!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 287-289


॥ఓమ్ తత్ సత్॥

వివేక చూడామణి 287-289 శ్లోకములు


శ్లోకము 287

నిద్రాయాః లోకవార్తాయాః
శబ్దార్దేరపి విస్మృతేః ।
క్వచిన్నావసరం దత్వా
చిన్తయ ఆత్మానం ఆత్మని॥ 287॥

1 నిద్రాయాః లోకవార్తాయాః -
నిద్రవలన లోకవార్తలవలన;

సాధకుడికి ,(మనకి) ఆధ్యాత్మ చింతన మరచిపోవడానికి చాలా అవకాశాలు వున్నాయి. వాటిల్లో రెండు నిద్ర , లోక సంబంధమైన వార్తలు.  అవే గుర్తుచేస్తున్నాడు గురువు

2 శబ్దార్దేరపి విస్మృతేః -
శబ్దాది విషయములవలన కూడా మరచిపోవడము;

నిద్ర, లోకవార్తలే కాదు , శబ్దాది విషయములవలన కూడా అధ్యాత్మ చింతన మరచిపోతాము. ధ్యానములో నిద్ర, మౌనములో లోక వార్తలు, చుట్టూవున్న పరివారముతో శబ్ద స్పర్శ రూప రసగంధాలలో మునిగి తేలుతున్న మనకి పరమాత్మగురించి అలోచించడానికి సమయము ఉండకపోవచ్చు.

మరి ఎందుకు గుర్తుచేస్తున్నాడు ? అలా  ఆయా లోకాల్లో పడి అధ్యాత్మ చింత మరచిపోవద్దు అని చెప్పడానికి.

3 క్వచిన్నావసరం దత్వా - క్వచిత్ న అవసరం దత్వా-
కొంచెముకూడా అవసరము ఇవ్వకుండా;

గురువు చెప్పవలసిన మాట చెపుతున్నాడు - వాటికి chance ఇవ్వకుండా - అధ్యాత్మికము మీద మతిమరుపు దూరము చెయ్యి అని.

4 చిన్తయ ఆత్మానం ఆత్మని -
ఆత్మానం ఆత్మని చిన్తయ -
ఆత్మగురించి నీ మనస్సులో ఆలోచించుము.

తాత్పర్యము:  నిద్రవలన లోకవార్తలవలన శబ్దాది విషయములవలన అధ్యాత్మిక చింతన మరచిపోవడానికి కొంచెముకూడా అవసరము ఇవ్వకుండా, ఆత్మగురించి నీ మనస్సులో ఆలోచించుము

అధ్యాత్మ చింతన పక్కనపెట్టడానికి లేక మరచిపోవడానికి కారణము అనాత్మ విషయాలే. అందులో దేహాభిమానము కూడా ఒకటి ముఖ్యమైనది. ఆ దేహాభిమానము పోవడానికి ,  దేహము మీదా అసహ్యము  కలిగించడము ఒక మార్గము. గురువు ఆ దేహము ఎలాంటిదో వర్ణిస్తున్నాడు 288 వ శ్లోకములో.

శ్లోకము 288

మాతాపిత్రోః మలోద్భూతమ్
మలమాంసమయం వపుః।
త్యక్త్వా చణ్డాలవత్ దూరమ్
బ్రహ్మీభూత కృతీ భవ॥ 288॥

1 మాతాపిత్రోః మలోద్భూతమ్ -
తల్లిదండుల దేహములలో వుండు మలములలో పుట్టిన;

2 మలమాంసమయం వపుః-
మలమాంసములతో నిండిన ఆ శరీరమును;

మనము పుట్టిన విధానము గుర్తు చేసుకుంటే, ఆ జీవుడు తొమ్మిది నెలలు మల మూత్ర కూపములో వుండి బయట పడతాడు. అట్టి దేహము మీద అభిమానము అక్కరలేదు అని భావము:

3 త్యక్త్వా చణ్డాలవత్ దూరమ్ -
అది చణ్డాలుని ( అంటరాని వాని)  వలే దూరముగా వుంచి;

అట్టి శరీరాన్ని ఛండాలుని లాగా దూరముగా వుంచి , నేను బ్రహ్మముని అనే భావముతో, మనస్సుని పరమాత్మపై నిలుపుము అని భావము;

4 బ్రహ్మీభూత కృతీ భవ-
బ్రహ్మత్వము తో కృతకృత్యుడవు కమ్ము.

