!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 212-213
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 212- 213
శ్లోకము 212
పంచానామపి కోశానాం
నిషేధే యుక్తితః కృతే|
తన్ నిషేధావధిః సాక్షీ
బోధరూపో అవశిష్యతే||
పంచానామపి కోశానాం -
ఐదు కోశములయొక్క
యుక్తితః కృతే నిషేధే -
యుక్తిగా చేయబడిన నిషేధము
తన్ నిషేధావధిః - అవిధముగా నిషేధింపబడిన అవధి లో
సాక్షీ బోధరూపో - బోధరూపమైన సాక్షి
అవశిష్యతే - శేషముగా మిగులును
ఈ ఐదు కోశములు నిషేధింపగా మిగిలిన పరిధిలో జ్ఞానరూపమైన సాక్షి శేషముగా మిగులును - అంటే అలా మిగిలినదే జ్ఞానరూపమైన సాక్షి - అదే ఆత్మ - అదే పరమాత్మ.
శ్లోకము 213
యోఽయం ఆత్మా స్వయంజ్యోతిః పంచకోశ విలక్షణః|
అవస్థాత్రయ సాక్షీ సన్ నిర్వికారో నిరంజనః|
సదానన్దః సవిజ్ఞేయః స్వాత్మత్వేన విపశ్చితా||
యోఽయం ఆత్మా - యో ( అవశిష్యతే ) అయం అత్మా-
ఏది మిగిలినదో ఆ ఆత్మ
స్వయంజ్యోతిః పంచకోశ విలక్షణః -
స్వయముగా ప్రకాశించునది , పంచకోశములకన్న భిన్నమైనది
అవస్థాత్రయ సాక్షీ - అది మూడు అవస్థలకు సాక్షి
సన్ నిర్వికారో నిరంజనః -
ఎల్లప్పుడు వుండు వికారములు లేనిది, బంధములు లేనిది
సదానన్దః స విజ్ఞేయః స్వాత్మత్వేన విపశ్చితా
సదానన్దః స విజ్ఞేయః -
సదానందరూపమైనది ఆ ఆత్మయే తెలియతగినది
ఎవరిచే ఏ విధముగా తెలియతగినది
స్వాత్మత్వేన విపశ్చితా -
స్వస్వరూపముగా పండితునిచే ( తెలియబడతగినది)
దీని తాత్పర్యము:
పంచకోశములు నిషేధింపబడగా , మిగిలిన శేషము - స్వయముగా ప్రకాశించునది. పంచకోశములకనా భిన్నమైనది. అదు మూడు అవస్థలకి సాక్షిగా, వికారములు లెనిదై, బంధములు లేనిదై సదానందరూపమైనది. ఆ ఆత్మయే స్వ స్వరూపముగా పండితునిచే తెలియబడతగినది.
||ఓమ్ తత్ సత్||