!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 249-251
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 249-251 మహావాక్య
విచారము: 243
నుంచి 251 వరకు ఎనిమిది శ్లోకాలలో
గురువు తత్వమసి
అన్న మహావాక్యము విశదీకరిస్తాడు. ముందు
శ్లోకాలలో
విన్నది: తత్వమసి
అన్న మహావాక్యములో
జీవ బ్రహ్మముల ఏకత్వము ప్రతిపాదించబడినది. ఆ
ఏకత్వము వాటి అంతరార్థము ద్వారా వస్తుంది
కాని, పరస్పర విరుద్ధమైన , మెరుగుపురుగు -
సూర్యుడు ; రాజు -రాజభటులు ;
పరమాణువు-మందరపర్వతము;
కూపము-మహాసముద్రము లాంటి మాటల అర్థము ద్వారా కాదు
అని: ఆ
రెండిటి (
ఈశ్వరుడు జీవుడు) విరోధము వాటి
ఉపాధి వలననే; యదార్థమైన విరోధము లేదు; ఈశ్వరుని
ఉపాధి - మహాతత్త్వము అహంకారము మొదలగు వాటితో కూడిన
జగత్తుకి కారణ మైన మాయ; జీవుడి ఉపాధి
- కార్యరూపమైన పంచకోశములు. పరమాత్మ
జీవుల
వారి ఈ ఉపాధిని - పూర్తిగా తీసేస్తే పరమాత్మాలేడు
జీవుడు లేడు. రాజు యొక్క రాజ్యము,
భటుడి ఆయుధము వాటిని తొలగిస్తే భటుడు లేడు రాజు
లేడు. అలా సులభముగా, ఉపాధి
తీయవచ్చా అన్న ప్రశ్న 247 వ శ్లోకములో
శ్రుతులద్వారా
చేయవచ్చు అని చెపుఉతాడు గురువు ’అథాత
ఆదేశో నేతి
నేతి’ అనబడే
శ్రుతి వాక్యము స్వయముగా...’ బ్రహ్మము
యందు కల్పింపబడిన ద్వైతమును నిషేధించుచున్నది.
శృతి యొక్క ప్రమాణము చే అనుగ్రహింపబడిన,
చెప్పబడిన, బోధనతో, ఆ రెండిటి ( ఈశ్వరుడు జీవుడుల)
ఉపాధులయొక్క నిరాకరణము చేయతగినదే;
అది 248 శ్లోకములో
చెప్పిన మాట. ఈశ్వరుడు
జీవుడి
ఉపాధులు తొలగిస్తే మిగిలేది బ్రహ్మమే అని మనకి
అనిపించినా , గురువు తన పద్ధతి లో ముందు
శ్లోకములో మనలని , శిష్యుడిని ముందుకు తీసుకు
వెడతాడు ఇదికాదు
ఇదికాదు
అన్నది, కల్పించబడడము (లేక భ్రాన్తి) వలన మనము
అనుకున్నవి సత్యము కాదు అని చెప్పడమే. దానికి
ఉదాహరణ తాడు చూచి పాము అనుకోవడమే; నిద్రలో
చూస్తున్న విషయము నిద్రలో నిజము అను కోవడమే. పాము
స్వప్నము నిజము కావు. ఈ విధముగా అసత్యమగు
వాటిని, అలా
భ్రాన్తిలో కనపడు వాటిని యుక్తితో
తొలగించి, తరువాత వాటిలో ఏ ఏకభావము కలదో అది
తెలిసికొన తగినది. అది గురువు చెపుతున్నమాట.
