సుబ్బలక్ష్మిగారి కలం నుంచి
భగవద్గీత లో
స్థితప్రజ్ఞుని గురించి
( గీతా మకరందములోనించి)
స్థితప్ర జ్ఞస్య కా భాషా సమాధిస్థస్యకేశవా |
స్థితధీః కిమ్ ప్రభాషేత కిమాసీతవ్రజేతకిమ్ ||
అర్జునుడు పలికెను . "కేశవా ! సమాధియందున్న స్థితప్రజ్ఞునియొక్క లక్షణములు ఏమి? ఎట్లు భాషింఛును? ఎట్లు కూర్చొనును? ఎట్లు సంచరించును ?"
భగవానుడు పలికెను:
ప్రజఃహాతీ యదాకామాన్ సర్వాన్ ఫార్ద మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||
ఫార్థా ! మనస్సులో చేలరేగే కోరికల నన్నింటీని త్యజించి అత్మయందే అత్మచేత సంత్రుప్తి ని ఫోందుచుండునో వానిని స్థితప్రజ్ఞుడు ఆందురు.
దుఃఖేష్వనుద్విగ్నమనాఃసుఖేషు విగతస్ప్రుహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||
దుఃఖములందుకలత నొందని మనస్సు కలవాడును సుఖములందు ఆసక్తి లేనివాడునూ అనురాగము భయము కోపము తొలగినవాడునుఅగు (అత్మ) మనశ్శీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును
యస్సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాసుభమ్|
నాభినన్దతి నద్వేష్ఠీ తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ||
ఎవడు సమస్త విషయములందు (దేహ బంధు భోగాదులందు ) అభిమానము లేక యుండునో, అప్రియా ప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని బొందకుండునో ఆట్టివాని జ్జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. అట్టివాడే స్థితప్రజ్ఞుడు.
యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశః|
ఇన్ద్రియాణి ఇన్ద్రియార్ధేభ్యస్తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ||
తాబేలు తన అవయవములను లోనికి ముడుచు కొనినట్లు యోగి యెపుడూ తన ఇంద్రియములను విషయములనుండి సర్వత్ర వెనకకు మరల్చుచున్నడో అపుడాతని జ్ఞానము మిగుల స్థిరమినది యగును ( అతడు స్థితప్రజ్ఞుడు యగును )
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోఫ్యస్య ఫరం దృష్ట్వా నివర్తతే ||
శబ్దాది విషయములను స్వీకరించునట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే గాని వాని గూర్చిన వాసన పోవుట లేదు . పరమాత్మని దర్శించినచో ఆ వాసనయు విషయములతొబాటు తొలగిబోవుచున్నది.
ఏతతోహ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణీ ఫ్రమాథీని హరన్తి ప్రసభం మనః ||
ఓ అర్జునా ఇంద్రియములు మహ శ క్తివంతములినవి. ఆత్మావలోకనము కొరకు యత్నించుఛున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సు గూడా అవి బలాత్కా రముగా లాగుకొని పొవుచున్నవి
తానిసర్వాణి సంయమ్య యుక్త ఆశీత మత్పరః|
వసీహి యస్యాంద్రియాణి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా||
ఆట్టి ఇంద్రియములన్నిటినీ చక్కగ వశపరచుకుని మనస్థిరత్వము కలవాడై నాయందే ఆసక్తి కల మనస్సు కలిగి యుండవలయును. ఏల అనగ ఎవని ఇంద్రియములు స్వాధీనమందుండునో అతని జ్ఞానము సుస్థిరమై వెలయగలదు.
ధ్యాయతో విషయాన్ పుంశః సంగస్తేషూప జాయతే|
ససంగాత్ సంజాయతే కామః కామాత్ క్రొధాభి జాయాతే||
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః |
స్మృతిర్భ్రంశాత్ బుద్దినాశో బుద్దీ నాశాత్ ప్రణస్యతి ||
మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుటవలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. ఆ ఆసక్తితో కోరిక ఉదయించుచున్నది. కోరికవలనకోపము, కోపములవలన అవివేకము , అవివేకము వలన మఱపు, మఱపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధి నాశముచే పూర్తిగా చెడినవాడగుచున్నాడు.
