!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 364-366

  

వివేక చూడామణి 364-366 శ్లోకములు:

ఇక్కడ మూడు శ్లోకాలలో మళ్ళీ గురువు నిర్వికల్ప సమాధి మీదనే తన ఉపదేశము సాగిస్తాడు. నిర్వికల్ప సమాధిలో జీవుడి మనస్సులో వుండే చిక్కులు లేక ముళ్ళు విడిపోతాయి అని అంటాడు గురువు(364). శ్రవణము మనన్ము నిధి ధ్యాసలగురించి కూడా చెపుతాడు (365). గురువు 366 లో నిర్వికల్ప సమాధిలో నిస్సంశయముగా బ్రహ్మ తత్త్వము స్ఫష్టముగా అవగాహన అగును అని చెపుతాడు;  అంతకన్నా ఇంకో మార్గములేదు. అంటే  బ్రహ్మ తత్త్వము స్ఫష్టముగా అవగాహనము అగుటకు నిర్వికల్ప సమాధి తప్ప ఇంకో మార్గము  లేదు అని కూడా గురువు చెపుతాడు.

శ్లోకము 364

సమాధినానేన సమస్త వాసనా
గ్రన్థేర్వినాశే అఖిల కర్మ నాశనః।
అన్తర్బహిః సర్వత ఏవ సర్వదా
స్వరూప విస్ఫూర్తిః అయత్నతః స్యాత్॥364॥

1 సమాధినానేన సమస్త వాసనా 
  గ్రన్థేర్వినాశే అఖిల కర్మ నాశనః।

అనేన సమాధినా - ఈ సమాధిలో
సమస్త వాసనా గ్రన్థేః వినాశే - అన్ని వాసనల ముళ్ళూ నాశనమౌడముతో
అఖిల కర్మ నాశనః - సమస్త కర్మల నాశనము అగును

3 అన్తర్బహిః సర్వత ఏవ సర్వదా-
లోపల బయట అంతటను ఎల్లప్పుడు

4 స్వరూప విస్ఫూర్తిః అయత్నతః స్యాత్ -
అత్మ స్వరూపము యొక్క ప్రకాశము ప్రయత్నము లేకుండానే అగును.

364 వ శ్లోక తాత్పర్యము:

ఈ (సవికల్ప) సమాధిలో  అన్ని వాసనల ముళ్ళూ నాశనమౌడముతో సమస్త కర్మల నాశనము అగును. సమస్త కర్మల నాశనముతో, లోపల బయట అంతటను ఎల్లప్పుడు అత్మ స్వరూపము యొక్క ప్రకాశము, ప్రయత్నము లేకుండానే అగును.

వాసనల ముళ్ళు అనడములో భావము జీవుడు మనస్సులో ఒకదానికొకటి ముడి వెసుకొని అనేక బంధాలతో తలక్రిందలౌతాము. నిర్వికల్పసమాధిలో అన్నిముళ్ళు విడిపోతాయి (నాశనమౌతాయి). బంధనాశనముతో - కర్మ నాశనము  అంటే సంచిత కర్మ నాశనము అని;


శ్లోకము 365

శ్రుతేః శతగుణం విద్యాత్
మననం మననాదపి।
నిధిధ్యాసం లక్షగుణమ్
అనన్తమ్ నిర్వికల్పమ్॥ 365॥

శ్రుతేః శతగుణం విద్యాత్ మననం-
శ్రవణము కన్నా మననము వందరెట్లు నయము అని తెలిసుకొనుము

 మననాదపి నిధిధ్యాసం లక్షగుణమ్  ( విద్యాత్)-
మననము కన్నా నిధి ధ్యాసము లక్ష రెట్లు నయము (అని తెలిసుకొనుము )

అనన్తమ్ నిర్వికల్పమ్  (విద్యాత్)-
నిధి ధ్యాస కన్న నిర్వికల్పము అనన్తమైన ఆధిక్యత గలది (అని తెలియవలెను )

365 వ శ్లోకము తాత్పర్యము

శ్రవణము కన్నా మననము వందరెట్లు నయము అని తెలిసుకొనుము; మననము కన్నా నిధి ధ్యాసము లక్ష రెట్లు నయము అని తెలిసుకొనుము;నిధి ధ్యాస కన్న నిర్వికల్పము అనన్తము గా అధిక్యత గలది అని తెలిసుకొనుము.

