!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 254-255

||ఓమ్ తత్ సత్||

శ్లోకము 254

నిద్రాకల్పిత దేశకాలవిషయజ్ఞాత్రాది  సర్వం యథా
మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్ స్వాజ్ఞానకార్యత్వతః।
యస్మాత్ ఏవమిదం శరీరకరణప్రాణాహమాద్యప్యసత్
తస్మాత్ తత్త్వమసి ప్రశాన్త మమలం బ్రహ్మాద్వయం యత్ పరమ్ ॥

1 నిద్రాకల్పిత దేశకాలవిషయజ్ఞాత్రాది  సర్వం యథా -
నిద్రచేత కల్పింపబడిన
దేశకాలవిషయజ్ఞాత్రాది  సర్వం యథా (మిథ్యా)
దేశము కాలము విషయములు జ్ఞాత మొదలగు  సర్వము ఏవిధముగా అసత్యమో

నిద్రచేత కల్పింపబడిన దేశము కాలము విషయములు జ్ఞాత మొదలగు  సర్వము ఏవిధముగా అసత్యమో.. అలాగే

2 తద్వదిహాపి జాగ్రతి జగత్ స్వాజ్ఞానకార్యత్వతః।
   తద్వత్ ఇహా జాగ్రతి అపి -
   అలాగే ఈ జాగ్రదవస్థలో కూడా
   జగత్ స్వ అజ్ఞానకార్యత్వతః -
   జగత్తుకూడా తన అజ్ఞానకారణము వలన ( అసత్యమగుచున్నది అని తాత్పర్యము)

   అలాగే ఈ జాగ్రదవస్థలో కూడా  తన అజ్ఞానకారణమైన జగత్తుకూడా  అసత్యమగు చున్నది అని తాత్పర్యము.


3 యస్మాత్ ఏవమిదం శరీరకరణప్రాణాహమాద్యప్యసత్
  
   యస్మాత్ ఏవం ఇదం - ఏకారణము వలన
   ఏవం ఇదం  - ఈ జగత్తు అంతయూ మిథ్యాభూతమో ( అలాగే)
  
   శరీర కరణ ప్రాణ అహమ్ ఆది అపి అసత్ -
   ఈ శరీరము ఇంద్రియములు, ఇంద్రియములు , ప్రాణములు, అహంకారములు    మొదలగు నవి  కూడా అసత్యములే ( అసత్)

అంటే ఏకారణము వలన ఈ జగత్తు అంతయూ మిథ్యాభూతమో అలాగే ఈ శరీరము ఇంద్రియములు, ఇంద్రియములు , ప్రాణములు, అహంకారములు    మొదలగు నవి  కూడా అసత్యములే ( అసత్)

4 తస్మాత్ తత్త్వమసి ప్రశాన్త మమలం బ్రహ్మాద్వయం యత్ పరమ్ ॥
 
    తస్మాత్ - అందువలన
    ప్రశాన్త మమలం బ్రహ్మాద్వయం యత్ పరమ్  -
    ప్రశాన్తమైన, శుద్ధమైన అద్వితీయమైన బ్రహ్మము ఏది కలదో
    తత్ త్వం అసి - ఆ బ్రహ్మము నీవే

    అందువలన ప్రశాన్తమైన, శుద్ధమైన అద్వితీయమైన బ్రహ్మము ఏది కలదో ఆ బ్రహ్మము నీవే

॥తాత్పర్యము॥

నిద్రచేత కల్పింపబడిన దేశము కాలము విషయములు జ్ఞాత మొదలగు  సర్వము ఏవిధముగా అసత్యమో, అలాగే ఈ జాగ్రదవస్థలో కూడా  తన ఆజ్ఞానకారణమైన  జగత్తుకూడా అలాగే అసత్యము. మిథ్యలో అజ్ఞానకారణమువలన సత్యము అనుకొనబడినవి మిథ్య తొలగిపోగానే జ్ఞానము వలన అసత్యమని తెలిసికొనబడినవి.
ఏ కారణము వలన ఈ జగత్తు అంతయూ మిథ్యాభూతమో అలాగే ఈ శరీరము ఇంద్రియములు, ఇంద్రియములు , ప్రాణములు, అహంకారములు మొదలగు నవి  కూడా అసత్యములే ( అసత్). అందువలన ప్రశాన్తమైన, శుద్ధమైన అద్వితీయమైన బ్రహ్మము ఏది కలదో ఆ బ్రహ్మము నీవే.

శ్లోకము 255:

జాతి నీతి కులగోత్ర దూరగం
నామ రూప గుణ దోష వర్జితమ్।
దేశకాలవిషయాతివర్తియత్
బ్రహ్మ తత్వమసి భావయాత్మని॥


జాతి నీతి కులగోత్ర దూరగం  -
జాతి నోతి కులము గోత్రములకు దూరముగా వున్నదియు

నామ రూప గుణ దోష వర్జితమ్।-
నామ రూప గుణ దోషములతో శూన్యమైనదియూ

దేశ కాల విషయ అతివర్తి -
దేశ కాల విషయములన్నీ దాటి యున్నదియూ

యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని॥
యత్ బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని
ఏ బ్రహ్మము కలదో అది నీవే అని నీ బుద్ధి యందు ఆలోచించుము>

తా॥ జాతి నీతి కులము గోత్రములకు దూరముగా వున్నదియు, నామ రూప గుణ దోషములతో శూన్యమైనదియూ. దేశకాల విషయములన్నీ దాటి యున్నదియూ  అగు , ఏ బ్రహ్మము కలదో అది నీవే అని నీ బుద్ధి యందు ఆలోచించుము.

॥ఓమ్ తత్ సత్॥









 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

Om tat sat !

 

 

 

    •