రాగ ద్వేషవియుక్తెస్తు విషయానింద్రియైశ్చరన్|
ఆత్మవశ్యై ర్విధేయాత్మ ప్రసాద మధిగచ్చతి||
స్వాధీన మైన మనస్సు కలవారున్ను రాగద్వేషరహితులును తమకు అధినములైన యింద్రియములచే అన్నపానాదులయిన విషయములను ఆనుభవించుచున్నవాడైనను మనో నిర్మలత్వము అనుభవించుచున్నాడు.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యొపజాయతే|
ప్రసన్నచేతసొ హ్యాశు బుద్ధిః ఫర్యవతిష్ఠతి ||
మనో నిర్మలత్వము కలుగగా దానివలన మనుజునకు సమస్త దుఃఖములును ఉపశమింఛి పొవుచున్నవి
నిర్మల మనస్సు కలవానికి బుద్ధి శీఘ్రముగా పరమాత్మ యందు స్థిరత్వము చెందుచున్నది
నాస్తి భుద్ది రయుక్తస్య న చా యుక్తస్య భవనా |
న చా భావయతశ్శాంతిరశాంతస్య కుతః సుఖమ్ ||
ఇంద్రియ నిగ్రహము మనస్సంయమనములేనివానికి వివేక బుద్ధి కలగదు. ఆత్మచింతనయు సంభవించ నేరదు అత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతిలేనివానికి సుఖమెచట దొఱుకును? .
ఇంద్రియానాం హి చరతాం య న్మనోను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి ||
విషయములయందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో దేనిని మనస్సు అనుసరించి పొవునో అది మనుజుని యొక్క వివే్కమును జలమందు ఓడను ప్రతికూలవాయువు పెడదారిని లాగుకొనిపొవునట్లు హరించివేయుచున్నది
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
ఇంద్రియాణీంద్రియార్దేభ్యః తస్యప్రజ్ఞాప్రతిష్ఠితా ||
కాబట్టీ ఓ అర్జునా ఎవడు తన ఇంద్రియములను విషయముల పైకి పొనీయకుండా సర్వవిధములా అరికట్టుచున్నాడో ఆతని జ్ఞానము మిగుల సుస్థిరమై యుండును
యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తీ సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సానిశాఫస్యతో మునేః ||
అజ్ఞానులకు ఏది రాత్రియో అది జ్ఞానులకు పగలు జ్ఞానులకు ఏది రాత్రియో అది అజ్ఞానులకు పగలు .
అపూర్వమాణమచల ప్రతిష్ఠంతి సముద్రమాఫః ఫ్రవిసంతి యద్వత్ |
తద్వత్ కామా యం ఫ్రవిశంతి సర్వే సశాంతి ఆప్నోతి నకామకామి||
జలములచే సంఫూర్ణముగా నిండింఫ బడినదియు నిశ్చలమైనదియు సముద్రమును నదిజలము ఏ ప్రకారము ప్రవేశింఛుచున్నదో ఆ ప్రకారము భోగ్యవిషయములు ఏ బ్రహ్మనిష్టని పొంది అణగి పొవుచున్నవో ఆతడే శాంతిని పొందును గాని విషయాసక్తి కలవాడుకాదు.
విహాయకామాన్ యస్సర్వాన్ పుమాంచరతి నిష్ప్రుహః |
నిర్మమో నిరహం కారః స శాంతి మధిగచ్చతి ||
తా ఎవడు సమస్తములయిన కొరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఎమాత్రము అశ లేక అహాంకారవర్జితుడై ప్రవర్తింఛునో అట్టివాడే శాంతినిపొందును
ఏషా బ్రాహ్మీ స్థితిః ఫార్ధ నేనాం ప్రాప్య విముహ్యతి
స్థీత్వాస్యా మంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృఛ్ఛతి ||
అర్జునా ఇది అంతయూ బ్రహ్మ సంభంధమైన స్థితి. ఇట్టి బ్రహ్మస్థితిని పొందినవాడు మరల ఎన్నటికిని విమోహమును చెందనేరడు. అంత్య కాలమందు కూడా ఇట్టి స్థితి యందున్నవాడు బ్రహ్మానందమును మోక్షమును పొందుచున్నాడు
స్థిత ప్రజ్ఞుని సంభందించి ఇంతవరకు తెలిపిన సాధనలు ఇంద్రియ నిగ్రహము విషయత్యాగము అహంకారరాహిత్యము చేయుచూరాగా జీవునకు బ్రహ్మైక్యము సిద్ధించును