!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 258-261

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి 258-261 శ్లోకములు

శ్లోకము 258:

భ్రాన్తికల్పిత జగత్కలాశ్రయమ్
స్వాశ్రయం చ సదసద్విలక్షణమ్।
నిష్కలమ్ నిరుపమాన సమృద్ధిమత్
బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని॥258॥

1 భ్రాన్తికల్పిత జగత్కలాశ్రయమ్ -
భ్రాన్తిచే కల్పితమైన జగత్ రూపమునుకు ఆశ్రయమైన

వివిధరూపములలో కనపడు బ్రహ్మముతో కూడిన జగత్తు అంతటికీ ఆధారమైనది బ్రహ్మమే. ఇది అనేకరకములుగా విన్నమాట. భగవద్గీతలో బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మణౌ బ్రహ్మణాహృతమ్..' అని కూడా విన్నాము. వేదాలలో జగత్తు బ్రహ్మముయొక్క పాదలలో నాల్గొవ వంతు  అని కూడా విన్నాము. అదే మాట ఇక్కడ గురువు ఈ జగత్తు అనే మిథ్య కి ఆధారభూతమైనది ఆ బ్రహ్మము అని చెపుతున్నాడు.

2 స్వాశ్రయం చ సద్ అసద్ విలక్షణమ్।

తనకు తనే అధారమైన, అంటే ఆధార రహితమైన ; సత్ అసత్ లకు అతీతమైనదియు ( అగు బ్రహ్మము)

వేదాలలో బ్రహ్మము దేనిపై ఆధరపడియున్నాడు అన్న ప్రశ్నకి ,సమాధానము ,'స్వే మహిమ్న" - అంటే తన మహిమపై నే ధారపడియున్నాడు అని వింటాము. దాని అర్థము తనకు తనే అధారమైనవాడు అని తగిన అర్థము. ఇక్కడ గురువు చెప్పినమాట అదే. అదే విధముగా పంచభూతములతో కూడిన వాటికి కూడా అతీతమైనది బ్రహ్మమే.

3 నిష్కలమ్ నిరుపమాన సమృద్ధిమత్

అవయవములు లేనిది, అద్వితీయమైనది (అగు బ్రహ్మము)

ఒకసారి పట్టుకొనబడలేని, పట్టుకోలేనిది కనక,  అవయవనములు లేనిది అని బ్రహ్మమును వర్ణిస్తారు. నిరుపమానమైనది అంటే అద్వితీయమైనది అని. ఇది కూడా బ్రహ్మము మీద తెలిసిన మాటే - ఇవన్నీ చెప్పి, అట్టి బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము అని గురువు చెపుతాడు

బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని -
ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము.

258 శ్లోక తాత్పర్యము:

భ్రాన్తిచే కల్పితమగు జగత్ రూపమునుకు ఆశ్రయమైన, తనకు తనే అధారమైన, అంటే ఆధార రహితమైన ; సత్ అసత్ లకు అతీతమైన, అవయవములు లేనిది, అద్వితీయమైనది అగు ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము.

శ్లోకము 259

జన్మవృద్ధి పరిణత్యపక్షయ
వ్యాధినాశనవిహీనమవ్యయమ్।
విశ్వసృష్ట్యవన ఘాత కారణమ్
బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని॥259॥

1 జన్మవృద్ధి పరిణత్యపక్షయ
  వ్యాధినాశనవిహీనమవ్యయమ్।

జన్మ వృద్ధి పరిణతః అపక్షయ వ్యాధి నాశనమ్ అవ్యయమ్ విహీనమ్ -
జన్మము, వృద్ధి, పరీణామములు, అవయవములు తరుగుట, వ్యాధి, నాశనము లేని ( విహీనమైన)  - ఈ ఆరు వికారములు లేని ,

3(i) అవ్యయమ్ - అవ్యయమైన,
అంటే నాశనములేనిది నిత్యము అయినది అగు

3(ii) విశ్వసృష్ట్యవన ఘాత కారణమ్
విశ్వముయొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైన,

