!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 305-307


॥ఓమ్ తత్ సత్॥

వివేక చూడామణి 305-307 శ్లోకములు:

గురువు  ఇంకా అహంకారము వదలాలి అన్నమాట మీద మళ్ళీ మళ్ళీ  చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో.

 శ్లోకము 305

అహమః అత్యన్త నివృత్త్యా
తత్ కృత నానావికల్ప సంహృత్యా।
ప్రత్యక్ తత్వ వివేకాత్
అయం అహమస్మీతి విన్దతే తత్త్వమ్॥305॥

1 అహమః అత్యన్త నివృత్యా -
అహంకారముయొక్క పూర్తి నాశనము వలన -

2 తత్ కృత నానావికల్ప సంహృత్యా -
దానిచే చేయబడిన అనేక వికల్పములు కూడా తొలగి పోవుట వలన

అహంకారము పూర్తిగా నాశనమైనప్పుడు , దానివలన వచ్చిన వికారములు కూడా తొలగి పోతాయి. అంటే అహంకారము వలన చెలరేగే అలోచనలూ సంశయాలు తప్పు త్రోవలు ఆగి పోతాయి. ఇక్కడ కారణము పోతే ఆ కారణము వలన వచ్చే కార్యములు ఆగిపోతాయి అన్నమాట. అది సాధారణముగా జరిగే మాట. అహంకారముపోతే, అప్పటిదాకా వుండే భ్రాన్తులు  కూడా పోతాయి. స్వతసిద్ధముగా వుండే వివేకము బయటపడుతుంది.

3 ప్రత్యక్ తత్వ వివేకాత్ -
స్వతసిద్ధముగా వుండే వివేకము ద్వారా

4 అయం అహమస్మీతి విన్దతే తత్త్వమ్ -
అయం అహం అస్మి ఇతి -
ఈ ఆత్మయే నేను అనే
విన్దతే తత్త్వమ్ - సత్యమును తెలిసికొనుచున్నాడు

అహంకారము పోయినప్పుడు,  స్వతసిద్ధముగా వుండే ఆత్మా అనాత్మల వివేకము ద్వారా , ఈ ఆత్మయే నేను అని తెలిసికుంటాడు అని భావము.

తాత్పర్యము:

అహంకారము పూర్తిగా నాశనమైనప్పుడు , దానివలన వచ్చిన వికారములు కూడా తొలగి పోయి, స్వతసిద్ధముగా వుండే వివేకము ద్వారా ఈ ఆత్మయే నేను అనే సత్యమును తెలిసికొనుచున్నాడు.

శ్లోకము 306

అహం కర్తర్యస్మిన్ అహమితి మతిం ముఞ్చ సహసా
వికారాత్మన్యాత్మ ప్రతిఫలజుషి స్వస్థితిముషి ।
యదధ్యాసాత్ప్రాప్తా జనిమృతిజరాదుఃఖ బహుళా
ప్రతీచశ్చిన్మూర్తేః తవ సుఖతనోః సంసృతిరియమ్॥306॥

అహం కర్తర్యస్మిన్ అహం  - యే అహంకారములో నేనే కర్తని
ఇతి మతిం ముఞ్చ సహసా - అనే బుద్ధి వున్నదో దానిని వెంటనే విడువుము

యే అహంకారములో నేనే కర్తని అనే బుద్ధి వున్నదో దానిని వెంటనే విడువుము , అని గురువు ఉపదేశము.

కాని అనుమానం, ఎందుకు ఆ అహంకారము వదలాలి?

ఆ అహంకారమనే వికారము, ఆత్మని అణిచి పెట్టి ఆ ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని అపహరిస్తుంది కాబట్టి.

ఆ మాట రెండవపాదములో వినిపిస్తుంది

2 వికారాత్మన్యాత్మ ప్రతిఫలజుషి స్వస్థితిముషి -

వికారాత్మని - వికారము పొందగల
ఆత్మ ప్రతిఫలజుషి - ఆత్మయొక్క  ప్రతిబింబముచే వెలిగించబడిన
స్వస్థితిముషి - తనయొక్క స్వస్వరూపమును అపహరించుచున్నది

అహంకారము ఆత్మ యొక్క ప్రతిబింబము. ప్రతిబింబము ఆత్మకాదు. కాని తనే ఆత్మ అనిపిస్తుంది, మనో వికారము వలనకలిగిన మార్పే ఆ అహంకారము.  ఈ వికారము ఈ అహంకారము తనే ఆత్మ అనిపించి , బ్రహానందస్వరూపమైన ఆత్మ స్వరూపాన్ని అపహరించుచున్నది. అందుకని గురువు చెప్పే మాట -  యే అహంకారములో నేనే కర్త అని బుద్ధి వున్నదో ఆ అహంకారమును వెంటనే విడువుము అని .

