ఏల్చూరి విజయరాఘవరావు గారి

తెలుగు సంక్షిప్త సుందరకాండ !

స్వేచ్ఛాను వాదము !!

|| సుందరకాండ||

కాసరబాద ఒర్గ్ లో అగష్టు 14, 2010 న రామాయణం పేజీలని మొట్టమొదటగా ఒక తెలుగు కవిత - "శ్రీమద్ వాల్మీకి రామాయాణాంతర్గత సుందరకాండ - సంక్షిప్త సంస్తుతి" - తో మొదలు పెట్టాము.

అది పద్మశ్రీ విజయరాఘవరావు గారి చే రచించబడిన సుందరకాండ - వారి స్వేచ్ఛానువాదము ! ఆ పూర్తి కవిత ఒక పత్రిక/పేజీలో రాదు అనిపించి , ఆ కవిత తొమ్మిది భాగాలలో ప్రస్తుతించబడినది. ఆ తొమ్మిది భాగాలకి తొమ్మిది పేరులు పేట్టాము. ఆపేరులు, ఆ భాగాలు అ కవితలో లేవు. అవన్నీ వెబ్ సైటులో పెట్టడానికి అనువుగా వుండడము కోసము కల్పించబడినవి మాత్రమే.

ఆ భాగాలు ఇవి:

- (1) సముద్ర లంఘనము : హనుమంతుడు మహేంద్రగిరి మీదనుంచి సముద్రము దాటుటకు ఎగురుట , లంక చేరుట
- (2) సీతాన్వేషణము : హనుమంతుడు సీతను వెదకుట , సీతను చూచుట
- (3) సీతా రావణ సంవాదము : సీతా రావణుల సంభాషణ
- (4) త్రిజటా స్వప్నము : రాక్షసస్త్రీలు సీతను బాధించుట , త్రిజట స్వప్నము
- ( 5) సీతా హనుమంతుల సంభాషణ- 1: హనుమంతుడు సీతకి తను రామదూతనని చెప్పుట
- (6 ) సీతా హనుమంతుల సంభాషణ-2: సీతా హనుమంతుల సంభాషణలో రాముడు వచ్చి రావణుని చంపి తనని తీసుకు పోవుట యే రామునికి తగునని చెప్పుట.
- (7 ) హనుమంతుని జయభేరి: లంకలో హనుమంతుని విజయము , జయమంత్రము.
- ( 8) లంకా దహనము : హనుమంతుడు లంకకు నిప్పు పెట్టుట
- (9 ) హనుమంతుని పునరాగమనము: హనుమంతుడు మళ్ళీ మహేంద్రగిరి వచ్చి , ఇతర వానరులతో కలిసి రామునకు సీతను గురించి నివేదించుట.

ఈ భాగములు అన్నీ పండిత్ విజయరాఘవరావు గారి స్వేచ్చానునువాదము లోవే. వారి పుస్తకము కాసరబాద వారి ట్రస్టు ద్వారా ప్రచురితమైనది. ఆ పుస్తకము ఉచితముగా ఇచట download చేసుకొనవచ్చు.

ఇది మీ ఆనందము కోసము||.

పద్మశ్రీ ఏల్చూరి విజయరాఘవరావు గారు బహుముఖ కళాకారులు. వారిని ఆంధ్రా విశ్వవిద్యాలయము వారు గౌరవనీయ doctorate తో సత్కరించారు.

వారి కవితను ప్రస్తుతించడము మాకు అమితమైన ఆనందము. దానిని అనుమతించినందుకు ఏల్చూరి వారికి మా కృతజ్ఞతలు.

|| ఓమ్ తత్ సత్||