!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 394-396

  
వివేక చూడామణి 394-396 శ్లోకములు:

ముందు మూడు శ్లోకములలో ( 391-393) బ్రహ్మ స్వరూపము గురించి మళ్ళీ చెపుతూ తరంగములు నురుగు సుడిగుండము మొదలగు వన్నీ నీరే అయినట్లు, శరీరములో దేహము మొదలు లోనగల అహంభావము మొదలగువన్నీ చిత్ స్వరూపమే అని, ఇంద్రియములకు మనస్సుకి కనిపించుచున్న జగత్తు అంతయూ బ్రహ్మమే, మాయా మదిరముతో వచ్చిన భ్రాంతిలో  నువ్వు నేను వేరే అనే భ్రమలో పడతారు అని చెప్పాడు గురువు.  ఇక 394-396 వ శ్లోకములలో అదే ధోరణిలో బ్రహ్మ స్వరూపము ఆకాశము వలె నిర్మలమైనది, నిర్వికల్పమైనదినిర్వికారమైనది అని చెప్పి,  అ బ్రహ్మ స్వరూపము నీవే అని, అలాగే "నేనే బ్రహ్మము"  అని తెలిసికొనిన బుద్ధి కలవారు బాహ్య విషయ ప్రపంచము వదిలివేసి, బ్రహ్మభూతులై  అంటే అంతా బ్రహ్మమే అన్న స్వభావము కలవారై సదా చిదానందముతో నిండినవారగుదురు అని చెప్పాడు.


శ్లోకము 394
ఆకాశవత్ నిర్మల నిర్వికల్పమ్
నిఃసీమ నిఃస్పందన నిర్వికారమ్।
అంతర్బహిః శూన్యమనన్యమ్ అద్వయం
స్వయం పరంబ్రహ్మ కిమస్తి బోధ్యమ్॥394॥

బ్రహ్మము ఆద్వితీయము. బ్రహ్మముతో సమానమైది ఏమీ లేదు - అయినా బ్రహ్మౌ యొక్క అనంతము మన బుర్రలో ఎక్కించడానికి గురువు , ఈ శ్లోకములో బ్రహ్మమును ఆకాశముతో పోల్చుచున్నాడు.

1 ఆకాశవత్ నిర్మల నిర్వికల్పమ్-
ఆకాశము వలె నిర్మలమైనది;

బ్రహ్మము ఆకాశము వలె నిర్మలమైనది; ఎలాగా ఆకాశము దుమ్ము ధూలితో ఆకాశము మలినముకాదో అలాగే పరబ్రహ్మము అజ్ఞానాదులచే వికారములు పొందక నిర్మలముగా వుండును

2 నిఃసీమ నిఃస్పందన నిర్వికారమ్-
సీమలేనిది నిశ్చలమైనది, వికారశూన్యమైనది;

ఆకాశము సీమలేనిది, నిశ్చలమైనది, వికారశూన్యమైనది.  అలాగే బ్రహ్మము కూడా అనంతమైనది, మార్పులేనిది, ఒకటే రూపముతో నిర్వికల్పమైనది,

3 అంతర్బహిః శూన్యం అనన్యం అద్వయం-
లోపలను బయటను శూన్యమైనది,అనన్యమైనది, అద్వితీయమైనది;

ఆకాశము సీమలేనిది, నిశ్చలమైనది, వికారశూన్యమైనది.  అలాగే బ్రహ్మము కూడా అనంతమైనది, మార్పులేనిది, ఒకటే రూపముతో నిర్వికల్పమైనది, లోపలను బయటను శూన్యమైనది, అనన్యమైనది, అద్వితీయమైనది.  అదే స్వతః సిద్ధమైనది అన్నమాటతో బ్రహ్మము గురించి చెప్పవలసిన మాట ఏమీ లేదు. అదే వింటాము ఆఖరి పాదములో.


4 స్వయం పరంబ్రహ్మ - స్వతఃసిద్ధమైనది (అదే) పరబ్రహ్మము;
   కిమస్తి బోధ్యమ్ - ఇక తెలియదగినది ఏమి వున్నది?

