!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 401-403

  
వివేక చూడామణి 401-403 శ్లోకములు:

"నిర్వికారే నిరాకారే నిర్విశేషే బిధాకుతః" - నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన బ్రహ్మములో భిన్నత్వము ఎక్కడ అనే ప్రశ్న రూపముతో, గురువు అద్వితీయమైన అంటే ఒకే వస్తువు అయిన బ్రహ్మము గురించి శిష్యుడికి బోధిస్తాడు. అదే  మాట తో - "నిర్వికారే నిరాకారే నిర్విశేషే బిధాకుతః"-  అదే ప్రశ్న వేస్తూ ముందు మూడు శ్లోకాలలో కూడా గురువు బ్రహ్మము గురించి శిష్యుడికి బోధిస్తాడు.

శ్లోకము 401
ద్రష్టృ దర్శన దృశ్యాది 
భావశూన్యైక వస్తుని।
నిర్వికారే నిరాకారే
నిర్విశేషే బిధాకుతః ।।

1 ద్రష్టృ దర్శన దృశ్యాది   -
ద్రష్ట దర్శనము దృశ్యము మొదలగు

2 భావశూన్య ఏక వస్తుని -
భావములు లేని ఏకవస్తువునందు ( బ్రహ్మము నందు)

3 నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏక వస్తుని - 
నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన ఏక వస్తువులో ( బ్రహ్మములో)

4 బిధాకుతః - భిన్నము ఎక్కడ

తాత్పర్యము:
ద్రష్ట ( చూచువాడు)  దర్శనము (చూచుట), దృశ్యము ( చూడబడునది) విభేదములు లేని, ఏకరూపము నందు నిర్వికారుడు, నిరాకారుడు, నిర్విశేషుడు అయిన వానియందు విభిన్నమేట్లు వుండును.

శ్లోకము 402
కల్పార్ణవ ఇవాత్యంత
పరిపూర్ణైక వస్తుని।
నిర్వికారే నిరాకారే
నిర్విశేషే బిధాకుతః ॥

1 కల్పార్ణవ ఇవ అత్యంత పరిపూర్ణై -
ప్రళయకాలము తరువాత ప్రశాంతముగా మిగిలిన మహాసముద్రము వలె అత్యంత పరిపూర్ణమైన

2 నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏక వస్తుని:
నిర్వికారమైన, నిరాకారమైన, నిర్విశేషమైన ఏక వస్తువులో ( బ్రహ్మములో)

4 బిధాకుతః - భిన్నము ఎక్కడ

తాత్పర్యము:

ప్రళయకాలము తరువాత ప్రశాంతముగా మిగిలిన మహాసముద్రము వలె అత్యంత పరిపూర్ణమైన ఏక వస్తువు నందు, అంటే నిర్వికారుడు నిరాకారుడు, నిర్విషుడు అయిన వానియందు విభిన్నత్వము ఎట్లు ఉండును?

కల్పార్ణవము అంటే ప్రళయకాలము తరువాత ప్రశాంతముగా మిగిలిన మహాసముద్రము అని)


శ్లోకము 403:

తేజసీవ తమో యత్ర
విలీనం భ్రాన్తి కారణమ్।
అద్వితీయే పరే తత్త్వే
నిర్విశేషే భిదా కుతః॥

తేజసీవ తమో -
తేజస్సులో తమస్సు వీలీనమైనట్లు

యత్ర విలీనం భ్రాన్తి కారణమ్ -
ఎక్కడ ( ఏపరబ్రహ్మములో) భ్రాన్తి కారణమైన తమస్సు విలీనమగునో

అద్వితీయే పరే తత్త్వేనిర్విశేషే -
(అట్టి) అద్వితీయమైన, నిర్విశేషమైన పరబ్రహ్మ తత్త్వములో

భిదా కుతః- భిన్నమెక్కడ యుండును

తాత్పర్యము:

కాంతిలో చీకటి విలీనమయినట్లు భ్రాన్తికారణమైన ఈ జగత్తు అంతయూ ఎవరిలో విలీన మౌతందో అట్టి అద్వితీయుడు, అతీంద్రియుడు నిర్విశేషుడు అయిన ఆత్మ తత్త్వమునందు విభిన్నత్వము ఏట్లు వుండును.  


___________________________________________________

__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396
వివేక చూడామణి శ్లోకములు 397-400
వివేక చూడామణి శ్లోకములు 401-403

Om tat sat !

 

 

 

    •