!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 384-386

  

వివేక చూడామణి 384-386 శ్లోకములు:

ధ్యానవిధిని 379 శ్లోకములలో చెప్పి , గురువు ధ్యానములో లక్ష్యము ఆత్మ అని, లక్ష్యముగా చేసుకోవలసిన ఆత్మ గురించి గురువు 381-383 శ్లోకములలో చెపుతాడు.

శ్లోకము 384:

విశుద్ధమంతః కరణమ్ స్వరూపే
నిక్షిప్య సాక్షిణ్య అవబోధమాత్రే।
శనైః శనైః నిశ్చలతాం ఉపానయన్
పూర్ణత్వమేవ అవిలోకయేత్ తతః ॥

1 విశుద్ధమంతః కరణమ్ స్వరూపే నిక్షిప్య-
విశుద్ధమైన అంతః కరణమును స్వరూపమునందు నిక్షేపించి;

 2 సాక్షిణ్య అవబోధమాత్రే (స్వరూపే )-
సాక్షిత్వముతో కూడిన జ్ఞానస్వరూపమైన ( స్వరూపమునందు);

విశుద్ధమైన అంతః కరణమును సాక్షిత్వముతో కూడిన జ్ఞానస్వరూపమైన స్వరూపమునందు నిక్షేపించి ధ్యానము చెయ్యాలి అని గురు భావము. విశుద్ధమైన అంటే రజోస్తమో గుణములు లేని - అంటే మనస్సును పూర్తిగా శాంతపరచి మన అంతః కరణమును సాక్షిరూపమైన ఆత్మలో నిలిపి ఆత్మపై ధ్యానము చెయ్యాలి. ఆ ధ్యానములో మునిగిపోవడము అన్నది మనస్సు మెల్లిగా మెల్లిగా నిశ్చలత్వము పొందినప్పుడే అవుతుంది- ఆ మాటే ముందు పాదములో గురువు చెపుతాడు

3 శనైః శనైః నిశ్చలతాం ఉపానయన్ -
మెల్లి మెల్లిగా నిశ్చలత్వమును పొందుచూ;

4 పూర్ణత్వమేవ అవిలోకయేత్ తతః -
అప్పుడు పూర్ణత్వమునే చూడవలయును;

మల్లి మెల్లిగా నిశ్చలత్వమును పొందుచూ అప్పుడు పూర్ణత్వమునే చూడవలయును - అంటే ధ్యానములో మనస్సు యొక్క నిశ్చలత్వము సంపాదించి,  పూర్ణత్వము అంటే బ్రహ్మమునే చూడవలయును అన్నమాట.

384 వ శ్లోక తాత్పర్యము:

"విశుద్ధమైన అంతః కరణమును సాక్షిత్వముతో కూడిన జ్ఞానస్వరూపమైన స్వరూపమునందు నిక్షేపించి మెల్లి మెల్లిగా నిశ్చలత్వమును పొందుచూ అప్పుడు పూర్ణత్వమునే అంటే బ్రహ్మమునే చూడవలయును"

 శ్లోకము 385

దేహేన్ద్రియ ప్రాణమనోఽహమాదిభిః
స్వాజ్ఞానక్లుప్తైరఖిలైరుపాదభిః।
విముక్తమాత్మానమఖణ్డరూపమ్
పూర్ణం మహాకాశమివావలోకనమ్॥385॥

దేహేన్ద్రియ ప్రాణమనోఽహమాదిభిః -
దేహము ఇన్ద్రియములు ప్రాణము మనస్సు అహంకారము మొదలగు;

స్వాజ్ఞానక్లుప్తైరఖిలైరుపాదభిః -
స్వ అజ్ఞానక్లుప్తైః అఖిలైః ఉపాదిభిః-
తన అజ్ఞానముచే కల్పితమైన అఖిల ఉపాధులనుంచి;

దేహము ఇన్ద్రియములు ప్రాణము మనస్సు అహంకారము ఇవన్నీ మన అజ్ఞానముచే కల్పించబడిన ఉపాధులు - ఇవి పంచకోశాలకి సంబంధమైనవి. వీటి తో ఆత్మకి సంబంధము లేదు. ఇవి వదిలివేయతగినవి  అని వదిలి వెయ్యాలి అని గురువు పలుసార్లు పదే పదే చెప్పిన మాట. అదే ఇక్కడ మళ్ళీ చెపుతున్నాడు.

విముక్తమాత్మానమఖణ్డరూపమ్ -
విముక్తమ్ ఆత్మానం అఖణ్డరూపం -
విడువబడిన అఖండరూపమైన ఆత్మను

పూర్ణం మహాకాశమివావలోకనమ్ -
పూర్ణమ్ మహాకాశమ్ ఇవ అవలోకయన్-
పూర్ణమైన ( ఆత్మను) మహా ఆకాశము వలె చూడవలయును;

ఆ ఉపాధులను అన్నిటిని వదిలివేసి మహా ఆకాశము చూచినట్లే సంపూర్ణమైన ఆత్మను
చూడవలెను.

385 వ శ్లోక తాత్పర్యము:

"దేహము ఇన్ద్రియములు ప్రాణము మనస్సు అహంకారము మొదలగు అజ్ఞానముచే కల్పితమైన అఖిల ఉపాధులనుంచి విడువబడిన, అఖండరూపమైన సంపూర్ణమైన ఆత్మను, మహా ఆకాశము వలె చూడవలయును"

శ్లొకము 386:

ఘటకలశకుసూలసూచీముఖ్యైః
గగనముపాధిశతైః విముక్తమేకమ్।
భవతి న వివిధంతథైవ శుద్ధం
పరమహమాది విముక్తమేవ॥386॥

1 ఘటకలశకుసూలసూచీముఖ్యైః -
ఘటము కలశము పొణక సూచి మొదలగు పాశములచే;

2 గగనం ఉపాధిశతైః విముక్తం -
శత ఉపాధులనుంచి విడువబడిన ఆకాశము వలె

ఇక్కడ ఘటము కలశము పొణక సూచి మొదలగు శత ఉపాధులనుంచి విడువబడిన ఆకాశము వలె అన్నప్పుడు, మనకి  తెలియవలసినది - ఘటములో ఘటాకాశము కలశములో వున్న ఆకాశము, సూది రంధ్రములో వున్న ఆకాశము మొదలగు చిన్న పెద్ద అకాశాలన్నీ వివిధరూపాలలో ఆకాశము విభజింపబడినట్లు కనపడినా - చివరికి ఆ మహాకాశము ఒక్కటే

3 ఏకమ్ భవతి న వివిధం -
ఒక్కటే అగును అనేక విధములైనది కాదు

ఆ ఆకాశము ఒక్కటే. అనేక విధములైనది కాదు.  అలాగే అహంకారము మొదలగు ఉపాధులచే విడువబడిన పరబ్రహ్మము ఒక్కటే అని గురు భావము.

4 తథైవ శుద్ధం పరం అహమాది విముక్తమేవ-
అలాగే శుద్ధ పర బ్రహ్మము  అహంకారాదులచే విడువబడి ఒక్కటిగానే ఉండును

386 వ శ్లోక తాత్పర్యము

" ఘటము కలశము పొణక సూచి మొదలగు శత ఉపాధులనుంచి విడువబడిన ఆకాశము  ఒక్కటే అగును అనేక విధములైనది కాదు, అలాగె అలాగే అహంకారాదులచే విడువబడిన శుద్ధ పర బ్రహ్మము ఒక్కటిగానే ఉండును"


॥ఓం తత్ సత్॥

________________________________________________________




__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386

Om tat sat !

 

 

 

    •