394 వ శ్లోక తాత్పర్యము:

"ఈ పరబ్రహ్మ స్వరూపము ఆకాశము వలె నిర్మలమైనది. నిర్వికల్పమైనది. ఎల్లలు లేనిది. కదలిక లేనిది. మార్పులు లేనిది. లోపల బయట అనునవి లేనిది. అనన్యమైనది; అద్వయమైనది. అదే స్వయముగా నీ ఆత్మకూడా- ఇంతకన్న చెప్పవలసినదేమున్నది?"



శ్లోకము 395

వక్తవ్యం కిమువిద్యతేఽత్ర బహుధా బ్రహ్మైవ జీవః స్వయమ్
బ్రహ్మైతత్ జగదాపరాణు సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేః।
బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయః సంత్యక్తబాహ్యాః స్ఫుటమ్
బ్రహ్మీభూయ వసన్తి సన్తతచిదానన్దాత్మనేవ ధృవమ్।|395||

1 వక్తవ్యం కిమువిద్యతేఽత్ర బహుధా బ్రహ్మైవ జీవః స్వయమ్

  వక్తవ్యం కిము విద్యతే అత్ర బహుధా -
  అత్ర బహుధా వక్తవ్యం కిము విద్యతే -
ఇక్కడ అనేకవిధములుగా (బహుధా) చెప్పవలసినది ఏమి ఉన్నది?

  బ్రహ్మైవ జీవః స్వయమ్ -
  జీవుడు తానే బ్రహ్మము;

ఇంత బ్రహ్మము మీద అనేకవిధములుగా చెప్పిన తరువాత ఇంక చెప్పవలసినది ఏమీ లేదు. అహంబ్రహ్మాస్మి అన్న వాక్యములో జీవుడే బ్రహ్మము అని విదితమే కదా

2 బ్రహ్మైతత్ జగదాపరాణు సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేః।

   బ్రహ్మైతత్ జగదాపరాణు సకలం-
   ఏతత్ అపరాణు సకలమ్ జగత్ బ్రహ్మః-
  పరమాణువు వరకు సమస్త జగత్తు బ్రహ్మమే;

  బ్రహ్మాద్వితీయం శ్రుతేః -
  శ్రుతులలో బ్రహ్మ అద్వితీయమైనది ( అని చెప్పబడినది కదా);

పరమాణువు వరకు సమస్త జగత్తు బ్రహ్మమే; బ్రహ్మము అద్వితీయమని శ్రుతులలో చెప్పబడినది కదా

  3 బ్రహ్మైవాహమితి ప్రబుద్ధ మతయః సంత్యక్తబాహ్యాః స్ఫుటమ్

  బ్రహ్మైవాహమితి ప్రబుద్ధ మతయః -
ఆ బ్రహ్మము నేనే అని తెలిసికొనిన బుద్ధి కలవారు

 సంత్యక్త బాహ్యాః స్ఫుటమ్ -
 స్పష్టముగా విడువబడిన బాహ్యప్రపంచము కలవారై

4 బ్రహ్మీభూయ వసన్తి సన్తతచిదానన్దాత్మనేవ ధృవమ్।

సన్తతచిదానన్దాత్మనేవ -
అవిచ్ఛిన్నమైన చిదానంద స్వరూపముతో

బ్రహ్మీభూయ వసన్తి  ధృవమ్ -
బ్రహ్మస్వరూపముగా అయి నివశించెదరు (అది) నిశ్చయము.

ఆ బ్రహ్మము నేనే అని తెలిసికొనిన బుద్ధి కలవారు, స్పష్టముగా విడువబడిన బాహ్యప్రపంచము కలవారై అవిచ్ఛిన్నమైన చిదానంద స్వరూపముతో బ్రహ్మస్వరూపముగా అయి నివశించెదరు. అది నిశ్చయము.

గురువు ఇక్కడ దాక చెప్పినమాటలనే సరళభాషలో చెపుతున్నాడు.

