Sundarakanda Chapter 66

Rama in sorrow !

Chapter 66:

Summary : After hearing Hanuman and receiving the "chudamani" sent as a token by Sita, Rama was desolate. Rama again asks Hanuman to tell each and every word spoken by Sita in her sorrow of separation"

For telugu Home page

click here

सुंदराकांड!! సుందరకాండ !!
అఱువది ఆఱవ సర్గము

ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః |
తం మణిం హృదయే కృత్వా ప్రరురోద స లక్ష్మణః ||

తా| హనుమంతుడు ఈ విధముగా చెప్పిన తరువాత దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని త హృదయమునకు హత్తుకొని లక్ష్మణుని తో కూడి చాలా విలపించెను.

తంతు దృష్ట్వా మణిశ్రేష్ఠం రాఘవ శ్శోకకర్శితః |
నేత్రాభామశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్ ||

 

తా|| శ్రీరాముడు శ్రేష్టమైన ఆ మణిని చూచి శోకాకులుడై కన్న్నుల నీరు నిండగా సుగ్రీవునితో ట్లనెను.

మణిరత్నమిదం దత్తం వైదేహ్యాః శ్వశురేణ మే |
వధూకాలే యథా బద్ధ మధికం మూర్ద్ని శోభతే ||
అయంహి జలసంభూతో మణిసజ్జనపూజితః |
యజ్ఞే పరమతుష్టేన దత్తస్సక్రేణ ధీమతా ||
ఇమం దృష్ట్వా మణీశ్రేష్ఠం యథా తాతస్య దర్శనమ్|
అద్యాస్మ్యవగత సౌమ్య వైదేహస్య తథావిభో: ||
అయం హిశోభతే తస్యాః ప్రియాయా మూర్ధ్ని మే మణిః |
అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే ||

 

తా|| " మామయైన జనక మహారాజు వివాహసమయమున వైదేహికి ఇచ్చెను. అది ఆమె శిరస్సున ధరించినప్పుడు ఆ మణిశోభలు ఇనుమడించెను. జలమునుంచి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొనినది. జనకుడు చేసిన యజ్ఞమునకు దేవేంద్రుడు సంతుష్ఠుడై దీనిని అ మహారాజుకి బహుకరించెను. సౌమ్యుడవైన ఓ సుగ్రీవా ! ఈ విశిష్ఠమైన మణిని చూడగనే మా తండ్రి అయిన దశరథుడు మామయైన జనకుని దర్శించినట్లున్నది. ఈ మణియే ఇంతవరకు సీతాదేవియొక్క శిరస్సుని అలంకరించి శోభిల్లుచుండెడిది. ఇప్పుడు ఈ మణిని చూచి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను ".

 

కిమాహా సీతా వైదేహీ బ్రూహి సౌమ్య పునఃపునః |
పిపాసుమువ తోయేన సీమ్చ్ంతీ వాక్యవారిణా ||

 

తా|| ఓ మారుతీ సీతాదేవి చెప్పిన మాతలు పదేపదే చెప్పుము. దాహము గలవానికి జలమువలె ఆ వాక్యవారి నాకు హాయినిగూర్చును.

 

ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారిసంభవమ్ |
మణిం పస్యామి సౌమిత్రే వైదేహీ మగతాం వినా ||
చిరం జీవతివై దేహీ యది మాసం ధరిష్యతి |
క్షణం సౌమ్య న జీవేయం వినా తామసితేక్షణామ్ ||

 

తా|| ఓ సౌమిత్రా ! వైదేహీ ఇచటలేకుండా జలసంభవమైన ఈ చూడామణిని చూచుటవలన నా దుఃఖము ఇంకా అధికమగుచున్నది. సౌమ్యుడవైన ఓ లక్ష్మణా ! సీతాదేవి ఒక మాసము జీవించినచో ఆమె చిరకాలము జీవించినట్లే యని తలంచవచ్చును. కాని మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఒక్కక్షణమైననూ జీవించియుండజాలను

 

 

నయ మామపి తం దేశం యత్రదృష్టా మమప్రియా |
న తిష్టేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్య చ ||
కథం సా మమ సుశ్రోణీ భీరుభీరుస్సతీ సదా |
భయావహానాం ఘోరాణాం మధ్యే తిష్టతి రక్షసామ్||
కిమాహా సీతా హనుమాన్ తత్వ్తః కథయాద్యమే |
ఏతేన ఖలు జీవిష్యే భేషజేనాతురో యథా ||

 

తా|| "నా ప్రియురాలుని ఎక్కడచూచితివో అక్కడికి నన్నుకూడా చేర్చుము. అమే జాడ తెలిసినతరువాత ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండలేకున్నాను. సుందరాంగియు సహజముగా భయపడుస్వభావము కలది సాధ్వి అగు సీత భయంకరులైన ఘోర రాక్షసులమధ్య ఎట్లు ఉండగలుగుచున్నది ? ఓ హనుమంతుడా సీతా ఇంకనూ ఏమనినదో పూర్తిగా చెప్పుము. అ మాటలతో రోగి ఔషధముచే నెట్లు జీవించునో అట్లే జివించెదను"

 

మథురా మథురాలాపా కిమాహా మమ భామినీ |
మద్విహీనా వరారోహా హనుమాన్ కథయస్వమే |
దుఃఖాద్దుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకీ ||

తా|| ఓ హనుమంతుడా మధురస్వభాముగల మధురముగా మాట్లాడు నా వియోగదుఃఖముతో నున్న నా భామ పలికినా మాటలు యథాతథముగా వివరింపుము. అత్యంత దుఃఖములోనున్న జానకి ఎట్లు జీవింఛుచున్నది.

 

!! సుందరకాండ !!
అఱువది ఆఱవ సర్గము
సమాప్తము

!! ఓమ్ తత్ సత్ !!