Sundarakanda Chapter 55

Burning of Lanka

Chapter 55:

Summary : Having burnt down the city of Lanka Hanuman suddenly seized of a concern that in that process he might have endangered Sita's life and thus endangering the mission for which he started. Even as he is assailed by such doubts he hears the charanas talking about Sita being miraculously saved !

For telugu Home page

click here

 

లంకాం సమస్తాం సందీప్య లాంగూలాగ్నిం మహాబలః |
నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః |

తా|| మహాబలైశాలిఅయిన హనుమమ్టుడు లంకను పూర్థిగా దగ్ధమొనర్చిన పిమ్మట వాలాగ్నిని సముద్రమున చల్లార్చెను.

సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షోగణాం పురీమ్ |
అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః ||
తస్యాభూత్ సుమహాం స్త్రాసః కుత్సాచాత్మన్యజాయత |
లంకాం ప్రదహతా కర్మ కింస్వికృతమిదం మయా ||

తా|| లంకానగరము అగ్నిజ్వాలలో భస్మమైపోవుచుండుట , అచటి రాక్షసులు భయముతో వణికిపోవుటను చూసి వానరోత్తముడు ఆలోచించసాగెను. " అయ్యో ఈ లంకను దగ్ధమొనర్చి నేను ఎంతతప్పుపని చేసితిని " అని బాధపడుచూ తనను తాను నిందించుకొనెను

ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్ |
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా ||
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్ గురూనపి |
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ ||
వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్ |
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి ||
య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి |
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే||

తా|| మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు.

ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమమ్ |
అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకమ్ ||
యది దగ్ధాత్వియం లంకా నూనమర్యాపి జానకీ |
దగ్ధాతేన మయాభర్తుః హతం కార్యమజాయత ||

తా|| " నేను ఎంత బుద్ధిహీనుడను ? ఏంత సిగ్గులేనివాడను ?ఏంతటి మహాపాపిని ? ముందువెనకలాలోచించకుండా సీతాదేవిని అగ్నిపాలుజేసి స్వామి ద్రోహమునకు ఒదిగట్టితిని.. ఈ లంక పూర్థిగా దగ్ధమైయున్నచో పూజ్యురాలైన సీతాదేవి నిశ్చయముగా దహింపబడియేయుండును. అజ్ఞానవశమున నేను చేసిన ఈ పనివలన నా స్వామి పనికి భంగము వాటిల్లినిది.

వినష్టా జానకీ నూనం న హ్యదగ్ధః ప్రదృశ్యతే |
లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీ కృతాపురీ||
యది తద్విహితం కార్యం మమ ప్రజ్ఞావిపర్యయాత్ |
ఇహైవ ప్రాణసన్న్యాసో మమాపి హృద్య రోచతే ||

తా|| లంకాపురిఅంతయూ దగ్ధమైనది దగ్ధముకాని చోటులేదు.కనుక స్తాదేవి తప్పక మరణించియేయుండును. నా బుద్ధివైపరీత్యమువలన నేను చేయవలసిన కార్యక్రమము భంగము అయినచో ఇచటనే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును.

ఇతి చింతయతస్తస్య నిమిత్తాన్యుపపేదిరే |
పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్ ||
అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజసా |
న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే ||

తా|| ఇట్టి విచారములోనున్న హనుమంతునికి ఇదివఱలోపవలెనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపడెను..

యద్వా దహనకర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః |
న మే దహతి లాంగూలం కథమార్యాం ప్రధక్ష్యతి||

తా|| ఈ అగ్ని సర్వధా దహన స్వభావము గలవాడు సర్వ సమర్థుడు. ణాశనము లేని వాడు ఇననూ నా వాలమును కాల్చలేదు. అఓదువలన్ పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహించును?

తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి|
అపి సా నిర్ధహేదగ్నిం న తామగ్నిః ప్రదక్ష్యతి ||
సతథా చింతయంస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహమ్ |
శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనామ్||

తా|| తనతపోబలముచేతను సత్యవాక్కుచేతనూ , అనన్య భావనలేక భర్తయందే ధ్యానముగల సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు.కనుక ఆమెను అగ్ని దహింపజాలదు.ఈ విధముగా సీతాదేవి ధర్మపరత్వమును గురించి ఆలోచించుచున్న హనుమంతుడు మహాత్ములైన చారణులమాటలను వినెను.

దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణా|
జానకీ చ న దగ్ధేతి విస్మయో అద్భుత ఏవ చ||
ఇతిశుశ్రావ హనుమాన్ వాచం తామమృతోపమామ్|
బభూవ చాస్య మనసః హర్షస్తత్కాలసంభవః ||

తా|| "ఈ నగరమంతయూ సాట్ట ప్రాకారతోరణములతో గల ఈ నగరమంతయూ దగ్ధమైనది. కాని సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు. ఇది విస్మయము కలిగించునది. అద్భుతమైనది" అమృత తుల్యమైన ఈ వచనములను హనుమంతుడు వినెను. అంతట అతని మనస్సు తత్క్షణమే హర్షభరితమాయెను..

తతః కపిః ప్రాప్త మనోరథార్థః
తామక్షతాం రాజసుతాం విదిత్వా |
ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా
ప్రతిప్రయాణాయ మతిం చకార ||

తా|| మనోరథములను సంప్రాప్తించిన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరుగ లేదని తెలిసికొని స్వయముగా సీతాదేవిని దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను.