!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 333-335

    ॥ఓం తత్ సత్॥

వివేక చూడామణి 333-335 శ్లోకములు


శ్లోకము 333:

సత్యాభిసంధానరతో విముక్తో
మహత్త్వమాత్మీయం ఉపైతి నిత్యమ్।
మిథ్యాభిసన్ధానరతస్తు నశ్యే
ద్దృష్టం తదేతత్ యదచోర చోరయోః॥333॥


సత్యాభిసంధానరతో విముక్తో -
సత్యాభిసంధానరతుడు విముక్తుడై ;

సత్యాభిసంధానరతుడు అంటే సత్పదార్థమైన బ్రహ్మము నందే మనస్సు నిలిపినవాడు అని. విముక్తో అంటే , అలా బ్రహ్మముయందు మనస్సు నిలిపినవాడు వాడు బంధములనుంచి విముక్తుడైతే అని; మరి బంధములనుంచి విముక్తుడైతే ఏమి పొందుతాడు? బ్రహ్మానందము పొందుతాడు. అదే వింటాము.

మహత్త్వమాత్మీయం ఉపైతి నిత్యమ్ -
మహత్తరమైన ఆత్మానుభవము నిత్యము పొందును;

సత్పదార్థమైన బ్రహ్మము నందే మనస్సు నిలిపినవాడు బంధములనుంచి విముక్తుడై; మహత్తరమైన ఆత్మానుభవము నిత్యము పొందును ; ఈ మాట మనకు తెలిసినదే.

మిథ్యాభిసన్ధానరతస్తు నశ్యే -
మిథ్య అంటే అసత్పదార్థమైన వాటియందు మనస్సు నిలిపినవాడికి వినాశము తప్పదు

మిథ్య అంటే అసత్పదార్థమైన, అంటే దేహాదులందు, విషయచింతనలో మనస్సు నిలిపినవాడికి, అంటే వాటిగురించి ఎల్లప్పుడు ఆలోచించువానికి-  వినాశము తప్పదు,

సత్యాభిసంధానరతుడికి, మిథ్యాభిసన్ధానరతుడికి ఉదాహరణలు వున్నాయి.

ద్దృష్టం తదేతత్ - దానికి దృష్టాంతము

యదచోర చోరయోః - యత్ అచోర చోరయోః -
దొంగతనము చేయనివాడు , దొంగతనము చేసినవాడు

సత్యాభిసంధానరరతుడికి, మిథ్యాభిసన్ధానరతుడికి దృష్టాంతము, దొంగతనము చేయనివాడు , దొంగతనము చేసినవాడు; దొంగతనము చేయనివాడు సత్యాభిసంధానరరతుడి లాగా సుఖము అనుభవిస్తాడు. దొంగతనము చేసినవాడు మిథ్యాభిసన్ధానరతుడి లాగా సదా దుఃఖములో ( కారాగారములో వుంటాడు) :

333 వ శ్లోక తాత్పర్యము:

సత్పదార్థమైన బ్రహ్మము నందే మనస్సు నిలిపినవాడు బంధములనుంచి విముక్తుడై; మహత్తరమైన ఆత్మానుభవము నిత్యము పొందును; మిథ్య అంటే అసత్పదార్థమైన దేహాదులంది విషయచింతనలో మనస్సు నిలిపినవాడికి, అంటే వాటిగురించి ఎల్లప్పుడు ఆలోచించువానికి-  వినాశము తప్పదు; సత్యాభిసంధానరరతుడికి, మిథ్యాభిసన్ధానరతుడికి దృష్టాంతము, దొంగతనము చేయనివాడు , దొంగతనము చేసినవాడు; దొంగతనము చేయనివాడు సత్యాభిసంధానరరతుడి లాగా సుఖము అనుభవిస్తాడు. దొంగతనము చేసినవాడు మిథ్యాభిసన్ధానరతుడి లాగా సదా దుఃఖములో ( కారాగారములో వుంటాడు)

శ్లోకము 334

యతిరసదనుసన్ధిం బన్ధహేతుం విహాయ
స్వయమయమహమస్మి  ఇత్యాత్మదృష్టైవ తిష్టేత్।
సుఖయతి నను నిష్ఠాబ్రహ్మణి స్వానుభూత్యా
హరతి పరమవిద్యాకార్య దుఃఖం ప్రతీతమ్॥ 334॥

