!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 371-373

  

వివేక చూడామణి 371-373 శ్లోకములు:

నిర్వికల్పధ్యానమే మోక్షానికి సాధనము అని చెప్పిన గురువు, ఆ నిర్వికల్పధ్యానదశలో చేరడానికి కావలసిన సాధనాలు లేక సూత్రాలు గురువు సూచిండానికి గురువు ఇక్కడ జీవుడి ఉపాధులతో మొదలు పెడతాడు. మనస్సు ఏ ఉపాధిలో దిగిపోతుందే అదే ఉపాధి జీవాత్మ కూడా పొందుతుంది. ఈ ఉపాధులలో మునిగిపోయే జీవాత్మ ఏలా నిర్వికల్పధ్యానదశ చేరగలడో అదే ఈ ముందు శ్లోకాలలో తాత్పర్యము.

దేహప్రాణేన్ద్రియమనోబుద్ధిః
అదిభిః ఉపాదిభిః
యైర్యైర్వృత్తేః సమాయోగః
తత్తత్ భావోఽస్యయోగినః॥371॥

1 దేహప్రాణేన్ద్రియమనోబుద్ధిః -
దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు బుద్ధి;

2 అదిభిః ఉపాదిభిః -
మొదలగు ఉపాధులలో;

3 యైర్యైర్వృత్తేః సమాయోగః -
యైః యైః వృత్తైః సమాయోగః -
దేని దేని వృత్తులందు ( ఏ ఉపాధియందు) మనస్సు సంయోగము పొందునో ;

4 తత్తత్ భావోఽస్యయోగినః -
దాని భావము యోగి పొందును;

371 వ శ్లోక తాత్పర్యము:

దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు బుద్ధి మొదలగు ఉపాధులలో దేని దేని వృత్తులందు ( ఏ ఉపాధియందు) మనస్సు సంయోగము పొందునో, దాని భావము యోగి పొందును. ( యే భావము నందు మనస్సు లగ్నము చేసి వ్యవహరించునో మనిషి ఆ ఉపాధియందే ఉన్నట్లు  భావించును)

మనస్సు ఏ వృత్తితో సంబంధమేర్పరచుకుంటుందో ఆ వృత్తి ఆకారమే పొందును. దానికి ఉదాహరణ స్ఫటికము స్వచ్ఛమైనను ఏ వర్ణముతో కలిస్తే ఆవర్ణమే పొందుతుంది.  ఇక్కడ పంచకోశములతో సంయోగము చూస్తే, మనస్సు యే కోశముతో సంబంధము  ఏర్పరచుకుంటుందో ఆ ఉపాధే ( రాగము, ద్వేషము, అవిద్య ) ఆత్మకి కూడా ఏర్పడుతుంది. అది తెలిసినమునులు దానిని వదిలేసి , అంటె మనస్సును వాటినుంచి మరలించి (నివృత్యా) బ్రహ్మము వేపు తరలించి, తద్వారావచ్చే అఖంద ఆనంద రసానుభూతి పొందుతారు. అదే మాట ముందు శ్లోకములో వస్తుంది.

శ్లోకము 372

తన్నివృత్యా మునేః
సమ్యక్ సర్వోపరమణం సుఖం।
సన్దృశ్యతే 
సదానన్దరసానుభావ విప్లవః॥ 372॥

1 తన్నివృత్యా మునేః -
మునులు దానిని ( మనస్సుని) వాటినుంచి మరలించి

2 సమ్యక్ సర్వోపరమణం సుఖం -
అన్ని వ్యాపరములనుంచి విరమించుటవలన కలిగే సుఖమును బాగుగా

3 సదానన్దరసానుభావ విప్లవః -
అత్మానందరసానుభూతిలో తేలియాడుట

4 సమ్యక్ సన్దృశ్యతే  - బాగుగా చూడబడుచున్నది

372 వ శ్లోకము తాత్పర్యము:

వాటిని విడిచిపెట్టిన ముని సులభముగా అన్నిటినుండి తన మనస్సుని మరలించి బ్రహ్మాండమైన అనందరసానుభవమునందు అతిశయించును (సుఖము పొందును)

ఈ రెండు శ్లోకాలు మనస్సును ప్రపంచ విషయవాంఛలనుంచి మళ్ళిస్తేనే బ్రహ్మము యొక్క బ్రహ్మాండమైన ఆనందరసానుభూతి కలుగుతుంది.

మనస్సును ఎలావెనక్కి లాగాలి అంటే త్యాగము చెయ్యాలి.  ఏమిటి త్యాగము చెయ్యాలి అంటే
బయట వుండే విషయ వాంఛలు లోపలివుండే కోరికలు త్యాగము చెయ్యాలి. అదే మాట ముందు శ్లోకములో వింటాము.

శ్లోకము 373

అన్తః త్యాగో బహిః త్యాగో
విరక్తస్త్యేవ యుజ్యతే।
త్యజత్యన్తః బహిః సఙ్గం
 విరక్తస్తు ముముక్షయా॥ 373॥

1అన్తః త్యాగో బహిః త్యాగో -
అంతః త్యాగము బహిః త్యాగము

2 విరక్తస్త్యేవ యుజ్యతే -
విరక్తివలననే సాధ్యమగును

త్యాగము చెయ్యడానికి విరక్తి వుండాలి. ఆ విరక్తి త్యాగము చెయ్యడానికి దారి చూపిస్తుంది.

4 విరక్తస్తు ముముక్షయా-
    విరక్తి కలవాడు మోక్షముపై కోరికతో ;

3 త్యజత్యన్తః బహిః సఙ్గం-
   బయట విషయలతో సంగము, అంతరముగా వుండే కోరికలు త్యజించును;

 విరక్తి కలవాడు మోక్షముపై కోరికతో, బయట విషయలతో సంగము, అంతరముగా వుండే కోరికలు త్యజించును;

373 వ శ్లోకము తాత్పర్యము

అంతః త్యాగము బహిః త్యాగము ఈ రెండును విరక్తివలననే సాధ్యమగును. ముక్తి అందలి కోరికవలన  విరక్తునకు లోపలి కోరికలు బయటి విషయాల ఆసక్తి సులభముగా విడుచుట సాధ్యమగును.


॥ఓం తత్ సత్॥


__________________________________________________


__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373

Om tat sat !

 

 

 

    •