!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 343-345

  

 ॥ఓం తత్ సత్॥                                 
వివేక చూడామణి 343-345 శ్లోకములు

వివేక చూడామణిలో మనకి తెలిసిన విషయము ఇలా చెప్పవచ్చు.
'ఈ దేహము నేను' అనే వాడిలో విచక్షణా జ్ఞానము తక్కువ - అజ్ఞానము ఎక్కువ. అజ్ఞానము పురుషుని ఆత్మకి దూరము చేయును. ఆత్మకి దగ్గర అవడానికి అజ్ఞానము నాశనము అవ్వాలి. అజ్ఞానము నాశనమౌడానికి విచక్షణా జ్ఞానము కావాలి. ఇది ఒక వృత్త వ్యూహము ( circular logic)

ఇదే మాట - ముందు మూడు శ్లోకాలలో ఆవరణ శక్తి ( మనస్సుని కప్పివేసేశక్తి) విక్షేప శక్తి (మనస్సుని విషయాలలోకి లాక్కుపోయే శక్తి) అన్నమాటలతో గురువు మళ్ళీ మనకి చెపుతాడు.


శ్లోకము 343

ఆరూఢశకక్తేః అహమో వినాశః
కర్తుం న శక్యః సహసాపి పణ్డితైః ।
యే నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చలాః
తానన్తరానన్తభవా హి వాసనాః॥343॥

1 ఆరూఢశకక్తేః అహమో వినాశః -
అత్యధికమైన శక్తి గల అహంకారము యొక్క వినాశము;

2 కర్తుం న శక్యః సహసాపి పణ్డితైః -
పండితులకు కూడా శీఘ్రముగా చేయుటకి శక్యము కాదు;

అత్యధికమైన శక్తి గల అహంకారము యొక్క వినాశము, పండితులకు కూడా శీఘ్రముగా చేయుటకి శక్యము కాదు. అహంకారము గురించి గురువు ఎన్నో శ్లోకాలలో చెప్పాడు. అది ధ్యానములో సమాధిలో పరిగెత్తే మనస్సుని నిలపగలిగినవాడికే సాధ్యము. అట్టి వాడే అహంకారమును నాశనము చేయగలడు. ఆ మాట ముందు పాదాలలో గురువు చెపుతాడు.


3 యే నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చలాః-
ఎవరు నిర్వికల్ప సమాధి యందు నిశ్చలముగా వుంటారో;

నిర్వికల్ప సమాధి యందు ఎవరు నిశ్చలముగా వుంటారో, వారికి మాత్రమే కుదురుతుంది.
నిర్వికల్ప సమాధి అంటే - ఆ సమాధి బ్రహ్మము తప్ప ఇంకో ధ్యాస లేని సమాధి. నిర్వికల్పము అన్నమాటకి ఉదాహరణ నీరు ఉప్పు - నీళ్ళలో ఉప్పు కలిపితే ఉప్పు కనపడదు.- నీరుఒక్కటే కనిపిస్తుంది. అలాగే నిర్వికల్ప సమాధిలో బ్రహ్మమొక్కటే కనిపిస్తుంది వినిపిస్తుంది. అద్వైతములో బ్రహ్మమొక్కటే, రెండవది లేదు కనక. నిర్వికల్పసమాధిలాగా సవికల్ప సమాధి అని కూడా వింటాము. సవికల్ప సమాధిలో ఆకారరూపమైన బ్రహ్మము పై ధ్యానములో సమాధిలో ఉండుట. వివేకచూడామణి లో మనము వినేది నిరాకార రూపమైన ఆత్మ బ్రహ్మముల గురించి. అందుకనే నిర్వికల్ప సమాధి అన్నమాట వస్తుంది.

