!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 318-320


వివేక చూడామణి 318-320 శ్లోకములు:

శ్లోకము 318

క్రియా నాశేత్ భవేత్ చిన్తా
నాశో అస్మాత్ వాసనా క్షయః।
వాసనా ప్రక్షయో మోక్షః
స జీవన్ముక్తిః  ఇష్యతే॥

క్రియా నాశేత్ భవేత్ చిన్తా నాశః-
క్రియ నశింపగా చింతానాశనము కలుగును;

అస్మాత్ వాసనా క్షయః -
అందువల వాసనా క్షయము కలుగును;

క్రియానాశముతో చింతానాశనము కలుగును. చింతా నాశనముతో వాసనల క్షయము కలుగును.  క్రియానాశనము అంటే కోరిక తో కూడిన క్రియల నాశనము అని. క్రియానాశముతో చింతానాశనము అవుతుంది, అంటే మనస్సులోని క్రియ వలన పుట్టే వాంఛలు నాశనమౌతాయి అని.

చింతానాశనము వలన - అందువలన పుట్టే వాసనల క్షయము అంటే నాశనము అవుతుంది.

వాసనా ప్రక్షయో మోక్షః - 
వాసనా క్షయమే మోక్షము;

స జీవన్ముక్తిః  ఇష్యతే -
అదే జీవన్ముక్తి గా చెప్పబడుచున్నది.

వాసనా క్షయమే, మోక్షము.  ఆ మోక్షమే జీవన్ముక్తి గా చెప్పబడుచున్నది.

318 శ్లోక తాత్పర్యము:

క్రియానాశముతో చింతానాశనము కలుగును. చింతా నాశనముతో వాసనల క్షయము కలుగును. వాసనా క్షయమే, మోక్షము.  ఆ మోక్షమే జీవన్ముక్తి గా చెప్పబడుచున్నది.

శ్లోకము 319

సద్వాసనా స్ఫూర్తి విఝృంబణే సతి
హ్యసౌ విలీనాపి అహమాదివాసనా।
అతి ప్రకృష్టాపి అరుణ ప్రభాయాం
విలీయతే సాధు యథా తమిస్రౌ॥


సద్వాసనా స్ఫూర్తి విఝృంబణే సతి -
సద్వాసనవలన కలిగిన సద్భావనల విఝృంభించడము వలన;

అసౌ  విలీయనా అహమాదివాసనా అపి।
ఈ ఆహంకారము  మున్నగు  వాసనలు కూడా నశించిపోవును;

అరుణ ప్రభాయాం సాధు -
అరుణోదయ సూర్యకాంతుల వలన;

అతి ప్రకృష్టాపి యథా తమిస్రౌ విలీయతే -
మిక్కిలి అధికమైన చీకటి కూడా ఏవిధముగా నశించునో.

319 వ శ్లోక తాత్పర్యము

అరుణోదయ సూర్యకాంతుల వలన ఏ విధముగా మిక్కిలి అధికమైన చీకటి కూడా నశించునో , అలాగే , సద్వాసనవలన కలిగిన సద్భావనల విఝృంభించడము వలన, ఆహంకారము  మున్నగు  వాసనలు నశించిపోవును.


శ్లోకము 320

తమస్తమః కార్యమనర్థజాలం
న దృశ్యతే సత్ ఉదితే దినేసే।
తథా అద్వయానన్ద రసాను భూతౌ
నైవాస్తి బన్ధో న చ దుఃఖ గన్ధః॥

1 తమస్తమః కార్యమనర్థజాలం-
తమః తమః కార్యం అనర్ధ జాలం-
చీకటి, చీకటితో కూడిన అనర్ధ సముదాయము;

రాత్రి సంబంధమైన చీకటి,  ఆ చీకటితో కూడిన అనర్థాలు ( మూసుకుపోతున్న కళ్ళు, చోరభయము మున్నగునవి )

2 న దృశ్యతే సత్ ఉదితే దినేశే-
దినేశే ఉదితే సత్ న దృశ్యతే -
సూర్యుడు ఉదయించగానే కనపడవు.

పగటి రాజు ( దినేశే) అంటే సూర్యుడు ఉదయించగానే రాత్రియొక్క చిమ్మ చీకటి, రాత్రిలొ చీకటి వలనకలిగే అనర్థాలు అంటే  చోరభయం, నిద్ర మున్నగునవి పోతాయి  ... ;

తథా - ఆలాగే

ఇక్కడ గురువు తమ ఉదాహరణ చెపుతున్నాడు ఎలాగైతే  సూర్యుడు ఉదయించగానే రాత్రియొక్క చిమ్మ చీకటి, రాత్రివలనకలిగే చోరభయం, నిద్ర మున్నగునవి పోతాయో - అలాగే -ఆత్మసాక్షాత్కారమైతే మన దుఃఖాలు కూడా పోతాయి అని - అది ముందు వాక్యములో వస్తుంది.

అద్వయానన్దరస అనుభూతౌ-
అద్వితీయమైన ఆనందరసముల అనుభూతి కలిగినచో

నైవాస్తి బన్ధో న చ దుఃఖ గన్ధ -
బంధములు వుండవు దుఃఖముయొక్క వాసన కూడా వుండదు

అంటే అద్వితీయమైన ఆనందరసముల అనుభూతి కలిగించే ఆత్మ సాక్షాత్ కారమైనా, బ్రహ్మానుభవము అయినా, బంధములు వుండవు దుఃఖముయొక్క వాసన కూడా వుండదు

తాత్పర్యము:

ఎలాగా సూర్యుడు ఉదయించగానే రాత్రియొక్క చిమ్మ చీకటి, రాత్రివలనకలిగే చోరభయం, నిద్ర మున్నగునవి పోతాయో ... అలాగే .. అద్వితీయమైన ఆనందరసముల అనుభూతి కలిగించే ఆత్మ సాక్షాత్ కారమైనా, బ్రహ్మానుభవము అయినా, బంధములు వుండవు దుఃఖముయొక్క వాసన కూడా వుండదు

॥ఓం తత్ సత్॥
___________________________________________________

____________________________________________
























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 318-320

Om tat sat !

 

 

 

    •