"నేనే బ్రహ్మము అని గుర్తించినవారు , బాహ్యప్రపంచములోని సుఖ దుఃఖములు మిథ్య అని గ్రహించుతారు. అలాగ సుఖదుఃఖాల మిథ్యను  గ్రహించినవారు ఎల్లప్పుడు చిదానంద స్వరూపముతో నివశించ గలరు.  దానిలో సందేహములేదు" అని ఉద్ఘాటిస్తాడు.


395 వ శ్లోక తాత్పర్యము:

"బహువిధములు గా చెప్పవలసినది ఏమున్నది. జీవుడు స్వయముగా బ్రహ్మ స్వరూపుడే. పరమాణువునుంచి జగత్తు అంతయూ బ్రహ్మమే. బ్రహ్మము అద్వితీయమని శ్రుతులు చెప్పుచున్నవి కదా. ఆ బ్రహ్మము నేనే అని తెలిసికొనిన బుద్ధి కలవారు, బాహ్యప్రపంచమును విడిచి బ్రహ్మభూతులై సంతతము చిదానందముతో నిండిన వారై వుండెదరు. అది నిశ్చయము".

శ్లోకము 396

జహి మలయకోశే అహంధియోత్థాపితాశాం
ప్రసభమనిలకల్పేలింగదేహఽపి పశ్చాత్।
నిగమగదిత కీర్తిం నిత్యమానన్దమూర్తిం
స్వయమతి పంచీయ బ్రహ్మరూపేణ తిష్ఠ॥

1 జహి మలయకోశే అహంధియా ఉత్థాపిత ఆశాం -
మల భూయిష్ఠమైన ఈ కోశమునందు  అహంకారముచే స్థాపింపబడిన ఆశను, నశింపచేయుము ( జహి)

2 ప్రసభం అనిలకల్పే లింగదేహఽపి పశ్చాత్ -
బలముతో వాయువుతో సమానమైన లింగ దేహమును కూడా , అటుపిమ్మట

మన దేహాభినమువలన అహంకారముచే స్థాపింపబడిన ఆశను బలముతో నశింపచేయుము. ఆ తరువాత వాయువుతో సమానమైన , గాలి మూటతో సమానమైన లింగ దేహముపై ఆశను కూడా వదిలివేయుము.''

అంటే స్థూల సూక్ష్మ శరీరాల మీద ఆశను వదిలివేయుము అని. అధ్యాత్మిక మార్గములో ఇది మొదటి పని అని చాలా సార్లు విన్నాము. అది వదిలివేసినవాడికి మిగిలేది ఆనందమే.

3 నిగమగదిత కీర్తిం నిత్యమానన్దమూర్తిం
  వేదములచే కొనియాడబడిన కీర్తి గల నిత్యమైన ఆనంద స్వరూపమును


4. స్వయమతి పంచీయ బ్రహ్మరూపేణ తిష్ఠ-
నేనే అని నిశ్చయించి బ్రహ్మరూపముతో వుండుము.

స్థూలశరీరాన్ని సూక్ష్మశరీరాన్ని కూడా వదిలివేసినవాడు, వేదములలో చెప్పబడిన చిదానంద స్వరూపము తానే అని గ్రహించి , బ్రహ్మ రూపముతో వుండుము.

396 వ శ్లోకతాత్పర్యము:

ఈ మలముతో నిండి వున్న దేహమునందు అహంకారము పెంచుకున్న  ఆశలను విడిచి పెట్టుము. ఈ విధముగనే గాలిమూటవంటి  లింగదేహమందలి ఆశను కూడా విడిచి పెట్టుము. వేదములచే కీర్తింపబడువాడు సర్వదా ఆనంద స్వరూపుడూ అయిన ఆ పరబ్రహ్మ స్వరూపము నీవే అని తెలుసుకొని బ్రహ్మరూపముతో మమును( నిలుపుము)

॥ఒమ్ తత్ సత్ ॥
__________________________________________________________







__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396

Om tat sat !

 

 

 

    •