!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 280-281
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 280-281 శ్లోకములు:
స్వ అధ్యాస అపనయం కురు - అంటే నీకు ధ్యాస లేకపోవడాన్ని
, అంటే చంచలత్వాన్ని తొలగించు అంటూ ఈ రెండు
శ్లోకాలలో చంచలత్వాన్ని తొలగించడము గురించిఇంకా
చెపుతున్నాడు గురువు
శ్లోకము 280:
ప్రారబ్ధం పుష్యతి వపుః
ఇతి నిశ్చిత్య నిశ్చలః।
ధైర్యమాలమ్బ్య యత్నేన
స్వాధ్యాసాపనయం కురు॥ 280॥
1 ప్రారబ్ధం పుష్యతి వపుః-
ప్రారబ్ధకర్మయే శరీరమును నడిపించును;
2 ఇతి నిశ్చిత్య నిశ్చలః -
అని నిశ్చయించుకొని నిశ్చలమైన మనస్సు కలవాడై;
శరీరమును ప్రారబ్ధకర్మ నడిపించును అని నిశ్చలమనస్సు
కలవాడై , అంటే శారీరక అవసరాలమీద భయము లేనివాడై ముందుకు
పోవలెను అని. భవద్గీతలో కూడా ఇదేమాట ఇంకో రూపములో
చెపుతాడు కృష్ణుడు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాం తామ్ తితీక్షస్వ భారత॥
శరీరానికి కలిగే సుఖ దుఃఖాలు అనిత్యాలు - వాటిని
భరించు అని
3 ధైర్యమాలమ్బ్య యత్నేన -
ధైర్యము వహించి ప్రయత్నముతో;
4 స్వాధ్యాసాపనయం కురు
నీ భ్రమలను నశింప చేయుము;
శారీరికవసరాలమీద భయము లేని వాడై ధైర్యముతో , భ్రమలను
నశింపచేయు కార్యక్రమములో వెళ్ళుము అని గురువు
చెపుతున్నమాట.
280 శ్లోక తాత్పర్యము:
ప్రారబ్ధకర్మయే శరీరమును నడిపించును అని
నిశ్చయించుకొని నిశ్చలమైన మనస్సు కలవాడై; ధైర్యము
వహించి ప్రయత్నముతో నీ భ్రమలను నశింప చేయుము;
శ్లోకము 281:
నాహం జీవః పరంబ్రహ్మేతత్
తద్ వ్యావృత్తిపూర్వకమ్।
వాసనా వేగతః ప్రాప్తః
స్వాధ్యాసాపనయం కురు॥ 281॥
1 నాహం జీవః పరంబ్రహ్మేతత్ -
నేను జీవుడను కాను పరబ్రహ్మమును అని;
2 తద్ వ్యావృత్తిపూర్వకమ్।
అ వృత్తిపూర్వకమైన వానిని నిరాకరిస్తూ;
నేని జీవుడను కాను. ఆ పరబ్రహ్మము నేనే అనే ధ్యాసతో,
బ్రహ్మముకన్నా వేరైన బుద్ధి మనస్సు ప్రాణ శరీరములను
నిరాకరిస్తూ అని.
3 వాసనా వేగతః ప్రాప్తః -
పూర్వజన్మ వాసనల వలన ప్రాప్తించిన
4 స్వాధ్యాసాపనయం కురు -
నీ భ్రమలను నశింప చేయుము;
పూర్వజన్మ వాసనలవలన ప్రాప్తించిన భ్రమలను, నేనే ఆ
పరబ్రహ్మముమను అని నిరాకరించి ఆ భ్రమలను నశింప
చేయవలెను అని భావము
281 శ్లోక తాత్పర్యము:
నేను జీవుడను కాను పరబ్రహ్మమును అని, అ
వృత్తిపూర్వకమైన అంటే బ్రహ్మముకన్నా వేరైన
బుద్ధి మనస్సు ప్రాణ శరీరములను నిరాకరిస్తూ, పూర్వజన్మ
వాసనల వలన ప్రాప్తించిన నీ భ్రమలను నశింప చేయుము; అని.
॥ఓమ్ తత్ సత్॥
___________________________________________-