!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 374-376

  

వివేక చూడామణి 374-376 శ్లోకములు:

ముందు శ్లోకములో  బహిః త్యాగము అంతః త్యాగము చెయ్యాలి. అది చెయ్యడము విరక్తుడికే  సాధ్యము అని విన్నాము. ఈ శ్లోకాలలో బహిః త్యాగము అంతః త్యాగము అంటే ఏమిటి అని మరికొంచెము విశదీకరించి, మోక్షము సంపాదించడానికి  వైరాగ్యము ఒక్కటే చాలదు, మోక్షానికి వైరాగ్యముతో పాటు వివేక జ్ఞానముకూడా కావాలి అని చెపుతాడు గురువు. పురుషునికి  వైరాగ్యము, వివేక జ్ఞానము రెండు రెక్కలు లాంటివి అని, పక్షికి ఆకాశములో ఎగరడానికి రెక్కలు ఎలా సాధనములో , అలాగే  పురుషుడికి మోక్షము కావాలంటే వైరాగ్యము వివేకము అనే రెండు రెక్కలు కావాలి అని చెపుతాడు గురువు.  

శ్లోకము 374:

బహిస్తు విషయైః సంగః
తథాన్తరః అహమాదిభిః।
విరక్త ఏవ శక్నోతి
త్యక్తుం బ్రహ్మణి నిష్టితః॥374॥

1 బహిస్తు విషయైః సంగః-
విషయములతో సంగము బాహ్య సంగము కదా

2 తథాన్తరః అహమాదిభిః-
అలాగే అహంకారము మున్నగు వాటితో అంతరములో సంగము

 విషయములతో సంగము బాహ్య సంగము. అలాగే అహంకారము మున్నగు వాటితో అంతరములో సంగము. ఈ రెండు త్యజింపవలసినవే. త్యజింపశక్తి గలవాడు బ్రహ్మములో నిష్ణాతుడైన విరక్తుడికే సాధ్యము. 

4 బ్రహ్మణి నిష్టితః-
   బ్రహ్మములో నిష్ణాతుడైన

3 విరక్త ఏవ శక్నోతి త్యక్తుం - 
  విరక్తి కలవాడికే వదిలివేయుటకు సాధ్యము

374వ శ్లోకతాత్పర్యము:

విషయములతో సంగము బాహ్య సంగము. అలాగే అహంకారము మున్నగు వాటితో అంతరములో సంగము. ఈ రెండింటిని త్యజించుట , బ్రహ్మములో నిష్ణాతుడైన విరక్తి కలవాడికే  సాధ్యము.

శ్లోకము 375:

వైరాగ్యబొధోపురుషస్య పక్షివత్
పక్షౌ విజానీహ విచక్షణత్వమ్।
విముక్తి సౌధాగ్ర తలాధిరోహణమ్
తాభ్యాం వినా నాన్యత్రేణ సిధ్యతి॥ 375॥

విచక్షణస్త్వమ్ -
విచక్షణగలవాడా ( బుద్ధిమంతుడా) నీవు;

1 వైరాగ్యబొధోపురుషస్య -
వైరాగ్యము వివేకముగల బుద్ధి పురుషునియొక్క

2 పక్షివత్ పక్షౌ విజానీహ -
పక్షికి గల రెక్కల వలే తెలిసికొమ్ము

ముందు శ్లోకములలో అంతః త్యాగము బహిః త్యాగము అని చెప్పుకుంటు వచ్చాడు. ఈ రెండూ కావాలి ఒకటి చాలదా అనే ఊహ రావచ్చునేమో అని గురువు ఇక్కడ ముందుగానే చెపుతున్నాడు. వైరాగ్యము వివేకము గల బుద్ధి రెండు కావలసినవే. ఆ రెండు పక్షికి గల రెండు రెక్కలవలె గ్రహించుము. ఏ ఒక్కదానితో  పక్షి ఎగరలేదు కదా. అలాగే పురుషుడు కూడా ఈ రెండింటి తొనే ముందుకు పోగలడు.

