ఏవం విధీ భవేత్ ||
తస్య బాహూరువేగం చ నినాదం చ మహాత్మనః |
నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుస్తతస్తతః||

తా|| " ఈ హనుమంతుడు అన్నివిధములుగా కృతకృత్యుడై వచ్చుచున్నాడు. అందుకు సందేహములేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు మహానాదమొనర్చడు." మహాత్ముడైన ఆ హనుమంతుని బాహువేగమును ఊరువేగమును గమనించి ఆ మహా నాదమునువిని వానరులందరూ ఇటునటూ గంతులు వేయసాగిరి.

తతస్తు వేగవాంస్తస్య గిరేర్గిరినిభః కపిః |
నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే ||
తతస్తే ప్రీతిమనసః సర్వే వానరపుంగవాః|
హనూమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే||

తా|| అప్పుడు గిరి సమానుడైన హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడిన ఆ మహేంద్రగిరిపై అడుగిడెను. అఫ్ఫుడు ఆనందభరితులైన అంగదాది వానరులు మహాత్ముడైన హనుమంతుని చుట్టు చేరిరి.

హనుమాంస్తు గురూన్ వృద్ధాన్ జాంబవత్ప్రముఖాం స్తదా |
కుమారమంగదం చైవ సోవందత మహాకపిః ||
స తాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః |
దృష్టాసీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్ ||

తా|| ఆ మహాకపి హనుమంతుడు గురువులకు వృద్ధులైన జాంబవంతుడు మొదలగువారికి అంగదకుమారునికి ప్రణమిల్లెను.వారిచే పూజింపబడి ప్రసాదింపబడి అప్పుడు మారుతి " సీతాదేవిని చూచితిని" అని సంక్షిప్తముగా నివేదించెను.

హనుమానబ్రవీత్ పృష్టః తదా తాన్ వానరర్షభాన్ |
అశోకవనికాసంస్థా దృష్టా సా జనకాత్మజా ||
రక్ష్యమాణా సుఘోరాభీ రాక్షసీరనిందితా |
ఏకవేణీధరా బాలా రామదర్శన లాలసా |
ఉపవాసపరిశ్రాంతా జటిలా మలినా కృతా ||

తా|| విశేషములు అడుగబడగా హనుమంతుడు ఇట్లు చెప్పెను. " ఆ పూజ్యురాలైన జనకాత్మజను అశోకవనమునందు దర్శించితిని . ఆమె ఘోరమైన రాక్షసస్త్రీల రక్షణలోనున్నది. ఆమె శ్రీరాముని దర్శనమునకు తహతహలాడుచున్నది. ఆమె ఒకే జడతో ఉపవాసములుచేసి మలినవస్త్రములు ధరించి కృశించిఉన్నది "

తతో దృష్టేతి వచనం మహార్థమమ్రుతోపమమ్|
నిశమ్య మారుతేస్సర్వే ముదితా వానరాభవన్ ||

తా| అప్పుడు " చూచితిని" అను గొప్ప అర్థముకల అమృతసమానమైన వచనములను విని వానరులు అందరూ పరమానందమునొందిరి.

ఉక్త వాక్యం హనూమంతం అంగదస్తమధాబ్రవీత్ |
సర్వేషాం హరివీరాణాం మద్యే వచనముత్తమమ్||
అహో స్వామిని తే భక్తిః అహో వీర్యమహోధృతిః |
దిష్ట్యా దృష్టా త్వయా దేవీ రామపత్నీ యశస్వినీ |
దిష్ట్యా త్యక్ష్యతి కాకుస్ఠః శోకం సీతా వియోగజమ్ ||

తా|| అ మంచి మాటను తీసుకువచ్చిన హనుమంతిని ప్రశంసించుచూ అంగదుడు అ వానరవీరులందరి సమక్షమున ఇట్లు పలికెను.
" అహో నీ స్వామి భక్తి అపురూపమైనది, నీ పరాక్రమములు నీ ధైర్యసాహసములు కొనియాడదగినవి. అదృష్టమువలన రామ పత్నీ యశస్వినీ అయిన సీతాదేవిని చూడటమైనది. అదృష్టమువలన కాకుస్థుడైన శ్రీరాముడు సీతావియోగము వలన కలిగిన శోకమును త్యజించగలడు "

తతోంగదం హనూమంతం జాంబవంతం చ వానరాః |
పరివార్య ప్రముదితా భేజిరే విపులాశ్శిలాః ||
ఉపవిష్టా గిరేస్తస్య శిలాసు విపులాసు తే |
శ్రోతుకామా సముద్రస్య లంఘనం వానరోత్తమాః||

తా|| అప్పుడు వానరులు హనుమంతుడు మరియూ జాంబవంతుల చుట్టునూ చేరిరి. సముద్ర లంఘనము గురించి వినదలచినవారై ఆ వానరోత్తములు సంతోషముతో పెద్ద పెద్ద శిలలపై ఆశీనులైరి .

హనుమతా కీర్తిమతా యశస్వినా
తథాంగదేనాంగదనద్ధబాహూనా|
ముదా తదా ధ్యాసితమున్నతం మహన్
మహీధరాగ్రం జ్వలితం శ్రియాభవత్ ||

తా|| ఆప్పుడు ధీశాలిగా కీర్తిగలవాడు మహాపరాక్రమవంతుడుగా పేరుపొందినవాడు అయిన హనుమంతుడు, బాహుభుజకీర్తులతో శోభిల్లుచున్న అంగదుడూ ఆ శిలలపై అధిష్టించియుండగా, అ మహాగిరి యొక్క శిఖరాగ్రము మరింత శోభించుచుండెను !

సుందరకాండ
ఏబది ఏడవ సర్గము
సమాప్తము.