!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 296-298


॥ఓమ్ తత్ సత్॥


వివేక చూడామణి 296-298 శ్లోకములు:

శ్లోకము 296:

వికారిణాం సర్వ వికార వేత్తా
నిత్యో అవికారో భవితుం సమర్హతి।
మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటమ్
పునః పునః దృష్టం అసత్త్వమేతయోః॥296॥

1 వికారిణాం సర్వ వికార వేత్తా
   వికారముపొందగలిగిన వాటి అన్నిటి యొక్క వికారములను తెలిసికొన గలిగినది

2 నిత్యో అవికారో భవితుం సమర్హతి।
  ఎల్లప్పుడు వికారము లేనిది అంటే మార్పులేనిదు అగుటకు సమర్థమైనది.

ఆత్మ సాక్షిగా వికారములు పొందగలిగిన వాటి అన్నిటి యొక్క వికారములను తెలిసికొన గలిగినది. అన్ని వికారములు తెలికొనగలిగిన సాక్షి వికారములు లేనిది

3 మనోరథ స్వప్న సుషుప్తిషు
   పరిగెట్టె మనస్సు అనే రథములో, స్వప్నములో , శుషుప్తిలో

4 పునః పునః ద్రష్టం అసత్త్వం  ఏతయోః-
ఏతయోః అసత్త్వం  స్ఫుటమ్ పునః పునః ద్రష్టం-

వీటియొక్క అసత్త్వము ( అవి నిత్యముకాదు అన్నమాట) మళ్ళీ మళ్ళీ స్పష్టముగా చూడబడినది.

ఇక్కడ వీటియొక్క అనడములో - అర్థము శరీరము, శరీరము మీద అభిమానము కలిగిన జీవుడు - ఈ రెండు అనిత్యము అన్న మాట పరిగెట్టె మనస్సు అనే రథములో, స్వప్నములో , శుషుప్తిలో మనకి స్పష్టముగా తెలుయుచున్నది. పగటి కలలు కనే టప్పుడు, నిద్రలో స్వప్నము చూసేవాడు , షుషుప్తి లో నిద్రపోయినవాడికి కూడా సాక్షి - మన అంతరాత్మయే , అది ఒక్కటే. అది మారనిది.

తాత్పర్యము:

వికారముపొందగలిగిన వాటి అన్నిటి యొక్క వికారములను తెలిసికొన గలిగినది ఎల్లప్పుడు వికారము లేనిది అగుటకు సమర్థమైనది.  పరిగెట్టె మనస్సు అనే రథములో, స్వప్నములో , శుషుప్తిలో వీటియొక్క అసత్త్వము ( అవి నిత్యముకాదు అన్నమాట) మళ్ళి మళ్ళీ స్పష్టముగా చూడబడినది.

శ్లోకము 297

అతోభిమానం త్యజ మాంసపిణ్డే
పిణ్డాభిమానిన్యపి బుద్ధి కల్పితే।
కాలత్రయాబాధ్యం అఖణ్డబోధమ్
జ్ఞాత్వా స్వ ఆత్మానం ఉపైహి శాన్తిమ్॥ 297॥


1 అతోభిమానం త్యజ మాంసపిణ్డే
ఆ మాంస  పిణ్డము మీద అభిమానము వదలుము;

2 పిణ్డాభిమానిన్యపి బుద్ధి కల్పితే।
బుద్ధిచేత కల్పింపబడిన పిణ్దాభిమానము కూడా వదిలి వేయుము

3 కాలత్రయాబాధ్యం అఖణ్డబోధమ్
మూడు కాలములలో సాక్షిగా నిలబడె , నిత్యజ్ఞాన స్వరూపము అగు

4 జ్ఞాత్వా స్వ ఆత్మానం
  నీలో వున్న ఆత్మని తెలిసికొని

  ఉపైహి శాన్తిమ్ - శాంతిని పొందుము

తాత్పర్యము:

"ఆ మాంస  పిణ్డము మీద అభిమానము వదలుము;బుద్ధిచేత కల్పింపబడిన పిణ్దాభిమానము కూడా వదిలి వేయుము. మూడు కాలములలో సాక్షిగా నిలబడె , నిత్యజ్ఞాన స్వరూపము అగు నీలో వున్న ఆత్మని తెలిసికొని, శాంతిని పొందుము."


శ్లోకము 298:

త్యజాభిమానం కులగోత్రనామ
రూపాశ్రమేషు  ఆర్ద్రశవాశ్రితేషు।
లింగస్య ధర్మానపి కర్తృతాదీం
త్యక్త్వా భవ అఖణ్డ సుఖస్వరూపః॥298॥

1 త్యజాభిమానం కుల గోత్ర నామ రూప ఆశ్రమేషు
   కులము గోత్రము నామము  రూపము ఆశ్రమము మీద మమకారము త్యజించుము (విడిచిపెట్టుము.)

2 ఆర్ద్రశవాశ్రితేషు - తడిసిన శవముకు సంబంధించిన 

తడిసిన శవము అంటే మన అనిత్యమైన శరీరము. ఆశరీరానికి  సంబంధించిన కులము గోత్రము నామము  రూపము ఆశ్రమము మీద మమకారము త్యజించుము (విడిచిపెట్టుము.) . ఇంకా వదలవలసినవి ఉన్నాయి.
  
3 లింగస్య ధర్మానపి కర్తృతాదీం త్యక్త్వా

సూక్ష్మ శరీరము సంబంధించిన కర్తృత్వము ( అహంకారము) లాంటి గుణములను కూడా వదిలేసి;

4 భవ అఖణ్డ సుఖస్వరూపః
   అఖణ్డ సుఖ స్వరూపము కలవాడవు కమ్ము !

అన్ని వదిలేస్తే మనకి కలిగేది అఖణ్డశాంతి. గురువు చెప్పేది - కులము గోత్రము నామము  రూపము ఆశ్రమము మీద మమకారము త్యజించుము. అలాగే సూక్ష్మ శరీరము సంబంధించిన కర్తృత్వము అంటే అహంకారము లాంటి గుణములను కూడా వదిలేసెయ్. అవి వదిలేసి  అఖణ్డ సుఖ స్వరూపము కలవాడవు కమ్ము అని!

తాత్పర్యము:

"తడిసిన శవము కు సంబంధించిన కులము గోత్రము నామము  రూపము ఆశ్రమము మీద మమకారము త్యజించుము (విడిచిపెట్టుము). సూక్ష్మ శరీరము సంబంధించిన కర్తృత్వము లాంటి గుణములను కూడా వదిలేసి అఖణ్డ సుఖ స్వరూపము కలవాడవు కమ్ము !"

అదే గురువు ఉపదేశము.

॥ఓమ్ తత్ సత్॥
______________________________________________








 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298

Om tat sat !

 

 

 

    •