!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 282-283


॥ఓమ్ తత్ సత్॥


వివేక చూడామణి 282-283 శ్లోకములు:

స్వ అధ్యాస అపనయం కురు - అంటే నీకు ధ్యాస లేకపోవడాన్ని , అంటే చంచలత్వాన్ని తొలగించు అంటూ మళ్ళీ ఈ రెండు శ్లోకాలలో  చంచలత్వాన్ని తొలగించడము గురించి ఇంకా చెపుతున్నాడు గురువు. ఇక్కడ రెండు విషయాలు ప్రతిపాదిస్తాడు - గురువు: ఒకటి నీలో వున్న ఆత్మ అందరిలో వున్న ఆత్మ ఒకటే అని తెలిసికొని, నీలో వున్న భ్రాన్తిని తొలగించు అని; రెండవది ఎలాగైతే పరమేశ్వరుని ధ్యానించే మునులకు అన్నము తినడము విసర్జించడము అనే క్రియలతో ప్రమేయము లేదో - అలాగే నీవుకూడా పరమేశ్వరునిపై నిష్ఠతో నీలో వున్న భ్రాన్తి తొలగించుము అని.

శ్లోకము 282

శ్రుత్వా యుక్త్యా స్వానుభూత్యా
జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మనః।
క్వచిదాభాసతః ప్రాప్తః
స్వాధ్యాసాపనయం కురు॥282॥

శ్రుత్వా యుక్త్యా స్వానుభూత్యా-
శృతిచేతనూ యుక్తి చేతనూ స్వానుభవము చేతనూ

జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మనః -
అన్నీటిలో వున్న ఆత్మ నీ ఆత్మే అని తెలిసికొని

అన్నిటిలో వున్న ఆత్మ నీలో వున్న ఆత్మే అని తెలిసికొని అని ప్రతిపాదిస్తున్నాడు గురువు - ఏలా తెలిసికుంటాము అంటే శృతులద్వారా అని సమాధానము. అంటే శృతులలో చెప్పబడిన మాటలద్వారాని. ఇక్కడ గురువు చెపుతున్నమాట - ఉపనిషత్తులు చదివి అర్థము చేసుకున్నందువలన, లేక తెలివిగా అలోచించి  తర్కించడము వలన గాని, లేక స్వయంగా అర్జించిన అనుభవము ద్వారా  నీలోని ఆత్మయే అందరిలోని ఆత్మ అని గ్రహించి - నీలో వున్న అధ్యాసని తొలగించు అని.

క్వచిదాభాసతః ప్రాప్తః -
ప్రాప్తించిన భ్రాంతిని కొంచెమైనా సరే;

పూర్వజన్మపాప పుణ్య ఫలప్రాప్తివలన ప్రాప్తించిన భ్రాంతిని కొంచెమైనా సరే , వెంటనే - స్వాధ్యాసాపనయం కురు- నీలో వున్న అధ్యాస ను తొలగించుము అని ఆఖరిపాదము లో వస్తుంది.

స్వాధ్యాసాపనయం కురు -
నీలోని భ్రమలను నశింపచేయుము

282 వ శ్లోకము తాత్పర్యము:

శృతిచేతనూ యుక్తి చేతనూ స్వానుభవము చేతనూ అన్నీటిలో వున్న ఆత్మ నీ ఆత్మే అని తెలిసికొని;  ప్రాప్తించిన భ్రాంతిని కొంచెమైనా సరే నీలోని భ్రమలను నశింపచేయుము:

శ్లోకము 283

అన్నదాన విసర్గాభ్యామ్
ఈషన్నాస్తి క్రియా మునేః।
తదేక నిష్ఠయా నిత్యం
స్వాధ్యాసాపనయం కురు॥283॥

అన్నదాన విసర్గాభ్యామ్ -
అన్నము తినుట విసర్జించుటలతో;

ఈషన్నాస్తి క్రియా మునేః -
మునులకు కొంచెమైననూ ప్రమేయము లేదు;

అన్నము తినడములో కాని , విసర్జించుటలో కాని మునులకు ప్రమేయము లేదు. ఆక్రియలను మునులు పట్టించుకోరు. ఇక్కడ భావము నీవు కూడా అలాగే వుండాలి; అలా వుండి ఎల్లప్పుడు పరమేశ్వరుని పై నిష్ఠతో నీలో వున్న అధ్యాసని తొలగించుఅని

తదేక నిష్ఠయా నిత్యం -
అందువలన ఆ పరమాత్మపై అదే నిష్ఠతో;

స్వాధ్యాసాపనయం కురు
నీలో వున్నా అధ్యాసను తొలగింపుము;

283 శ్లోకతాత్పర్యము:

మునులకు అన్నము తినుట విసర్జించుట అన్నక్రియలతో ప్రమేయము లేదు. అందువలన (నీవు కూడా) ఆ పరమాత్మపై అదే నిష్ఠతో నీలో వున్నా అధ్యాసను తొలగింపుము:

॥ఓమ్ తత్ సత్॥
____________________________________________



































































 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

Om tat sat !

 

 

 

    •