బ్రహ్మత్వము తో అంటే బ్రహ్మముకు కల సద్భావములు సద్వర్తన మనలో నిలుపుకున్నప్పుడు మనము  కృత కృత్యులము , జీవితములో సాధించ వలసినది సాధించిన వారము అవుతాము. ఈ శ్లోకములో అలా కృతకృత్యుడవు కమ్ము అని గురు ఆదేశము.

తాత్పర్యము:

'తల్లిదండుల దేహములలో వుండు మలములలో పుట్టిన మలమాంసములతో నిండిన ఆ శరీరమును, చండాలుని దూరముగా వుంచినట్లు, దూరముగావుంచి,బ్రహ్మత్వముతో కృతకృత్యుడవు కమ్ము'.

మరి మనము బ్రహ్మత్వము పొందమని మన ఆత్మని పరమాత్మలో విలీనము చేయమని చెప్పినప్పుడు, మరి అలాగ  ఒకటి ఇంకొకటిలో విలీనమయ్యే ఉదాహరణలు వున్నాయా అంటే, వెంటనే ఘటము ఘటములో వుండే ఘటాకాశము గుర్తుకు వస్తాయి. ఘటములో వుండే space ని ఘటాకాశము అంటారు. ఘటము వున్నప్పుడు ఘటాకాశము మనకి  ఘటరూపములోనే కనిపిస్తుంది. ఘటములేనప్పుడు ఆ space కి ఘటరూపము వుండదు - ఆ ఘటాకాశము, చుట్టూవున్న ఆకాశములో విలీనమౌతుంది. అదే ముందు శ్లోకములో వింటాము. అలాగే మనము బ్రహ్మము లో వీలీనమవ్వాలి అని .

శ్లోకము 289:

ఘటాకాశమ్ మహాకాశం
ఇవ ఆత్మానం పరమాత్మని।
విలప్యాఖండభావేన
తూష్ణీం భవ సదా మునే॥

1 ఘటాకాశమ్ మహాకాశం-
ఘటాకాశము మహాకాశములో ఇమిడినట్లు,

ఘటములో వుండే ఆకాశము, ఘటము ముక్కలు అయినప్పుడు - ఘట రూపములో వుండదు కదా -  అది అక్కడ చుట్టువున్న మహా అకాశములో విలీనమౌతుంది. అలాగే తుది దశలో జీవుని ఆత్మకూడా పరమాత్మరూపమైన ఆకాశములో కలిసిపోతుంది అని ఒక హైందవ నమ్మకము.  ఇక్కడ గురువు చెప్పబోయేది ఆధ్యాత్మ జ్ఞాన సంపాదనలో - మన ఆత్మని పరమాత్మలో నిలుపుము అని. మనమే బ్రహ్మము అయినప్పుడు అది అసాధ్యము కాదు- కాని మనము మన లోకావర్తనములలో వుండడము వలన - ఈ ప్రశ్న వస్తుంది - అందుకే అధ్యాత్మ చింతన మరచిపోకుండా ఈ కార్యము చేపట్టమని గురువు ఆదేశము.

2 ఇవ ఆత్మానం పరమాత్మని।
నీ ఆత్మని పరమాత్మలో (నిలుపుము).

3 విలప్యాఖండభావేన - విలప్య అఖణ్డభావేన-
విలీనము చేసి అఖణ్డభావముతో

4 తూష్ణీం భవ సదా మునే -
ఓ మునీ తూష్ణీభావము గలవాడవు అగుము

అంటే: శ్లోకతాత్పర్యము:

ఓ మునీ,  ఘటాకాశము మహాకాశములో ఇమిడినట్లు, నీ ఆత్మని పరమాత్మలోవిలీనము చేసి, అఖణ్డభావముతో తూష్ణీభావము ( మౌనము) గలవాడవు అగుము

మన ఆత్మని పరమాత్మలో విలీనము చేసినప్పుడు, మనకు మౌన భావమే మిగలాలి - ఆ మౌనభావము కాక మరో ధ్యాసలోకి వెడితే అప్పుడు మనము మన అత్మని పరమాత్మలో విలీనము చేయడములో విఫలము అయ్యాము అన్నమాట.

॥ఓమ్ తత్ సత్॥
______________________________________________








 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289

Om tat sat !

 

 

 

    •