!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 278-279


॥ఓమ్ తత్ సత్॥

వివేక చూడామణి 278-279 శ్లోకములు:
చంచలత్వాన్ని తొలగించడము గురించి

ముందుశ్లోకాలలో పూర్వజన్మ కృత పాప పుణ్యముల కారణముగా వుండే వాసనల వలన, అంటే లోకవాసన దేహ వాసన శాస్త్ర వాసనల వలన ప్రాణి తన ఆత్మను గుర్తించలేకపోతున్నాడు అని, వాటిని నాశనము చేసినపుడే , ఆత్మ దర్శనానికి అడ్డంకులు తొలగి పోతాయని, అందుకని ఆ మూడు వదిలి వేయాలి అని గురువు చెప్పాడు.

ఇక్కడ తొమ్మిది శ్లోకాలలో గురువు మనలో నిజమైన ధ్యాస రావడానికి మార్గాలు ఉపదేశిస్తాడు.

ధ్యాస అన్నపదము లౌకికభాషలో వాడతాము. ఎవరైనా ఒక పని సరిగ్గా చేయకపోతే వాడికి ఆ పని మీద ధ్యాస లేదు అందుకనే ఆ పని కావటల్లేదు అని అంటాము. అంటే ఇక్కడ ధ్యాస అన్నపదము concentration అన్న మాటలా వినిపిస్తుంది. ధ్యాస లేకపోవడాన్ని అధ్యాస అంటాము ; అంటే ధ్యాస రావాలి అంటే అధ్యాస పోవాలి అన్నమాట. మనో చంచలత్వము పోతే concentration వస్తుంది. అధ్యాస అన్నపదాన్ని భ్రమలు అని కూడా అనవచ్చు

ఇప్పుడు తొమ్మిది శ్లోకాలు,  "స్వ అధ్యాసా అపనయం కురు" అన్నమాటతో ముగుస్తాయి - స్వ అధ్యాస అంటే నీభ్రమలను ; అపనయం కురు అంటే తొలగించు.
తొమ్మిది శ్లోకాలలో అదే మాట వింటాము.

ఈ భ్రమలు ఎక్కడ పుడతాయి ఎక్కడ నివశిస్తాయి అన్నది మనకి తెలుసు అదే మన మనస్సు. భ్రమలను నాశనము చేయాలి అంటే మనస్సు లేక దాని గుణాలని నాశనము చెయ్యాలి అన్నమాట; ముందు శ్లోకాలలో అదే మాట మీద గురువు మార్గాలను విశదీకరిస్తాడు.


శ్లోకము 278

స్వాత్మన్యేవ సదా స్థిత్వా
మనో నశ్యతి యోగినః।
వాసనానాం క్షయశ్చాతః
స్వాధ్యాసా అపనయం కురు॥

స్వాత్మన్యేవ సదా స్థిత్వా-
తన ఆత్మ లోనే ఎల్లప్పుడు వుంటూ

మనో నశ్యతి యోగినః-
యోగి మనస్సుని  నశింపచేస్తాడు.

 మనస్సు ఒక దీపములాంటిది. ఎలాగైతే ఒక దీపము యొక్క జ్వాల నిరంతరము వెలుగుతూవుంటుందో, మనస్సు క్షణము కూడా వదలకుండా నిరంతరము ఎక్కడెక్కడికో ప్రయాణము చేస్తుంది.  యోగులు , ఆ మనస్సుయొక్క ప్రవృత్తిని తమ ధ్యానముతో ఆత్మ మీదా ధ్యాసతో ,నిలిపేస్తారు. ఇక్కడ గురువు చెప్పినది అదే. తన ఆత్మ లోనే ఎల్లప్పుడు వుంటూ యోగి మనస్సుని  నశింపచేస్తాడు అని

వాసనానాం క్షయశ్చ  -
వాసనలు కూడా నశించును

అలా ఆత్మలోనే నివశిస్తున్న యోగికి ముందు చెప్పిన వాసనలు, లోకవాసనలు దేహభిమాన వాసనలు శాస్త్ర వాసనలు అన్నీ, నశిస్తాయి. వాసనలు నశిస్తాయి అంటే ముందు వెనకల గురించి ఆలోచించకుండా వచ్చే క్రోధము మొదలగు వాటికి స్థానమైన మనస్సు చల్లబడింది అన్నమాట.

ప్రాణికి అదేకావాలనుకుంటే (అతః - అందువలన) తనలో వున్న భ్రమలను నశింపచేయాలి. అదే మాట గురువు చెపుతాడు.

అతః - అందువలన

స్వాధ్యాసా అపనయం కురు -
నీ భ్రమలను నశింప చేయుము.

భ్రమలు అంటే మనస్సులో పుట్టే విపరీత భావనలు. వాటిని తోసి  పారవెయ్యాలి అన్నమాట.

278 శ్లోకతాత్పర్యము:

తన ఆత్మ లోనే ఎల్లప్పుడు వుంటూ, యోగి మనస్సుని  నశింపచేస్తాడు. దానితో వాసనలు కూడా నశించును.  అందువలన నీవు కూడా  నీ భ్రమలను నశింప చేయుము.

భ్రమలను ఎలా నాశనము చెయ్యాలో మళ్ళీ చెపుతాడు గురువు


శ్లోకము 279

తమో ద్వాభ్యాం రజః సత్త్వాత్
సత్త్వం శుద్ధేన నశ్యతి।
తస్మాత్ సత్త్వం అవష్టభ్య
స్వాధ్యాసా అపనయం కురు॥

స॥ తమో ద్వాభ్యాం నశ్యతి। రజః సత్వాత్। సత్త్వం శుద్ధేన । తస్మాత్ సత్త్వం అవష్టభ్య స్వ అభ్యాసా అపనయం కురు॥

తమో ద్వాభ్యాం -
తమస్సు రజస్సు ( సత్త్వము రజస్సు గుణములు) రెండింటివలన నశించును;

తమస్సు అంటే అలసత్వము నిద్ర సోమరిపోతుతనము వ్యాయామము , కావ్య శాస్త్ర పఠనము వలన పోతుంది.

రజః సత్త్వాత్-
రజస్సు సత్త్వము వలన నశించును;

సత్త్వగుణము వలన ఏకాగ్రతలభిస్తుంది. రజోగుణము కర్మల మీద పోయే గుణము. సత్వగుణముతో  రజోగుణము నసశింపచేయవచ్చును

సత్త్వం శుద్ధేన నశ్యతి-
సత్త్వము శుద్ధ ( నిర్గుణ) స్వభావముచే నశించును;

సత్త్వము నిర్గుణబ్రహ్మ అరాధనతో, శుద్ధ స్వభావముపొంది , నిర్గుణమైన ఆత్మతో కలిసిపోతుంది. అంటే నిర్గూణత్వానికి మారము చూపేది సత్త్వమే.


తస్మాత్ సత్త్వం అవష్టభ్య -
అందువలన సత్త్వము అధారముగా;

స్వ అభ్యాసా అపనయం కురు-
నీ యొక్క  భ్రమలను తొలగించుము;

శ్లోకతాత్పర్యము:

తమస్సు  సత్త్వము రజస్సు గుణములు రెండింటివలన నశించును. రజస్సు సత్త్వము వలన నశించును; సత్త్వము శుద్ధ ( నిర్గుణ) స్వభావముచే నశించును అందువలన సత్త్వము అధారముగా నీ యొక్క  భ్రమలను తొలగించుము.

॥ఓమ్ తత్ సత్॥

__________________________________________________
































































 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279

Om tat sat !

 

 

 

    •