యతిరసదనుసన్ధిం బన్ధహేతుం విహాయ -
యతిః అసదనుసన్ధిం బన్ధహేతుం విహాయ -
యతి బంధహేతువైన అసత్ మీద చింతను వదిలేసి;

స్వయమయమహమస్మి  ఇత్యాత్మదృష్టైవ తిష్టేత్-
స్వయం అయం అహం అస్మి ఇతి ఆత్మ దృష్టైవ తిష్టేత్-
స్వయముగా ఇది (ఈ బ్రహ్మము) నేనే అని ఆత్మదృష్టితోనే ఉండవలెను;

యతి (అనబడే వాడు)  బంధహేతువైన అసత్ మీద చింతను వదిలేసి, స్వయముగా ఇది (ఈ బ్రహ్మము) నేనే అని ఆత్మదృష్టితోనే ఉండవలెను;

సుఖయతి నను నిష్ఠాబ్రహ్మణి స్వానుభూత్యా-
నను బ్రహ్మణి నిష్ఠా స్వానుభూత్యా సుఖయతి-
స్వానుభవముచే సుఖము కలిగించు బ్రహ్మములో నిష్ఠ;

హరతి పరమవిద్యాకార్య దుఃఖం ప్రతీతమ్ -
ప్రతీతమ్ అవిద్యాకార్య దుఃఖం పరం హరతి
అవిద్యవలన కలిగిన పరమ దుఃఖమును కూడా హరించును కదా

334 వ శ్లోకతాత్పర్యము:

యతి బంధహేతువైన అసత్ మీద చింతను వదిలేసి, స్వయముగా ఇది (ఈ బ్రహ్మము) నేనే అని ఆత్మదృష్టితోనే ఉండవలెను; బ్రహ్మములో నిష్ఠ, స్వానుభవముచే సుఖము కలిగించును; ఆ బ్రహ్మములో నిష్ఠ అవిద్యవలన కలిగిన పరమ దుఃఖమును కూడా హరించును కదా.


శ్లోకము 335

బాహ్యాభిసన్ధిః పరివర్ధయేత్ ఫలం
దుర్వాసనామేవ తతస్తతోఽధికామ్।
జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం
స్వాత్మానుసన్ధిం విదధీత నిత్యమ్॥ 335॥

బాహ్యాభిసన్ధిః పరివర్ధయేత్ ఫలం -
బాహ్యాను సంధానము కర్మఫలములను వృద్ధి చేయును;

మనస్సును బాహ్యవిషయములలో విహరింపచేయుటవలన కర్మ ఫలములు అభివృద్ధి చెందును. ( కోరికలు తద్వారా కర్మలు క్రియలు పెరుగును)

దుర్వాసనామేవ తతస్తతోఽధికామ్ -
దానివలన దుష్ట వాసనలు కూడా అభివృద్ధి చెందును;

మనస్సును బాహ్యవిషయములలో విహరింపచేయుటవలన కర్మ ఫలములు అభివృద్ధి చెందును. దానివలన దుష్ట వాసనలు కూడా అభివృద్ధి చెందును;

జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం ;
ఇది తెలిసికొనిన వివేకముగలవారు బాహ్య విషయములను విడిచిపెట్టి;

స్వాత్మానుసన్ధిం విదధీత నిత్యమ్-
తమ ఆత్మయందే మనస్సును నిలుపుదురు.

ఇది తెలిసికొనిన వివేకముగలవారు బాహ్య విషయములను విడిచిపెట్టి, తమ ఆత్మయందే మనస్సును నిలుపుదురు.


335 వ శ్లోకతాత్పర్యము:

మనస్సును బాహ్యవిషయములలో విహరింపచేయుటవలన కర్మ ఫలములు అభివృద్ధి చెందును. దానివలన దుష్ట వాసనలు కూడా అభివృద్ధి చెందును;ఇది తెలిసికొనిన వివేకముగలవారు బాహ్య విషయములను విడిచిపెట్టి, తమ ఆత్మయందే మనస్సును నిలుపుదురు

॥ఓం తత్ సత్॥
______________________________________________________
 
______________________________________________________

                                


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335

Om tat sat !

 

 

 

    •