ఇక
249/
250/251 శ్లోకాలు: వివేక చూడామణి శ్లోకములు
249-250-251 శ్లోకము 249: తతస్తుతౌ లక్షణయా సులక్ష్యౌ తయోః అఖండైక రసత్వ సిద్ధయే| నాలం జహత్యా న తథా అజహత్యా కింతూభాయార్థైకతయైవ భావ్యమ॥249॥ తతస్తుతౌ లక్షణయా సులక్ష్యౌ - తతః తౌ
లక్షణయా సులక్ష్యౌ- అందువలన
వారు
( జీవేశ్వరులు) లక్షణము చేత బాగుగా బోధింపతగినవారు అందువలన
అంటే
- ఈశ్వరుడు జీవులలో వున్న పరస్పర విరుద్ధ
గుణములవలన - వారిలో ఏకత్వము గ్రహించడానికి
- వాక్యవృత్తిలో - అంటే వాక్యములు చదివే విధానములో
- వాక్య పదములయొక్క లక్షణములద్వారా
బాగా పరిశీలించవలెను అని. తయోః అఖండైక రసత్వ సిద్ధయే - వారిద్దరికీ
అఖండమగు
ఏకత్వము సిద్ధించుటకు: లక్షణముల
ద్వారా
ఎందుకు పరిశీలిద్దాము అంటే వారిలో ఏకత్వము
గ్రహించడానిక్ఇ. నాలం జహత్యా న తథా అజహత్యా - జహత్యా
అజహత్యా
అనే గుణములచే కాదు; అంటే ఆ
ఏకత్వము
ఈ రెండు గుణాలద్వారా రాదు అని కింతూభాయార్థైకతయైవ భావ్యమ్- కింతు ఉభయ అర్ధ ఏకతయా ఏవ భావ్యమ్। రెండు
అర్థములకు
ఏకత్వము ప్రతిపాదించు లక్షణము చేతనే తగును. ఏ
లక్షణము ద్వారా
ఏకత్వము వస్తుంది అన్నది గురువు ముందు చెపుతాడు. 249 శ్లోకతాత్పర్యము: అందువలన వారు ( జీవేశ్వరులు) లక్షణముల చేత
బాగుగా బోధింపతగినవారు. వారిద్దరికీ
అఖండమగు ఏకత్వము సిద్ధించుటకు జహత్యా అజహత్యా
అనే గుణములచే కాదు. వారి ఏకత్వము - రెండు
అర్థములకు ఏకత్వము ప్రతిపాదించు లక్షణము చేతనే
తగును. ఇక్కడ
గురువు లక్షణములగురించి
చెప్పాడు. లక్షణములు
మూడు
విధములు - జహల్
లక్షణము
(తిరస్కారము ద్వారా) -
అజహల్ లక్షణము
(అంగీకారము ద్వారా) -
జహదజ్జహల్ లక్షణము
( అంగీకార - తిరస్కారముల ద్వారా) గురువు
ముందే చెప్పాడు
జహల్ లక్షణము, అజహల్ లక్షణము ద్వారా ఏకత్వానికి
సరి పోవు అని. దానిలో ఇంకచెప్పవలసిన
మాట ఏమీ లేదు. కాని ఆ రెండు లక్షణాలు మనకి
పూర్తిగా తెలియకపోయినా, వాటి గురించి ఇలా
అనుకోవచ్చు. ఒక వాక్యములో పదముల అర్థమును పూర్తిగా
తిరస్కరించి , వాక్యానికి అనుగుణమైన
అర్థము తీసుకొనుటను జహల్లక్షణము అంటారు. ఉదాహరణకి "గంగలో
గోశాల" పదముల అర్థము తీసుకుంటే
ఆ గోశాల గంగలో వుంది అని. గంగలో వుంటే ఆ
ప్రవాహానికి ఆ గోశాల కొట్టుకొని పోవచ్చు ;
ఇక్కడ ఆ పదముల అర్థము తిరస్కరించి - "గంగలో
గోశాల"ని గంగాతీరము మీద వున్న
గోశాల అని అర్థము చేసుకోవడము - జహల్ లక్షణము; అంటే
ఇక్కడ పదముల అర్థము తిరస్కరించి
, వాక్యానికి అనుగుణమైన అర్థము తీసుకొనబడినది. అదే
జహల్లక్షణము. పదముల
అర్థము తిరస్కరించ
కుండా, ( తిరస్కరిస్తే అది జహల్లక్షణము)
వాక్యానికి అనుగుణమైన అర్థము తీసుకుంటే అది
అజహల్లక్షణము అని అంటారు; " ఎఱ్ఱవి
పరగెడుతున్నాయి" అన్న వాక్యములో - ఎఱ్ఱవి
పరగెడుతున్నాయి అన్నమాటకి అర్థము రాదు - అదే ఎఱ్ఱ
గుర్రములు పరుగెడుతున్నాయి అనే అర్థము
- ఎఱ్ఱవి అన్నమాట తిరస్కరించకుండా గుర్రము అనే
మాటతో వాక్యార్థము చెప్పబడినది ; ఈ పదముల
అర్థము తిరస్కరించకుండా వాక్యార్థము చెప్పడాన్ని
అజహల్లక్షణము అంటారు; ఒక
వాక్యములో పదముల
అర్థములలో ఒక భాగము తిరస్కరించి ( జహల్లక్షణము
లాగా) మిగిలినది
అంగీకరించడము ( అజహల్లక్షణము లాగా) ఇది
జహల్ అజహల్ లక్షణముల మిశ్రమము. అదే మనకి కావలసిన
మార్గము. ఈ మార్గము పండితులు ఉదాహరణ
ద్వారా విశదీకరిస్తారు. ఆ
ఉదాహరణ
"ఆ దేవదత్తుడు వీడే". ఇక్కడ
"ఆ"
అన్న మాటలో "ఎప్పుడో" "ఎక్కడో" చూడబడిన దేవదత్తుడు
అని అర్థము
వినిపిస్తుంది. "వీడే"
అన్న మాటలో "ఇప్పుడు" "ఇక్కడ" చూడబడిన దేవదత్తుడు
అని అర్థము వినిపిస్తుంది. ఈ
వాక్యములో అర్థము
ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒకడే అని. ఆ అర్థము
కోసము -
ఆ
"ఎప్పుడో" "ఎక్కడో" , అన్న మాటలని అలాగే
"ఇప్పుడు"
"ఇక్కడ" అన్నమాటలని వదిలేసి , వీడే ఆ దేవదత్తుడు
అని అర్థము చేసుకుంటాము.