పరమాత్మయే స్థితి సంహారములకు కారణమైననవాడు అన్న మాట పదే పదే విన్నమాట. అదే గురువు చెపుతున్నాడు ;  గురువు ఏ అధారముతో చెపుతున్నాడు అన్న ప్రశ్న వస్తే - అది వేదముల అధారముగా చెపుతున్నాడు అని చెప్పవచ్చు. వేదాలలో వచ్చిన మాట - "యతో వా ఇమాని భూతాని జాయన్తే" - దేనినినుంచి ఈ భూతములన్నీ పుట్టు చున్నవో;   "యేన జాతాని జీవన్తీ" - పుట్టినవి దేని చేత జీవించుచున్నాయో; "యత్ ప్రయంత్యభిసంవిశంతి" - మరల దేనిలో సంలీనమగుచున్నాయో,  ఆ బహ్మము అని;అంటే ఇవన్నీ వేదాలలో వినపడిన మాటలే

పోతన భాగవతములో - " ఎవ్వనిచే జనించు, జగమెవ్వరి లోపలనుండు.." అంటూ పరమాత్మ స్తుతించే  గజేంద్రుడి ప్రార్థన లో ఇవే మాటలు ప్రతిధ్వనిస్తాయి.

4) బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని-
ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము;

శ్లోకతాత్పర్యము 259:

జన్మము, వృద్ధి, పరీణామములు, అవయవములు తరుగుట, వ్యాధి, నాశనము లేని ( విహీనమైన)  - ఈ ఆరు వికారములు లేని , అంటే నాశనములేనిది నిత్యము అయినది అగు, విశ్వముయొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైన, ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము

శ్లోకము 260

అస్తభేదమనపాస్తలక్షణం
నిస్తరంగజలరాశి నిశ్చలమ్।
నిత్యముక్తమ్ అవిభక్తమూర్తియత్
బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని॥260॥

1(i) అస్తభేదం -
దేనినుంచి అన్ని భేదములు తొలగి పోయినవో
1(ii) అనపాస్త లక్షణమ్ -
ఎప్పటికీ మారని స్వరూపము అంటే సచ్చిదానంద స్వరూపము కలది

2 నిస్తరంగజలరాశి నిశ్చలమ్ -
నిః తరంగ జలరాశి నిశ్చలం-
తరంగములు లేని జలాశ్రయము వలే నిశ్చలముగా వుండునదియూ

3(i) నిత్యముక్తమ్ - ఎల్లప్పుడు ఏమీ సంబంధములు లేనిదియు:
3(ii) అవిభక్తమూర్తియత్ - విభజింపబడలేని స్వరూపము కలది యు;

4 బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని -
ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము;

260 వ శ్లోక తాత్పర్యము:

దేనినుంచి అన్ని భేదములు తొలగి పోయినవో, ఏది ఎప్పటికీ మారని స్వరూపము అంటే సచ్చిదానంద స్వరూపము కలదియో, ఏది తరంగములు లేని జలాశ్రయము వలే నిశ్చలముగా వుండునదియూ, ఎల్లప్పుడు ఏమీ సంబంధములు లేనిదియు, విభజింపబడలేని స్వరూపము కలదియు అగు , ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము;

శ్లోకము 261:

ఏకమేవసత్ అనేక కారణమ్
కారణాన్తర నిరాస కారణమ్।
కార్య కారణ విలక్షణ స్వయమ్
బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని॥

1 ఏకమేవసత్ - తాను ఒక్కటియే అగుచూ
అనేక కారణమ్ - అనేకమైన వాటికి కారణము అయిన

2 కారణాన్తర నిరాస కారణమ్
ఇతర కారణములన్నిటిని తొలగించగల కారణమైనది యు

3 కార్య కారణ విలక్షణ స్వయమ్-
కార్య కారణములకన్న భిన్నమైదియు స్వయం సిద్ధమైనదియు

బ్రహ్మ తత్ త్వం అసి భావయాత్మని -
ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము;

261 వ శ్లోకము తాత్పర్యము:

తాను ఒక్కటియే అగుచూ, అనేకమైన వాటికి కారణము అయిన; ఇతర కారణములన్నిటిని తొలగించగల కారణమైనదియు ; కార్య కారణములకన్న భిన్నమైదియు; స్వయం సిద్ధమైనదియు , ఆ బ్రహ్మము నీవే అని మనస్సులో భావించుము

ఇవన్ని గురువు ఆత్మగురించి బ్రహ్మము గురించి ముందు చెప్పినమాటలే. ఇప్పుడు గురువు ఆ బ్రహ్మమే నీవు అని గ్రహించుము అంటూ శిష్యుడికి మళ్ళీ
మళ్ళీ బోధిస్తున్నాడు.

॥ఓమ్ తత్ సత్॥














 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261

Om tat sat !

 

 

 

    •