ఆద్యాత్మిక మార్గములో ముందు పోవడానికి శ్రవణము తో మొదలు పెట్టి ఒకొక్క మెట్టు ఎక్కడము అవుతుంది. ఆ మార్గములో మొదటి సోపానము శ్రవణము అయినా, దానినించి ముముక్షువు ధ్యానము లోకి చేరాలి - ధ్యానము నుంచి నిధి ధ్యాస అంటే నిర్వికల్ప ధ్యానము సమాధి ల్కి మారాలి. నిర్వికల్ప సమాధి గమ్య స్థానము. ఆ నిర్వికల్ప సమాధిలో సమస్త వాసనా క్షయము సంచిత కర్మ నాశనము - దానితో నే మోక్షము కూడా.


శ్లోకము 366

నిర్వికల్పక సమాధినా స్ఫుటమ్
బ్రహ్మతత్త్వం అవగమ్యతే ధృవమ్।
నాన్యథా చలతయా మనోగతేః
ప్రత్యయాంతర విమిశ్రితమ్ భవేత్॥

1 నిర్వికల్పక సమాధినా స్ఫుటమ్ -
నిర్వికల్ప సమాధిలో స్ఫష్టముగా

2 బ్రహ్మతత్త్వం అవగమ్యతే ధృవమ్-
తప్పక బ్రహ్మ తత్త్వము అవగాహన అగును,

3a నాన్యథా - న అన్యథా - ఇంకో మార్గము లేదు

అంటే నిర్వికల్ప సమాధిలో తప్పకుండా బ్రహ్మ తత్త్వము స్ఫష్టముగా అవగాహన అగును; ఇంకో మార్గములేదు. అంటే  బ్రహ్మ తత్త్వము స్ఫష్టముగా అవగాహనము అగుటకు నిర్వికల్ప సమాధి తప్ప ఇంకో మార్గము  లేదు.

మరి ఇంకో మార్గములో ఎమి అవుతుంది. చంచలమైన మనస్సుతో నిర్గుణబ్రహ్మ అవగాహనలో కొన్ని అన్య భావములతో మిశ్రమై వుండును. అలా మిశ్ర మైన  భావములతో మనకి అవగాహన అయ్యేది నిర్గుణ బ్రహ్మము బదులు సగుణ బ్రహ్మము అగును.

3b చలతయా మనోగతేః -
మనస్సుయొక్క గతి చంచలమగుటచే;

4 ప్రత్యయాంతర విమిశ్రితమ్ భవేత్-
ఇతర ప్రత్యయములతో మిశ్రితమై వుండును

మనస్సుయొక్క గతి చంచలమగుటచే నిర్గుణ బ్రహ్మము ఇతర ప్రత్యయములతో మిశ్రితమై సగుణ బ్రహ్మము వలె వుండును ,

366 వ శ్లోక తాత్పర్యము:

నిర్వికల్ప సమాధిలో తప్పకుండా బ్రహ్మ తత్త్వము స్ఫష్టముగా అవగాహన అగును; ఇంకో మార్గములేదు. ఇంకొక మార్గములో మనస్సుయొక్క గతి చంచలమగుటచే నిర్గుణ బ్రహ్మము ఇతర ప్రత్యయములతో మిశ్రితమై సగున బ్రహ్మము వలె వుండును .

బ్రహ్మ తత్త్వము తెలుకోడానికి బ్రహ్త్వము పొందడానికి నిర్వికల్ప సమాధి అవసరము. అందుకు గురువు మళ్ళీ ముందు శ్లోకములో నిర్వికల్ప సమాధి గురించి చెపుతాడు.

॥ఓం తత్ సత్॥



_______________________________________________________


__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366

Om tat sat !

 

 

 

    •