అంటే ఇక్కడ వ్యతి రేకమైన - "ఎప్పుడో"
"ఎక్కడో"
అలాగే "ఇప్పుడు" "ఇక్కడ" అన్నమాటలు
తిరస్కరించడమైనది.
దానినే జహల్ అజహల్ లక్షణము అంటారు. ఎలాగైతే "ఎప్పుడో"
"ఎక్కడో" అలాగే
"ఇప్పుడు" "ఇక్కడ" అన్నమాటలు తిరస్కరించి, మిగిలిన
దేవదత్తుడు
నిజముగా గ్రహింవబడినదో - అలాగే - "తత్ త్వం అసి"
అన్న వాక్యములో
తత్ అన్నమాటలో చెప్పబడిన ఈశ్వరుని ఉపాధి
అయిన మాయను
తిరస్కరించి, త్వం అన్నమాటలో గల జీవుని ఉపాధి అయిన
పంచ కోశములను తిరస్కరించి, శేషము
విచారించాలి. ఇంకొంచెము
ముందుకు
పోయి , దృశ్య రూపముగల జీవుడిలో పంచకోశములని
విసర్జించితే, జీవుడిలో మిగిలేది శుద్ధచైతన్యమే. అదృశ్య
రూపమైన
ఈశ్వరుడిలో మాయ విసర్జిస్తే మిగిలేది కూడా శుద్ధ
చైతన్యమే. అంటే
జీవుడు ఈశ్వరుడిలో
మిగిలిన శుద్ధ చైతన్యమే - తత్ త్వం లో
(వారిద్దరిలో) ఏకత్వము. ఇక్కడ
ఒక మహావాక్యములో
చెప్పబడిన మాట, అనేక మహావాక్యములలో ఇదే అర్థము
వినిపిస్తుంది గురువు
ఇదే మాటని
250 వ శ్లోకములో విశదీకరిస్తాడు. 250 వ శ్లోకము స దేవదత్తోఽయం ఇతీహచైకతా విరుద్ధ ధర్మాంశ అపాస్య కథ్యతే యథా తథా తత్వమసీతి వాక్యే విరుద్ధ ధర్మాన్ ఉభయత్ర హిత్వా స దేవదత్తోఽయం ఇతీహచైకతా - అయమ్ స దేవదత్తః ఇతి ఇహ చ -
'ఆ
దేవదత్తుడు
ఇతడే' అనే వాక్యములో విరుద్ధ ధర్మాంశ అపాస్య, ఏకతా కథ్యతే- విరుద్ధధర్మములని
విడిచి,
ఏకత్వము చెప్పబడుతున్నది యథా తథా - ఎలాగ
(చెప్పబడుతున్నదో) అలాగే అంటే ఏ
విధముగా
ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒకడే అని
నిర్ధారించుకున్నాడో అలాగే తత్వమసీతి వాక్యే - తత్వమసి అన్నవాక్యములో ఆంటే ఆ
బ్రహ్మము
నువ్వే అనే వాక్యములో విరుద్ధ ధర్మాన్ ఉభయత్ర హిత్వా- విరుద్ద
గుణములను
రెండిటినించి తొలగించి - అంటే
విరుద్ధధర్మములని
విడిచి ఆ
దేవదత్తుడు ఇతడే అని ఏకత్వము ఎలా
చెప్పబడుతున్నదో అలాగే - తత్వమసి అన్నవాక్యములో
-
విరుద్ద గుణములను రెండిటినించి తొలగించి - (
ఏకత్వము చెప్పవలెను అని గురువు మాట
- అది ముందు శ్లోకములో) 250 వ శ్లోకము తాత్పర్యము: 'ఆ దేవదత్తుడు ఇతడే' అనే వాక్యములో
విరుద్ధధర్మములని విడిచి ఏకత్వము -
ఎలా చెప్పబడుతున్నదో అలాగే - తత్వమసి - బ్రహ్మము
నీవే అన్నవాక్యములో - విరుద్ద గుణములను
రెండిటినించి తొలగించి - ( ఏకత్వము చెప్పవలెను). ఇక్కడ
శ్లోకములో
గురువు వాక్యము పూర్తి చేయలేదు - విరుద్ధగుణములు
తొలగించమన్నాడు అంతే. ఈ శ్లోకము లో
విరుద్ధగుణములను విడిచి అంటే, ఆ విరుద్ధ గుణములు
అయిన ఈశ్వరుని మాయ , జీవుడి పంచకోశములు
విడిచి అన్నమాట - అలా అవి వదిలేస్తే మిగిలేది
ఏమిటి ? - అది మనకి తెలిసినమాటే అయినా
251 శ్లోకము ద్వారా వింటాము. శ్లోకము 251: సంలక్ష్య చిన్మాత్ర తయా సదాత్మనోః అఖండ భావః పరిచీయతే బుధైః| ఏవం మహా వాక్యశతేన కథ్యతే బ్రహ్మాత్మనోః ఐక్యం అఖండభావః|| సంలక్ష్య చిన్మాత్ర తయా సదాత్మనోః- చిన్మాత్ర తయా సదాత్మనోః సంలక్ష్య - చిన్మాత్రరూపముగా
వాటి
సత్ రూపములగు జీవ పరమాత్మలయొక్క లక్షణము గ్రహించి, అంటే
పంచకోశములు
విసర్జించగా అంటే తీయగా మిగిలేది ఆత్మయొక్క
చైతన్యమే, చైతన్య స్వరూపమే. ఈశ్వరునిలో
మాయ తీసివేసి నప్పుడు మిగిలేది కూడా చైతన్యమే.
