Sundarakanda Chapter 63

Sugriva asks Dadhimukha to send

Hanuman and others !!

Chapter 63:

Summary : Dadhimukha tells that Angada and others destroyed the Madhuvan. Sugriva immediately understood that Vanaras and specifically hanuman found Sita. He tells Dadhimukha to go back and send Hanuman and other vanaras immediately

For telugu Home page

click here

సుందరకాండ
అఱువది మూడవ సర్గము

తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభః |
దృష్ట్వైవోద్విగ్నహృదయో వాక్యమేతదువాచ హ ||

తా|| ఆ వానర ప్రభువు తనకు సాష్టాంగప్రణామములు చేయుచున్న వానరుని చూసి హృదాయాందోళనతో ఇట్లు పలికెను.

ఉత్తిష్టోత్తిష్ఠ కస్మాత్ త్వం పాదయోః పతితో మమ |
అభయం తే ప్రదాస్యామి సర్వమేవాభిదీయతామ్ ||

తా|| " లేవుము లేవుము . ఎందువలన నీవు నాపాదములపై బడితివి ? అభయమిచ్చుచున్నాను. అంతయూ విపులముగా దెలుపుము ".

స సమాశ్వాసితస్తేన సుగ్రీవేణ మహాత్మనా |
ఉత్థాయ స మహాప్రాజ్ఞో వాక్యం దధిముఖోబ్రవీత్ ||
నైవర్ క్షరజసా రాజన్ న త్వయా నాపి వాలినా |
వనం నిసృష్టపూర్వం హి భక్షితం తచ్చ వానరైః ||
న్యవారయమహం సర్వాన్ సహైభిర్వనచారిభిః |
అచింతయిత్వా మాం హృష్టా భక్షయంతి పిబంతి చ||
ఏవమేతే హతశ్శూరాః త్వయి తిష్టతి భర్తరి |
కృత్స్నం మధువనం చైవ ప్రకామం తైః ప్రభక్ష్యతే ||

తా|| సుగ్రీవునిచే ఆవిధముగా ఆశ్వాసించబడిన మరియూ మిక్కిలి బుద్ధిశాలి అయిన దధిముఖుడు లేచి నిలబడి ఇట్లు పలికెను. "ఓ రాజా ! నీ తండ్రి అగు ఋక్షరజసుడు , నీ ఆన్నయగు వాలి ఇంకా నీ చేతనూ రక్షింపబడిన మధువనమును ఈ వానరులు అందలి ఫలములను భక్షించి వనమును ధ్వంసమొనర్చిరి. నేను వనపాలకులతో వారిని నివారించితిని. అయిననూ వారు ఎట్టి చింతలేనివారై ఫలములను సేవించుచుండిరి. నీవు రాజువైనా వీరులైన మన వనరక్షకులను ఆ వానరులు హతమార్చి విచ్చలవిడిగా మధువనమును ధ్వంసమొనర్చిరి"

ఏవం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభమ్ |
అపృచ్చత్ తం మహప్రాజ్ఞో లక్ష్మణః పరవీరహా ||
కిమయమ్ వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః|
కంచార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్ ||
ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మనా |
లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః ||

తా|| ఈ విధముగా దధిముఖుడు వానర రాజుకి విన్నవించుచున్నప్పుడు , మహాధీశాలి మఱియూ శత్రువులను హతమార్చుటకు సమర్థుడైన లక్ష్మణుడు సుగ్రీవుని ఇట్లు ప్రశ్నించెను." ఓ రాజా వనపాలకుడైన ఈ వానరుడు ఇచ్చటికి వచ్చుటకు కారణమేమి ? ఏల దుఃఖించుచున్నాడు ? ఏ విషయముగుఱించి నీకు నివేదించుచున్నాడు ? ". ఈ విధముగా లక్ష్మణునిచే అడగబడిన మరియూ మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఇట్లు సమాధానమిచ్చెను.

ఆర్య లక్ష్మణ సంప్రాహ వీరో దధిముఖో కపిః |
అంగదప్రముఖైర్వీరైః భక్షితం మధు వానరైః ||
విచిత్య దక్షిణామాశాం ఆగతైర్హరిపుంగవైః |
నైషామకృతకృత్యనాం ఈదృశస్స్యాదుపక్రమః ||
పతిర్మమ వనస్యాయమ్ అస్మాభిః స్థాపితః స్వయమ్|
దృష్టాదేవీ న సందేహో న చాన్యేన హనూమతా ||
దృష్టా సీతా మహబాహో సౌమిత్రే పశ్య తత్త్వతః |
అభిగమ్య తథా సర్వే పిబంతి మధు వానరాః ||

తా|| " ఆర్యా లక్ష్మణా ! అంగదాది ప్రముఖ వీరులు మధువనమును భక్షించిరి. దక్షినదిశనుంచి వచ్చిన వానరపుంగవులు కృతకృత్యులు గానిచో ఇట్టి పనికి పూనుకొనరు. సందేహములేదు వారు సీతాదేవిని చూసి వచ్చిరి. చూసినది మరెవ్వరూకాదు . హనుమంతుడే ! ఓ మహాబాహో సౌమిత్రా ! సీతాదేవి కనబడినది అన్నది సత్యము. వారందరూ వచ్చి మధువును భక్షించుటయే ఇందుకు నిదర్శనము ! "

తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహరాఘవః|
శ్రుత్వా కర్ణసుఖం వాణీం సుగ్రీవవదనాచ్చ్యుతామ్ |

తా|| సుగ్రీవుని నోట వెలువడిన వీనులవిందుగావించు ఈ మాటలను విని ధర్మాత్ములైన శ్రీరామ లక్ష్మణులు పరమానంద భరితులైరి.

వనపాలం పునర్వాక్యం సుగ్రీవః ప్రత్యభాషత |
ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తైః కృతకర్మభిః ||
మర్షితం మర్షణీయం చ ఏష్టితం కృతకర్మణామ్|
గచ్చ శీఘ్రం మధువనం సంరక్షస్వ త్వమేవహి |
శీఘ్రం ప్రేషయ సర్వాం స్తాన్ హనూమత్ప్రముఖాన్ కపీన్ ||

తా|| ఆ వనపాలకునకు సుగ్రీవుడు మళ్ళీ ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. " కృతార్థులై వచ్చిన వానరులు వనమందలి ఫలములను మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే. కార్యము సాధించి వచ్చినందుకు వానరులచర్య సహింపదగినదే. వెంటనే మధువనమునకు వెళ్ళుము .దానిని నీవే రక్షింపుము. హనుమదాది ప్రముఖులను శీఘ్రముగా ఇచటికి పంపుము."

ప్రీతి స్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ
దృష్ట్వా సిద్ధర్థౌ వానరాణాం చ రాజా |
అంగైస్సంహృష్టైః కర్మసిద్ధిం విదిత్వా
బాహ్వోరాసన్నాం సోతిమాత్రం ననంద ||

తా|| కార్యము సఫలమైనందుకు సంతోషముతో విపారిన కన్నులతో తమసంతోషమును ప్రకటించుచున్న కుమారులిద్దరినీ గాంచిన సుగ్రీవుడు , తన శరీరమంతయూ పులకించుటచే కార్యసిద్ధి ఇక కరతలామలకము అని భావించి సంతోష పడెను.

సుందరకాండ
అఱువది మూడవ సర్గము
సమాప్తము

ఓమ్ తత్ సత్