!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 290-292


॥ఓమ్ తత్ సత్॥

వివేక చూడామణి 290-292 శ్లోకములు

స్వప్రకాశం అధిష్ఠానం
స్వయం భూత్వా సదాత్మనా।
బ్రహ్మాణ్డమపి పిణ్డాణ్డం
త్యజతాం మలభాణ్డవత్॥ 290॥

స్వప్రకాశం అధిష్ఠానం -
స్వయం ప్రకాశమైన అధిష్టానముగా

స్వయం భూత్వా -
నీవే అయ్యి :

అంటే నీవే స్వయం ప్రకాశమైన ఆత్మగా అయ్యి, నీవే అనడములో నీ దేహముకాదు, నీలో వున్న అంతరాత్మ - నీవే ఆ అంతరాత్మ లాగా అయ్యి అని ; నీవే ఆ అంతరాత్మ అయితే - ముందు శ్లోకములో  చెప్పినట్లు - తల్లిదండ్రుల దేహములలో వుండు మలములలో పుట్టిన మలమాంసములతో నిండిన ఆ శరీరమును, చండాలుని దూరముగా వుంచినట్లు, దూరముగావుంచాలి అన్నమాట . అదే మాట ఇంకో రూపములో మళ్ళీ గురువు చెపుతాడు ,

 బ్రహ్మాణ్డమపి పిణ్డాణ్డం -
 బ్రహ్మాండమును  పిండరూపమైన స్వశరీరమును;

సదాత్మనా త్యజతాం -
ఆ  సదాత్మనా అంటే సదౄపమైన ఆత్మతో వదిలి వేయుము;

బ్రహ్మాండము అంటే బ్రహ్మచేత సృష్టించబడిన సమస్త జగత్తు ,అలాగే పిండరూపమైన జగత్తుని వదిలి వేయుము అని. ఆ వదిలేయడము ఎలా వదిలేయాలి. ఆ మాట కూడా ముందు శ్లోకములో విన్నాము. మన దేహమును ( దేహ భ్రాన్తిని) చండాలుని దూరముగా వుంచినట్లు దూరముగా వుంచుము అన్నాడు. ఇక్కడ అలాంటి ఉపమానము చెపుతాడు

మలభాణ్డవత్ -
మలముతో కూడిన భాండమువలె అని

290 వ శ్లోక తాత్పర్యము:

స్వయం ప్రకాశమైన అధిష్టానముగా  నీవే అయ్యి, అంటే అంటే నీవే స్వయం ప్రకాశమైన ఆత్మగా అయ్యి - బ్రహ్మచేత సృష్టించబడిన సమస్త జగత్తు ,అలాగే పిండరూపమైన జగత్తుని మలముతో కూడిన భాండమువలె వదిలి వేయుము

శ్లోకము 291:

చిదాత్మని సదానన్దే
దేహారూఢాం అహం ధియం।
నివేశ్య లిఙ్గం ఉత్సృజ్య
కేవలో భవ సర్వదా॥ 291॥

దేహారూఢాం అహం ధియం -
దేహమునకు సంబంధించిన అహంకారమును :

చిదాత్మని సదానన్దే నివేశ్య
సదానందరూపమైన చిదాత్మయందు వుంచి:

అంటే మన అహంకారమును సదానందరూపమైన ఆత్మలో ( అదే పరమాత్మలో) వుంచుము అని భావము. అలా అహంకారమును పక్కకి తోసేస్తే మిగిలిది అపరిమితమైన శాంతి అని అనేక సార్లు విన్నాము- ఇక్కడ గురువుగారు అలాంటి మాటే చెపుతాడు

లిఙ్గం ఉత్సృజ్య -
లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును విడిచి

కేవలో భవ సర్వదా-
ఎల్లవేళలా సంగరహితుడవు కమ్ము;

లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును విడిచి అన్న మాటలో భావము సూక్ష్మ రూపముతో కూడిన మనస్సు బుద్ధిని వదిలి అని. అలావదిలేస్తే నిస్సంగత్వము పొందడము అవుతుంది. భజగోవిందములో - "నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలబుద్ధిః" అని విన్నాము. అంటే నిస్సంగత్వము తో కోరికలు అటువంటి ఆలోచనలు పోయి, అటు ఇటూ తొణకని మనస్సు కలవాడము అవుతాము. పరమాత్మే తప్ప ఇంకో ఆలోచన లేని వాళ్ళము అంటే కైవల్యము పొందుతాము అన్నమాట.

291వ శ్లోకము తాత్పర్యము:

దేహమునకు సంబంధించిన అహంకారమును సదానందరూపమైన చిదాత్మయందు వుంచి, లింగస్వరూపమైన సూక్ష్మ శరీరమును విడిచి, ఎల్లవేళలా సంగరహితుడవు కమ్ము;


శ్లోకము 292:

యత్రైషా జగదాభాసః
దర్పణాన్తః పురా యథా।
తద్ బ్రహ్మం ఇతి జ్ఞాత్వా
కృతకృత్యో భవిష్యసి॥292॥

యత్రైషా జగదాభాసః -
యత్ర ఏషా జగత్ అభాసః -
ఎప్పుడు ఈ జగత్తుయొక్క మిథ్యాభావము కలుగుచున్నదో

దర్పణాన్తః పురా యథా-
దర్పణములోని (అద్దములోని) ప్రపంచములాగా


తద్ బ్రహ్మం ఇతి జ్ఞాత్వా -
అదే బ్రహ్మము అని గుర్తించి

కృతకృత్యో భవిష్యసి -
కృతకృత్యుడము అయ్యెదవు.

 292 వ శ్లోకము తాత్పర్యము:

ఎప్పుడు అద్దములోని ప్రపంచములాగా, జగత్తుయొక్క మిథ్యాభావము కలుగుచున్నదో, అదే బ్రహ్మము అని గుర్తించి కృతకృత్యుడవుము అయ్యెదవు.

గురువు ఇక్కడ చివరి మాట - దేహాన్ని ప్రపంచాన్ని మలపూరిత భాండము వలె దూరముగా చేసుకొని - ఈ జగమంతా బ్రహ్మమే అని, కనిపించేది అద్దములోని బొమ్మలవలె మిథ్యా మాత్రమే అని గ్రహించ గలగడమే  సంగరహితము అదే  కైవల్యము.


___________________________________________








 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292

Om tat sat !

 

 

 

    •