3 విముక్తి సౌధాగ్ర తలాధిరోహణమ్
విముక్తి అనే సౌధము యొక్క పై మెట్టుదాక ఎక్కడము

4 తాభ్యాం వినా నాన్యత్రేణ సిధ్యతి-
అ రెండు లేకుండా ఇంకో విధముగా సిద్ధించదు;

అ రెండు లేకుండా  విముక్తి అనే సౌధము యొక్క పై మెట్టుదాక ఎక్కడము ఇంకో విధముగా సిద్ధపడదు.

375 వ శ్లోక తాత్పర్యము:

వైరాగ్యము వివేకము పక్షివంటి పురుషునియొక్క రెక్కల వలే తెలిసికొమ్ము. విముక్తి అనే సౌధము యొక్క పై మెట్టుదాక ఎక్కడము వైరాగ్యము వివేకము లేకుండా ఇంకో విధముగా సిద్ధించదు.

పురుషుడికి వైరాగ్యము వివేకము రెండు కావాలి అని, మోక్షము ఒక్క వైరాగ్యముతో లేక ఒక్క జ్ఞానముతో సాధ్యముకాదు అని చెప్పాడు గురువు. మోక్ష ప్రయాణము  వైరాగ్యముతో మొదలెడితే పోను పోను బ్రహ్మ జ్ఞానము వస్తుంది. జ్ఞానముతో మొదలెడితే పోను పోను సమత్వ భావముతో  వైరాగ్యము కూడా వస్తుంది.

గీతాధ్యయనములో భక్తి మార్గము జ్ఞానమార్గము అని విన్నాము. అక్కడ కూడా భక్తిమార్గము లో వెళ్ళే ముముక్షువుకు భక్తి జ్ఞానములోకి, జ్ఞానమార్గములో పోయే ముముక్షువు కి చివరిదశ భక్తిలో సమాప్తి అవుతుంది అని కూడా విన్నాము. ఇది కూడా అలాగే


శ్లోకము 376:

అత్యన్త వైరాగ్యవత్ సమాధిః
సమాహితస్యైవ దృఢప్రబోధః।
ప్రబుద్ధ తత్త్వ స్య హి బన్ధముక్తిః
ముక్తాత్మనో నిత్య సుఖానుభూతిః॥ 376॥

1 అత్యన్త వైరాగ్యవత్ సమాధిః-
అత్యంత వైరాగ్యము కలవానికే బ్రహ్మనిష్ఠ కలుగును;

2 సమాహితస్యైవ దృఢప్రబోధః -
బ్రహ్మ నిష్ఠ కలవానికే బ్రహ్మ జ్ఞానము కలుగును;

3 ప్రబుద్ధ తత్త్వస్య హి బన్ధముక్తిః -
  బ్రహ్మజ్ఞానము కలవానికే బంధ విముక్తి;

4 ముక్తాత్మనో నిత్య సుఖానుభూతిః-
   ముక్తి పొందినవానికే శాశ్వతమైన సుఖము


376 వశ్లోకతాత్పర్యము:

అత్యంత వైరాగ్యము కలవానికే బ్రహ్మనిష్ఠ కలుగును. బ్రహ్మ నిష్ఠ కలవానికే బ్రహ్మ జ్ఞానము కలుగును.  బ్రహ్మజ్ఞానము కలవానికే బంధ విముక్తి.  బంధముక్తి పొందినవానికే శాశ్వతమైన సుఖము.

అంటే శాశ్వతమైన సుఖానికి బంధవిముక్తి కావాలి. బంధవిముక్తి కావాలంటే (బ్రహ్మ) జ్ఞానము కావాలి. బ్రహ్మ జ్ఞానము కావాలి అంటే నిష్ఠ కావాలి. బ్రహ్మము పై నిష్ఠ కావాలి అంటే వైరాగ్యము. అంటే ఒకవిధముగా వైరాగ్యమే మొదటి సోపానము.

॥ఓం తత్ సత్॥




__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376

Om tat sat !

 

 

 

    •