!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 350-353

  

 వివేక చూడామణి 350-352 శ్లోకములు:

ముందు మూడు శ్లోకాలలో అనాత్మ కి సంబంధించిన బుద్ధి గురించి, బుద్ధి వికారాల గురించి, అలాగే ఆత్మ స్వరూపము గురించి వింటాము. శ్లోకాలను వినే ముందర మనకు తెలిసిన విషయాలు ఒకసారి మననం చేద్దాము.

 మనకు ఆత్మ జ్ఞానము లభించే ముందర , మనకు మనమే ఆత్మ లేక మనమే అధికారులు అని ఎలా అనిపిస్తుంది? మన బుద్ధే మనని మనమే సర్వము అనే అలోచన కలిగిస్తుంది. మన బుద్ధే మనని మనమే చేయగలవారమని, చేయించేవారమని,  చేయించ తగినవారమని చెపుతుంది. అహంకారము కూడా బుద్ధివలన వచ్చినదే. అంటే అవన్నీ బుద్ది స్వరూపాలే. అంటే బుద్ధి వికారాలే. మనము జీవాత్మ అన్నప్పుడు, ఆ జీవాత్మ కూడా బుద్ధి ప్రయోగమే ( వికారమే). బుద్ధి ఆత్మతో కూడినది కాబట్టి బుద్ధి వికారాలు అన్నీ ఆత్మయే అని భ్రమలో వుంటాము మనము. ఆత్మ జ్ఞానము వచ్చిన తరువాత మనకి తెలిసినది , ఈ శరీరము అహంకారము మొదలుగువన్నీ అనిత్యము, అంటే నిత్యము కావు. బుద్ది కూడా అనాత్మ స్వరూపమే. బుద్ధి ఆత్మ కాదు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము అని మనకి అవగతమౌతుంది. 

బుద్ధి యొక్క వికారాలు గుర్తులో వుంచుకొని ముందు శ్లోకాలు చదువుదాము.

శ్లోకము 350:

అయోఽగ్నియోగాత్ ఇవ సత్వమన్వయాత్
మాత్రాదిరూపేణ విజృంభతే ధీః।
తత్కార్యమేతత్రితయం యతో మృషా
దృష్టం భ్రమస్వప్నమనోరథేషు॥350॥

1a అయః అగ్నియోగాత్ ఇవ - ఇనుము అగ్ని సంబంధముతో లాగా

అగ్నిగుండములో వున్న ఇనుము, చూసే వారికి, అగ్నిలాగా కనిపిస్తుంది. అంటే అగ్ని కాని ఇనుము అగ్ని సంబంధముతో (అగ్నిగుండములో), అగ్నిలాగా కనపడుతుంది. అగ్ని తీసివెయ్యగానే  మళ్ళీ చల్లబడిన ఇనును ఇనును లాగ కనిపిస్తుంది. అంటే అగ్నిసంబంధముతో  వచ్చిన మార్పులు క్షణికమే. అలాగే  ఆత్మ కాని విషయములు అంటే బుద్ధి, ఆత్మ సంబంధముతో, ఆత్మలా కనపడవచ్చు కదా ! - గురువు ఈ ఇనుము అగ్ని ఉదాహరణతో సంబంధముతో మనకి బుద్ధికి కలిగే మార్పులు గురించి చెపుతున్నాడు.

1b సత్వమన్వయాత్ - ఆత్మ సంబంధము వలన
2  ధీః మాత్రాదిరూపేణ విజృంభతే  -
    బుద్ధి, అదే దృష్ట అదే దృశ్యము లాంటి వికారములతో విజృంభించుచున్నది

సత్వమన్వయాత్ అంటే ఆత్మ సంబంధముతో, ధీః అంటే బుద్ధి కూడా, విజృంభతే వికజృంభిస్తుంది; ఎలాగ విజృంభిస్తుంది అంటే - మాత్రాది రూపేణ - అంటే అదే దృష్ట అదే దృశ్యము లాగా కనిపించుచున్నది. అంటే మనము బుద్ధినే అన్ని చూశేది లాగా (దృష్ట) , బుద్ధినే చూడబడతగినదిలాగా (దృశ్యము) లాగా అనుకొని, చివరికి బుద్ధే ఆత్మ అని భ్రమపడతాము.

