సుబ్బలక్ష్మిగారి కలం నుంచి
Happy Mothers Day , May 2013 !!
అన్నదానం అంటే.. !!
"సూర్యుడు ఏ కిరణములచే సంతాపమును ఎక్కువగా కలుగ చేయుచున్నాడో ఆ కిరణములచేతనే మేఘరూపుడై వర్షించుచున్నాడు. ఆ వర్షజలము చేతనే వడ్లు మున్నగు ఓషధులు పుట్టుచున్నవి. ఆ ఓషధులచేత అన్నము పుట్టుచున్నది.
అన్నముచేత ప్రాణములు , ప్రాణములచేత బలము కలుగు చున్నది. బలముచేత తపస్సు కలుగుచున్నది. తపస్సుచేత జ్ఞానసంబంధమగు శ్రద్ధ ఉత్పన్నమగుచున్నది. ఆ శ్రద్ధచేత మేధస్సు కలుగుచున్నది. అ మేధస్సుచేత బుద్ధి కలుగు చున్నది. ఆ బుద్ధిచేత నిరంతరము తత్వ జ్ఞానము కలుగుచున్నది.
ఆ తత్వజ్ఞానముచేత క్రోధవృత్తి రహితమైన శాంతి కలుగుచున్నది. ఆ శాంతిచేత తత్వజ్ఞాన విషయ ప్రమాణజనితమైన చిత్తము కలుగుచున్నది. ఆ చిత్త జ్ఞానముచేత తత్వ విషయిక శ్రుతి , శ్రుతిచేత నిరంతర స్మరణము వలన విజ్ఞానము పొందుచున్నారు. ఆ విజ్ఞానముచేత ఆత్మను తెలుసుకొచున్నారు.
అందుచేత అన్నము ఇచ్చువాడు ఈ పైవి అన్నీ ఇచ్చుచున్నాడు. అన్నమువలన భూతములయొక్క ప్రాణములు కలుగుచున్నవి, ప్రాణములచేత మనస్సు , అందునుండి విజ్ఞానము , అందువలన పరమానంద స్వరూపుడై వేదాంత ప్రతిపాద్యమగు జగత్కారణ రూపుడగుచున్నాడు.
అందుచేత అన్నదానము అన్నిటిలోను ప్రశస్తము "
ఓమ్ తత్ సత్.