అంటే సత్ రూపములగు జీవ పరమాత్మలయొక్క
ముఖ్య లక్షణము చైతన్యమే. అఖండ భావః పరిచీయతే బుధైః- ఖండించబడ
లేని
ఆ అఖండ భావము పండితులచే గ్రహింపబడుతున్నది. అఖండ
అంటే ఖండించబడలేని,
ముక్కలుగా చేయబడలేని, అంటే విడతీయబడలేని అని
అర్థము - విడతీయబడలేని ఆ జీవుడిలో, ఈశ్వరులలో మిగిలేది
చైతన్యమే. చైతన్య స్వరూపము మాత్రమే. ఏవం మహా వాక్యశతేన కథ్యతే ఈ
విధముగా శత మహావాక్యములలో, బ్రహ్మాత్మనోః ఐక్యం అఖండభావః కథ్యతే- బ్రహ్మ
ఆత్మలయొక్క
ఖండించలేని (ఏకత్వ) భావము చెప్పబడుచున్నది. 251 తాత్పర్యము: చిన్మాత్రరూపముగా వాటి సత్ రూపములగు జీవ
పరమాత్మలయొక్క లక్షణము గ్రహించి - ఖండించబడ
లేని ఏకత్వ భావము పండితులచే గ్రహింపబడుతున్నది.
ఈ విధముగా శత మహావాక్యములలో, బ్రహ్మ
ఆత్మలయొక్క
ఖండించలేని (ఏకత్వ) భావము
చెప్పబడుచున్నది. ఈ మూడు
శ్లోకాల
తాత్పర్యము ఒకసారి - 249 - జీవేశ్వురుల ఏకత్వము ఆ మాటల అర్థము
ద్వారా సరిపోదు ;
అందువలన వారు ( జీవేశ్వరులు) శ్రుతిలో
చెప్పబడిన
వారి లక్షణముల చేత బాగుగా బోధింపతగినవారు.
లక్షణములు పరిశీలించినపుడు వారిద్దరికీ అఖండమగు
ఏకత్వము సిద్ధించుటకు జహత్యా అజహత్యా అనే
గుణములచే వాక్యార్థము రాదు. వారి ఏకత్వము
- రెండిటిలో ఏకత్వము ప్రతిపాదించుటకు అంగీకారము
నిరంగీకారము కల
జహల్ - అజహల్
అనే లక్షణము చేతనే తగును. 250 : 'ఆ దేవదత్తుడు ఇతడే' అనే వాక్యములో
విరుద్ధధర్మములని విడిచి ఏకత్వము -
ఎలా చెప్పబడుతున్నదో అలాగే - తత్వమసి అన్నవాక్యములో
- విరుద్ద గుణములను రెండిటినించి
తొలగించి - ( ఏకత్వము చెప్పవలెను) 251 తాత్పర్యము చిన్మాత్రరూపముగా వాటి సత్ రూపములగు జీవ
పరమాత్మలయొక్క ఏకత్వ లక్షణము గ్రహించి
- ఖండించబడ లేని ఏకత్వ భావము పండితులచే
గ్రహింపబడుతున్నది. ఈ విధముగా శతమహావాక్యములలో,
బ్రహ్మ ఆత్మలయొక్క విడతీయబడలేని
అఖండ (ఏకత్వ)
భావము చెప్పబడుచున్నది. తత్ త్వం అసి - అంటే ఆ బ్రహ్మమే నువ్వు అని. ||ఓమ్
తత్ సత్|| _________________________________________________________________