ఎందుకు ఆహంకారము విడవమంటున్నాడో అన్నమాట గురువు ఇంకో విధముగా చెపుతాడు అది అహంకారము వలన వచ్చే దుఃఖము పోయే సుఖము.

యత్ అధ్యాసాత్ ప్రాప్త జనిమృతిజరాదుఃఖ బహుళా -
బ్రాంతి వలన కలిగిన జనన మరణ జరావ్యాధి దుఃఖములతో  కూడిన ( సంసారము)

అహంకారము వలన జీవుడి కి వచ్చేది జనన మరణ జరావ్యాధి దుఃఖములతో  కూడిన  సంసారము.

ప్రతీచః చిన్మూర్తేః తవ సుఖతనోః  -
అనందమూర్తి జ్ఞాన శరీరుడవు అగు నీకు
సంసృతిరియమ్ -సంసృతిః  ఇయమ్  - ఈ సంసారము ( తగదు ) 

అనందమూర్తి జ్ఞాన శరీరుడవు అగు నీకు, బ్రాంతి వలన కలిగిన జనన మరణ జరావ్యాధి దుఃఖములతో  కూడిన ఈ సంసారము తగదు.

అంటే అహంకారము వలన రావలసిన బ్రహానందము రాకుండ దుఃఖభరిత సంసారము వస్తోంది అన్నమాట. అది నికు తగదు
అని  గురువు చెపుతున్నాడు.

306 వ శ్లోకతాత్పర్యము:

"యే అహంకారములో నేనే కర్తని అనే బుద్ధి వున్నదో దానిని వెంటనే విడువుము. ఆ అహంకారము వికారము పొందగలది, ఆత్మయొక్క  ప్రతిబింబముచే వెలిగించబడినది, తనయొక్క స్వస్వరూపమును అపహరించుచున్నది.  బ్రాంతి వలన కలిగిన జనన మరణ జరావ్యాధి దుఃఖములతో  కూడిన ( సంసారము), అనందమూర్తి జ్ఞాన శరీరుడవు అగు నీకు తగదు".

శ్లోకము 307

సదైక రూపస్య చిదాత్మనో విభోః
ఆనన్దమూర్తేః అనవద్య కీర్తేః ।
నైవాన్యథా క్వాప్య వికారిణస్తే
వినాహమధ్యాస ముముష్య సంసృతిః॥ 307॥

సదైక రూపస్య చిదాత్మనో విభోః -
ఎప్పుడూ ఒకే రూపము గల, చిత్ స్వరపుడవు, సర్వవ్యాప్తుడవు

ఆనన్దమూర్తేః అనవద్య కీర్తేః -
ఆనందస్వరూపుడవు, చెక్కుచెదరని కీర్తిగల

నైవాన్యథా క్వాప్య అవికారిణః తే

అవికారిణః తే - వికార రహితుడవు అయిన నీకు
నైవాన్యథా - మరియొక విధముగా లేదు

వినాహమధ్యాస ముముష్య సంసృతిః
 వినా అహమధ్యాసమముష్య సంస్మృతిః

వినా అహమధ్యాసం- అహంకారమనెడి భ్రాన్తిలేకుండా
అముష్య సంసృతిః - ఈ సంసారముతో సంబంధము ( లేదు)

307 వ శ్లోక తాత్పర్యము:

ఎప్పుడూ ఒకే రూపము గల, చిత్ స్వరపుడవు, సర్వవ్యాప్తుడవు, ఆనందస్వరూపుడవు, చెక్కుచెదరని కీర్తిగలవాడవు వికార రహితుడవు అయిన నీకు అహంకారమనెడి భ్రాన్తిలేకుండా ఈ సంసారముతో సంబంధము ( లేదు)


__________________________________________________












 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307

Om tat sat !

 

 

 

    •