ఇనుమును అగ్నిలావుంది అని  ఎలా అనుకున్నామో అలాగే బుద్ధిని కూడా ఆత్మ అని అనుకుంటాము.  ఇనుములో మార్పు (అగ్ని) తాత్కాలికము అంటే అసత్యము. అలాగే బుద్ధిలో మార్పులుకూడా తాత్కాలికమే, అంటే అసత్యములే;
  
4 యతః భ్రమస్వప్నమనోరథేషు -
ఏలయన భ్రమ స్వప్న మనోరథములలో

3 తత్కార్యం ఏతత్రితయం
సత్ తో సంబంధమైన బుద్ది వికారములు మూడూ

4b మృషా దృష్టం -
అసత్యములుగా చూడబడుచున్నవి

ఇనుము యొక్క అగ్నిసంబంధముతో కలిగినమార్పులు అసత్యములాగా,  భ్రమ స్వప్న మనోరథములలో, సత్ (ఆత్మ) తో సంబంధమైన బుద్ది వికారములు మూడూ అసత్యములుగా చూడబడుచున్నవి.

350 వ శ్లోకతాత్పర్యము:

ఇనుము అగ్ని సంబంధముతో లాగా , ఆత్మ సంబంధము వలన బుద్ధి, అదే దృష్ట అదే దృశ్యము లాంటి వికారములతో విజృంభించుచున్నది. ఆ వికారములు అసత్యములు. అలాగే భ్రమ స్వప్న మనోరథములలో సత్ తో సంబంధమైన బుద్ది వికారములు మూడూ అసత్యములుగా చూడబడుచున్నవి.

ఈ అనాత్మ విషయాలు అనిత్యములు మారుతాయి అని 351 వ శ్లోకములో వింటాము.

శ్లోకము 351:

తతో వికారాః ప్రకృతేః అహం ముఖా
దేహావసానా విషయాశ్చ సర్వే।
క్షణేఽన్యథాభావినః  ఏష ఆత్మా
నోదేతి నాప్యేతి కదాపి నాన్యథా॥351॥

1 తతో వికారాః ప్రకృతేః సర్వే -
అందువలన ప్రకృతియొక్క వికారములు అన్నీ

2 అహం ముఖా దేహావసానా విషయాశ్చ సర్వే -
జీవ భావము మొదలు దేహము వరకు విషయములే

3 క్షణే అన్యథాభావినః -
క్షణకాలములో మరియొక విథముగా మారును.

ముందుశ్లోకములో ఆత్మతో  సంబంధమైన బుద్ధి కార్యములు, అత్మలా అనిపించే మిథ్యాభూతములు అని విన్నాము.  అందువలన (అలాగే), ప్రకృతి యొక్క వికారములు విషయములు మాత్రమే ( అనిత్యము)-  క్షణకాలములో మరియొక విథముగా మారును;

3b ఏష ఆత్మా - ఈ ఆత్మ

 4  నోదేతి నాప్యేతి కదాపి నాన్యథా -
    పుట్టదు, నశించదు, మరియొక విథముగా మారదు కూడా.

అనాత్మ సంబంధమైన విషయాలు మారినా - ఆత్మ మారదు. ఆత్మ నిత్యము, పుట్టదు, నశించదు, మరియొక విథముగా మారదు కూడా.

351 వ శ్లోక తాత్పర్యము:

జీవ భావము మొదలు దేహము వరకు వున్న ప్రకృతియొక్క వికారములు అన్నీ అనిత్యములు. క్షణకాలములో మరియొక విథముగా మారును. కాని ఈ ఆత్మ పుట్టదు, నశించదు, మరియొక విథముగా మారదు కూడా.

352 వ శ్లోకములో వికారములు గల ఆనాత్మ బుద్ధిని వదిలేసి - మనకి తెలిసిన ఆత్మ స్వరూపము చెపుతాడు గురువు.