4 తానన్తరానన్తభవా హి వాసనాః -
  తాన్ అన్తరా అనన్తభవా హి వాసనాః-
  తాన్ అన్తరా - వారుతప్ప;
  అనన్తభవా హి వాసనాః - వాసనలు అనన్తమైన పుట్టుకలు కలవి కదా।

గురువు నిర్వికల్ప సమాధి యందు ఎవరు నిశ్చలముగా వుంటారో, వారికి మాత్రమే కుదురుతుంది. మరి ఎందుకు అంతకష్టము అంటే - జీవుడికి వున్న పూర్వజన్మ కృత వాసనలు ఎన్నో వుంటాయి. వాటిని అధిగమించడానికి వాసనలు నిర్వికల్పసమాధి ముఖ్యము అని .


343 వ శ్లోక తాత్పర్యము:

"ఎవరు నిర్వికల్ప సమాధి యందు నిశ్చలముగా వుంటారో వారుతప్ప ,అత్యధికమైన శక్తి గల అహంకారము యొక్క వినాశము పండితులకు కూడా శీఘ్రముగా చేయుటకి శక్యము కాదు; మరి వాసనలు అనన్తమైన పుట్టుకలు కలవి కదా".


శ్లోకము 344

అహం బుద్ధ్యేవ మోహిన్యా
యోజయిత్వా వృతేర్బలాత్।
విక్షేప శక్తిః పురుషం
విక్షేపయతి తద్గుణైః॥344॥

అహం బుద్ధ్యేవ మోహిన్యా  -
అహంకారము యొక్క (ఆవరణశక్తి) బలమువలన మోహితుడైన;

యోజయిత్వావృతేర్బలాత్- యోజయిత్వా ఆవృతేః బలాత్
'ఈ దేహము నేను' అనే భావముతో సదా ఆలోచించుటవలన

విక్షేప శక్తిః పురుషం -
విక్షపశక్తి  పురుషుని;

విక్షేప శక్తి అంటే మనస్సుని పలువిధములుగా పరిగెత్తించగల శక్తి
 
విక్షేపయతి తద్గుణైః -
'ఆ గుణములతో పలువిధములుగా విక్షేపించును - అంటే మభ్యపెట్టును;

ఆ గుణములతో అంటే - అహంకారము వలన మోహితుడైన పురుషుడు, అందువలన కలిగిన సంకల్పము మొదలగు వానితో - విక్షేపయతి - అంటే ఆ గుణములతో మనస్సుని పలువిధములుగా పరిగెత్తించి - అంటే మభ్యపెట్టి - ఆత్మకి దూరముగా చేయును.


344వ  శ్లోక తాత్పర్యము: 

అహంకారము ( ఆవరణశక్తి) బలమువలన మోహితుడైన పురుషుడు, 'ఈ దేహము నేను' అనే భావముతో సదా ఆలోచించుటవలన కలిగిన విక్షేప శక్తి, అంటే మనస్సుని పలువిధములుగా పరిగెత్తించగల శక్తి , అందువలన కలిగిన సంకల్పము మొదలగు వానితో మనస్సుని మభ్యపెట్టి,  పురుషుని ఆత్మకి దూరముగా చేయును.

ఈ దేహము నేను అనే వాడిలో విచక్షణా జ్ఞానము తక్కువ - అజ్ఞానము ఎక్కువ. అజ్ఞానము పురుషుని ఆత్మకి దూరము చేయును. ఆత్మకి దగ్గర అవడానికి అజ్ఞానము నాశనము అవ్వాలి. అజ్ఞానము నాశనమౌడానికి విచక్షణా జ్ఞానము కావాలి. 

శ్లోకము 345:

విక్షేపశక్తివిజయో విషమో విధాతుం
నిశ్శేషం ఆవరణశక్తినివృత్యభావ॥
దృక్ దృశ్యయోః స్ఫుటపయోజలవద్విభాగే
నస్యేత్తదావరణం ఆత్మని చ స్వభావాత్।
నిస్సంశయేన భవతి ప్రతిబన్ధశూన్యో
విక్షేపణం న హి తదా యది చేత్ మృషార్థే॥

1 నిశ్శేషం ఆవరణశక్తినివృత్యభావ -
నిశ్శేషముగా ఆవరణశక్తిని నివర్తింపకపోయినచో;

2 విక్షేపశక్తివిజయో విషమో విధాతుం -
విక్షేప శక్తియొక్క విజయము ఆపుట అసాధ్యము;

గురువు మొదటిలోనే ముఖ్యమైన మాట చెపుతున్నాడు. ఆవరణ శక్తిని కనక నిశ్శేషముగా నాశనము చేయకయపోతే - అంటే మన మనస్సుని లాక్కుపోయే శక్తిని ఆపకపొతే - మనస్సుని పరిగెత్తించగలశక్తి  యొక్క విజయము ఆపుట అసాధ్యము.

