Sundarakanda Chapter 61

Vanaras destroy Madhuvan !!

Chapter 61:

Summary : All the Vanaras including Hanuman accept the suggestion of Jambavan that they should proceed and inform SriRama and Lakshmana. So The Vanaras leave Mahendra mountain with Hanuman in the forefront ! On the way they see Madhuvan and stop to drink honey with the permission of Angada and other chief Vanaras. In the process they lose control of themselves. They destroy the Madhuvan and attack Dadhimuka who was protecting Madhuvan under the orders of Sugriva.

For telugu Home page

click here

సుందరకాండ
అఱువదిఒకటవ సర్గము

తతోజాంబవతో వాక్యం అగృహ్ణాంత వనౌకసః |
అంగద ప్రముఖావీరా హనుమాంశ్చ మహాకపిః ||

తా|| అప్పుడు జాంబవంతుని మాటలను అంగదుడు మొదలగు వానర ప్రముఖులు కపివరుడైన హనుమంతుడు ఆమోదించిరి.

ప్రీతిమంతస్తతస్సర్వే వాయుపుత్రపురస్సరాః |
మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువుః ప్లవగర్షభాః ||

తా|| పిమ్మట సంతోషముగానున్న వారందరూ వాయుసుతుడైన హనుమంతుని ముందు ఉంచుకొని మహేంద్రగిరిని వీడి ఆకశముపకి ఏగిరిరి.

ప్లవమానాః ఖమాప్లుత్య తతస్తే కాననౌకసః |
నందనోపమమాసేదుః వనం ద్రుమలాయుతమ్ ||

తా|| అంతట ఆ వానరులు ఆకాశమార్గమున ఎగురుచూ సుసంపన్నమైన వృక్షములతోనూ లతలతోనూ అలరారుచూ ననదనవన సదృశమైన మధువనమును చేరిరి.

యత్తన్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితమ్ |
అధృష్యం సర్వభూతానాం సర్వభూతమనోహరమ్ ||
యద్రక్షతి మహావీరః సదా దధిముఖః కపిః |
మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః||

తా|| సకలప్రాణులకు ఆహ్లాదము గూర్చునట్టి ఆ మధువనము సుగ్రీవును రక్షణలోనుండెను. ఆ వనమును దధిముఖుడను వానరుడు , కపిముఖ్యుడైన సుగ్రీవునకు మేనమామ ,నిరంతరము పరిరక్షించుచుండెను.

తే తద్వనముపాగమ్య బభూవుః పరమోత్కటాః |
వానరా వానరేంద్రస్య మనః కాంతతమం మహత్ ||
తతః కుమారస్తాన్ వృద్ధాన్ జాంబవత్ప్రముఖాన్ |
అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధుబక్షణే ||

తా|| వానరేంద్రుడైన సుగ్రీవునకు మానసోల్లసము కలిగించు ఆ వనమును చేరగనే ఆ వానరలందరను మధుపానమునకి ఆరాటపడసాగిరి. అప్పుడు యువరాజైన అంగదుడు ప్రముఖులైన జాంబవదాది వృద్ధ వానరుల ఆమోదముతో మధుభక్షణమునకై వారికి అనుమతిని ఇచ్చెను.

భక్షయంతస్సుగంధీని మూలాని చ ఫలాని చ |
జగ్ముః ప్రహర్షం తే సర్వే భభూవుశ్చ మదోత్కటాః||

తా|| ఆ వానరులందరూ సుగంధములుగల మూలములను , మధుర ఫలములను భక్షించుచూ ఆనందమును పొంది మత్తెక్కి మైమరచిరి. |

గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్
నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ |
పతంతి కేచిత్ విచరంతి కేచిత్
ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ ||

తా|| కోందరు గానములు చేయుచుండిరి. కొందరు కొమ్మలతో, కొందరు నృత్యములు చేయుచుండిరి , కొందరు పకపక నవ్వుచుండిరి, కొందరు చెట్లనించి క్రింద పడుచుంటిరి, కొందరు అటునిటు తిరుగుచుండిరి. కొందరు గంతులు వేయుచుండిరి. కొందరు ప్రలాపములు చేయుచుండిరి..

తతో వనం తత్పరిభక్ష్యమాణం
ద్రుమాంశ్ఛ విధ్వంసిత పత్రపుష్పాన్ |
సమీక్ష్య కోపాద్దధివక్త్రనామా
నివారయామాస కపిః కపీంస్తాన్ ||
సతైర్మదాత్ సంపరివార్యవాక్యైః
బలాచ్చటెన ప్రతివార్యమాణైః |
ప్రధర్షితస్త్యక్తభయైస్సమేత్య
ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషమ్ ||

తా|| ఆ వానరులందరూ యధేచ్చగా ఆ మధువనమునందలి ఫలములను భక్షించుచూ , మధువులను సేవించుచూ, పత్రములతో పుష్పములతో అలరారుచున్న ఆ వనమును ధ్వంసము చేయుచుండగా చూచి వనపాలకుడైన దధిముఖుడను వానరుడు మిక్కిలి కోపముతో వారిని వారింపసాగెను. అతడు సామవచనములతో ఆ వానరులను నివారింపసాగెను. అంతట మధుమత్తులైన ఆ వానరులు ఏట్టి భయములేనివారై , దోషమని తలంపక ఆ దధిముఖుని చుట్టుచేరి బలప్రయోగముచే అతనిని భయపెట్టసాగిరి.

నఖైస్తు దంతో దశనైర్దశంతః
తలైశ్చ పాదైశ్చ సమాపయంతః |
మదాత్ కపిం తం కపయసమగ్రా
మహావనం నిర్విషయం చ చక్రుః ||

తా|| మధుపానముతో మత్తులైన ఆ వానరులందరూ ఆ దధిముఖుని గోళ్ళతో దంతములతో దశించిరి. పాదములతో చేతులతో గాయపఱిచిరి. ఆ వనమును పూర్తిగా ధ్వంసమొనర్చిరి .

సుందరకాండ
అఱువదిఒకటవ సర్గము
సమాప్తము