శ్లోకము 352:

నిత్యాద్వయాఖండచిదేకరూపో
బుధ్యాధి సాక్షీ సదసద్విలక్షణః।
అహంపదప్రత్యయలక్షితార్థః
ప్రత్యక్ సదానంద ఘనః పరాత్మా॥352॥

1 నిత్యాద్వయాఖండచిదేకరూపో-
నిత్య అద్వయ అఖండ చిత్ ఏక రూపో-
 నిత్యము, అద్వయము, అఖండము,  జ్ఞానమే రూపముగా కలది,

2 బుధ్యాధి సాక్షీ సదసద్విలక్షణః -
బుద్ధి మొదలగువానికి సాక్షి,  సత్ అసత్ లకు భిన్నమైనది

3 అహంపదప్రత్యయలక్షితార్థః -
నేను అనే పదముచే నిర్దేశించబాడినదియు;

4 ప్రత్యక్ సదానంద ఘనః పరాత్మా -
ప్రతిహృదయమందు ప్రత్యగాత్మగా ఆనందఘనముతో నిండినది అగు పరమాత్మ;

 252 వ శ్లోక తాత్పర్యము:

పరమాత్మ నిత్యము, అద్వయము, అఖండము, జ్ఞానమే రూపముగా కలది, బుద్ధి మొదలగువానికి సాక్షి,  సత్ అసత్ లకు భిన్నమైనది, నేను అనే పదముచే నిర్దేశించబాడినదియు. పరమాత్మ ప్రతిహృదయమందు ప్రత్యగాత్మగా ఆనందఘనముతో నిండియున్నది.

ఆత్మజ్ఞానము లేనప్పుడు, నేను అన్నపదము అహంకారానికి మరో పేరు. కాని ఆత్మజ్ఞానము వున్నవారికి, 'నేను' అన్న పదము సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మకి పర్యాయపదము.

349 నుంచి352 దాకా శ్లోకాలలో విక్షేపశక్తి , ఆవరణశక్తి ,ఆశక్తుల ప్రకోపము,  వాటిని అధిగమించడానికి కావలసినది బాగా ఉపదేశించ బడిన విచక్షనాశక్తి  అని, ఆ విచక్షణాశక్తి తో సత్ అసత్ ల , అలాగే ఆత్మ అనాత్మ ల భేదము గుర్తించి, అనాత్మని నాశనము చెయ్యడముతోనే ఆత్మజ్ఞానము మనషి పొందుతాడు అని చెప్పడమైనది. ఈ సందర్భములో ఎవిషయమైనా పదార్థమైనా దాని అసలు రూపము తెలిసికున్నప్పుడే ముందు మార్గము కనిపిస్తుంది అని గురువు చెప్పడమైనది.

ఈ శ్లోకాలో చెప్పినది సంగ్రహముగా  353 వ శ్లోకములో గురువు చెపుతాడు

 
శ్లోకము 353

ఇత్థం విపశ్చిత్ సదసద్విభాజ్య
నిశ్చిత్య  తత్త్వమ్ నిజబోధ దృష్ట్యా ।
జ్ఞాత్వా స్వం ఆత్మానం అఖండబోధం
తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి॥253॥

ఇత్థం విపశ్చిత్ సదసద్విభాజ్య -
ఈ విధముగా పండితుడు సత్ అసత్ లని వేరు చేసి;

నిశ్చిత్య  తత్త్వమ్ నిజబొధ దృష్ట్యా-
వాటి తత్త్వమును  విచక్షణా జ్ఞానముతో కూడిన దృష్టితో చూసి;

జ్ఞాత్వా స్వం ఆత్మానం అఖండబోధం-
తన ఆత్మనే అఖండరూపమైన పరమాత్మగా తెలిసికొని;

తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి -
వాటి నించి ( ఆవరణ విక్షేప శక్తులనుంచి) విముక్తుడై ప్రశాంతిపొందును:

353 వ శ్లోక తాత్పర్యము:

ఈ విధముగా పండితుడు సత్ అసత్ లని వేరు చేసి; వాటి తత్త్వమును  విచక్షణా జ్ఞానముతో కూడిన దృష్టితో చూసి;తన ఆత్మనే అఖండరూపమైన పరమాత్మగా తెలిసికొని;ఆవరణ విక్షేప శక్తులనుంచి విముక్తుడై ప్రశాంతిపొందును.

॥ఓం తత్ సత్॥

 


__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353

Om tat sat !

 

 

 

    •