3 దృక్ దృశ్యయోః స్ఫుటపయోజలవద్విభాగే -
దృక్ దృశ్యయోః స్ఫుటపయోజలవత్ విభాగే-
దృక్ దృశ్యములను స్పష్టమగు పాలు నీరు వలె వేరు విభాగము చేయబడగా ;

దృక్ దృశ్యములు పాలు నీరు వలె వేరు విభాగము చేయబడగా అంటే గురువు చెపుతున్నది హంస ఎలాగ పాలు నీరు విడదీసి పాలు గ్రహించగలుగుతుందో అలాగా ఆత్మ అనాత్మల భేదాన్ని గ్రహించగల విచక్షణాశక్తి తో - ముందు పాదములో చెప్పిన ఆత్మని కప్పగల ఆవరణ శక్తిని అపవచ్చు - అదే మాట ముందు పాదములో గురువు చెపుతాడు.

4 నశ్యేత్తదావరణం ఆత్మని చ స్వభావాత్ -
నశ్యేత్ తదా ఆవరణం ఆత్మని చ స్వభావాత్ -
తదా ఆత్మని చ స్వభావాత్ ఆవరణం నశ్యేత్ -
అప్పుడు ఆత్మని కప్పగల శక్తి నశించును

5 నిస్సంశయేన భవతి ప్రతిబన్ధశూన్యో-
నిస్సందేహముగా ప్రతిబంధము లేకుండా అగును;

అంటే దృక్ దృశ్యములను స్పష్టమగు పాలు నీరు వలె వేరు విభాగము చేయబడగా, అంటే అలాచేయగల విచక్షణాశక్తి తో,  నిస్సందేహముగా ఆత్మని కప్పగల శక్తి ప్రతిబంధము లేకుండా నాశనము అగును.

ఆత్మా అనాత్మ విచక్షణా జ్ఞానము వున్నప్పుడు - మనస్సుని లాక్కుపోయే శక్తి (అదే విక్షేపశక్తి) నిర్వీర్యమౌతుంది. అంటే  మనస్సుని కప్పివేయగల ఆవరణ శక్తి కూడా నిస్సందేహముగా ఏమీ అడ్దంకులు లేకుండా నాశనమౌతుంది.

ఆంటే ఆ విచక్షణా జ్ఞానము వుంటే అజ్ఞానానికి (మిథ్యకి) దారిలేదు.


6 విక్షేపణం న హి తదా యది చేత్ మృషార్థే॥
అప్పుడు మిథ్యాభూతమగు విక్షేపణము ఏమియు వుండదు.

ఆత్మని కప్పగల శక్తి ప్రతిబంధము లేకుండా నాశనము అవడముతో - మిథ్యాభూతమైన విషయములపై మనస్సుని లాక్కుపోయే శక్తి (విక్షేప శక్తి లెక విక్షేపణము) ఏమియు వుండదు.

345 వ శ్లోక తాత్పర్యము:

ఆవరణ శక్తిని కనక నిశ్శేషముగా నాశనము చేయకయపోతే - అంటే మన మనస్సుని లాక్కుపోయే శక్తిని ఆపకపొతే - ఆ విక్షేప శక్తి  యొక్క విజయము ఆపుట అసాధ్యము.
దృక్ దృశ్యములను స్పష్టమగు పాలు నీరు వలె వేరు విభాగము చేయబడగా, అంటే అలాచేయగల విచక్షణాశక్తి తో నిస్సందేహముగా ఆత్మని కప్పగల శక్తి ప్రతిబంధము లేకుండా నాశనము అగును,

 ॥ఓం తత్ సత్॥




__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345

Om tat sat !

 

 

 

    •