!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 264-265

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి 264-265 శ్లోకములు

శ్లోకము 264:

యచ్చకాస్త్యనపరం పరాత్పరమ్
ప్రత్యగేకరసమ్ ఆత్మలక్షణమ్ ।
సత్యచిత్సుఖం అనన్తమవ్యయమ్
బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని॥

1 యత్ చకాస్తి అనపరమ్ -
ఏది వాస్తవమైన కార్యము లేనిదై ప్రకాశించుచున్నదో:

ఇక్కడ మళ్ళీ గురువు 'యత్', ఏదైతే అంటూ 'అనపరమ్' అంటూ,  శ్రుతి వాక్యము గుర్తు చేస్తూ బ్రహ్మము గురించి చెపుతున్నాడు. బ్రహ్మము నకు చేయవలసిన చేయ తగిన కార్యము అంటూ వుండదు. అది స్వయం ప్రకాశము కూడా.

1(ఇ) పరాత్పరమ్ - పరాత్ పరమ్ -
అన్నిటికన్నా అంటే ఉత్కృష్టమైనదానికన్న గొప్పదో;

బ్రహ్మము గురించి అలా చెప్పడములో అర్థము, ప్రప్రథమమైన హిరణ్యగర్భుడికన్నా అని , లేక అన్ని కార్యాలకై కారణమైన అజ్ఞానము కన్న ఉత్కృష్టమైనది అని, అన్నిటికన్నా (పరాత్) ముందు (పరమ్) వున్నది  అని వేరు వేరు విధాలు గా అర్థము చేసుకోవచ్చు.

2 ప్రత్యగేకరసమ్ ఆత్మలక్షణమ్
ప్రత్యగాత్మకంటే అభిన్నమైనదో , ఆత్మలక్షణము కలదో;

బ్రహ్మము ప్రతి భూతములలో జీవాత్మ రూపములో ప్రవేసించుచున్నది అని, అలా ఆత్మ లక్షణములు కల బ్రహ్మము నీవు అని చెపుతున్నాడు గురువు

3 సత్యచిత్సుఖం అనన్తమవ్యయమ్-
సచ్చిదానంద రూపమైనదో , అనన్తమైనదో , అవ్యయమైనదో;

బ్రహ్మము అనంతము ఆది మొదలు లేనిది, అదే అపరిచ్ఛిన్నము అంటారు - అపరిఛ్ఛిన్నము అంటే వీడతీయబడలేనిది - తుది మొదలు లేనిదాన్ని ఇది మొదలు అది ఆఖరిభాగము అను విడతీయలేము కనక అది అపరిచ్ఛిన్నము; అవ్యయము అంటే ఎల్లప్పుడు వుండేది, నిత్యము అని. ఇవన్ని బ్రహ్మము యొక్క లక్షణాలు అనవచ్చు.

4 బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని
అట్టి బ్రహ్మము నీవే అని మనస్సు లో భావింపుము; 

శ్లోకతాత్పర్యము:

"ఏది వాస్తవమైన కార్యము లేనిదై ప్రకాశించుచున్నదో; ఏది అన్నిటికన్నా అంటే ఉత్కృష్టమైనదానికన్న గొప్పదో; ఏది ప్రత్యగాత్మకంటే అభిన్నమైనదో , ఏది ఆత్మలక్షణములు కలదో; ఏది సచ్చిదానంద రూపమైనదో , అనన్తమైనదో , అవ్యయమైనదో; అట్టి బ్రహ్మము నీవే అని మనస్సు లో భావింపుము'.


శ్లోకము 265:

ఉక్తమర్థం ఇమమాత్మనిస్వయమ్
భావయ ప్రథితయుక్తిభిః ధియా ।
సంశయాదిరహితమ్ కరామ్బువత్
తేన తత్త్వనిగమో భవిష్యతి॥

 
1 ఉక్తమర్థం ఇమమాత్మనిస్వయమ్
భావయ ప్రథితయుక్తిభిః ధియా -

ఇక్కడ పదాలని విడదీసి కలిపితే ఇలావస్తుంది:

ఉక్తమ్ అర్థమ్ ఇమం  ఆత్మని స్వయమ్ ప్రథితయుక్తిభిః ధియా భావయ -
ఇమం ఉక్తమ్ అర్థమ్ ప్రథితయుక్తిభిః ధియా ఆత్మని స్వయమ్ భావయ

ఇమం ఉక్తమ్ అర్థమ్ - ఇక్కడ చెప్పబడిన విషయమును
ప్రథితయుక్తిభిః ధియా - ప్రసిద్ధమైన యుక్తులతో నిర్మలమైన అంతఃకరణముతో
ఆత్మని స్వయమ్ భావయ - ఆత్మయందు స్వయముగా భావన చేయుము:

ఇక్కడ చెప్పబడిన విషయమును, ప్రసిద్ధమైన యుక్తులతో నిర్మలమైన అంతఃకరణముతో ఆత్మయందు స్వయముగా భావన చేయుము.

ప్రసిద్ధమైన యుక్తులతో అంటే శ్రుతులలో చెప్పబడిన మాటలతో అని అంటే ప్రతిసారి గురువు, శృతులని అంటే వేదాలని గుర్తుచేస్తూ , శిష్యుడికి చెపుతున్నాడు అన్నమాట

ప్రతిశ్లోకములో ఆఖరి పాదము - బ్రహ్మ తత్త్వమ్ అసి భావయాత్మని;
అదే మాటని గురువు ఇక్కడ మళ్ళీ చెప్పాడు.

2 సంశయాదిరహితమ్ కరామ్బువత్ -
కరములో వున్న నీటి వలె సంశయరహితమైన;

కరము అంటే చెయ్యి -
చేతిలో వున్న నీరు మీద, ఎలా ఏ మాత్రము సంశయముండదో  -
అలాగే సంశయము లేకుండా అని.

3 తేన తత్త్వనిగమో భవిష్యతి-
దాని చేత ( మనస్సులో చేసిన భావన చేత), తత్త్వార్థము (సంశయములేనిదై ) వుండును.

265వ శ్లోక తాత్పర్యము:

ఇక్కడ చెప్పబడిన విషయమును, ప్రసిద్ధమైన యుక్తులతో నిర్మలమైన అంతఃకరణముతో ఆత్మయందు స్వయముగా భావన చేయుము; చేతిలో వున్న నీరు మీద ఎలా ఏమాత్రము సంశయముండదో  - అలాగే సంశయము లేకుండా
మనస్సులో చేసిన భావన చేత, తత్త్వార్థము అంటే తత్త్వమ్ అసి అన్నమాట సంశయములేనిదై వుండును.

ఈ మాటతో గురువు తత్వం అసి అన్న మహావాక్యానికి అర్థము చెప్పి , అలా అర్థము చేసుకో అని శిష్యుడికి చెపుతున్నాడు

॥ఓమ్ తత్ సత్॥
_________________________________________


















 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 

Om tat sat !

 

 

 

    •